జూన్ 22, 2008

రెఢీ బాగుంది …

Posted in రెఢీ, సినిమా, సినిమాలు వద్ద 5:21 సా. ద్వారా Praveen Garlapati

చాన్నాళ్ళ తర్వాత థియేటరులో ఒక తెలుగు సినిమా చూసాను. “రెఢీ

హీరో రామ్‌, హీరోయిన్ జెనీలియా. ఇక కమేడియన్లు బ్రహ్మానందం, సునీల్, ఇంకా చాలా మంది.
సరదాగా ఉంది. కామెడీ బాగుంది. రామ్‌ డాన్సు చక్కగా చేసాడు.

కథలో పెద్ద నావెల్టీ గురించి చూడకండి. ఎందుకంటే కొంత ఢీ, దిల్ లాంటి సినిమాల టైపులో ఉంటుంది.
కానీ బాగుంది. సరదా సరదాగా చూసి ఆనందించడానికి అనువయిన సినిమా.

ముఖ్యంగా కామెడీ చక్కగా ఉంది. వల్గారిటీ లేదు.
సునీల్ పాత్ర కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నా, అసభ్యంగా అయితే లేదు.

కథ గురించి పెద్దగా చెప్పేదేమీ లేదు. హీరో అమ్మాయిలను లెపుకెళ్ళి స్నేహితులతో పెళ్ళి జరిపించే బాపతు.
అలా పొరపాటున ఇంకెవరి బదులో మన “జెనీలియా” ని ఎత్తుకొచ్చి కష్టాల్లో పడతాడు. అక్కడ నుంచి దిల్, ఢీ స్టయిల్లో ఎలా నెట్టుకొచ్చాడో అన్నదే కథ.

రామ్‌ నటించిన దేవదాసు అయితే నేను చూడలేదు కానీ జగడం చూసాను. ఆ సినిమా పెద్ద నచ్చకపోయినా యాక్షన్ బానే ఉంది అనిపించింది. ఈ సినిమాలోనూ బాగుంచి యాక్షన్.
అలాగే డాన్సు బాగా చేసాడనిపించింది. ఫైట్లు షరా మామూలే కొంత గాల్లోనూ, కొంత జారడంలోనూ.

పాటలు సుమారుగా ఉన్నాయి. పెద్దగా చెప్పుకునేందుకేమీ లేదు.

హాయిగా చూసి మరచిపోయే సినిమా. “పాండురంగడు” మహత్యానికి జడిసిన సినీ జనాలకి ఊరటనిస్తుంది.

రేటింగు: 3.5/5

ప్రకటనలు

16 వ్యాఖ్యలు »

 1. శ్రీ said,

  హమ్మయ్య..మంచి సినిమా అనమాట. తప్పక చూస్తాం.

 2. శ్రీ said,

  హమ్మయ్య..మంచి సినిమా అనమాట. తప్పక చూస్తాం.

 3. కత్తి మహేష్ కుమార్ said,

  మొత్తానికి చాలారోకుల తరువాత తెలుగులో చూడదగ్గ సినిమా ఒకటొచ్చిందన్నమాట! మంచిది.

  మీరి http://www.navatarangam.com/?p=502 ఈ లంకె చూడగలరు.

 4. మొత్తానికి చాలారోకుల తరువాత తెలుగులో చూడదగ్గ సినిమా ఒకటొచ్చిందన్నమాట! మంచిది.మీరి http://www.navatarangam.com/?p=502 ఈ లంకె చూడగలరు.

 5. katuri said,

  good review … kaani …. paandurangamahatyam .. gurinchi deenilo special ga raayala .. dani tarvata chala chettacinemalu vachai … avi gurturaaleda …. mee uddesam bagaledu ….

 6. katuri said,

  good review … kaani …. paandurangamahatyam .. gurinchi deenilo special ga raayala .. dani tarvata chala chettacinemalu vachai … avi gurturaaleda …. mee uddesam bagaledu ….

 7. రాకేశ్వర రావు said,

  నాకూ పిచ్చగా నచ్చి, నతలో తప్పక చూడండి ఈ సినిమా అని వ్రాసిపారేశాను.

 8. నాకూ పిచ్చగా నచ్చి, నతలో తప్పక చూడండి ఈ సినిమా అని వ్రాసిపారేశాను.

 9. అబ్రకదబ్ర said,

  ప్రధమార్ధం సోసోగా ఉన్నా ద్వితీయార్ధంలోని పొట్ట చెక్కలయ్యే హాస్యం ఈ సినిమాని నిలబెట్టింది. ఇంటర్వెల్ దాకా చూసి చప్పగా ఉందని పెదవి విరిచిన నాకు సినిమా పూర్తయ్యే సరికి DVD ఎప్పుడొస్తుందో అనిపించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక clean entertainer.

 10. ప్రధమార్ధం సోసోగా ఉన్నా ద్వితీయార్ధంలోని పొట్ట చెక్కలయ్యే హాస్యం ఈ సినిమాని నిలబెట్టింది. ఇంటర్వెల్ దాకా చూసి చప్పగా ఉందని పెదవి విరిచిన నాకు సినిమా పూర్తయ్యే సరికి DVD ఎప్పుడొస్తుందో అనిపించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక clean entertainer.

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @ శ్రీ గారు:
  మరే… అన్నీ చూసి దీనిని వదిలేస్తే ఎలా ?

  @ మహేష్ గారు:
  ఆహా… ఇవాళే దీనికి మీ ముహూర్తం.

  @ katuri గారు:
  ఏదో సరదా వ్యాఖ్య అది. పెద్ద పట్టించుకోనవసరం లేదు.

  @ రాకేశ:
  ఓ! మీకూ నచ్చిందా.
  హమ్మయ్య నవతరంగంలో తెలుగు సినిమా మెచ్చుకోవట్లేదనే వారికోసం ఒక సమీక్ష. 🙂

  @ అబ్రకదబ్ర:
  నిజమే.. నాకూ పెద్దగా ఎక్కడా బోరు కొట్టలేదు.

 12. @ శ్రీ గారు:మరే… అన్నీ చూసి దీనిని వదిలేస్తే ఎలా ?@ మహేష్ గారు:ఆహా… ఇవాళే దీనికి మీ ముహూర్తం.@ katuri గారు:ఏదో సరదా వ్యాఖ్య అది. పెద్ద పట్టించుకోనవసరం లేదు.@ రాకేశ:ఓ! మీకూ నచ్చిందా.హమ్మయ్య నవతరంగంలో తెలుగు సినిమా మెచ్చుకోవట్లేదనే వారికోసం ఒక సమీక్ష. :)@ అబ్రకదబ్ర:నిజమే.. నాకూ పెద్దగా ఎక్కడా బోరు కొట్టలేదు.

 13. MURALI said,

  Plz Kasta naa blog chadivi petandi.

  http://muralidharnamala.wordpress.com/

 14. MURALI said,

  Plz Kasta naa blog chadivi petandi. http://muralidharnamala.wordpress.com/

 15. రవి said,

  జెనీలియా కోసం ఓ సారి చూడక తప్పదు. సినిమా బావుందన్నారు కాబట్టి ఈ వారం ఎలాగైనా పెట్టాలి క్యాంపు. మా ఆవిడేమో దశావతారం అంటోంది. ఆవిడను ఈ సినిమాకు ఎలా ఒప్పించాలో ఏమిటో?

 16. రవి said,

  జెనీలియా కోసం ఓ సారి చూడక తప్పదు. సినిమా బావుందన్నారు కాబట్టి ఈ వారం ఎలాగైనా పెట్టాలి క్యాంపు. మా ఆవిడేమో దశావతారం అంటోంది. ఆవిడను ఈ సినిమాకు ఎలా ఒప్పించాలో ఏమిటో?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: