జూన్ 25, 2008

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౬

Posted in అనుభవాలు, ట్రెక్, సంగతులు, హిమాలయాలు వద్ద 7:34 సా. ద్వారా Praveen Garlapati

అలా “బిస్కేరీ” కాంపు ముగిసింది…

ఆ కాంపులో అనిపించింది. మన జట్టులో సరదా సరదా మనుషులు ఉండడం ఎంత ముఖ్యమో. లేకపోతే ఆ రోజు అంత ఎంజాయ్ చేసేవాళ్ళమా ? ఏమో ?
చక్కగా ఆడి పాడి, ఆడించి పాడించి భలే గడిపాము. ఆ రోజు రాత్రి కూడా గజ గజే…

మరుసటి రోజు ఉదయం మేము “బందక్ తాజ్” అనే కాంపు కేసి బయలుదేరాము. ఇది మా ఆఖరి కాంపింగు. అప్పటికే మా గుంపులో అందరూ అయ్యో అప్పుడే మనం కిందికి వెళ్ళిపోతున్నామా ? మంచు ఇదే ఆఖరా అని దిగులుగా ఉన్నారు.
నెమ్మదిగా, కొద్దిగా భారంగా ఆ కాంపుకి బయలుదేరాము. అనుకుంటాము కానీ కొన్ని సార్లు ఎక్కడం ఎంత కష్టమో, దిగడమూ అంతే కష్టం. అది ఆ రోజు మాకు బాగా అనుభవమయింది.

ఆ రోజు మేము ప్రయాణించిన దారి మరీ నిలువుగా ఉంది. దాని మీద దిగడం కోసం జారిపోకుండా పట్టుకోసం ఆపుకోవాల్సి వచ్చేది. దానికి అదనపు శ్రమ. ఎలాగయినా కష్టపడి కాసేపు నడిచిన తరువాత నేల చదునయింది కాసేపు.

ఆ రోజు ప్రయాణం పెద్ద ఎక్కువ దూరం కాకపోవడంతో సరదాగా ఆడుతూ పాడుతూ సాగుతున్నాము. అన్నట్టు చిన్నప్పుడు మీరు వంగుడు, దూకుడు ఆడారా ? ఆ రోజు మేము ఆడాము.
అసలే ఆ ఆటలో నేను కత్తి. భలే సరదాగా అనిపించింది.

ఆ రోజు జనాలకు ఒక పుర్రె దొరికింది (కోతి చేతికి కొబ్బరి చిప్ప లాగా). ఇక జనాలలో క్రియేటివిటీ తెగ పొంగింది. ఒకరు అదెట్టుకుని తపస్సు చేస్తే, ఇంకొకరు దానిని ఒక కర్రకి తగిలించి ఆదివాసీలలో కలిసారు.

అలా పరిగెట్టి అలసిపోయి లంచ్ కోసం ఆగాము. ఇంతలో వాన. ఇంతకు ముందు పనికిరాని ప్లాస్టిక్ కవర్లని అందరూ బయటికి తీసి దాని కిందే కానిచ్చారు.

అంతలో హర్షద్ తన దగ్గరున్న చిన్న బాలొకటి బయటకు తీసాడు. ఇక దాంతో ఆటలాడారు కాసేపు.

భలే సరదా సంఘటన జరిగింది ఆ రోజు. పాపం మన “అయ్యరు” లంచ్ టైములో కడుపు కదిలి తట్టుకోలేక చెట్టు చాటు కెళ్ళాడు. ఇక ఇలాంటి సందర్భం వదులుతారా జనాలు. గైడ్ కి చెబుతున్నట్టు “చలో చలో… దేర్ హో రహా హైన్” అంటూ ఒకటే గొడవ, అయ్యరుకి వినబడేటట్టుగా. అందరూ వంత పాడారు “చలో, చలో…” అని.

అంతే పాపం అయ్యరు జారుతున్న పాంటుని చేత్తో పట్టూకుని మరీ పరిగెత్తుకొచ్చేసాడు. మరదే “టిట్ ఫర్ టాట్” అన్నమాట 🙂
అక్కడ నుంచి కాంపు చేరే వరకూ గుర్రు గుర్రు… మాకు హిహిహిహి….

ఈ కాంపు చప్పగా ఉంటుందనుకున్నాము. కానీ మాకేం తెలుసు ఇక్కడ సూపరు మజా ఉంటుందని.

ఆ కాంపుకి మేము తొందరగా చేరడంతో రకరకాల ఆటలు మొదలుపెట్టాము.

ముందొక నాచ్ గానా అన్నమాట. సెంటర్లో రాంబాబు టైపులో ఎవరో ఒక బకరాని పెట్టి మొబైలు లో నుంచి ఒక పాట మోగించేది. డాన్సు చేయించేది.

అదయిన తరువాత నుంచి ఆటలు మొదలయ్యాయి. ఫుట్‌బాలుతో మొదలు. పదకొండు వేల అడుగుల పైన ఫుట్‌బాలు ఎంత మంది ఆడతారు చెప్పండి 🙂 అదో అనుభవం.

కాళ్ళు విరగ్గొట్టుకున్న తర్వాత జనాలు కబడ్డీ ఆడదామన్నారు. కానీ పాపం అమ్మాయిలు మరీ ప్రేక్షకుల్లా ఉన్నారని చెప్పి ఖో, ఖో కి మారాము.

అసలు ఎంత సరదా అనుకున్నారు. అబ్బే ఇదేమాడతాం అన్న జనాలు ఇంకొక గేమ్‌ ప్లీజ్ మేమూ ఆడతాం అన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు.

ఇక అక్కడ కాంపు లీడరుకి కొద్దిగా క్రియేటివిటీ ఎక్కువ. ఇంత చురుకయిన జనాలను ఊరికే ఎందుకు వదిలిపెట్టాలని ఒక ఆట సృష్టించాడు. పర్యావరణానికి సంబంధించిన ఆట అది. ఆట ఆడుతూనే జనాలను ఎడ్యుకేట్ చేస్తుందన్నమాట.

ఇంతకీ ఆటేమిటంటే ఒక పది జింకలు, రెండు పులులు ఉంటాయి. అలాగే ఒక అగ్ని, నీరు, గడ్డి, వేటగాడు కూడా (అన్నీ జనాలే). ఇచ్చిన పది నిముషాలలో జింకలన్నీ ఒక సారి నీటిని, గడ్డిని తాకాలి. అలాగే పులినుంచి, అగ్ని నుంచి, వేటగాడి నుంచి తమని తాము కాపాడుకోవాలి. అలా ఆఖరుకి మిగిలిన జింకలు విజేతలన్నమాట. బాగుంది కదూ…

అడవిలో జంతువులకు అవసరమయిన వనరులని ఆట ద్వారా చక్కగా చెప్పించాడు. అలాగే వాటికున్న ఉపద్రవాలనీ, ఫుడ్ చెయిన్ నీ కూడా. అందరమూ సరదాగా కాంపంతా పరిగెడుతూ ఆటాడేసాము.

ఈ కాంపులో కూడా చలి బాగానే ఉన్నా ఇంతకు ముందు విపరీతమయిన చలి తర్వాత పెద్దగా ఆనలేదు. హాయిగా నిద్రపోయాము డిన్నరు చేసి, బోర్నవీటా తాగిన తర్వాత.

(అదేంటో రాత్రిళ్ళు టీ, బోర్నవీటా తాగిన తర్వాత నిద్ర భలే వస్తుంది. నాకు కాలేజీలో కూడా ఇదే అనుభవం. మాకు పరీక్షల టైములో మేల్కోవడానికి టీ ఇస్తే అది తాగి వచ్చి గుర్రుపెట్టేవాళ్ళము 🙂

అరెరె… అన్నట్టు మీకు మా టెంటు జనాలను పరిచయం చెయ్యలేదు కదూ…

ఏంటీ జంగ్లీల్లా ఉన్నామా ? సరే ఈ సారి కొంచెం బుద్ధిగా…

ఇదే ఆఖరి కాంపు అవడంతో మరుసటి రోజు ఉదయం మా బేస్ కాంపు కి బయలు దేరామన్నమాట. మధ్యలో అందమయిన జలపాతాలు, చెక్క బ్రిడ్జీలు అలరించాయి.

అవి దాటిన తరువాత ఇదేంటి ఇక్కడెక్కడికో వచ్చేసాము అనిపించింది. జనాలు, చెట్లు చేమలు, పొలాలు మళ్ళీ తగిలాయి.
అక్కడ అలసిన పాదాలకు కాసేపు విశ్రాంతి ఇచ్చాము.

ఇక “బర్శైనీ” అనే చోటికి చేరి అక్కడి నుంచి “మణికారన్”, అటు నుంచి “కసోల్” చేరడంతో ట్రెక్కు ముగిసింది. హహ.., అన్నట్టు అన్ని రోజులు స్నానమే చెయ్యలేదు. మీకు గుర్తు లేదు కదూ ? కిందికొచ్చాక కాంపు బయటకెళ్ళి ఒక హోటలు లో రూము తీసుకున్నాము. (కింద టెంటులలో జనాలు మరీ ఎక్కువుండడంతో…)

అప్పుడు స్నానం చేస్తే చూడాలి. వంటి పై నుంచి పోసుకున్న నీరు మురిక్కాలువ పారుతున్నట్టు నల్లగా డ్రైనేజీ నీరు లాగా పారింది. అసలే నాకు కాస్త జుట్టు కాస్త పొడవేమో, అట్టలు కట్టి ఉంది అప్పటికే :-). దాన్ని క్లీను చేసేసరికి నా పనయిపోయింది. (ఓ మూడు షాంపూ పాకెట్లు బలిచ్చిన తర్వాత)

అందరూ తయారయిన తర్వాత మా బేసు కాంపుకెళ్ళి సర్టిఫికెట్లు అందుకోవడంతో ట్రెక్కుకి శుభం కార్డు పడింది.

మరుసటి రోజు కాంపులో ఊరికే గడపాలి అన్నమాట. టైమెందుకు వేస్టు అని రివర్ రాఫ్టింగు (అబ్బో అందులో ఎంత మజా అనుకున్నారు…) చేసి రాత్రి ఢిల్లీ కి బయలుదేరాము. ఢిల్లీ కథ (మథుర, తాజ్‌మహలు, వగయిరా…) రాయాలంటే ఇంకో రెండు టపాలు అవుతుంది కానీ ఇక ఇక్కడితో ముగిస్తాను 🙂
ఢిల్లీ అనుభవాలు దాదాపు ఈయనకు లాగానే ఉన్నాయి.

అలా ముగిసింది నా కల… కలా ? నిజమా ?

హమ్మయ్య ట్రావెలాఆఆఆఅగుడు అయిపోయింది. ఓ టపా లేటయినా మీకు విముక్తి 🙂

20 వ్యాఖ్యలు »

 1. oremuna said,

  !

 2. oremuna said,

  !

 3. రవి said,

  !! నీహారికా బిందువులు మంచు ముత్యాల లాగా ఉన్నాయి. !! తాజ్ మహల్ అందం గొప్పదా? గడ్డిపై ఆ తుషార బిందువుల కూర్పు గొప్పదా??

 4. రవి said,

  !! నీహారికా బిందువులు మంచు ముత్యాల లాగా ఉన్నాయి. !! తాజ్ మహల్ అందం గొప్పదా? గడ్డిపై ఆ తుషార బిందువుల కూర్పు గొప్పదా??

 5. మేధ said,

  అది గడ్డైనా ఆ నీటి బిందువులు చాలా బావున్నాయి!
  మొత్తానికి ఎలాగైతేనేమి, హిమాలయాలకి బై బై చెప్పేశారు.. 🙂

 6. మేధ said,

  అది గడ్డైనా ఆ నీటి బిందువులు చాలా బావున్నాయి!మొత్తానికి ఎలాగైతేనేమి, హిమాలయాలకి బై బై చెప్పేశారు.. 🙂

 7. నిషిగంధ said,

  ప్రవీణ్ గారూ, మొత్తానికి మీ టపాలు, ఫోటోలతో మమ్మల్ని కూడా ట్రెక్కించేసారు.. అయ్యర్ ఎపిసోడ్, జింక-పులి ఆట బావున్నాయి 🙂
  హిమాలయాలను చూసిన తర్వాత తాజ్ ని చూస్తే అంతగా ఎక్సైట్ అవ్వలేమేమో కదా!

 8. ప్రవీణ్ గారూ, మొత్తానికి మీ టపాలు, ఫోటోలతో మమ్మల్ని కూడా ట్రెక్కించేసారు.. అయ్యర్ ఎపిసోడ్, జింక-పులి ఆట బావున్నాయి :-)హిమాలయాలను చూసిన తర్వాత తాజ్ ని చూస్తే అంతగా ఎక్సైట్ అవ్వలేమేమో కదా!

 9. ramya said,

  వావ్ మీ ఆటల్ని చూస్తుంటే నాకు జెలసీ గా ఉంది.
  ఇంకూరుకోను నేనూ ఈ సారి సమ్మర్ లో కలా? నిజమా? కి ఎళ్ళి తీరతా:)

 10. ramya said,

  వావ్ మీ ఆటల్ని చూస్తుంటే నాకు జెలసీ గా ఉంది.ఇంకూరుకోను నేనూ ఈ సారి సమ్మర్ లో కలా? నిజమా? కి ఎళ్ళి తీరతా:)

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @ oremuna:
  ఏమిటో మీ క్రిప్టిక్ వ్యాఖ్య ఏమీ అర్థం కాలేదు.

  @ రవి:
  అందాల్ని పోల్చడం అంత తేలికా ? 🙂

  @ మేధ గారు:
  థాంక్స్. అవును మరి బై చెప్పాల్సొచ్చింది!

  @ నిషిగంధ గారు:
  నిజమే… తాజ్ వేరే కారణాల వల్ల కూడా నాకంత ఎక్కలేదు.

  @ ramya గారు:
  మరే ఆ ఆటలు హైలైటు. తప్పకుండా వెళ్ళండి ఈ సారి.

 12. @ oremuna:ఏమిటో మీ క్రిప్టిక్ వ్యాఖ్య ఏమీ అర్థం కాలేదు.@ రవి:అందాల్ని పోల్చడం అంత తేలికా ? :-)@ మేధ గారు:థాంక్స్. అవును మరి బై చెప్పాల్సొచ్చింది!@ నిషిగంధ గారు:నిజమే… తాజ్ వేరే కారణాల వల్ల కూడా నాకంత ఎక్కలేదు.@ ramya గారు:మరే ఆ ఆటలు హైలైటు. తప్పకుండా వెళ్ళండి ఈ సారి.

 13. రవి said,

  పర్వాతారోహకుడు గారూ, అందుకోండి జన్మదిన శుభాకాంక్షలు…

 14. రవి said,

  పర్వాతారోహకుడు గారూ, అందుకోండి జన్మదిన శుభాకాంక్షలు…

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  @ రవి:
  మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు. 🙂

 16. @ రవి:మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు. 🙂

 17. రాజశేఖర్ said,

  నీ ట్రావెలాగుడు చాలా చాలా బావుంది ప్రవీణ్ 🙂
  అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని భలే రాసావుగా!
  నువ్వు రాసింది చదువుతూ , ఫోటోలు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది..
  అన్నీ ఒకేసారి చదవడం వల్ల తరువాయి భాగంకోసం నిరీక్షణ అవసరం లేకపోయింది. 😀
  మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారన్నమాట Good 🙂

 18. నీ ట్రావెలాగుడు చాలా చాలా బావుంది ప్రవీణ్ :)అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని భలే రాసావుగా!నువ్వు రాసింది చదువుతూ , ఫోటోలు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది..అన్నీ ఒకేసారి చదవడం వల్ల తరువాయి భాగంకోసం నిరీక్షణ అవసరం లేకపోయింది. :Dమొత్తానికి బాగా ఎంజాయ్ చేశారన్నమాట Good 🙂

 19. రాజశేఖర్ said,

  అయ్యో… నీ పుట్టినరోజుని కూడా మిస్సయ్యానా ..
  లేటుగా అయినా లేటెస్టుగా అందిస్తాను శుభాకాంక్షలు..

  పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రవీణ్ 🙂

 20. అయ్యో… నీ పుట్టినరోజుని కూడా మిస్సయ్యానా ..లేటుగా అయినా లేటెస్టుగా అందిస్తాను శుభాకాంక్షలు..పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రవీణ్ 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: