జూలై 12, 2008

నాదా ? …. కాదా? …. – ఓ చిన్న కథ

Posted in కథ వద్ద 9:54 సా. ద్వారా Praveen Garlapati

నాదా? …. కాదా ? ….

డబ్బులు తగలేసి చాలా రోజులవడంతో ఫోరం మాలు కేసి బయలుదేరాను.

ఈ మధ్య ఆఫీసుకి కాబ్ లో వెళుతుండడంతో నాకెంతో ఇష్టమయిన నా బైకు కాస్తా అలిగింది.
దాని అలక తీరుద్దామని కాస్త దాన్ని సవరించి కిక్కు కొట్టగానే “ఊ…” అంటూ మూలిగింది. కాసేపు ఆక్సిలరేటరు తిప్పిన తర్వాత గర్జించింది.

అసలు నేను ఒంటరిగా షాపింగ్ చెయ్యను. కానీ ఏం చెయ్యను. పరిస్థితులు అలా తగలడ్డాయి.

పాపం నెల పైగా బైకుని బయటకు తీయలేదేమో దాని బాటరీ కాస్తా డౌనయింది. నాకు తిండి కూడా పెట్టకుండా నడుపుతావా అంటూ సూచీ కేసి బేలగా చూసింది.
సరే ముందు నీ ఆకలి తీరుస్తానని దానిని ఇంటి పక్కనున్న హెచ్పీ పెట్రోల్ పంపు దగ్గరికి తీసుకెళ్ళాను.

ఏమిటో వారాంతంలో కూడా పెద్ద లైనే ఉందక్కడ.
జనాలందరూ లక్షాధికారులూ, కోటీశ్వరులేమో మరి కార్లలో లీటర్ల కొద్దీ పెట్రోలు కొట్టించుకుంటున్నారు. నేను మాత్రం ఓ లీటరుతో సరి పెట్టుకున్నా.

నాకనుమానమొచ్చి చూస్తే పొల్యూషన్ సర్టిఫికెటు కూడా ఓ నెల రోజుల క్రితం ఎక్స్పైర్ అయిపోయింది. సరే వచ్చినప్పుడే పనులన్నీ కానిచ్చెయ్యాలి అని చెప్పి అక్కడే ఉన్న వాడి దగ్గర కెళ్ళి ఓ పొల్యూషన్ సర్టిఫికెట్టు కూడా తీసుకున్నా. అలాగే కాస్త నా బైకు టైర్లు వెడల్పు చేయించి ఆక్సిలరేటరు తిప్పాను.

ఎందుకో మరి మెయిన్ రోడ్డు కంటే నాకు, నా బైకుకీ సందులే ఇష్టం.
వెళ్ళాల్సిన చోటికి నేరుగా వెళ్ళకుండా కాస్త అటూ ఇటూ చక్కర్లు కొట్టి, కాసేపు ఆ చక్కని వాతావరణాన్ని ఆస్వాదించి ఫోరం మాలు కేసి పరిగెత్తించాను నా బైకుని.

అసలు మాలులంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. అలాగని ఇష్టం లేదనీ అనలేను.
ఏమిటో అక్కడ వందలాది జనాలలో ఉక్కగా ఉంటుంది. తిరుణాళ్ళకి వచ్చినట్టు ఉంటుంది. అలాంటి చోటికి ఒక్కణ్ణే వెళ్ళాలంటే ఏదోలా ఉంటుంది. అయినా తప్పదు.

రోడ్డు మీద పెద్దగా ట్రాఫిక్ లేదు. తొందరగానే చేరాను . బైకుకో టికెట్టు కొనుక్కుని దానిని పార్కు చేసి లోపలికి వెళ్ళాను.
బెంగుళూరులో సగం మంది వారాంతాలలో ఈ మాల్స్ లోనే పడుంటారేమో ?
గోల గోలగా ఉంది. భార్యా భర్తలు, గర్లు ఫ్రెండు బాయ్ ఫ్రెండులూ, స్నేహితులూ, స్నేహితురాళ్ళూ, పిల్లలు, నాలాంటి ఒంటరులు అందరూ ఈగల్లా ముసురుతున్నారు.

ఓ సారి చుట్టూ చూసాను. రకరకాల షాపులు, షోరోములు. జీన్సు, షూసు, టీ షర్టులు, తిండి వస్తువులు, పుస్తకాలు ఒకటేంటి అన్నీ అమ్ముతున్నారు. డబ్బెక్కువయినా జనాలు కొంటున్నారు.
కొంత డాబు కోసం, కొంత కొనగలిగినందుకు.

ఎందుకో నేనిక్కడ చెందను అనిపించింది. అయినా ధైర్యంగానే షాపుల అద్దాల్లోంచి తొంగి చూస్తున్నాను.
అరే… ఇక్కడేదో సేల్ ఉందే అని లివైస్ జీన్సు షోరూములోకి వెళ్ళాను.
బయట యాభై పర్సెంటు తగ్గింపు అన్నాడు గానీ లోపలికెళితే ఒక చిన్న టేబుల్ మీద కొన్ని జీన్సు, టీ షర్టులు పడేసి వీటికి మాత్రమే తగ్గింపు అని చూపించాడు. సరే నా లాంటి జనాలను ఆకర్షించడానికి ఇదో విధానం.

అందులోనే కొద్దిగా బాగున్న జీన్సు ఒకదాన్ని ఎంచుకుని ట్రయల్ రూముకేసి నడిచాను. ఫర్లేదు బానే ఉంది. బానే ఉందా ? లేక నాకు నేనే బాగుందని సర్దిచెప్పుకున్నానా ?
సర్లే ఏదో ఒకటి. కాస్త సైజు ఆల్టరేషను చెయ్యమని చెప్పి దాన్ని బిల్ చేయించుకుని బయటకొచ్చాను.

నిజం చెప్పుకోవాలి. ఇలాంటి మాల్స్ కి వస్తే ఒకటికి రెండు కొంటాము మనం. సరే ఇక ఆ జీన్సు మీదకి షర్టో, టీ షర్టో కొనాలి కదా. పక్కన షాపులు చూసుకుంటూ ముందుకెళుతున్నాను.

అరె స్కల్లర్స్ లో ఇదేదో పాంటు బాగుందే అని దాంట్లో దూరాను. అటూ ఇటూ చూడగానే పాంటు నచ్చేసింది. మ్… ఈ రంగు నా దగ్గర ఇప్పటికే ఉందా ?
ఛా! అసలు అర్థం కాదేంటో. ఎన్ని సార్లు కొన్నా నా దగ్గర ఉన్న రంగులకి దగ్గరవే కొంటుంటాను.
అసలు తెలీట్లేదు. సర్లే ఏదో ఒకటి. అంత ఆలోచించేంత ఓపిక లేదని దానిని కూడా ఆల్టరేషను కి ఇచ్చాను. షాపతన్ని అడిగితే పది నిముషాలు పడుతుందని చెప్పాడు.

ఇప్పుడు రెండు పాంట్లకి షర్టులు కొనాలి. హు…
పక్కనే “లీ” లో కొత్త సరుకు వచ్చినట్టుంది. సరే ఇక దాంట్లోకి.
అమ్మో! ఏంటిది ఇంతేసి ఉన్నాయి ధరలు ఇక్కడ అనిపించింది. అంతలోనే మంచి షార్టు షర్టు ఒకటి కనిపించింది. ధర వెయ్యి.
తప్పుతుందా ? దానిని బిల్లు వేయించాను.

హు… ఈ ఎస్కలేటర్లెప్పుడూ మనముండే వైపుకి కాక ఇంకో వైపుకే ఎందుకుంటాయో ?
అటు నడిచి వెళ్ళేసరికి ఒక ఐస్ క్రీం తింటే బాగుంటుందనిపించింది.
కింది కొచ్చి మెక్ డోనాల్డ్స్ కి వెళ్ళి ఓ సాఫ్టీ కొనుక్కుని లాగిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. అందాలని ఆస్వాదించడానికి సమయం దొరికింది. అలాగే బయటకెళ్ళి కాసేపు అక్కడ అరుగు మీద కూర్చుని తింటున్నా. ఆకాశం మబ్బు పట్టి ఉంది. వర్షమొస్తుందేమో ?

త్వరగా షాపింగు ముగించుకుని ఇంటికెళ్ళిపోతే మంచిదనిపించింది.
లోపలికెళ్ళాను మళ్ళీ. ఇక మిగిలిన షర్టయినా కొద్దిగా తక్కువలో కానిస్తే బాగుంటుందేమో ? ఊ… వెస్ట్ లైఫులో ఏమన్నా తక్కువకొస్తాయేమో అని అటు నడిచాను. చూస్తే ధరలు “సరసం”గానే ఉన్నాయి.

చుట్టూ అన్నిటినీ గమనిస్తుంటే ఒక షార్టు కుర్తా, ఒక టీ షర్టు, ఇంకొక పాంటు నా చేతుల్లోకొచ్చాయి.
మళ్ళీ మతి తిరిగి రావడంతో టీ షర్టు మాత్రం కొని బయటకొచ్చా. హమ్మయ్య షాపింగంతా అయిపోయింది. సరే అని ఆల్టరేషను కి ఇచ్చిన పాంట్లు రెండూ తీసుకున్నాను.

బయటకొస్తుంటే “జాకీ” కనిపించింది. లోపలి కెళ్ళి కావలసినవి తీసుకున్నాను.
ఎంతయింది ? అని అడిగితే రెండొందల ముప్ఫై అన్నాడు.
ఐదొందల నోటు ఒకటి తీసి అతని చేతికిచ్చాను. చిల్లర తిరిగిచ్చాడు. ఒక చిరునవ్వు విసిరి బయటకొచ్చాను.

ఎస్కలేటరు దిగుతుంటే అనుమానమొచ్చింది. అదేంటి బిల్లు నాలుగొందల అరవై అయింది. అతనేమో రెండొందల ముప్ఫై తీసుకున్నాడు అని ?
బిల్లు బయటకి తీసి అతనిచ్చిన చిల్లర చూసుకున్నాను. నేననుకున్నట్టుగానే రెండొందల ఢెబ్బై రూపాయలున్నాయి. బిల్లు చూసాను నాలుగు వందల అరవై.
అయ్యో! పొరపాటున ఎక్కువిచ్చేసాడే. ఇప్పుడేం చెయ్యను ? వెనక్కెళ్ళి ఇచ్చేసి రానా ?

అంతలో మనసులో అనిపించింది.. అరే అప్పనంగా రెండొందల ముప్ఫై రూపాయలు వస్తే ఎందుకు కాదనాలి ? నేనేమన్నా తప్పు చేసానా ?
అయినా షాపు వాడు కదా పొరపాటు చేసింది. దానికి వాడు అనుభవిస్తే తప్పేమిటి ?

నేను కావాలని దొంగతనం చెయ్యలేదు. ఎవరినీ మోసం చెయ్యలేదు ఈ డబ్బు కోసం.
ఎలాగో నా వద్దకు చేరింది. ఉంచేసుకుంటే తప్పేంటి ? మనసు పరి పరి విధాల సర్ది చెప్పుకుంటుంది.

అయినా ఇందాక నేను షాపుకి వెళ్ళినప్పుడు వాడు సరిగా మాట్లాడలేదు అనుకుంట నాతో.
షాపు వారికి కూడా కస్టమర్లను సరిగా ట్రీట్ చెయ్యడం రాదు. అలాంటి వాళ్ళకి నేను డబ్బులు తిరిగి ఎందుకు ఇవ్వాలి. వాళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే.

అంతే… డబ్బు నేనే ఉంచేసుకుంటే సరి.
కాళ్ళు బయటకేసి కదిలాయి.

రెండడుగులు వేసిన తర్వాత కాళ్ళు కదలనంటున్నాయి.
హు… ఇప్పుడు ఏమిటి ? అంతా డిసైడయిపోయిందిగా ?
అంతలోనే ఆత్మారాముడు మళ్ళీ… మరి నీకు ఎక్కువగా ఇచ్చిన డబ్బులు నీవి కాదుగా న్యాయంగా. దానిని నువ్వెలా ఖర్చు పెడతావు ?
ఇప్పుడు నావేగా… ఇందాక అదేగా అనుకుంది.
కానీ నువ్వు ఏమన్నా సంపాదించావా ? నీకు తెలిసీ తప్పుగా డబ్బు వాడుకుంటున్నావంటే అది దొంగతనమే అవుతుందిగా మరి ?
ఛ ఛ! లేదు లేదు. అది దొంగతనం ఎలా అవుతుంది ? నేను ఎవరి దగ్గరనుంచీ డబ్బు తీయలేదుగా. పొరపాటున నా దగ్గరకు వచ్చింది అంతే.
సరే నీ ఇష్టం. నువ్వు చేస్తున్నది తప్పని నీకూ తెలుసు. నే చెప్పాల్సింది చెప్పాను.
ఊ… పెద్ద చెప్పొచ్చావులే. ఇంకో నాలుగడుగులు పడ్డాయి.

మళ్ళీ…
ఛా! సావధానంగా ఉండనీయవు కదా నన్ను.
సరే వెనక్కెళ్ళి డబ్బులు తిరిగిచ్చేద్దామా ? ఊరకే వచ్చిన డబ్బులు… ప్చ్.
పద. ఇంక చెప్పేదేముంది.

మళ్ళీ ఎస్కలేటరు ఎక్కి షాపులోకి వెళ్ళాను.
కౌంటరు దగ్గర ఉన్నతను చిరాగ్గా చూస్తున్నాడు. ఇప్పుడే కొని వెళ్ళిన వాడు తిరిగొచ్చాడంటే ఏదో కిరికిరి అని.
మీరు నాకు డబ్బులెక్కువిచ్చారు అన్నా అతని దగ్గరకెళ్ళి.
అతను నాకు డబ్బు తక్కువిచ్చాడని నేను అన్నట్టు అర్థం చేసుకుని మొహం చిరాగ్గా పెట్టాడు.
హు… ఇలాంటి వాడికా డబ్బు తిరిగిద్దామనుకుంది…

బిల్ చూపించమన్నాడు. ఏంటి సంగతి చెప్పు అన్నాడు ?
ఏమీ లేదు బిల్లు నాలుగొందల అరవై. నేను మీకు ఐదొందలు ఇచ్చాను. కానీ మీరు నాకు తిరిగి రెండొందల ఢెబ్బై రూపాయలిచ్చారు అన్నాను.
ఆశ్చర్యం! అతని మొహంలో.
ఓ ఈజిట్ ?? బిల్ వంక తీక్షణంగా చూసాడు.

పక్కన నుంచి అతని పార్ట్‌నరో, ఎవరో కొరకొరగా చూస్తున్నాడు అతని వైపు.
ఓ సారీ అన్నాడు నా దగ్గర నుంచి మిగిలిన డబ్బు తీసుకుంటూ.
మొహంలో ఇందాక చిరాకు మాయమయింది. ఓ చిరునవ్వు వెలిసింది.

నా మనసెందుకో సడన్ గా తేలిక అయింది. ఎంతో ఆనందంగా గొప్ప పని చేసిన అనుభూతి కలిగింది.
ఇట్స్ ఓకే… నో ప్రాబ్లెం. అన్నా తిరిగి ఇంకో చిరునవ్వు విసురుతూ.

హమ్మయ్య!
ఇప్పుడు అడుగులు చకచకా పడుతున్నాయి. మాంచి పాట కూడా ఆ పాటున హం చెయ్యాలనిపించింది.
నాలో నేనే హం చేసుకుంటూ బైకు పార్కు చేసిన బేసుమెంటు కేసి నడుస్తున్నాను.

చల్ల గాలి మొహానికి తగులుతూ ఉంది. హాయిగా ఉంది.
షాపింగు చేసిన బాగులని బైకుకి తగిలించి కిక్ కొట్టాను. ఈ సారి మొదటి సారికే స్టార్టయింది బండి.

రోడ్డు మీదకి రాగానే మబ్బులు కరిగి సన్నని జల్లు మొదలయింది.
ఆహా! ఇలా వర్షంలో బైకు నడిపి ఎన్నాళ్ళయిందో…

చల్లని గాలి, సన్నని తుంపర మొహం మీద పడుతుంటే బైకు వేగం నెమ్మదిగా పెరిగింది.
వర్షం నా వంటిని కాక నా మనసుని కడిగేస్తున్నట్టనిపించింది.

ఇందాక ఆ డబ్బు తిరిగివ్వకపోతే నేనింతే ఆనందంగా ఉండేవాడినా ?

బైకు సాఫీగా ఇంటికేసి సాగుతుంది.

ఇది చూడండి: కథలు రాయడంలో నాకు అనుభవం లేదు. అసలు ఇది కథగా క్వాలీఫై అవుతుందో లేదో కూడా తెలీదు. ఇక మీ అభిప్రాయాలు చెప్పండి మరి 🙂

ప్రకటనలు

20 వ్యాఖ్యలు »

  1. ప్రవీణ్ గార్లపాటి said,

    ఇప్పుడు వ్యాఖ్యలు పని చేస్తున్నాయా ?

  2. ఇప్పుడు వ్యాఖ్యలు పని చేస్తున్నాయా ?

  3. మోహన said,

    ప్రవీణ్ గారూ..

    ఇలాంటి తర్జన బర్జనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటయి. మంచి-చెడు మధ్య ఎంతో దూరం లేదు. మన ఎంపిక అంత మాత్రమే.. దాని వెంబడే మన మానసిక స్థితి..
    బాగుంది.

  4. మోహన said,

    ప్రవీణ్ గారూ..ఇలాంటి తర్జన బర్జనలు అప్పుడప్పుడు ఎదురవుతుంటయి. మంచి-చెడు మధ్య ఎంతో దూరం లేదు. మన ఎంపిక అంత మాత్రమే.. దాని వెంబడే మన మానసిక స్థితి.. బాగుంది.

  5. రవి said,

    కథ సూపర్. పొగడ్డం కోసం కాదు, నిజంగానే. నాకూ ఫోరం లాంటి చోట్లకి కి వెళితే, ఆదిమ మానవుడు సిటీ కి వెళితేఎలానో అలా అనిపిస్తా ఉంటుంది. ఓ సారి ప్లానెట్ ఎం లో ఓ ఎఫ్ ఎం రేడియో వాడు తగిలాడు. నకు నోట మాట రాలేదు.అదో భయంకరమైన అనుభవం 🙂

    మీ బ్లాగు లో వ్యాఖ్యలు రాయడం కుదరట్లేదని ఎలనోలా తెలియజేయాలనుకున్నాను. ఇప్పుడు ఓ కే.

  6. రవి said,

    కథ సూపర్. పొగడ్డం కోసం కాదు, నిజంగానే. నాకూ ఫోరం లాంటి చోట్లకి కి వెళితే, ఆదిమ మానవుడు సిటీ కి వెళితేఎలానో అలా అనిపిస్తా ఉంటుంది. ఓ సారి ప్లానెట్ ఎం లో ఓ ఎఫ్ ఎం రేడియో వాడు తగిలాడు. నకు నోట మాట రాలేదు.అదో భయంకరమైన అనుభవం :-)మీ బ్లాగు లో వ్యాఖ్యలు రాయడం కుదరట్లేదని ఎలనోలా తెలియజేయాలనుకున్నాను. ఇప్పుడు ఓ కే.

  7. పూర్ణిమ said,

    కథలు రాయడంలో నాకూ అనుభవం లేదు. ఇదో కథగా క్వాలిఫై అవుతుందో.. లేదో నాకూ తెలియదు. ఇక నా అభిప్రాయం చెప్పమంటే మాత్రం చాంతాండంత అవుతుంది. సరేనా??

    ఆదివారం ఉదయం ఫలహారం తింటూ.. మీ కథనాన్ని చదువుతుంటే.. ఆహా అనిపించింది. రెండు మూడు సార్లు తనివితీరా చదువుకున్నాను. ఇది మీ స్వగతమా?? నా స్వగతమా?? అని అనుమానం వచ్చింది చాలా సార్లు. A day in a shopping mall..అని essay రాయమంటే.. ఇంచుమించు ఇవే రాస్తాను.

    స్కూల్లో.. same pinch అంటే భయం వేసేది.. గట్టిగా గిల్లేస్తారని, నొప్పి పుడుతుందని 😦 కానీ ఈ టపాలో నాకనిపించిన కొన్ని same pinch lines 😉

    అసలు నేను ఒంటరిగా షాపింగ్ చెయ్యను. కానీ ఏం చెయ్యను. పరిస్థితులు అలా తగలడ్డాయి.
    జనాలందరూ లక్షాధికారులూ, కోటీశ్వరులేమో మరి కార్లలో లీటర్ల కొద్దీ పెట్రోలు కొట్టించుకుంటున్నారు.
    వెళ్ళాల్సిన చోటికి నేరుగా వెళ్ళకుండా కాస్త అటూ ఇటూ చక్కర్లు కొట్టి, కాసేపు ఆ చక్కని వాతావరణాన్ని ఆస్వాదించి
    అసలు మాలులంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. అలాగని ఇష్టం లేదనీ అనలేను.
    ఎందుకో నేనిక్కడ చెందను అనిపించింది. – I feel absolutely lost in a mall. That’s the reason why I need a company for sure.

    ఒక మంచి అనుభూతిని పంచి ఇచ్చినందుకు ధన్యవాదాలు!!

  8. కథలు రాయడంలో నాకూ అనుభవం లేదు. ఇదో కథగా క్వాలిఫై అవుతుందో.. లేదో నాకూ తెలియదు. ఇక నా అభిప్రాయం చెప్పమంటే మాత్రం చాంతాండంత అవుతుంది. సరేనా??ఆదివారం ఉదయం ఫలహారం తింటూ.. మీ కథనాన్ని చదువుతుంటే.. ఆహా అనిపించింది. రెండు మూడు సార్లు తనివితీరా చదువుకున్నాను. ఇది మీ స్వగతమా?? నా స్వగతమా?? అని అనుమానం వచ్చింది చాలా సార్లు. A day in a shopping mall..అని essay రాయమంటే.. ఇంచుమించు ఇవే రాస్తాను.స్కూల్లో.. same pinch అంటే భయం వేసేది.. గట్టిగా గిల్లేస్తారని, నొప్పి పుడుతుందని 😦 కానీ ఈ టపాలో నాకనిపించిన కొన్ని same pinch lines ;-)అసలు నేను ఒంటరిగా షాపింగ్ చెయ్యను. కానీ ఏం చెయ్యను. పరిస్థితులు అలా తగలడ్డాయి.జనాలందరూ లక్షాధికారులూ, కోటీశ్వరులేమో మరి కార్లలో లీటర్ల కొద్దీ పెట్రోలు కొట్టించుకుంటున్నారు.వెళ్ళాల్సిన చోటికి నేరుగా వెళ్ళకుండా కాస్త అటూ ఇటూ చక్కర్లు కొట్టి, కాసేపు ఆ చక్కని వాతావరణాన్ని ఆస్వాదించిఅసలు మాలులంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. అలాగని ఇష్టం లేదనీ అనలేను.ఎందుకో నేనిక్కడ చెందను అనిపించింది. – I feel absolutely lost in a mall. That’s the reason why I need a company for sure.ఒక మంచి అనుభూతిని పంచి ఇచ్చినందుకు ధన్యవాదాలు!!

  9. ప్రవీణ్ గార్లపాటి said,

    @ మోహన గారు:
    అవును నిజం. ఆ అంతరం మన ఎంపికలోనే ఉన్నా మోరల్స్ అనేవి మనల్నెప్పుడూ అదుపులో ఉంచుతాయి.

    @ రవి:
    కథ మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ఎఫ్ ఎం అనుభవం నేను ఊహించగలను. మీ స్థానంలో నేనున్నా అంతే 🙂
    ఇన్‌లైన్ వ్యాఖ్యల కోసం చేసిన సెట్టింగు సృష్టించిన సమస్య వ్యాఖ్యలు పని చెయ్యకపోవడం.

    @ పూర్ణిమ గారు:
    అభిప్రాయాలు చెబితేనేగే మెరుగుపరచుకోగలిగేది.
    ఇప్పుడు మోడర్న్ లైఫ్ తో కాచప్ కాలేని వారందరి సమస్యా అనుకుంట అలా ఫీలవడం.

    మీకు నచ్చినందుకు సంతోషం.

  10. @ మోహన గారు:అవును నిజం. ఆ అంతరం మన ఎంపికలోనే ఉన్నా మోరల్స్ అనేవి మనల్నెప్పుడూ అదుపులో ఉంచుతాయి.@ రవి:కథ మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ఎఫ్ ఎం అనుభవం నేను ఊహించగలను. మీ స్థానంలో నేనున్నా అంతే :-)ఇన్‌లైన్ వ్యాఖ్యల కోసం చేసిన సెట్టింగు సృష్టించిన సమస్య వ్యాఖ్యలు పని చెయ్యకపోవడం.@ పూర్ణిమ గారు:అభిప్రాయాలు చెబితేనేగే మెరుగుపరచుకోగలిగేది.ఇప్పుడు మోడర్న్ లైఫ్ తో కాచప్ కాలేని వారందరి సమస్యా అనుకుంట అలా ఫీలవడం.మీకు నచ్చినందుకు సంతోషం.

  11. వేణూ శ్రీకాంత్ said,

    ప్రవీణ్ గారు కధ కి క్వాలిఫై అవుతుందా లేదా అనే విషయం చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు కానీ మీ టపా చాలా బావుంది, చదువుతుంటే నన్ను నేను ఐడెంటిఫై చేసుకో గలిగాను… అలా మనసులో ఉన్న ఆలోచనలని యధా తధం గా వ్రాయడం బావుంది.

  12. ప్రవీణ్ గారు కధ కి క్వాలిఫై అవుతుందా లేదా అనే విషయం చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు కానీ మీ టపా చాలా బావుంది, చదువుతుంటే నన్ను నేను ఐడెంటిఫై చేసుకో గలిగాను… అలా మనసులో ఉన్న ఆలోచనలని యధా తధం గా వ్రాయడం బావుంది.

  13. నిషిగంధ said,

    హమ్మయ్యా, మీ కామెంట్ సెక్షన్ పనిచేస్తోంది!

    ప్రవీణ్, బావుంది.. మంచి కధ గా క్వాలిఫై కావడానికి ఇంకాస్త వర్క్ అవసరమేమో!

    “వర్షం నా వంటిని కాక మనసుని కడిగేస్తున్నట్లుంది” ఈ వాక్యం చాలా బావుంది.. అసలు మీ బైక్ రైడ్ గురించి చదువుతుంటే మిమ్మల్ని తోసేసి నేనా బైక్ తీసుకుని ఝుమ్మని వెళ్ళిపోవాలనిపించింది :))

    కానీ మీ మాల్ షాపింగ్ అనుభవం భలే ఉంది.. ఏమైనా కొనడానికైతే నాకు ఒక్కదాన్నే వెళ్ళడం ఇష్టం.. తీరిగ్గా అన్నిటినీ పైనేసి తిరగేసి కొనుక్కోవచ్చు.. తిని మస్తీ చేయడానికైతే గుంపుతో వెళ్తాను..

    ఇక రోడ్డు పక్కన ఎవరూ లేనిచోట దొరికిన డబ్బులైనా తీసుకుని వాడుకోవడానికి అస్సలు మనస్కరించదు.. అలాంటిది షాపు వాడు పొరపాటున ఇచ్చిన డబ్బుని తీసుకుని ఆ కాంపౌండ్ కూడా దాటలేము.. it wasn’t yours and you did a good job!

  14. హమ్మయ్యా, మీ కామెంట్ సెక్షన్ పనిచేస్తోంది! ప్రవీణ్, బావుంది.. మంచి కధ గా క్వాలిఫై కావడానికి ఇంకాస్త వర్క్ అవసరమేమో!”వర్షం నా వంటిని కాక మనసుని కడిగేస్తున్నట్లుంది” ఈ వాక్యం చాలా బావుంది.. అసలు మీ బైక్ రైడ్ గురించి చదువుతుంటే మిమ్మల్ని తోసేసి నేనా బైక్ తీసుకుని ఝుమ్మని వెళ్ళిపోవాలనిపించింది :))కానీ మీ మాల్ షాపింగ్ అనుభవం భలే ఉంది.. ఏమైనా కొనడానికైతే నాకు ఒక్కదాన్నే వెళ్ళడం ఇష్టం.. తీరిగ్గా అన్నిటినీ పైనేసి తిరగేసి కొనుక్కోవచ్చు.. తిని మస్తీ చేయడానికైతే గుంపుతో వెళ్తాను..ఇక రోడ్డు పక్కన ఎవరూ లేనిచోట దొరికిన డబ్బులైనా తీసుకుని వాడుకోవడానికి అస్సలు మనస్కరించదు.. అలాంటిది షాపు వాడు పొరపాటున ఇచ్చిన డబ్బుని తీసుకుని ఆ కాంపౌండ్ కూడా దాటలేము.. it wasn’t yours and you did a good job!

  15. రవి said,

    ప్రవీణ్, ఇంకా కామెంట్ లంకె ఇబ్బందుల్లోనే వుంది. కూడలి కామెంట్ ల నుండీ మీ బ్లాగు కు వెళితే, మీ టపాలు చదవ వచ్చు కానీ కామెంటలేము. మళ్ళీ ’హోమ్ ’ కి వచ్చి మొదలెట్టాలి. గమనించగలరు.

  16. రవి said,

    ప్రవీణ్, ఇంకా కామెంట్ లంకె ఇబ్బందుల్లోనే వుంది. కూడలి కామెంట్ ల నుండీ మీ బ్లాగు కు వెళితే, మీ టపాలు చదవ వచ్చు కానీ కామెంటలేము. మళ్ళీ ’హోమ్ ’ కి వచ్చి మొదలెట్టాలి. గమనించగలరు.

  17. కొల్లూరి సోమ శంకర్ said,

    ప్రవీణ్ గారూ,
    కథ బాగుంది.
    ఎవరేమనుకున్నా, మనం మన హృదయం మాట విని ఓ నిర్ణయం తీసుకుంటే ఆ సంతృప్తే వేరు.
    అభినందనలు.
    కొల్లూరి సోమ శంకర్
    http://www.kollurisomasankar.wordpress.com

  18. ప్రవీణ్ గారూ,కథ బాగుంది.ఎవరేమనుకున్నా, మనం మన హృదయం మాట విని ఓ నిర్ణయం తీసుకుంటే ఆ సంతృప్తే వేరు. అభినందనలు.కొల్లూరి సోమ శంకర్ http://www.kollurisomasankar.wordpress.com

  19. ప్రవీణ్ గార్లపాటి said,

    @ వేణూ శ్రీకాంత్ గారు:
    మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

    @ నిషిగంధ గారు:
    తప్పకుండా ఇంకా చాలా మెరుగవ్వాలి. రాసే నాకే అర్థమయింది.
    కానీ ఎక్కడో అక్కడ మొదలెట్టాలి కదా అందుకే ఇలా 🙂
    నేనసలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళడానికి ఇష్టపడను. ఏంటో అలా అలవాటయిపోయింది.

    @ రవి:
    ఏంటో ఏ ముహూర్తంలో మూస మార్చానో కానీ ఇలా శనిలా పట్టుకుంది.
    మీ వ్యాఖ్య చదివిన తరువాతే మళ్ళీ సవరించి సరి చేసా.
    మీ ఓపికకి కృతజ్ఞతలు.

    @ కొల్లూరి సోమ శంకర్ గారు:
    మీ లాంటి వారి నుంచి ప్రోత్సాహం కలగడం చాలా ఆనందంగా ఉంది.

  20. @ వేణూ శ్రీకాంత్ గారు:మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.@ నిషిగంధ గారు:తప్పకుండా ఇంకా చాలా మెరుగవ్వాలి. రాసే నాకే అర్థమయింది. కానీ ఎక్కడో అక్కడ మొదలెట్టాలి కదా అందుకే ఇలా :)నేనసలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళడానికి ఇష్టపడను. ఏంటో అలా అలవాటయిపోయింది.@ రవి:ఏంటో ఏ ముహూర్తంలో మూస మార్చానో కానీ ఇలా శనిలా పట్టుకుంది. మీ వ్యాఖ్య చదివిన తరువాతే మళ్ళీ సవరించి సరి చేసా. మీ ఓపికకి కృతజ్ఞతలు.@ కొల్లూరి సోమ శంకర్ గారు:మీ లాంటి వారి నుంచి ప్రోత్సాహం కలగడం చాలా ఆనందంగా ఉంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: