జూన్ 21, 2008

ఫైవ్ పాయింట్ సమ్‌వన్, ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ – చేతన్ భగత్

Posted in చేతన్ భగత్, పుస్తకం, పుస్తకాలు వద్ద 7:53 సా. ద్వారా Praveen Garlapati

కొన్ని పుస్తకాలు చదవడానికి కారణం అవసరం లేదు. అంటే అది చదవడానికి అది ఏదో పెద్ద రచయితది అవనవసరం లేదు. ఇంకేదో మంచీ, చెడూ చెప్పనక్కర్లేదు.
ఇవేవీ లేకపోయినా వీటికి ఎంటర్టెయిన్‌మెంట్ వాల్యూ ఉంటుంది. అలాంటి ఒక రెండు పుస్తకాలు ఈ మధ్య చదివాను. రెండూ ఒక రచయిత రాసినవే.

ఇవి మన యువ బ్లాగు మిత్రులలో చాలా మందే చదివి ఉంటారు. నేను చెప్పేది చేతన్ భగత్ గురించి. అతను రాసిన “ఫైవ్ పాయింట్ సమ్‌వన్”, “ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” పుస్తకాల గురించి.
వీటిని నవలలనలేము, అలాగని స్వగాతలనీ అనలేము. కొంత నిజం, కొంత కల్పితం, కొంత ఆటో బయాగ్రఫీ ని మేళవించి చెప్పిన కథలు.

ముఖ్యంగా ఈ పుస్తకాలలో మనని ఆకట్టుకునేది సాఫీగా సాగిపోయే పదజాలం, మనకి తెలిసనట్టే ఉండే సన్నివేశాలు, ఏదీ బోధించని తత్వం. (అంతర్గతంగా కథలో భాగంగా కొంత నేర్చుకోదగింది ఉంటుందనుకోండి)

ఉదా: అతని “ఫైవ్ పాయింట్ సమ్‌వన్” పుస్తకం తీసుకుంటే అది ఐఐటీ లలో జీవితం గురించి. అక్కడ రాగింగు, స్నేహితులతో జల్సాలు, చదువు అనే ఒక చట్రం, ఆ సంకెళ్ళని తెంచుకుని బయటపడడానికి జరిపే ప్రయత్నం, లవ్ స్టోరీలు వగయిరా వగయిరా.

ఓ ముగ్గురు ఐఐటీ విద్యార్థుల కథ ఇది (అందులో రచయిత ఒకడు). అక్కడ చేరినప్పటి నుంచీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో, అక్కడ కష్టాలని ఎలా ఎదురుకున్నారో, అర్థం లేని చదువులను కెరీర్ కోసమే బట్టీయం వేయలేక ఎలా తికమక పడ్డారో చెబుతాడు.
అలానే చిన్న చిన్న సరదాలు, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల పట్టించుకోని తనం, వారు చేసే తప్పులు, వాటిని సరిదిద్దుకోవడానికి పడే పాట్ల గురించీ ఉంటుంది కథలో.

పైన చెప్పిన వాటన్నిటినీ ఒక చక్కని సరదాగా సాగిపోయే కథలా చెప్పడంలో విజయం సాధించాడు చేతన్. పుస్తకానికి ముందే చెబుతాడు అతను ఈ పుస్తకం ఐఐటీలో ప్రవేశించడానికి కాదనీ, అక్కడ జరిగే సంగతుల గురించి చెప్పటానికి మాత్రమేననీ. చెప్పినట్టే ఉంటుంది పుస్తకం.

సరదాగా ఏ ప్రయాణంలోనో టైం పాస్ కి అద్బుతమయిన పుస్తకం ఇది. నేను అలానే చదివాను దీనిని 🙂

ఇక రెండో పుస్తకమూ ఇతనిదే. మొదటి పుస్తకం నచ్చి ఇది కూడా కొన్నాను.

ఈ కథ ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన మూడు తప్పుల గురించి స్వగతంలా చెప్పుకునే కథ. జీవితంలో వ్యాపారం చేసి కోట్లు గడించాలనుకునే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, అతను ఏం తప్పులు చేసాడు, అతనిని ఆత్మహత్యకి ప్రయత్నించేలా చేసిన సందర్భాలేంటి అనేది పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.

చక్కని యువ రచయితగా తనను తాను స్థాపించుకున్న చేతన్ పుస్తకాలు సినిమాలుగా కూడా మారబోతున్నాయి. అన్నట్టు అతను రాసిన ఇంకో పుస్తకం కూడా ఉందండోయ్… “వన్ నైట్ ఇన్ కాల్‌సెంటర్”. అది క్యూలో ఉంది 🙂

16 వ్యాఖ్యలు »

 1. మేధ said,

  మీరు చెప్పినట్లు టైంపాస్ కి సరిపోతుంది.. మొదటిది, చివరిది చదివారా, మరి మధ్యలోది ఎప్పుడో..?!

 2. మేధ said,

  మీరు చెప్పినట్లు టైంపాస్ కి సరిపోతుంది.. మొదటిది, చివరిది చదివారా, మరి మధ్యలోది ఎప్పుడో..?!

 3. Purnima said,

  ee pustakaalanu choosina pratee saari light teesukuntunnaanu. mee tapaa chadivaaka aalochinchaalsi vastundi.

 4. Purnima said,

  ee pustakaalanu choosina pratee saari light teesukuntunnaanu. mee tapaa chadivaaka aalochinchaalsi vastundi.

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @ మేధ గారు:
  అదీ కానివ్వాలి. ఇంకో ప్రయాణం ఎప్పుడో దానికి మోక్షం అప్పుడే 🙂

  @ purnima గారు:
  ఇవి లైట్ తీసుకోవాల్సిన పుస్తకాలే. కానీ తీసిపారేయాల్సినంత కాదు. చక్కని టైం పాస్.

 6. @ మేధ గారు:అదీ కానివ్వాలి. ఇంకో ప్రయాణం ఎప్పుడో దానికి మోక్షం అప్పుడే :-)@ purnima గారు:ఇవి లైట్ తీసుకోవాల్సిన పుస్తకాలే. కానీ తీసిపారేయాల్సినంత కాదు. చక్కని టైం పాస్.

 7. కొల్లూరి సోమ శంకర్ said,

  చిత్రంగా నేను కూడా Five Point Someone ని రైలు ప్రయాణంలోనే చదివా. నా బ్లాగులో ఈ లింక్ చూడండి: http://kollurisomasankar.blogspot.com/2008/05/blog-post.html
  “ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” శనీవారం సాయంత్రం నా చేతికొచ్చింది ఇంకా చదవలేదు.
  కొల్లూరి సోమ శంకర్
  http://www.kollurisomasankar.wordpress.com

 8. చిత్రంగా నేను కూడా Five Point Someone ని రైలు ప్రయాణంలోనే చదివా. నా బ్లాగులో ఈ లింక్ చూడండి: http://kollurisomasankar.blogspot.com/2008/05/blog-post.html “ద ౩ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” శనీవారం సాయంత్రం నా చేతికొచ్చింది ఇంకా చదవలేదు. కొల్లూరి సోమ శంకర్ http://www.kollurisomasankar.wordpress.com

 9. సిరిసిరిమువ్వ said,

  నిజమే మూడూ time pass పుస్తకాలే. అక్కడక్కడ కొంత అసహజం అనిపించినా కాలక్షేపానికి చదువుకోవచ్చు.

 10. నిజమే మూడూ time pass పుస్తకాలే. అక్కడక్కడ కొంత అసహజం అనిపించినా కాలక్షేపానికి చదువుకోవచ్చు.

 11. ravindra said,

  మూడూ టైం పాస్ పుస్తకాలే అయినా,5పాయింట్ సంవన్ ప్రతీ ఒక్కరికి వాళ్ళ కాలేజీ రోజుల్ని గుర్తుచేస్తుందనటంలో సందేహం లేదు. ఇక వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్ మొదటిదాని అంత బాగుండదు.3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ చాలా సినిమాటిక్ గా ఉంటుంది.కానీ బోరింగ్ గా ఉన్నప్పుడు వీటిలో ఏది చదివినా మంచి టైం పాస్ .

 12. ravindra said,

  మూడూ టైం పాస్ పుస్తకాలే అయినా,5పాయింట్ సంవన్ ప్రతీ ఒక్కరికి వాళ్ళ కాలేజీ రోజుల్ని గుర్తుచేస్తుందనటంలో సందేహం లేదు. ఇక వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్ మొదటిదాని అంత బాగుండదు.3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ చాలా సినిమాటిక్ గా ఉంటుంది.కానీ బోరింగ్ గా ఉన్నప్పుడు వీటిలో ఏది చదివినా మంచి టైం పాస్ .

 13. ప్రవీణ్ గార్లపాటి said,

  @ కొల్లూరి సోమ శంకర్ గారు:
  చాలా మంది అలాగే కొంటారనుకుంట.

  @ సిరిసిరిమువ్వ గారు:
  అవును.

  @ ravindra గారు:
  నాకూ మొదటి దానంతగా “3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” నచ్చలేదు.

 14. @ కొల్లూరి సోమ శంకర్ గారు:చాలా మంది అలాగే కొంటారనుకుంట.@ సిరిసిరిమువ్వ గారు:అవును.@ ravindra గారు:నాకూ మొదటి దానంతగా “3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” నచ్చలేదు.

 15. ఏకాంతపు దిలీప్ said,

  @Praveen

  eppati nundo nEnu Chetan Bhagat ni parichayam cheddaamanukuntunnaanu. inka aa avasaram ledu.
  saradaaga,vyagyamga,vetakaaramgaa,chilipigaa chaalaa baagaa raastaadu Chetan.

  3 mistakes konnaanu gaanee inkaa chadavaledu. mundu rendu chadivesaanu.

  atani rachana saili tappanisarigaa parichayam chesukovaalsinadi. five point someone maatram miss avvakoodadu.

  chadivina taravaata manalo chetan poonataadu. entati introvert lainaa bhava prakatana vaipu adugulesataaru.

  inkO vishayamentante,tanu aaDa, maga manastatvaalani bhale saradaagaa differentiate chesi chUputaadu.

 16. @Praveeneppati nundo nEnu Chetan Bhagat ni parichayam cheddaamanukuntunnaanu. inka aa avasaram ledu. saradaaga,vyagyamga,vetakaaramgaa,chilipigaa chaalaa baagaa raastaadu Chetan. 3 mistakes konnaanu gaanee inkaa chadavaledu. mundu rendu chadivesaanu.atani rachana saili tappanisarigaa parichayam chesukovaalsinadi. five point someone maatram miss avvakoodadu.chadivina taravaata manalo chetan poonataadu. entati introvert lainaa bhava prakatana vaipu adugulesataaru.inkO vishayamentante,tanu aaDa, maga manastatvaalani bhale saradaagaa differentiate chesi chUputaadu.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: