జూన్ 27, 2008

మీ బ్లాగరు బ్లాగుని వర్డుప్రెస్సు లోకి మార్చుకోవడం ఎలా ?

Posted in టెక్నాలజీ, బ్లాగరు, వర్డుప్రెస్సు, సాంకేతికం వద్ద 7:21 సా. ద్వారా Praveen Garlapati

మన తెలుగు బ్లాగర్లలో ఎక్కువ మంది బ్లాగరు లేదా వర్డుప్రెస్సులో బ్లాగుతుంటారు.

బ్లాగరు మనకు కావలసినట్టు తీర్చిదిద్దుకోవడానికి, అన్ని అమరికలు చేసుకోవడానికీ అనువయినది.
వర్డుప్రెస్సు లే మాన్ కూడా అనాయాసంగా నిర్వహించగలిగినది.

కొద్దిగా కస్టమైజేషనూ వగయిరా చేసుకోవాలంటే బ్లాగరే బాగుంటుంది. అందుకే బ్లాగరులో ఎంతో అందంగా డిజైన్ చెయ్యబడిన థీములు, జనాలు జోడించుకునే ఆరెసెస్ లంకెలు, వగయిరా అందుబాటులో ఉంటాయి.
కానీ వర్డుప్రెస్సు.కాం లో అంతగా కుదరవు (మీ సొంత ఇన్స్టాలేషనయితే కుదురుతుంది). కానీ డీఫాల్టు థీములు వర్డుప్రెస్సులోనే బాగుంటాయి, ఎన్నుకోవడానికి సులభం కూడా.

అయితే ఇక్కడ ఒక కష్టం ఏమిటంటే ఒక చోట మొదలుపెట్టిన బ్లాగు వివిధ కారణాల వల్ల అందులోనే ఉండవలసి వస్తుంది.

౧. ఒక దాని నుంచి ఇంకొక ప్రవయిడరుకి మారితే మన టపాలు, వ్యాఖ్యలు అన్నీ పోతాయి గనుక.
౨. ఇన్నాళ్ళ నుంచి మనం సంపాదించుకున్న ఒక ఐడెంటిటీ పోతుంది గనుక.
౩. సెర్చ్ ఇంజన్లలో బ్లాగు రాంకు మళ్ళీ మొదటి నుంచీ మొదలవుతుంది గనుక.

అయినా కానీ ఒక ప్రొవయిడరు నుంచి ఇంకొక దానికి మారగలిగితే బాగుంటుంది కదూ…

అలాంటి సదుపాయం వర్డుప్రెస్సులో ఉంది. మీ బ్లాగరు, ఇంకా చాలా ఇతర బ్లాగులలో నుంచి టపాలను వ్యాఖ్యల సహితంగా వర్డుప్రెస్సులోకి దిగుమతి చేసుకోవచ్చు.

అదెలాగో చూద్దాము.

(అన్నట్టు ఈ సోపానాలు మీ సొంతంగా హోస్టు చేసిన బ్లాగుకయినా, వర్డుప్రెస్సు.కాం లో ఉన్న బ్లాగుకయినా ఒకటే.)

౧. మీరు మీ వర్డుప్రెస్సు అకౌంటులోకి లాగిన్ అవండి. మీ ప్రొఫైలు అమరికలలో గనుక “తెలుగు” ని ఎంపిక చేసుకునుంటే మీకు కూడా జాబితాలూ, అవీ తెలుగులో కనిపిస్తాయి.

ఒకవేళ చేసి లేకపోతే ఇప్పుడు చెయ్యండి.

అలా చెయ్యడానికి మొదట My Account > Edit Profile కి వెళ్ళండి.

అక్కడ Interface Language ని te-తెలుగు గా ఎంచుకోండి.

౨. ఇప్పుడు నిర్వహణ అనే లంకె మీద నొక్కండి.

౩. దాని కింద దిగుమతి > బ్లాగర్ మీద నొక్కండి.

౪. అక్కడ మీ బ్లాగరు సంకేత నామం (Username), రహస్య నామం (Password) ఇచ్చి మీ బ్లాగరు బ్లాగుని జోడించండి.

౫. ఇప్పుడు బ్లాగరులో మీరు రాస్తున్న బ్లాగులన్నీ చూపించబడతాయి.

౬. మీకు కావలసిన బ్లాగు పక్కన ఉన్న “దిగుమతి” అనే బొత్తాన్ని నొక్కండి.

అంతే మీ టపాలు, వ్యాఖ్యలు బ్లాగరు లో నుంచి వర్డుప్రెస్సులోకి దిగుమతి అయిపోతాయి. అంతే…
ఇక నుండి వర్డుప్రెస్సులో బ్లాగు చేసుకోవచ్చు.

ఈ పద్ధతి ద్వారా ఇప్పుడు మీకు బ్లాగరు నచ్చకపోతే వర్డుప్రెస్సుకి మారవచ్చు. అలాగే కావాలంటే మీ బ్లాగరు బ్లాగుకో మిర్రరు బ్లాగు ఏర్పరచుకోవచ్చు. (అలా చేసిన నా మిర్రరు బ్లాగు ఇక్కడ చూడవచ్చు.)

ఇది చూడండి:

అన్నట్టు మీరు గమనించి ఉంటారు. వర్డుప్రెస్సు తెలుగు అనువాదాలు పూర్తిగా లేవని. కొంత ఆంగ్లంలో కనిపిస్తుంది.
దానిని సరి చెయ్యాలంటే మీరు తెలుగు అనువాదంలో పాలుపంచుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా చెయ్యవచ్చు.
(తెలియని వారికోసం: వర్డుప్రెస్సు ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. మీరు దానిని ఉచితంగా పొందవచ్చు, వాడుకోవచ్చు. కాబట్టి మీరు చేసే అనువాదాలు మీకు లభించే ఓపెన్ సోర్స్ వర్షనులో కూడా పొందుపరచుకోవచ్చు.)

12 వ్యాఖ్యలు »

 1. Purnima said,

  Awesome writeup Praveen!! Was looking for this information for a long time. Got it at the right place.

  But the primary reason I’m looking to move to wordpress is that I’m not happy with blogger templates.

  nenu manasu paaresukunna template id..

  http://www.eblogtemplates.com/chocolate-beach/

  kanee id pedutunte.. font sarigga kanipinchatam ledu.. people complained it is not suitable to reading. kanee naaku ade kaavali. 😦 Editing html for color changes is not helping me. Can something be done abt it?

  anduke wordpress ki jump avudaamu anukuntoo undagaa mee post vacchindi. Atleast i’ll have a mirror site now. 🙂

 2. Purnima said,

  Awesome writeup Praveen!! Was looking for this information for a long time. Got it at the right place. But the primary reason I’m looking to move to wordpress is that I’m not happy with blogger templates. nenu manasu paaresukunna template id..http://www.eblogtemplates.com/chocolate-beach/kanee id pedutunte.. font sarigga kanipinchatam ledu.. people complained it is not suitable to reading. kanee naaku ade kaavali. 😦 Editing html for color changes is not helping me. Can something be done abt it?anduke wordpress ki jump avudaamu anukuntoo undagaa mee post vacchindi. Atleast i’ll have a mirror site now. 🙂

 3. netizen said,

  మరి బ్లాగ్ అగ్రిగేటర్స్‌కి ఎలా తెలియజేయాలి? కూడలి, జల్లెడ, తెలుగుబ్లాగర్స్ తదితరులకి,? ఓకే బ్లాగు రెండు సార్లు కనపడదా?

 4. netizen said,

  మరి బ్లాగ్ అగ్రిగేటర్స్‌కి ఎలా తెలియజేయాలి? కూడలి, జల్లెడ, తెలుగుబ్లాగర్స్ తదితరులకి,? ఓకే బ్లాగు రెండు సార్లు కనపడదా?

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  @ purnima గారు:

  సమాచారం ఉపయోగపడినందుకు సంతోషం.

  టెంప్లేట్స్ మామూలుగా జనాలు తమ అభిరుచికి తగ్గట్టు తయారు చేసుకుంటారు. వాటిని మార్పు చేసుకోవడం కొద్దిగా శ్రమతో కూడుకున్న పనే.
  దానికంటే నచ్చే ఇంకో టెంప్లేట్ వెతుక్కోవడం బెటర్.

  @ netizen:
  అగ్రిగేటర్లు ఇంత వరకూ ఆటోమేటెడ్ కాదు కాబట్టి వారికి ఒక వేగు రాస్తే సరిపోతుంది. (ఇంతకు ముందు బ్లాగు తీసివేసి, కొత్త బ్లాగు జోడించమని)

  ఆటోమేటెడ్ అయితే మన బ్లాగు తీసెవెయ్యడానికీ ఒక మార్గం ఉండాలి.

 6. @ purnima గారు:సమాచారం ఉపయోగపడినందుకు సంతోషం.టెంప్లేట్స్ మామూలుగా జనాలు తమ అభిరుచికి తగ్గట్టు తయారు చేసుకుంటారు. వాటిని మార్పు చేసుకోవడం కొద్దిగా శ్రమతో కూడుకున్న పనే.దానికంటే నచ్చే ఇంకో టెంప్లేట్ వెతుక్కోవడం బెటర్.@ netizen:అగ్రిగేటర్లు ఇంత వరకూ ఆటోమేటెడ్ కాదు కాబట్టి వారికి ఒక వేగు రాస్తే సరిపోతుంది. (ఇంతకు ముందు బ్లాగు తీసివేసి, కొత్త బ్లాగు జోడించమని)ఆటోమేటెడ్ అయితే మన బ్లాగు తీసెవెయ్యడానికీ ఒక మార్గం ఉండాలి.

 7. మేధ said,

  ప్రవీణ్ గారూ, ఈ రోజు మీ పుట్టినరోజట కదా..! జన్మదిన శుభాకాంక్షలు…

 8. మేధ said,

  ప్రవీణ్ గారూ, ఈ రోజు మీ పుట్టినరోజట కదా..! జన్మదిన శుభాకాంక్షలు…

 9. వేణూ శ్రీకాంత్ said,

  Belated Happy Birthday Praveen.

 10. Belated Happy Birthday Praveen.

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  @ మేధ గారు, వేణూ శ్రీకాంత్ గారు:
  కృతజ్ఞతలు.

 12. @ మేధ గారు, వేణూ శ్రీకాంత్ గారు:కృతజ్ఞతలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: