జూన్ 18, 2008

మంట నక్క ౩, ఇతరాలు …

Posted in ఒపెరా, టెక్నాలజీ, ఫైర్‌ఫాక్స్, మంటనక్క, firefox, opera వద్ద 5:14 సా. ద్వారా Praveen Garlapati

మొత్తానికి మంట నక్క ౩ విడుదలయింది. వారు స్థాపించదలచుకున్న ఐదు మిలియన్ల దిగుమతుల రికార్డు ఎప్పుడో దాటేసారు (ఇప్పటికి ఎనిమిది మిలియన్లు దాటింది). వివరాలు ఇక్కడ.

నిన్న అందరూ ఒకే సారి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించడంతో దాని సర్వరు డౌనయింది కూడా. రాత్రి ఆన్లైనులో కనబడిన వారందరికీ దిగుమతి చేసుకోమని ప్రచారం చేసి నా వంతు నేను చేసాను (నేను కూడా దిగుమతి చేసుకున్నాను). అన్నట్టు వీవెన్, నేను రాత్రి స్టాట్స్ పేజీని ఒకటే తాజీకరించడం. నిముషానికి ఎన్ని దిగుమతులవుతున్నాయో చూడడానికి 🙂

ఎన్నో చక్కని ఫీచర్లతో, మెరుగుపరచబడిన మెమొరీ వాడకంతో ఆకట్టుకునేదిగా ఉంది. అన్ని ఫీచర్లనూ తెలుసుకోవడానికి ఓ సారి ఇక్కడికెళ్ళండి.

అన్నిటి కన్నా మంచి సదుపాయం మనం ఇంతకు ముందు వెళ్ళిన పేజీల సంగ్రహాన్ని సులువుగా వెతకడానికి జత చేసిన ఫీచర్లు.

మీరు మీ URL bar లో ఏదయినా కీ పదాన్ని టైపు చెయ్యగానే అది మీరు ఇంతకు ముందు వెళ్ళిన పేజీలలో ఆ పదం ఎక్కడెకడుందో ఆ పేజీలను మీకు వెంటనే చూపిస్తుంది.

అలాగే మీరు తరచుగా వెళ్ళే పేజీలను ఆటోమేటిగ్గా Places, Smart Bookmarks, Most Visited అనే ఫోల్డర్లలో పెడుతుంది. పేజీకలను (bookmarks) ను స్థాపించుకోవడం కూడా చాలా ఈజీ. మీరు ఏ పేజీనయితే పేజీకగా మార్చదలచుకున్నారో ఆ పేజీకి వెళ్ళి URL bar లో ఉన్న నక్షత్రం బొమ్మని క్లిక్కుమనిపించండి. అంతే అది పేజీకగా మారిపోతుంది. అలాగే మీ పేజీకలకు టాగులని పెట్టుకోవచ్చు. నక్షత్రం గుర్తు మీద రెండు సార్లు నొక్కండి. అక్కడ మీకు కావలైసిన టాగులను దానికి జోడించండి.

ఇంకా కొత్త ఫీచర్లును ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఇక్కడ, ఇక్కడ చూడండి.

అన్నట్టు కొసరుగా ఓ రెండు చక్కని ఆడాన్‌ ల గురించి ఈ సందర్భంగా చెబుతాను.

౧. వీవ్: ఇది ఇంకా పూర్తిగా విడుదల అవలేదు. ఇంకా మోజిల్లా లాబ్స్ లోనే ఉంది. అంటే దీనిని ఇంకా పరీక్షిస్తున్నారు. కానీ చక్కని ఆడాన్ ఇది.

మీరు చాలా సార్లు అనుకునుంటారు మీ పేజీకలు, వెబ్ పేజీల చరిత్ర, కుకీలు, మంట నక్కలో నిక్షిప్తం చేసుకున్న సంకేత పదాలూ మీరెక్కడి నుంచి పని చేసినా అక్కడికొచ్చేలా ఉంటే బాగుండునని. సరిగా దానికోసం సృష్టించబడిన ఆడాన్ ఇది.

దీని కోసం మీరు ఒక మోజిల్లా లాబ్స్ లో ఒక ఖాతా సృష్టించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ మంట నక్క విహరిణి లో దానిని నిక్షిప్తం చేసుకుంటే అప్పటి నుంచీ పైన చెప్పినవన్నీ దాని సర్వరులో పెట్టుకుంటుంది (ఎన్‌క్రిప్ట్ చేసి పెట్టుకుంటుంది.)

మీకు ఇవన్నీ ఇంకొక సిస్టం మీద పని చేసేటప్పుడు కావాలనుకోండి, ఆ సిస్టం లో ఉన్న మంట నక్క కి వీవ్ ఆడాన్ ని జత చెయ్యండి. మీ లాగిన్ వివరాలు అందిస్తే అన్నిటినీ కొత్త సిస్టం లోకి తెచ్చేసుకుంటుంది.

మీరు Tools > Weave > Weave Preferences కి వెళ్ళి కావలసిన ఎంపికలను చేసుకోండి.

అంతే కాదు ఇక నుంచి మీరు కొత్తగా జోడించిన పేజీకలు వగయిరా అన్నీ కూడా వీవ్ ఉన్న అన్ని సిస్టం ల మీదా లభ్యమయ్యేలా చూస్తుంది.

మీ పని సులభతరం చేస్తుంది కదూ. ప్రయత్నించి చూడండి.

౨. రీడిట్ లేటర్: ఈ ఆడాన్ కూడా మీ మంట నక్కకి చక్కని జోడింపు.

ఎన్నో సార్లు మీరు అంతర్జాలంలో విహరించేటప్పుడు కావలసిన పేజీలు అన్నీ అప్పటికప్పుడే చదవడం కుదరదు. అలాగని అంత సేపూ మీరు అంతర్జాలానికి అనుసంధానమయ్యి ఉండలేరు. సరిగా ఆ సమస్యను పరిష్కరించడానికే ఈ ఆడాన్.

దీనిని మీ మంట నక్కలో వ్యవస్థాపితం చేసుకోండి. తర్వాత మీకు URL bar లో ఒక టిక్కు మార్కు కనిపిస్తుంది. మీరు ఏ పేజీనయితే తర్వాత చదవదలచుకున్నారో ఆ పేజీలో టిక్కు మార్కుని నొక్కండి. ఆ లంకె వెంటనే రీడిట్ లేటర్ జాబితాలో చేరిపోతుంది. (మీరు ప్రస్తుతం చూస్తున్న అన్ని టాబులనూ, విడి విడిగా లంకెలనూ కూడా ఇందులో చేర్చుకోవచ్చు)

అయితే మీరు ఎంచుకున్న పేజీలు మీరు అంతర్జాలానికి అనుసంధానమయి లేనప్పుడు కుడా లభ్యం కావాలంటే మీరు దాని మెనూ కి వెళ్ళి “Read Offline” అనే లంకె మీద నొక్కండి. అది మీకు కావలసిన పేజీలన్నిటినీ మీ సిస్టం లో నిక్షిప్తం చేసుకుంటుంది. తర్వాత మీరు అంతర్జాలానికి దూరమయినా దాని మెనూ కి వెళ్ళి ఆ లంకె మీద నొక్కితే ఆ పేజీ మీకు లభ్యమవుతుంది.

అక్కర్లేదనుకున్న పేజీల నుంచి టిక్కు మార్కు తొలగిస్తే ఆ పేజీ ఇక లభ్యమవదు.

భలేగా ఉంది కదూ.

అందుకే మరి మంట నక్క లాంటి విహరిణులు వాడాలి. మరిన్ని చక్కని ఆడాన్‌ లు స్థాపించుకుని మీ విహరిణిని మరింత శక్తిమంతంగా తయారు చేసుకోండి.

ఇది చూడండి: అన్నట్టు నా లాగా ఒకటి కంటే ఎక్కువ విహరిణులు వాడే వారు ఓపెరా 9.5 ని ప్రయత్నించి చూడండి. దాని వేగం ముందు ఏ విహరిణి అయినా దిగదుడుపే. అదీ కాక ఏ ఆడాన్ లు లేకుండానే అది ఎన్నో ఫీచర్లను అందిస్తుంది. అవేమిటో ఇక్కడ చూడండి.
కొత్త రూపుతో ఆకట్టుకునేలా తయారు చేసారు కూడా.

19 వ్యాఖ్యలు »

 1. మేధ said,

  వివరణ బావుంది… నేను కూడా నా వంతు ప్రచారం చేశాను.. 🙂

 2. మేధ said,

  వివరణ బావుంది… నేను కూడా నా వంతు ప్రచారం చేశాను.. 🙂

 3. రవి said,

  మంట నక్క వాడు నక్కను తొక్కాడన్నమాట మొత్తానికి.

  వీవ్, రీడిట్ లేటర్ మంచి ఫీచర్లు. మంట నక్కలో ఇవన్నీ డీఫాల్ట్ ఫీచర్సా, లేకపోతే మనం సంస్థాపించుకున్న తత్ క్షణం సిస్టంలో వచ్చి కూర్చుంటాయా? ఎందుకంటే, ఇవన్నీ దిగుమతి ఐతే, space ఎక్కువవుతుంది కదా సిస్టంలో..

  నాకో ఇబ్బంది…నా మొబైల్ లో ఓపెరా, ఓపెరా మినీ ఉన్నాయి. అందులో మన తెలుగు (యూనీ కోడ్) అక్షరాలు కనిపించవు. నా దగ్గర సిస్టం లేకపోవడంతో, నా మైల్స్ అన్నీ మొబైల్ లో చూసుకోవాలి. యూనికోడ్ కోసం ఎవో డీఎలెల్స్ దింపుకోమంటుంది. కానీ మొబైల్ లో అవి దింపుకుని ఎమి చేసుకోవాలి?

  ఈ విషయం మీద మీకేమైనా తెలుస్తే ఙ్ఞానోదయం కలిగించండి.

 4. రవి said,

  మంట నక్క వాడు నక్కను తొక్కాడన్నమాట మొత్తానికి. వీవ్, రీడిట్ లేటర్ మంచి ఫీచర్లు. మంట నక్కలో ఇవన్నీ డీఫాల్ట్ ఫీచర్సా, లేకపోతే మనం సంస్థాపించుకున్న తత్ క్షణం సిస్టంలో వచ్చి కూర్చుంటాయా? ఎందుకంటే, ఇవన్నీ దిగుమతి ఐతే, space ఎక్కువవుతుంది కదా సిస్టంలో..నాకో ఇబ్బంది…నా మొబైల్ లో ఓపెరా, ఓపెరా మినీ ఉన్నాయి. అందులో మన తెలుగు (యూనీ కోడ్) అక్షరాలు కనిపించవు. నా దగ్గర సిస్టం లేకపోవడంతో, నా మైల్స్ అన్నీ మొబైల్ లో చూసుకోవాలి. యూనికోడ్ కోసం ఎవో డీఎలెల్స్ దింపుకోమంటుంది. కానీ మొబైల్ లో అవి దింపుకుని ఎమి చేసుకోవాలి? ఈ విషయం మీద మీకేమైనా తెలుస్తే ఙ్ఞానోదయం కలిగించండి.

 5. Purnima said,

  Good Info Praveen!! Firefox is improving, time and gain which is great news for ppl like me, who rely on it so heavily!!

  -Purnima

 6. Purnima said,

  Good Info Praveen!! Firefox is improving, time and gain which is great news for ppl like me, who rely on it so heavily!!-Purnima

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  @ మేధ గారు:
  ఆసం. మీ లాంటి వారే అవసరం. 🙂

  @ రవి:

  ఆ రెండూ ఆడాన్ లు. అంటే డీఫాల్టుగా మంట నక్కతో పాటు రావు. మనం విడిగా స్థాపితం చేసుకోవాల్సిందే.
  అయితే పెద్దగా స్పేస్ ఏమీ తీసుకోవు ఇవి. ఆడాన్ లు చాలా తక్కువ సైజు ఉంటాయి.

  నేను మోబైల్ మీద బ్రౌజింగ్ చెయ్యలేదు కాబట్టి మొబైల్ మీద యూనీకోడు గురించి తెలీదు. కిరణ్ వాకా గారికి, లేదా శ్రీ దీపిక దిలీపు గారికి తెలిసుండచ్చు.
  ఇంతకు ముందు వారు మన గుంపులోనూ, బ్లాగూలలోనూ దీని గురించి కొంత చర్చించారు.

  @ purnima గారు:
  అవును నిజమే. ఈ విహరిణిని వాడే వాళ్ళు బాగా పెరిగారు. మొన్న దిగుమతుల సంఖ్యే విహరిణి విపణిలో నాలుగు శాతం ఉంటుందని ఒక అంచనా అట.

 8. @ మేధ గారు:ఆసం. మీ లాంటి వారే అవసరం. :)@ రవి:ఆ రెండూ ఆడాన్ లు. అంటే డీఫాల్టుగా మంట నక్కతో పాటు రావు. మనం విడిగా స్థాపితం చేసుకోవాల్సిందే.అయితే పెద్దగా స్పేస్ ఏమీ తీసుకోవు ఇవి. ఆడాన్ లు చాలా తక్కువ సైజు ఉంటాయి.నేను మోబైల్ మీద బ్రౌజింగ్ చెయ్యలేదు కాబట్టి మొబైల్ మీద యూనీకోడు గురించి తెలీదు. కిరణ్ వాకా గారికి, లేదా శ్రీ దీపిక దిలీపు గారికి తెలిసుండచ్చు.ఇంతకు ముందు వారు మన గుంపులోనూ, బ్లాగూలలోనూ దీని గురించి కొంత చర్చించారు.@ purnima గారు:అవును నిజమే. ఈ విహరిణిని వాడే వాళ్ళు బాగా పెరిగారు. మొన్న దిగుమతుల సంఖ్యే విహరిణి విపణిలో నాలుగు శాతం ఉంటుందని ఒక అంచనా అట.

 9. కొత్త పాళీ said,

  నీకు నూరేళ్ళాయుస్సు.
  వీవెన్ ఇచ్చిన పిలుపుతో నేను సైతం అని రెచ్చిపోయి దింపేసి స్థాపించేశా. అప్పుడు మొదలయ్యాయి నా పాట్లు .. పద్మ పని చెయ్యదు, దానికి బ్లాగ్గుంపులు మీరంతా ఇచ్చిన సూచనలు పిల్లంటే మార్జాలం అన్నట్టున్నాయి (నాగార్జున గారు పద్మ కొత్త అవతారాన్ని ఆవిష్కరించినట్టు ఇప్పుడే చూశా), ఎడ్రసు బార్లో నాలుగక్షరాలు నొక్కంగానో ఎక్కడెక్కడి సంబంధం లేనివన్నీ పైకి తేల్తున్నాయి .. మొత్తానికి ఇవ్వాళ్ల పొద్దున నా పరిస్థితి ఉన్నది కూడా ఊడింది అన్న చందంగా తయారైంది.
  సరే .. ఈ మూడో అవతారం ముచ్చట్లేమో రాశావుగా, ఇహ చూస్తా దాని పస. 🙂

 10. నీకు నూరేళ్ళాయుస్సు.వీవెన్ ఇచ్చిన పిలుపుతో నేను సైతం అని రెచ్చిపోయి దింపేసి స్థాపించేశా. అప్పుడు మొదలయ్యాయి నా పాట్లు .. పద్మ పని చెయ్యదు, దానికి బ్లాగ్గుంపులు మీరంతా ఇచ్చిన సూచనలు పిల్లంటే మార్జాలం అన్నట్టున్నాయి (నాగార్జున గారు పద్మ కొత్త అవతారాన్ని ఆవిష్కరించినట్టు ఇప్పుడే చూశా), ఎడ్రసు బార్లో నాలుగక్షరాలు నొక్కంగానో ఎక్కడెక్కడి సంబంధం లేనివన్నీ పైకి తేల్తున్నాయి .. మొత్తానికి ఇవ్వాళ్ల పొద్దున నా పరిస్థితి ఉన్నది కూడా ఊడింది అన్న చందంగా తయారైంది.సరే .. ఈ మూడో అవతారం ముచ్చట్లేమో రాశావుగా, ఇహ చూస్తా దాని పస. 🙂

 11. anil said,

  When I tried to install – ” There was problem starting Read It Later. Try starting Firefox. IF this happens again let us know at ideashower.com” messages appeared all the four times when I tried to restart and uninstall and install and disable and enable on the FF3 version.
  మీ సలహా ఏమిటి?

 12. anil said,

  When I tried to install – ” There was problem starting Read It Later. Try starting Firefox. IF this happens again let us know at ideashower.com” messages appeared all the four times when I tried to restart and uninstall and install and disable and enable on the FF3 version.మీ సలహా ఏమిటి?

 13. ప్రవీణ్ గార్లపాటి said,

  @ కొత్త పాళీ గారు:
  అవును. టెక్నాలజీని లే మాన్ దగ్గరికి తీసుకురావడంలో విఫలమే అది. దానికి మార్గాలను అన్వేషించాలి.
  నా టపాలో లంకెలు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను.

  @ anil గారు:
  థర్డ్ పార్టీ ఆడాన్లతో వచ్చిన చిక్కే అది. మోజిల్లా మీద హోస్టు చేయబడిన ఆడాన్లు అయితే వారు సర్టీఫై చేస్తారు.
  మీ బ్రౌజరు క్రాష్ అవుతుందంటే తీసివేయండి దానిని.

 14. @ కొత్త పాళీ గారు:అవును. టెక్నాలజీని లే మాన్ దగ్గరికి తీసుకురావడంలో విఫలమే అది. దానికి మార్గాలను అన్వేషించాలి.నా టపాలో లంకెలు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను.@ anil గారు:థర్డ్ పార్టీ ఆడాన్లతో వచ్చిన చిక్కే అది. మోజిల్లా మీద హోస్టు చేయబడిన ఆడాన్లు అయితే వారు సర్టీఫై చేస్తారు.మీ బ్రౌజరు క్రాష్ అవుతుందంటే తీసివేయండి దానిని.

 15. తెలుగు'వాడి'ని said,

  కొత్తపాళీ గారు : ప్రవీణ్ గారు చెపుతారులే, మధ్యలో మనం వేలు పెట్టటం ఎందుకు అని ఆగా మీ అడ్రస్ బార్ సమస్య (నాలుగు అక్షరాలు నొక్కితే ఎక్కడి నుంచో ఏవేవో వస్తున్నాయి) గురించి …

  Disable Firefox 3’s ‘awesome bar’

  Hide Unvisited 3

  ఇంకా ఇలాంటి టిప్స్ కొన్ని ఉన్నాయండీ .. ఇవి పని చేయకపోతే చెప్పండి .. అప్పుడు వాటి గురించి చూద్దాం ..

 16. తెలుగు'వాడి'ని said,

  కొత్తపాళీ గారు : ప్రవీణ్ గారు చెపుతారులే, మధ్యలో మనం వేలు పెట్టటం ఎందుకు అని ఆగా మీ అడ్రస్ బార్ సమస్య (నాలుగు అక్షరాలు నొక్కితే ఎక్కడి నుంచో ఏవేవో వస్తున్నాయి) గురించి …

  Disable Firefox 3’s ‘awesome bar’

  Hide Unvisited 3

  ఇంకా ఇలాంటి టిప్స్ కొన్ని ఉన్నాయండీ .. ఇవి పని చేయకపోతే చెప్పండి .. అప్పుడు వాటి గురించి చూద్దాం ..

 17. కొత్తపాళీ గారు : ప్రవీణ్ గారు చెపుతారులే, మధ్యలో మనం వేలు పెట్టటం ఎందుకు అని ఆగా మీ అడ్రస్ బార్ సమస్య (నాలుగు అక్షరాలు నొక్కితే ఎక్కడి నుంచో ఏవేవో వస్తున్నాయి) గురించి … Disable Firefox 3’s ‘awesome bar’ Hide Unvisited 3ఇంకా ఇలాంటి టిప్స్ కొన్ని ఉన్నాయండీ .. ఇవి పని చేయకపోతే చెప్పండి .. అప్పుడు వాటి గురించి చూద్దాం ..

 18. ప్రవీణ్ గార్లపాటి said,

  @ తెలుగు’వాడిని:
  కృతజ్ఞతలు. అసలు ఉపయోగం తెలీకుండా అచేతనం చెయ్యడమెందుకు ?

  నా ప్రకారం చక్కని ఫీచర్ అది.
  దాని గురించి చదివిన తర్వాత కూడా అవసరం లేదనిపిస్తే అప్పుడే అచేతనం చెయ్యచ్చు.

 19. @ తెలుగు’వాడిని:కృతజ్ఞతలు. అసలు ఉపయోగం తెలీకుండా అచేతనం చెయ్యడమెందుకు ?నా ప్రకారం చక్కని ఫీచర్ అది. దాని గురించి చదివిన తర్వాత కూడా అవసరం లేదనిపిస్తే అప్పుడే అచేతనం చెయ్యచ్చు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: