మే 26, 2008

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౨

Posted in అనుభవాలు, ట్రెక్, సంగతులు, హిమాలయాలు వద్ద 8:23 సా. ద్వారా Praveen Garlapati

మొదలెట్టాక ఇక ఆగకూడదు కదా…

మాకివ్వబడిన టెంటులలో చేరాము మేము నలుగురమూ. అయ్యరు అప్పటికే ఒక ఎర్ర రంగు బాక్ పాక్ లో ఏదో సర్దుతూ కనిపించాడు.

మేము మా బాక్‌పాక్‌లు టెంటులో పడేసే లోపల అయ్యరు తను YHAI నుంచి మూడు ట్రెక్కులు పూర్తి చేసాననీ, తను సకుటుంబ సపరివార సమేతంగా ఈ ట్రెక్కుకి వచ్చానని, తనో కత్తి కటారిననీ, ఇప్పుడు పక్కనే ఉన్న “మణికారన్” అనే టౌనుకి వెళ్ళి వేడి నీళ్ళ స్ప్రింగులో స్నానం చేసి వద్దామని బయల్దేరుతున్నాననీ మా చెవిలో వేసేసాడు (తోసేసాడు అనాలేమో ?)

పుత్తరు పేరు వరుణ్. పెద్దగా మాట్లాడలేదు.

అయ్యరు మాట్లాడిన పది నిముషాలలో
“వరుణ్… వెళ్ళి స్నానం చెయ్యి…, వరుణ్ బట్టలు మార్చుకో…, వరుణ్ బూట్లేసుకో…”
లాంటి డైలాగులు చాలా వినబడ్డాయి. అప్పటికే మాకు అర్థమయ్యింది అతనో పెద్ద కంట్రోల్ ఫ్రీకని.

మమ్మల్ని అలా బతికించి అయ్యరూ, పుత్తరూ వేడి నీళ్ళ స్నానానికి వెళ్ళిపోయారు.

ఇంతకీ మీరు గమనించారో లేదో నేను స్నానం చేసి దాదాపు మూడు రోజులయింది. (కంపా… నాకేమీ రాలేదే ?)

ఇక “కసోల్”లో వెళ్ళిన మధ్యాహ్నం పూట బానే ఉంది కానీ కాసేపట్లోనే వాతావరణం చలిగా అవడం మొదలెట్టింది (ఇంతకు ముందు చెప్పలేదనుకుంట, కసోల్ 6500 అడుగుల ఎత్తులో ఉంది). స్నానం చెయ్యడానికి తెగ ఉత్సాహపడిన మనసు ఇప్పుడంత అవసరమా అంది. అబ్బే కాసేపు వాయిదా వెయ్యచ్చు అని సమాధానం రావడంతో అక్కడ బేస్ కాంపులో ఇస్తున్న “ఛాయ్” ని ఓ గుటకేసాము (పట్టేసారూ, ఇంకా బ్రష్ చేసుకోలేదనీ… మరదే)

మళ్ళీ టెంట్లలో దూరాము, మనమూ వెళ్ళి వేడి నీళ్ళ స్నానం చేద్దామా ? అని హర్ష అన్నాడు. కానీ ఆ ప్రశ్న అడగగానే ఎందుకో పశ్చాత్తాపపడుతున్నట్టు కనబడ్డాడు. సరేలే వాడిని కాపాడదామని నేను అబ్బే మనం ప్రయాణం చేసి అలసిపోయాము కదా… ఇలా కానిచ్చేద్దాం అన్నా…

కానీ కొంత సేపటికే టెంటులో ఎలక చచ్చిన వాసన వస్తుండడంతో మేము స్నానం చెయ్యక తప్పదని అర్థమయింది. ఒంటి మీద మొదటి మగ్గు నీళ్ళు పడడంతోనే జిల్లు మంది. వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. అయినా సరే ధైర్యంగా స్నానం ముగించి బయటపడ్డాను.

ఇక్కడే ఇంత చలిగా ఉంటే పైన మనం స్నానం ఎలా చేస్తామో అన్నా… హర్షద్, యోగేష్ ఒకరినొకరు చూసుకుని ఫెళ్ళున నవ్వడం మొదలెట్టారు. నాకర్థం కాలా…

సరే స్నానం అయింది కదా అని అందరమూ కసోల్ చుట్టి వద్దామని బయల్దేరాము. కసోల్ గురించి కొంత చెప్పాలి. చిన్న ఊరు అది. ఊరంతా ఇస్రాయిలీలు నిండి ఉంటారు. ఎందుకంటారా ? ఊరిలో గడ్డి (grass) బాగా లభిస్తుంది. (అర్థం కాలేదా ? హు… వికీ లంకె మీద నొక్కండి.)

ఇస్రాయిలీ భామలు మాత్రం చాలా అందంగా ఉన్నారు. మన పక్కన ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉండడం ఎంత మంచిదో అప్పుడు తెలిసొచ్చింది. అదీ ట్రైపాడ్ తో సహా…
(ఎక్కడ మాంచి భామ కనబడినా మీ ఫోటో తీసుకోవచ్చా ? నేనో ఫోటోగ్రాఫరుని అని ట్రైపాడ్ చూపించగానే అమ్మాయిలు చటుక్కున ఒప్పుకునేవారు…)

ఓకే ఓకే… అదొదిలేస్తే విదేశీయులు చాలా మంది ఉన్నారు కాబట్టి కరెన్సీ మార్పిడి, బుల్లెట్/ఎన్‌ఫీల్డు బైకులు అద్దెకిచ్చే షాపులు అడుగుకొకటి. అలాగే తిండి ధర కూడా ఎక్కువే. కానీ జర్మను, ఇస్రాయలీ తిండి దొరుకుతుంది అక్కడ. మేము అక్కడే ఉన్న జర్మన్ బేకరీలో తెగ తిని కడుపు నింపుకున్నాము. నిజం చెప్పొద్దూ రుచి మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి.

అలా తిరిగి తిరిగి టెంటుకి చేరుకున్నాము. మేము వెనక్కి రావడమే ఓ చిన్న సైజు గుంపు కనబడింది ఎంట్రన్సులో… అదేంటబ్బా ? ఏమయింది అనుకున్నంతలోనే తెలిసింది మొత్తం బేసు కాంపులో కరెంటు ఉండేది ఆ ఒక్క చోటులోనే అని. (జనాలు మొబైలు ఫోన్లు, బాటరీ ఛార్జర్లతో ఎగబడుతున్నారు. మేము చాలా తెలివి గల వాళ్ళం. ఇంటికి కాల్ చేసి వెంటనే స్విచ్చాఫ్ చేసేవాళ్ళం. పిచ్చి వెధవలు, ఇక్కడికి వచ్చి కూడా కొట్టుకుంటున్నారు)

అప్పటికే సాయంత్రం అయింది. టెంటుకెళ్ళే సరికి టెంటు నిండా అన్ని రకాల జంతువులు కనబడ్డాయి. బెంగుళూరు నుంచే ఓ పెద్ద గుంపు దిగబడింది. ఓ పది/పదిహేను మంది జనాల గుంపు. అప్పటికే పేకాట మొదలెట్టారు. చచ్చాం అనుకున్నంతలోనే డిన్నర్ కి రమ్మని ఓ విజిలు. మరీ ఏడింటికేనా ? అనుకుని మా ప్లేట్లు గట్రా పట్టుకుని బయల్దేరాము.

చపాతీలు, అన్నం, కూర, స్వీటుతో బానే ఉంది. చపాతీలు వేడిగా తినకపోతే మాత్రం దాంతో టగ్గాఫ్ వారు ఆడుకోవచ్చు. అప్పుడు తెలిసింది అదేదో తొమ్మిదింటికి “కాంప్ ఫైర్” ఉంటుందిట. అబ్బ భలే బావుంటుంది చలి కాసుకోవచ్చు అనుకున్నంతలోనే తెలిసింది అది ఫైర్ లేని కాంప్ ఫైరని (అక్కడ నిజం కాంపు ఫైరు నిషేధముట). ఇంతకీ విషయమేమిటంటే ఆ కాంపు ఫైరు దగ్గర ఎవరయినా పాటలూ గట్రా పాడదలచుకుంటే పాడచ్చని.

మనకంత సీను లేకపోవడంతో సుబ్బరంగా కూర్చుని కామెంట్లు మాత్రం చేసాము… ఇంతకీ ఫైరెలా చేస్తారో మీకు తెలుసా ? ఒక ఎలెక్ట్రిక్ లైటు తీసుకొచ్చి, దానికొక ఎర్ర పేపరు చుట్టి దాన్ని స్విచాన్ చేస్తే అదే కాంపు ఫైరు 🙂
తమాషా ఏమిటంటే మేము మొదటి రోజు కాంపు ఫైరుకి కూర్చుని పైకి చూస్తే అక్కడ కొద్దిగా దూరంగా కొండల మీద నిజంగా ఫైరే కనబడింది. అక్కడ అడవిలో మంటలట. పెద్దగా మంటలు లేచి చెట్లు తగలబడడం కనిపించింది.

మా ముందు బాచులో నుంచి పిల్లకాయలు (పదో క్లాసు స్కూలు పిల్లల గుంపు) పాటలు, జోకులూ చెబితే అవి విని మేము బయల్దేరబోతుండగా చెప్పాడు అక్కడి కాంపు లీడరు (ట్రెక్కులో ప్రతీ కాంపుకీ ఒక కాంపు లీడరు ఉంటాడు. అతను చెప్పిందే అందరూ వినాలన్నమాట. ఆ కాంపుని మొత్తం నడిపించే బాధ్యతంతా ఆ కాంపు లీడరుదే) మరుసటి రోజు ఉదయాన్నే ఐదున్నరకి ఒక రెండున్నర కిలోమీటర్ల జాగ్, తర్వాత ఎక్సర్సైజూ ఉంటాయి అని.

మన రియాక్షను తెలిసిందే. ఉదయాన్న తొమ్మిదిన్నరకి లేచే నాకు అది మింగుడుపడలేదు కానీ తప్పదుగా. అక్కడ ఇచ్చిన బోర్నవీటా పుచ్చుకుని టెంటుకి వెనక్కొచ్చాము. ఆ మందలో పడుకోలేము కానీ ఇలా కాదని గుట్టు చప్పుడు కాకుండా మరుసటి రోజు బాచు కి కేటాయించిన టెంటులో పాగా వేసాము మేము నలుగురమూ. ఇంకో ఇద్దరు వచ్చి మాతో జత కలిసారు. (అచిన్, క్రిస్టో)

పొద్దున్నే ఐదున్నరకల్లా విజిలు… బ్రషింగు ఎలాగూ లేదు. ఆ రెండున్నర కిలోమీటర్లు జాగింగ్ చేసుకుంటూ వెళితే (ముప్పావు మంది వాకింగే) అక్కడ ఒక పెద్ద గ్రౌండు ఉంది. అక్కడ మా చేత డాన్సాడించిన తర్వాత మళ్ళీ వెనక్కి. మళ్ళీ అనౌన్స్మెంటు ట్రెక్కుకి అలవాటు పడటానికి ఇవాళ ఓ వెయ్యిన్నర అడుగులు ఎక్కిస్తారుట. (ట్రెక్కులో మొదటి మూడు రోజులూ కేవలం అలవాటు పడటానికే)

అందరికీ కొద్దిగా ఉత్సాహంగా అనిపించింది. ఆ వెయ్యిన్నర అడుగులు సులువుగానే అనిపించింది. ఆ రోజు అలా ముగిసింది.
మూడో రోజు “రాక్ క్లైంబింగూ”, “రాప్లింగూ” లాంటివి చేయించారు.

అక్కడితో మేము ట్రెక్కు చెయ్యడానికి తయారయ్యామన్నమాట.

నాలుగో రోజు ఉదయమే ట్రెక్కు మొదలు. ట్రెక్కుకి మొదలు అక్కడికి ఒక గంటన్నర దూరంలో ఉన్న “షీలా” అనే ఊరి నుంచి. అక్కడికి బస్సు టాపు మీదెక్కి చేరాము. అందరిలోనూ ఉత్సాహం, ఉత్కంఠ. గోల గోలగా అక్కడికి చేరింది గుంపు.

38 వ్యాఖ్యలు »

 1. శ్రీ said,

  అబ్బ.. ఇరగదీస్తున్నారండీ మీరు! మీ ట్రెక్కింగ్, ఇక తాడు పట్టుకు లాగుడు…. నా సామి రంగా, అద్భుతం! మీ ట్రెక్కింగ్ నాకయితే చాలా బాగా నచ్చింది.

 2. శ్రీ said,

  అబ్బ.. ఇరగదీస్తున్నారండీ మీరు! మీ ట్రెక్కింగ్, ఇక తాడు పట్టుకు లాగుడు…. నా సామి రంగా, అద్భుతం! మీ ట్రెక్కింగ్ నాకయితే చాలా బాగా నచ్చింది.

 3. Kamaraju Kusumanchi said,

  సూపర్ గా వ్రాస్తున్నారు! I am amazed that you remembered even small small details!

 4. సూపర్ గా వ్రాస్తున్నారు! I am amazed that you remembered even small small details!

 5. క్రాంతి said,

  ఫోటోస్ చాలా బాగున్నాయి.అయినా అసలు మీరు వెళ్ళేటప్పుడు మాకు కూడ ఒకమాట చెప్పొచ్చు కదా,మేము కూడ వచ్చేవాళ్ళము.నాకు అడ్వెంచర్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం.

 6. ఫోటోస్ చాలా బాగున్నాయి.అయినా అసలు మీరు వెళ్ళేటప్పుడు మాకు కూడ ఒకమాట చెప్పొచ్చు కదా,మేము కూడ వచ్చేవాళ్ళము.నాకు అడ్వెంచర్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం.

 7. రవి said,

  ఓ రెండేళ్ళ ముందు ఐతే నేనూ అవేశంతో బయలుదేరుండే వాణ్ణి, ఆ గాళ్ళను పట్టుకుని. ఇప్పుడు ఆలోచించీ, అనుకునీ లాభం లేదు 🙂

  మీనియేచర్ జగదేకవీరుడూ, అతిలోక సుందరీ సినిమా చూపిస్తున్నారు.

 8. రవి said,

  ఓ రెండేళ్ళ ముందు ఐతే నేనూ అవేశంతో బయలుదేరుండే వాణ్ణి, ఆ గాళ్ళను పట్టుకుని. ఇప్పుడు ఆలోచించీ, అనుకునీ లాభం లేదు :)మీనియేచర్ జగదేకవీరుడూ, అతిలోక సుందరీ సినిమా చూపిస్తున్నారు.

 9. రవి said,

  సారీ YHAI గాళ్ళను అని రాయబోయి మిస్ అయింది

 10. రవి said,

  సారీ YHAI గాళ్ళను అని రాయబోయి మిస్ అయింది

 11. sujata said,

  జీవితం అంతా ”కసోలీ – కసోలీ” అని వినడమే తప్ప చూసే అద్రుష్టం లేకపోయింది. మీ బస్సు టాపు ప్రయాణం ఫోటో చాలా బావుంది. నేను కుళ్ళుకుని చచ్చిపోతూ చదువుతున్నాను. చాల బావుంది మీ ట్రేక్ – లాగుడు.

 12. sujata said,

  జీవితం అంతా ”కసోలీ – కసోలీ” అని వినడమే తప్ప చూసే అద్రుష్టం లేకపోయింది. మీ బస్సు టాపు ప్రయాణం ఫోటో చాలా బావుంది. నేను కుళ్ళుకుని చచ్చిపోతూ చదువుతున్నాను. చాల బావుంది మీ ట్రేక్ – లాగుడు.

 13. కొత్త said,

  very cool.
  cool pics too.

 14. very cool.cool pics too.

 15. vikaTakavi said,

  Cool, nice narration and ofcourse nice pictures too.

 16. vikaTakavi said,

  Cool, nice narration and ofcourse nice pictures too.

 17. meenakshi.a said,

  hi praveen garu.mee trecking visheshalu chaduvutunte naku vellalanipistundi.chala chala bagunnai mee prayanapu sangatulu.

 18. meenakshi.a said,

  hi praveen garu.mee trecking visheshalu chaduvutunte naku vellalanipistundi.chala chala bagunnai mee prayanapu sangatulu.

 19. meenakshi.a said,

  praveen garu mee trecking visheshalu chaduvutunte kalalo kooda ave kanapadutunnai.nado request andi meeru ee sari ganaka trecking ki vedite kasta cheppagalaru.plzzzzzzzzzzzzzzz.

 20. meenakshi.a said,

  praveen garu mee trecking visheshalu chaduvutunte kalalo kooda ave kanapadutunnai.nado request andi meeru ee sari ganaka trecking ki vedite kasta cheppagalaru.plzzzzzzzzzzzzzzz.

 21. ramya said,

  బావుందండీ మీ ట్రావెలాగుడు.. తరువాతి టపాకై వెయిటింగు ఇక్కడ.
  ఆ టపాలో బ్రష్ చేసుకుని, స్నానించి వస్తారనే అనుకుంటున్నా 🙂

 22. meenakshi.a said,

  praveen garu meeru bus pina unna photo lo pakkana chinna chinna gorrepillalu unnai kadandi.vati photos emyna unte kasta emanukokunda naaku mail pampinchandi.

 23. ramya said,

  బావుందండీ మీ ట్రావెలాగుడు.. తరువాతి టపాకై వెయిటింగు ఇక్కడ.ఆ టపాలో బ్రష్ చేసుకుని, స్నానించి వస్తారనే అనుకుంటున్నా 🙂

 24. meenakshi.a said,

  praveen garu meeru bus pina unna photo lo pakkana chinna chinna gorrepillalu unnai kadandi.vati photos emyna unte kasta emanukokunda naaku mail pampinchandi.

 25. meenakshi.a said,

  mee next post kosam himalayalanta ettyna choopulato eduru choostuntanu.mee abhimani

 26. meenakshi.a said,

  mee next post kosam himalayalanta ettyna choopulato eduru choostuntanu.mee abhimani

 27. meenakshi.a said,

  aap likh rahen hain kuch ise dhung se,ke hum aap ke blog ke deewaane ban gaye.

 28. meenakshi.a said,

  aap likh rahen hain kuch ise dhung se,ke hum aap ke blog ke deewaane ban gaye.

 29. నిషిగంధ said,

  ఆ మధ్య మీ టపాలు కనబడకపోతే ఇంకో విధంగా అపార్ధం చేసుకున్నా 😉 హిమాలయాలకు వెళ్ళారన్నమాట.. how exciting!! చదువుతుంటే నా బ్యాక్ పాక్ సర్దేసుకుని ఇక్కడే ఎక్కడో ఏదైనా కొండ చూసుకుని ట్రెక్కింగ్ చేశేయాలనిపిస్తుంది.. క్రాంతిగారు అన్నట్లు వెళ్ళేముందు ఓ ముక్క మా చెవిన వేసి ఉండాల్సింది.. ఫ్లైట్ కట్టుకుని డైరెక్ట్ గా అక్కడ వాలిపోయేవాళ్ళము :))

  మిగతా భాగాలు వెంట వెంటనే రాయండి, ప్లీజ్ 🙂

 30. ఆ మధ్య మీ టపాలు కనబడకపోతే ఇంకో విధంగా అపార్ధం చేసుకున్నా 😉 హిమాలయాలకు వెళ్ళారన్నమాట.. how exciting!! చదువుతుంటే నా బ్యాక్ పాక్ సర్దేసుకుని ఇక్కడే ఎక్కడో ఏదైనా కొండ చూసుకుని ట్రెక్కింగ్ చేశేయాలనిపిస్తుంది.. క్రాంతిగారు అన్నట్లు వెళ్ళేముందు ఓ ముక్క మా చెవిన వేసి ఉండాల్సింది.. ఫ్లైట్ కట్టుకుని డైరెక్ట్ గా అక్కడ వాలిపోయేవాళ్ళము :)) మిగతా భాగాలు వెంట వెంటనే రాయండి, ప్లీజ్ 🙂

 31. విహారి said,

  ప్రవీణ్,

  చూస్తుంటే హిమలయాల్లో కూడా ప్రమదా వనం పెట్టేట్లున్నారు. ఆ వాడేసిన బ్యాక్ ప్యాకూ, బూట్లు అమ్ముకోవాలంటే ఇదే సరైన టైము. ఇప్పుడే అమ్మకానికి పెట్టెయ్.

  — విహారి

 32. ప్రవీణ్,చూస్తుంటే హిమలయాల్లో కూడా ప్రమదా వనం పెట్టేట్లున్నారు. ఆ వాడేసిన బ్యాక్ ప్యాకూ, బూట్లు అమ్ముకోవాలంటే ఇదే సరైన టైము. ఇప్పుడే అమ్మకానికి పెట్టెయ్.– విహారి

 33. ప్రవీణ్ గార్లపాటి said,

  @శ్రీ గారు:
  నా ట్రెక్కు సంగతులు పూర్తయ్యేలోపు మీరు ట్రెక్కుకి వెళ్ళేట్టున్నారే 🙂

  @kamaraju kusumanchi గారు:
  థాంకూ… కదూ నాకూ ఆశ్చర్యంగానే ఉంది.

  @ క్రాంతి గారు:
  మన బ్లాగర్లలో ఇంత మందికి ట్రెక్కింగంటే ఇష్టమని తెలీదుగా…
  పోనీలెండి వచ్చే సారి “వాలీ ఆఫ్ ఫ్లవర్సో”, “హర్ కీ దున్” కో వెళదాము.

  @ రవి:
  అప్పుడే “యూత్” కాటగరీ నుంచి బయటకెళ్ళిపోయారా ? 😉

  @ sujata గారు:
  ముందు ముందు లాగుడులలో ఇంకా కుళ్ళుకునేంత మాటరు ఉంది 🙂

  @ కొత్త పాళీ, @ వికటకవి:
  కృతజ్ఞతలు

  @ meenakshi గారు:
  మీ వ్యాఖ్యలతో తడిపేస్తున్నారు. మీకు నా బ్లాగు, టపాలు నచ్చినందుకు చాలా సంతోషం.

  @ ramya గారు:
  అబ్బా, నా చేత అంత త్వరగా మళ్ళీ స్నానం చేయిద్దామనే… అమ్మో చాలా చెప్పేస్తున్నాను.

  @ నిషిగంధ గారు:
  అమ్మో, అమ్మో! ఎన్నెన్ని అపార్థాలు. ఈ సారి వెళితే చెప్పే వెళతాను సుమా…
  వారాంతం కదా. మూడో పార్టు వచ్చేస్తుంది 🙂

  @ విహారి:
  ఇంకా మీరు ఈబే లో చూడలేదా ?? అప్పుడే వంద మంది బిడ్లు కూడా వేసేస్తేనూ 😛

 34. @శ్రీ గారు:నా ట్రెక్కు సంగతులు పూర్తయ్యేలోపు మీరు ట్రెక్కుకి వెళ్ళేట్టున్నారే :)@kamaraju kusumanchi గారు:థాంకూ… కదూ నాకూ ఆశ్చర్యంగానే ఉంది.@ క్రాంతి గారు:మన బ్లాగర్లలో ఇంత మందికి ట్రెక్కింగంటే ఇష్టమని తెలీదుగా… పోనీలెండి వచ్చే సారి “వాలీ ఆఫ్ ఫ్లవర్సో”, “హర్ కీ దున్” కో వెళదాము.@ రవి:అప్పుడే “యూత్” కాటగరీ నుంచి బయటకెళ్ళిపోయారా ? ;)@ sujata గారు:ముందు ముందు లాగుడులలో ఇంకా కుళ్ళుకునేంత మాటరు ఉంది :)@ కొత్త పాళీ, @ వికటకవి:కృతజ్ఞతలు@ meenakshi గారు:మీ వ్యాఖ్యలతో తడిపేస్తున్నారు. మీకు నా బ్లాగు, టపాలు నచ్చినందుకు చాలా సంతోషం.@ ramya గారు:అబ్బా, నా చేత అంత త్వరగా మళ్ళీ స్నానం చేయిద్దామనే… అమ్మో చాలా చెప్పేస్తున్నాను.@ నిషిగంధ గారు:అమ్మో, అమ్మో! ఎన్నెన్ని అపార్థాలు. ఈ సారి వెళితే చెప్పే వెళతాను సుమా…వారాంతం కదా. మూడో పార్టు వచ్చేస్తుంది :)@ విహారి:ఇంకా మీరు ఈబే లో చూడలేదా ?? అప్పుడే వంద మంది బిడ్లు కూడా వేసేస్తేనూ 😛

 35. రాకేశ్వర రావు said,

  నేను ఆగస్టులో ఉత్తరాఖండం మరియు హిమాచలం వెళ్ళినప్పుడు, అక్కడవాడే అయినా నా మిత్రుడు చెప్పాడు, ఆ గడ్డి కనిపిస్తుందే, అది మామూలు గడ్డి కాదు అని. దానిని చేతిలో నలిపి రసం తాగవచ్చని. పాలలో వేసుకోవచ్చని, శివరాత్రికి వాళ్ళు అదే చేస్తారనీ గట్రా…
  నాకు కూడా అదే చేయాలని పించింది. గాని కొద్దిగా కొండ దిగువులో వుండడం వల్ల చేతికి అందలేదు 😦
  మనం చిన్నప్పుడు పుల్లకూరాకు తిన్నట్టు వాళ్ళు అవి తింటారనుకుంట 😉

 36. నేను ఆగస్టులో ఉత్తరాఖండం మరియు హిమాచలం వెళ్ళినప్పుడు, అక్కడవాడే అయినా నా మిత్రుడు చెప్పాడు, ఆ గడ్డి కనిపిస్తుందే, అది మామూలు గడ్డి కాదు అని. దానిని చేతిలో నలిపి రసం తాగవచ్చని. పాలలో వేసుకోవచ్చని, శివరాత్రికి వాళ్ళు అదే చేస్తారనీ గట్రా… నాకు కూడా అదే చేయాలని పించింది. గాని కొద్దిగా కొండ దిగువులో వుండడం వల్ల చేతికి అందలేదు :(మనం చిన్నప్పుడు పుల్లకూరాకు తిన్నట్టు వాళ్ళు అవి తింటారనుకుంట 😉

 37. ప్రవీణ్ గార్లపాటి said,

  @ రాకేశ్వర రావు:
  అలా మిస్సయ్యారన్నమాట.
  అయినా మనం చాలా మంచోళ్ళం కదూ 😉

 38. @ రాకేశ్వర రావు:అలా మిస్సయ్యారన్నమాట.అయినా మనం చాలా మంచోళ్ళం కదూ 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: