హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౩

రెండో భాగం అయిపోయిందా చదవడం ?

గుంపంతా ఆడుతూ పాడుతూ బస్సు టాపు మీద “షీలా” కి దగ్గరే ఉన్న “ఊంచ్ ధర్” కి చేరింది.

అక్కడ మాకోసం ఒక గైడు ఎదురు చూస్తున్నాడు (ఒక్కో ట్రెక్కు కోసం రోజూ ఒక్కో గైడు ఉంటాడు. ఇంతకు ముందు అయితే గైడు ఉండే వాడు కాడంట. కానీ రెండు మూడు సార్లు జనాలు తప్పిపోవడంతో ఇప్పుడు గైడుని ఇస్తున్నారు)

దాదాపు జనాలందరూ ఓ ఊతకర్ర కొనుక్కున్నారు అక్కడ. చాలా ఉపయోగపడింది.
ఎందుకంటే బాగా ఎత్తులు ఎక్కేటప్పుడు కాళ్ళ మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంచుతుంది.

అలాగే కొద్దిసేపటికే అర్థమయింది ఏమిటంటే ఒక మంచి షూ ఉండడం ఎంత ముఖ్యమో. షూ కి మంచి గ్రిప్ ఉంటే చక్కని పట్టు దక్కుతుంది ఎక్కేటప్పుడు. ఇక ముందు కూడా కొన్ని ట్రెక్కులు చెయ్యాలనే ఆలోచన ఉండడంతో నేను ఒక కొత్త షూ కొనుక్కున్నాను. బాటా షోరూం లో ఉన్న వీన్బర్నర్. మంచి షూ. చాలా మంది హంటర్ బూట్లు వాడారు.

ఇక ఎవరి బాక్‌పాక్ లు వారి భుజాల మీద ఉంచుకుని నడవడం మొదలుపెట్టారు. (YHAI వారు మీకు కావలిస్తే పైకి తీసుకెళ్ళడానికి విడిగా బాక్‌పాక్ లు ఇస్తారు. మీకు కావాల్సిన సామాన్లు మాత్రమే అందులో సర్దుకుని మీ బాక్‌పాక్ కింద వదిలెయ్యవచ్చు.)
అందరూ బాక్‌పాక్ లను తేలికగా సర్దుకున్నారు. ఎందుకంటే అవి భుజాన వేసుకుని ఎక్కాలి కాబట్టి. అంటే వేసుకున్న బట్టలు కాక ఇంకొక జత, స్వెటరు, జాకెట్టు, గ్లోవ్స్, ప్లేటు, గ్లాసు, కోల్డ్‌క్రీము/వాసెలీను, వగయిరాలన్నమాట. అవి సర్దుతున్నప్పుడే అర్థమయింది నాకు ఇక మిగతా రోజులన్నీ స్నానం కుదరదని 🙂 (హర్షద్, యోగేష్ లు ఎందుకు నవ్వారో కూడా).

YHAI వారి ట్రెక్కులో నాకు నచ్చిందేమిటంటే‌ వాళ్ళు తొందర పెట్టరు. కావలసినంత సమయం తీసుకుంటూ ఇతర కాంపులకు చేరవచ్చు. అందుకని ఎన్నో విషయాలు గమనిస్తూ. ట్రెక్కుని ఆస్వాదించవచ్చు. (అందరూ అలా చేస్తారని కాదు)

మొదటి రోజు “షీలా” గ్రామం గుండా ట్రెక్కు “గుణా పానీ” అనే కాంపుకి చేరుతుంది. ఈ ప్రాంతం అంతా కొండలే. ఇక్కడి గ్రామస్థులు చక చకా ఎక్కగలరు. మా గుంపులో కొంత మంది ఆడవారికి మొదటి రోజే ట్రెక్కు చెయ్యడానికి వారి ఫిట్‌నెస్ సరిపోదని తెలిసివచ్చింది. వారు ఈ గ్రామస్థులను పోర్టర్లుగా పెట్టుకున్నారు. (అంటే వీరి బాగులు వారు మోస్తూ వస్తారన్నమాట).

నాకయితే నచ్చలేదు అలా చెయ్యడం. ముందే తెలుసుకుని ఉండాల్సింది ట్రెక్కు చెయ్యగలమో లేదో. ట్రెక్కులో మజా అంతా సొంతంగా చేసుకోవడమే కదా. కానీ వారి దృష్టి నుంచి ఆలోచిస్తే ఇటు వెనక్కు వెళ్ళలేరు కాబట్టి పోర్టర్లని పెట్టుకుని ముందుకి సాగడమే మంచిదని అనిపిస్తుంది.

సరే అలా “షీలా” గ్రామం మీదుగా వెళుతుంటే తారసపడిన గ్రామస్థులు, వారి జీవన విధానాలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. వారి ఇళ్ళ నిర్మాణం, చెక్కలతో కట్టిన ఇళ్ళూ, పంట పొలాలు, పెంపుడు జంతువులు, చిన్న పిల్లలు, స్కూలు అన్నీ భలేగా ఉన్నాయి.

అక్కడి వ్యక్తులు స్వచ్ఛంగా నవ్వుతూ కనిపించారు.

అక్కడి ఇళ్ళు కూడా సుందరంగా ఉన్నాయి. అన్నీ చెక్కతో నిర్మించినవే. కప్పు మీద రాళ్ళతో ఇంకో లేయరు ఉంటుంది గాలి దుమారాలకి ఎగిరిపోకుండా పటిష్ఠంగా నిలవడానికనుకుంట.

అలా ఆహ్లాదంగా సాగుతున్న ట్రెక్కు మధ్యాహ్నం లంచ్ కి ఆగిన చోట ఏవో సణుగుళ్ళు వినిపించాయి. ఏమిటా అని చూస్తే “అయ్యరు” చిటపట మంటున్నాడు. సంగతేమిటని కనుక్కుంటే అందరూ త్వరగా కదలట్లేదని గైడు దగ్గర విసుక్కుంటున్నాడన్నమాట. పాపం ఇలాంటి ఆనందాలన్నీ అతనికి పట్టినట్టు లేవు. సర్లే పూర్ ఫెలో అని అతని మానానికి అతనిని వదిలేసి మా ట్రెక్కు మా వేగంతో మేము కదిలాము.

ఆ రోజు సాయంత్రం “గుణా పానీ” కి చేరుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఇంకో కాంపు లీడరు మా కోసం ఎదురు చూస్తున్నాడు. అందరికీ టెంట్లు అప్పటికే వేసి ఉన్నాయి. ఎవరయినా ఏ టెంటులోనయినా ఉండవచ్చు కానీ కింద ఏ విధంగా అయితే సర్దారో పైన కూడా అదే విధంగా సర్దుకున్నారు జనాలు. కింద మేము వేరే టెంటులోకి దూరడంతో మేము అయ్యరు టెంటు కాక వేరేదాంట్లో చేరాము. మాతో పాటు బెంగుళూరు నుండి వచ్చిన ఇంకో గుంపు చేరింది.

అక్కడికి చేరగానే ఓ “వెల్కం డ్రింక్” ఇచ్చారు, తర్వాత కొంత సేపటికి వేడి టీ ఒకటి, షరా మామూలే తర్వాత డిన్నరు. అదయ్యాక అందరూ టెంట్లలోకి ఉపక్రమించారు వారి వారి స్లీపింగు బాగులు, రగ్గులు తీసుకుని. మాతో కలిసిన బెంగుళూరు గుంపు మంచి అల్లరి మూక అవడంతో మాకు భలే టైం పాస్ అన్నమాట. (మగాళ్ళ చర్చలన్నీ ఎక్కువగా సెన్సార్డు గా ఉంటాయి కాబట్టి వాటి గురించి ఇక్కడ మాట్లాడను 😉 )

అలా నిద్రలోకి జారుకున్నాము. ఉదయం తొమ్మిదింటికి వేరే కాంపుకి ప్రయాణం. స్నానాలు లేవు గనక చేసుకునే వాళ్ళు బ్రష్ చేసుకుని టీ తాగి, బ్రేక్ఫాస్ట్ తిని, లంచ్ పాక్ చేసుకుని వెళ్లడమే.
హహ… వచ్చిందా డౌటు మరి ఒకటి, రెండు ఎక్కడా అని అక్కడున్న రాళ్ళు, చెట్లన్నీ మీవే 🙂

ఇక రెండో రోజు ఉదయం కాంపు లీడరు ఇవాళ మీరు గ్లేషియర్ దాటాల్సి రావచ్చని చెప్పడంతో అందరిలోనూ ఉత్సుకత. (గ్లేషియర్ అంటే మంచు పెళ్ళలు విరిగినప్పుడు కిందికి జారతాయి. అలా జారినవి కరిగే వరకూ అక్కడే మకాం అన్నమాట). బయల్దేరిన కాసేపట్లోనే మాకు గ్లేషియర్ ఎదురయింది. మేమేదో మంచు లాగా ఉంటుందనుకుంటే అది కొద్దిగా హార్డు ఐసు అన్నమాట.

నెమ్మదిగా దాని మీద నడవటం మొదలుపెట్టాము.

నెమ్మది నెమ్మదిగా పట్టు జారకుండా నడుస్తున్నాము. అంతలో జర్రుమని జారాడు ఒకడు, అతనిని నిలువరించడానికి అతనితో పాటు గైడు. ఐసు/మంచులో జారినప్పుడు నిలువరించడానికి మన షూ హీలుని గట్టిగా దాంట్లో దింపితే కొద్దిగా పట్టు దొరుకుతుంది.

కానీ జారిన షాకో ఏమో ఆ కుర్రాడు మాత్రం అసలు ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. అలా ఓ ఇరవై అడుగులు దాదాపు కిందికి జారిన తరువాత గైడు ఎలాగో ఆపాడు. కానీ ఈ జారడంలో అతని కాంటాక్టు లెన్సు ఒకటి పడిపోయింది. అరగంట వెతికినా అది దొరకలేదు. (పైన బొమ్మలో ఆ కుర్రాడూ, అతని నాన్న పడిపోయిన లెన్సు కోసం వెతకడం కనిపిస్తుంది.)

ఎలాగయితే ఆఖరుకి అందరూ ఆవల పక్క చేరారు.

అది దాటిన తరువాత ఐసు గానీ, మంచు గానీ పెద్దగా తగల్లేదు. అవాంతరాలూ ఎదురవలేదు. రెండో‌ కాంపు “ఫౌలా పానీ” కి చేరుకున్నాము…

23 thoughts on “హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౩

  1. చాలా బాగా ఉంది. చదువుతుంటే హాయిగా ఉంది. ఎందుకంటే నేనూ ట్రెక్కర్నే కాబట్టి. సమాజానికి దూరంగా ప్రకృతి ఒడిలో సరదాగా, భయంగా, ధైర్యంగా ఆ ప్రయాణం అత్యంత శోభనీయం. జీవితంలో ఒక్కసారైనా ఇలా నేషనల్ ట్రెక్కింగ్ చేయని వారు దురదృష్టవంతులు. మీ అనుభవాలు పంచుకుంటున్నందుకు దన్యవాదాలు. జైహింద్

  2. చాలా బాగా ఉంది. చదువుతుంటే హాయిగా ఉంది. ఎందుకంటే నేనూ ట్రెక్కర్నే కాబట్టి. సమాజానికి దూరంగా ప్రకృతి ఒడిలో సరదాగా, భయంగా, ధైర్యంగా ఆ ప్రయాణం అత్యంత శోభనీయం. జీవితంలో ఒక్కసారైనా ఇలా నేషనల్ ట్రెక్కింగ్ చేయని వారు దురదృష్టవంతులు. మీ అనుభవాలు పంచుకుంటున్నందుకు దన్యవాదాలు. జైహింద్

  3. @ నువ్వుశెట్టి బ్రదర్స్:
    బాగా చెప్పారు. నిజంగానే అది ఎవరికి వారు అనుభవించాల్సిందే.
    మీ ట్రెక్కుల విశేషాలు కూడా పంచుకుంటే బాగుంటుంది.

    @ramya గారు:
    అవును వారి ఫోటోలు తీసే అనుభవం నాకు కూడా మరువలేనిది. అమాయకంగా చిరునవ్వులు నవ్వుతూ ఉన్న వారు ఎంత సంతోషంగా ఉన్నారో…
    ఆ ఇళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాయో, అదీ అలాంటీ పరిసరాలలో.. డ్రీం లాండేనేమో

  4. @ నువ్వుశెట్టి బ్రదర్స్:బాగా చెప్పారు. నిజంగానే అది ఎవరికి వారు అనుభవించాల్సిందే.మీ ట్రెక్కుల విశేషాలు కూడా పంచుకుంటే బాగుంటుంది.@ramya గారు:అవును వారి ఫోటోలు తీసే అనుభవం నాకు కూడా మరువలేనిది. అమాయకంగా చిరునవ్వులు నవ్వుతూ ఉన్న వారు ఎంత సంతోషంగా ఉన్నారో…ఆ ఇళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాయో, అదీ అలాంటీ పరిసరాలలో.. డ్రీం లాండేనేమో

  5. ఆ అమ్మాయి నవ్వు చాలా బావుంది.
    నాకక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అవాలనుంది.
    మీ ట్రిప్ అనుభవాలు సింప్లీ సూపర్.

  6. ప్రవీణ్ గారూ, అమాయకత్వం, నిర్మలత్వం అంటే ఏమిటో ఫోటోల్లోని పిల్లలు, అమ్మాయిలను చూస్తే అర్ధం అవుతుంది.. చాలా బాగా రాస్తున్నారు.. నేను కూడా ట్రెక్కింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది! మీరన్నది నిజమే, సరైన ఫిట్ నెస్ లేకుండా వెళ్తే అక్కడ అందరితో సమానంగా ఎంజాయ్ చేయలేము అలా అని తిరిగి రాలేము..

  7. ప్రవీణ్ గారూ, అమాయకత్వం, నిర్మలత్వం అంటే ఏమిటో ఫోటోల్లోని పిల్లలు, అమ్మాయిలను చూస్తే అర్ధం అవుతుంది.. చాలా బాగా రాస్తున్నారు.. నేను కూడా ట్రెక్కింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది! మీరన్నది నిజమే, సరైన ఫిట్ నెస్ లేకుండా వెళ్తే అక్కడ అందరితో సమానంగా ఎంజాయ్ చేయలేము అలా అని తిరిగి రాలేము..

  8. @రవి:
    నాకు బాగా నచ్చిన ఫోటో అది.
    ఏది ఎలా ఉన్నా ఈ ట్రిప్పులో నాకు నచ్చిన కొన్ని ఫోటోలన్నా తీయగలిగాను.

    @meenakshi గారు:
    ఇంకో సారి వెళ్ళాలంటే వెనక్కి రావాలిగా 🙂

    @నిషిగంధ గారు:
    మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

  9. @రవి:నాకు బాగా నచ్చిన ఫోటో అది.ఏది ఎలా ఉన్నా ఈ ట్రిప్పులో నాకు నచ్చిన కొన్ని ఫోటోలన్నా తీయగలిగాను.@meenakshi గారు:ఇంకో సారి వెళ్ళాలంటే వెనక్కి రావాలిగా :)@నిషిగంధ గారు:మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

  10. చాలా బాగా రాస్తున్నారు. నేను ఒక చిన్న 2 మైళ్ళు ట్రెక్ చేసాను, మీ లాగా ఎపుడూ చెయ్యలేదు. ఈ సారి ప్రయత్నిస్తాను.

  11. సూపర్‌గా రాస్తున్నావ్ ప్రవీణ్. ప్రకృతి, మనుషుల ప్రవర్తన, పరిసరాలు, వసతులు, ప్రాంతీయ విషయాలు అన్నీ కలిసి హెడెఫనిషన్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నట్టుంది చదువుతూ వుంటే. ఇదే మాటను నీ ట్రావెలాగుడు ప్రతి భాగానికీ కాపీ-బూస్టు చేసుకో.

  12. సూపర్‌గా రాస్తున్నావ్ ప్రవీణ్. ప్రకృతి, మనుషుల ప్రవర్తన, పరిసరాలు, వసతులు, ప్రాంతీయ విషయాలు అన్నీ కలిసి హెడెఫనిషన్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నట్టుంది చదువుతూ వుంటే. ఇదే మాటను నీ ట్రావెలాగుడు ప్రతి భాగానికీ కాపీ-బూస్టు చేసుకో.

  13. ప్రవీణ్ గారు, ఇప్పుడే మీ ట్రావెలాగు 3 భాగాలూ వరసపెట్టి చదివేసాను.

    ట్రెక్కింగ్ excellent హాబీ! మీతో పాటు ట్రెక్కింగ్ చేసిన అనుభూతి కలిగింది.అదే టైం లో భలే కుళ్ళుగా కూడా ఉందండీ! వాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసి చచ్చిపోవాలని కోరిక! మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చేశారా! అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఆ సువాసనలకు మతి భ్రమించినట్టు అయిపోతారని చదివానెక్కడో! ఈ YHAI గురించి ఒకబ్బాయి ఈనాడు ఆదివారం ఎడిషన్లో రాసాడొకసారి!

    ఈ సారి కులూ వెళ్ళినపుడు కసోల్ వెళ్లి తీరాల్సిందే! మేమిద్దరమూ టూర్లంటే పడి చచ్చిపోతాము! మీ ట్రావెలాగు అద్భుతంగా ఉంది! నిషిగంధ గారన్నట్టు అత్యవసరంగా బాక్పాక్ సర్దేసుకోవాలనిపిస్తోంది.

  14. ప్రవీణ్ గారు, ఇప్పుడే మీ ట్రావెలాగు 3 భాగాలూ వరసపెట్టి చదివేసాను.ట్రెక్కింగ్ excellent హాబీ! మీతో పాటు ట్రెక్కింగ్ చేసిన అనుభూతి కలిగింది.అదే టైం లో భలే కుళ్ళుగా కూడా ఉందండీ! వాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసి చచ్చిపోవాలని కోరిక! మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చేశారా! అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఆ సువాసనలకు మతి భ్రమించినట్టు అయిపోతారని చదివానెక్కడో! ఈ YHAI గురించి ఒకబ్బాయి ఈనాడు ఆదివారం ఎడిషన్లో రాసాడొకసారి! ఈ సారి కులూ వెళ్ళినపుడు కసోల్ వెళ్లి తీరాల్సిందే! మేమిద్దరమూ టూర్లంటే పడి చచ్చిపోతాము! మీ ట్రావెలాగు అద్భుతంగా ఉంది! నిషిగంధ గారన్నట్టు అత్యవసరంగా బాక్పాక్ సర్దేసుకోవాలనిపిస్తోంది.

  15. @శ్రీ:
    ప్రయత్నించండి… నేనూ ఈ ట్రెక్కుకి ముందు మీ బాపతే 🙂

    @రానారె:
    అంత లాగుడు లాగిన నువ్వు చెబుతున్నావంటే ఆనందంగా ఉంది. థాంకూ…

    @సుజాత గారు:
    “వాలీ ఆఫ్ ఫ్లవర్స్” చూడాలని నా కోరిక కూడా అండీ…
    కుదిరితే వచ్చే ఏడాది చెయ్యడమే.

  16. @శ్రీ:ప్రయత్నించండి… నేనూ ఈ ట్రెక్కుకి ముందు మీ బాపతే :)@రానారె:అంత లాగుడు లాగిన నువ్వు చెబుతున్నావంటే ఆనందంగా ఉంది. థాంకూ…@సుజాత గారు:”వాలీ ఆఫ్ ఫ్లవర్స్” చూడాలని నా కోరిక కూడా అండీ…కుదిరితే వచ్చే ఏడాది చెయ్యడమే.

Leave a reply to రవి స్పందనను రద్దుచేయి