జూలై 22, 2008

ఓ చాక్లెట్టిచ్చి ఈ టపా చదవండి …

Posted in అనుభవాలు, చాక్లెట్టు, నేను, సరదా వద్ద 3:35 సా. ద్వారా Praveen Garlapati

చిన్నప్పటినుంచీ చాక్లెట్టులంటే స్పెషలింటరెస్టు నాకు.

అన్నం లేకపోయినా ఫరవాలేదు కానీ చాక్లెట్టు లేనిదే నా భోజనమెప్పుడూ పూర్తయేది కాదంట.
అంటే దాని మహత్యం నాకు చిన్నప్పుడే తెలిసిపోయిందన్నమాట.
అప్పటి నుంచీ ఇప్పటి దాకా నా బెట్టు తీర్చడానికి చాక్లెట్టే మార్గం.

చాక్లెట్టు తినని వారిని వింత పశువు కన్నా వింతగా చూస్తాను నేను. నా ప్రకారం తినని వాడు మనిషే కాదు మరి.
అసలు చాక్లెట్లు అంటే అమ్మాయిలకు తెగ ఇష్టం అనే ముద్ర వెయ్యడం ఒక పెద్ద “కాన్స్‌పిరసీ” అని నాకనిపిస్తుంది. మన మగాళ్ళ చాక్లెట్లు కూడా లాక్కుని వారు తినడానికి.

నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పటి దాకా తిన్న ఒక్కొక్క చాక్లెట్టూ గుర్తే…

చిన్నప్పుడు నాకు ఆరెంజ్ మిఠాయి అంటే భలే ఇష్టంగా ఉండేది. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉండే దానిని చప్పరిస్తూ ఉంటే ఆహా! (జెండా వందనాల స్పెషలు ఇదే)
క్లాసురూములో కూడా దాచుకుని చివరి బెంచీలలో కూర్చుని మరీ తినేవాడిని.

తర్వాత నెమ్మదిగా అసలయిన చాక్లెట్టులు అలవాటయ్యాయి. అంటే “కాడ్బరీ ఎక్లయిర్స్” అన్నమాట. దానిని తప్ప ఇంక దేనినీ ఇప్పటికీ నేను చాక్లెట్టుగా అంగీకరించలేను. (రాపర్లలో ఉన్న చాక్లెట్లలో అన్నమాట)
ఆ రుచి మరిగిన తరువాత అసలు ఇంక ఏ ఇతర చాక్లెట్టు తినబుద్దయ్యేది కాదు. అసలు అవి తింటేనే మహా పాపం అనుకునేవాడిని. కాఫీ బ్రేకులూ, న్యూట్రినులూ ఎన్ని తిన్నా తృప్తిగా ఉంటేగా ?

కానీ విధి ఆడిన వింత నాటకంలో నేను బలయినట్టు రోజూ నాకు అర్థ రూపాయి ఇవ్వరుగా అందుకే “ఆశ” లాంటి చాక్లెట్లు తినలేక, చాక్లెట్లు తినకుండా ఉండాలేక ఎంత మధనపడ్డానో నాకే తెలుసు.
కొన్ని సార్లు కష్టపడి రెండు రోజులకి ఆ పావలా దాచుకుని మరీ ఎక్లయిర్సే కొనుక్కునేవాడిని.

అలాగే ఇంటికెవరొచ్చినా బిస్కెట్లు, స్వీట్లు గాక నాకోసం ఎవరయినా చాక్లెట్లు పట్టుకొస్తే వాళ్ళు నాకు అత్యంత ఆప్తులన్నమాట. వాళ్ళ కోసం స్పెషలుగా మంచినీళ్ళు తెచ్చివ్వడం, ఫలహారాల ప్లేట్లు అందివ్వడం లాంటివి చేసేవాడినన్నమాట. అవి తేనివాళ్ళకు మాత్రం నన్ను పలకరించినా మొహం తిప్పుకునే వాడిని.

దాని సైడెఫెక్టు ఏమిటంటే నాచేత పని చేయించుకోవడమెలాగో జనాలకు తెలిసిపోయింది. ఇంట్లో అమ్మకి కందిపప్పో, మినప్పప్పో కావాలంటే ఓ రూపాయెక్కువిచ్చేది కావాలనే. అమ్మకి తెలుసు ఆ రూపాయి వెనక్కి రాదని. అదే కదా మరి మర్మం.

ఎక్లయిర్స్ ఎలా ఉన్నా ప్రత్యేక సందర్భాలకి మాత్రం పెద్ద చాక్లెట్లు ఉండాల్సిందే. అంటే నా పుట్టిన రోజు, అక్క, అమ్మ, నాన్న ఎవరి పుట్టిన రోజులయినా నాకు పండగే. మరి నన్ను సంతృప్తి పరచాలంటే నాకు “ఫైవ్ స్టార్” ఇవ్వాల్సిందే. ఏ స్వీటూ, హాటూ దానికి సాటి రాదు. దానిని పిసర పిసరంత కొనుక్కుని తిని ఆనందిస్తే ఆ మజానే వేరు. నాది తినడం అయిపోయిన తర్వాత మరి అక్కది వదిలేస్తే ఎలా ? దానినీ హాం ఫట్టు.
ఇక అమ్మా, నాన్నలదయితే డీఫాల్టుగా నాదే. అంటే నాలుగు చాక్లెట్లు కొని తేగానే మూడు నా చేతిలో. అవి తిన్న తర్వాత అక్కది కూడా నాదేనన్నమాట. అక్క తింటున్నా సరే అందులో సగం నా వాటానే.

“పెద్ద” చాక్లెట్లు తినడం మొదలుపెట్టిన తర్వాత నాకు పిచ్చపిచ్చగా నచ్చింది “ఫైవ్ స్టారే”. డెయిరీ మిల్కులూ, క్రాకిల్ లూ, కిట్ కాట్ లూ దాని తర్వాతే.

అలా చిన్నప్పటి నుంచే వందలాది (వేలాది ??) చాక్లెట్లు తిని చాక్లెట్టు ఫాక్టరీలను పోషించడంలో కీలక పాత్ర పోషించానన్నమాట.

పెద్దయ్యాక స్నేహితులందరూ బేకరీలలో పఫ్ లూ, కేకులూ కొనుక్కుని తింటుంటే నేను మాత్రం చాక్లెట్టులే తినేవాడిని. వారికేమో అదో చిత్రం. ఇంకా చిన్నపిల్లాడిలా చాక్లెట్లు తినడమేంట్రా అని ?
అయినా నాకు తెలియక అడుగుతాను చాక్లెట్లు తినడానికి వయసుతో సంబంధం ఏమిటండీ ?

నేను పొరపాటున కేకులు గట్రా కొనాల్సి వచ్చినా చాక్లెట్టు ఉన్న కేకులే కొనేవాడిని. అందుకే ఇప్పటికీ ఎవరయినా నన్ను కొనమని చెప్పడానికి సందేహిస్తారు.

సరే ఎలాగో రెండు రోజులకి ఒక చాక్లెట్టు తింటూ ఇంజినీరింగు వరకూ గడిపేసాను.

ఇక నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే వెంటనే ఒక వంద రూపాయలు పెట్టి చాక్లెట్లు కొనుక్కుని తినేసాను. అన్నట్టు ఇంట్లో వాళ్ళకి కూడా స్వీట్లు బదులు చాక్లెట్లే… 🙂

నా జీతంలో ఓ పావు వంతు చాక్లెట్లకి కేటాయింపన్నమాట. మా అమ్మ కూడా ప్రతీ నెలా సరుకులతో పాటూ ఓ పది రకాల చాక్లెట్లు కొంటుంది ఇప్పటికీ… నాలుగు రాత్రులు కూడా దాటకుండానే వాటికి కాలం చెల్లిపోతుందనుకోండి.

ఇక మన లెవెలు పెరిగింది. ఇప్పటి దాకా దేశీ చాక్లెట్లే తినే నాకు విదేశీ చాక్లెట్లు పరిచయమయ్యాయి. హెర్షీసూ, ఘిరాడెల్లీలు, ఫెర్రెరో రోషర్‌లూ, మార్సు బారులూ, లిండ్ట్ లూ అన్నీ ఒకటొకటిగా నా చిట్టాలో చేరాయి.
ఆఖరికి నా పిచ్చి ఎంత వరకూ వచ్చిందంటే నా స్నేహితులు ఆన్సైటు నుంచి తిరిగొచ్చేటప్పుడు నా కోసం ఓ పాకెట్టు చాక్లెట్లు ప్రత్యేకంగా తెచ్చేవారు. అవి లేకపోతే వారితో మాటలుండవు మరి.

నా ఇష్టాన్ని ఉపయోగించుకుని జనాలు నాతో ఆడుకున్నారు కూడా… ఓ సారి మా స్నేహితులతో కలిసి వెళుతుంటే ఓ చాక్లెట్టు చాపారు నా ముందు. నా సంగతి ఎలాగూ తెలిసిందే. మరు క్షణంలో గబుక్కు. అది కొరికిన తర్వాత చేదుగా ఏదో ద్రవం వచ్చింది దాంట్లోంచి. అప్పుడు గానీ చెప్పలా వాళ్ళు అదేదో వోడ్కా నింపిన చాక్లెట్టంట. యాక్…
అప్పుడు గానీ నాకు తెలీలేదు నే తినని చాక్లెట్టు కూడా ఉంటుందని. (ఆఖరికి చేదుగా ఉండే చాక్లెట్లు కూడా నే తింటాను మరి)

మీకు తెలీదేమో నా చాక్లెట్టు పిచ్చి ఎంతంటే ఆఖరికి ఐస్ క్రీం తిన్నా చాక్లెట్టుదే… చాక్లెట్టు ఫడ్జ్‌లూ, సండేలూ. అన్నిటికన్నా ప్రియమైనది కార్నర్ హౌజ్‌లో “డెత్ బై చాక్లెట్”.
హహ… పేరేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా…
వెనిల్లా స్కూపుల మీద పెద్ద పెద్ద చాక్లెట్టు కేకులూ, దాని మీద ఓ బకెట్టుడు చాక్లెట్ సాసు. నాలాంటి వారికి అది చాలదూ ???

అన్నట్టు ఫ్రిజ్‌లో “పర్క్” పిలుస్తుంది కానీ మళ్ళీ కలుస్తా !

49 వ్యాఖ్యలు »

 1. మాకినేని ప్రదీపు said,

  నా కొత్త ఆఫీసులో ఎవరి పుట్టినరోజయినా ఆఫీసు మొత్తానికీ చాక్లెట్లు పంచిపెట్టేస్తారు! అయినా వోడ్కా యాక్ ఏంటి!

 2. నా కొత్త ఆఫీసులో ఎవరి పుట్టినరోజయినా ఆఫీసు మొత్తానికీ చాక్లెట్లు పంచిపెట్టేస్తారు! అయినా వోడ్కా యాక్ ఏంటి!

 3. RSG said,

  నాదీ అదే ప్రశ్న… వోడ్కా యాక్ ఏమిటి?
  వైన్ కలిపిన చాక్లెట్స్ ఎప్పుడైన ట్రై చేశారా? భలే ఉంటాయ్ 🙂

 4. RSG said,

  నాదీ అదే ప్రశ్న… వోడ్కా యాక్ ఏమిటి?వైన్ కలిపిన చాక్లెట్స్ ఎప్పుడైన ట్రై చేశారా? భలే ఉంటాయ్ 🙂

 5. oremuna said,

  నీకో లారీడు చాక్లేట్లు కొనిస్తాం కానీ ఇలాగే వ్రాస్తూ ఉండు. హాట్ చాక్లెట్ ఫడ్జ్ ట్రై చేశావా? (చెయ్యకుండా ఉండవులే 🙂 ) ఆ దోమ్లూరు సర్కిల్లో టీ ఐ ఆఫీసు ( ఇప్పుడు అక్కడే ఉందో లేదో, నందినీ దగ్గరలో ) మొదటి సారి హాట్ చాక్లెట్ ఫడ్జ్ తిని ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ 🙂 కాకుంటే మళ్లా ఐమాక్క్స్ లో తిన్నాక మాత్రం ఆ టేస్ట్ లేదు 😦 చాక్లెట్ విషయంలో నేను మాత్రం న్యూట్రల్!

 6. oremuna said,

  నీకో లారీడు చాక్లేట్లు కొనిస్తాం కానీ ఇలాగే వ్రాస్తూ ఉండు. హాట్ చాక్లెట్ ఫడ్జ్ ట్రై చేశావా? (చెయ్యకుండా ఉండవులే 🙂 ) ఆ దోమ్లూరు సర్కిల్లో టీ ఐ ఆఫీసు ( ఇప్పుడు అక్కడే ఉందో లేదో, నందినీ దగ్గరలో ) మొదటి సారి హాట్ చాక్లెట్ ఫడ్జ్ తిని ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ 🙂 కాకుంటే మళ్లా ఐమాక్క్స్ లో తిన్నాక మాత్రం ఆ టేస్ట్ లేదు 😦 చాక్లెట్ విషయంలో నేను మాత్రం న్యూట్రల్!

 7. శ్రీ said,

  కాడ్బరీస్ ఎక్లైర్సు నాకూ భలే ఇష్టం!చాక్లెట్టు చప్పరిస్తూ ఉన్నపుడు పై పొర కరిగి రెండో పొర నొట్లో కరుగుతుంటే నా సామి రంగా!ఇప్పటికీ యే చాక్లెట్టు నాకు ఈ తృప్తి ఇవ్వలేదు.

 8. శ్రీ said,

  కాడ్బరీస్ ఎక్లైర్సు నాకూ భలే ఇష్టం!చాక్లెట్టు చప్పరిస్తూ ఉన్నపుడు పై పొర కరిగి రెండో పొర నొట్లో కరుగుతుంటే నా సామి రంగా!ఇప్పటికీ యే చాక్లెట్టు నాకు ఈ తృప్తి ఇవ్వలేదు.

 9. కొత్త పాళీ said,

  ప్రవీణుడు ప్రవచించిన చాక్లెట్టు వేదం బహు బాగు.

  అసలు చాక్లెట్టు పరమ చేదుగా ఉంటుంది.. అదే దాని సహజ రుచి. దానికి బోలెడు పాలూ, ఇంకా చక్కెరా కలిపి తీపి చాక్లెట్టు తయారు చేస్తారు. చాక్లెట్టు వొంతికి మంచిది అయినా, దానితో వచ్చే చక్కెర మంచిది కాదని ఈ మధ్య ఇక్కడ పండ్ల రసాలతో కలిపిన చాక్లెట్లు తెగ అమ్ముతున్నారు.

  అన్నట్టు మా కేలేజిలో ఈ చాక్లెట్ ప్రహసనం ఒకటి జరిగింది. ఆ రోజుల్లో అముల్ చాక్లెట్ల వాళ్ళు “A gift for Someone YOu Love” అని ప్రకటనలు ఇచ్చేవారు. మావోడొకడు తను మెచ్చిన అమ్మాయికి రెచ్చిపోయి అమూల్ చాక్లెట్లు సరఫరా చేశాడు, ఆమె అలా తన మనసు గ్రహిస్తుందని. ఆ పిల్ల ఎంచక్కగ్గా వీడిచ్చ్న చాక్లెట్లన్నీ తినేసి, ఇంకోడితో జత కట్టేసింది 🙂

 10. ప్రవీణుడు ప్రవచించిన చాక్లెట్టు వేదం బహు బాగు.అసలు చాక్లెట్టు పరమ చేదుగా ఉంటుంది.. అదే దాని సహజ రుచి. దానికి బోలెడు పాలూ, ఇంకా చక్కెరా కలిపి తీపి చాక్లెట్టు తయారు చేస్తారు. చాక్లెట్టు వొంతికి మంచిది అయినా, దానితో వచ్చే చక్కెర మంచిది కాదని ఈ మధ్య ఇక్కడ పండ్ల రసాలతో కలిపిన చాక్లెట్లు తెగ అమ్ముతున్నారు.అన్నట్టు మా కేలేజిలో ఈ చాక్లెట్ ప్రహసనం ఒకటి జరిగింది. ఆ రోజుల్లో అముల్ చాక్లెట్ల వాళ్ళు “A gift for Someone YOu Love” అని ప్రకటనలు ఇచ్చేవారు. మావోడొకడు తను మెచ్చిన అమ్మాయికి రెచ్చిపోయి అమూల్ చాక్లెట్లు సరఫరా చేశాడు, ఆమె అలా తన మనసు గ్రహిస్తుందని. ఆ పిల్ల ఎంచక్కగ్గా వీడిచ్చ్న చాక్లెట్లన్నీ తినేసి, ఇంకోడితో జత కట్టేసింది 🙂

 11. శ్రీను said,

  ప్రవీణ్ గారు,
  నేను మీకొక చాక్లెట్ పంపిన తర్వాతే మీ టపా చదివాను.నిజమండీ! నా చాక్లెట్ మీకు అందిందా!

 12. ప్రవీణ్ గారు, నేను మీకొక చాక్లెట్ పంపిన తర్వాతే మీ టపా చదివాను.నిజమండీ! నా చాక్లెట్ మీకు అందిందా!

 13. ఏకాంతపు దిలీప్ said,

  ప్రవీణ్ మీకు నేను అందరికీ ఇచ్చే కాఫీ బైట్ ఇస్తున్నాను…

  మీ ఆరెంజు మిఠాయి ని మేము నిమ్మ తొనలు అంటామనుకుంట…. నాకు రస్న తాగడం కన్నా, వాటిని చప్పరించడమే ఇష్టం 🙂

  కానీ చాక్లెట్లు ఇష్టమైనా, ఎక్కువ తినేంత ఇష్టం కాదు… సండే లు, చాకలెట్ కేక్ లు అయితే ఒక స్కూపో ఒక ముక్కో తిని ఆ రుచిని ఆస్వాదిస్తా… అంతకన్నా ఎక్కువ లాగించెయ్యాలనిపించదు…

 14. ప్రవీణ్ మీకు నేను అందరికీ ఇచ్చే కాఫీ బైట్ ఇస్తున్నాను… మీ ఆరెంజు మిఠాయి ని మేము నిమ్మ తొనలు అంటామనుకుంట…. నాకు రస్న తాగడం కన్నా, వాటిని చప్పరించడమే ఇష్టం 🙂 కానీ చాక్లెట్లు ఇష్టమైనా, ఎక్కువ తినేంత ఇష్టం కాదు… సండే లు, చాకలెట్ కేక్ లు అయితే ఒక స్కూపో ఒక ముక్కో తిని ఆ రుచిని ఆస్వాదిస్తా… అంతకన్నా ఎక్కువ లాగించెయ్యాలనిపించదు…

 15. అశ్విన్ బూదరాజు said,

  అయినా వోడ్కా యాక్ ఏంటి! ప్రవీణ్ ORKUT లో ఎక్కవ మంది ఉన్న community ఇది… చాక్లేట్ ఫ్లేవర్ మాత్రమ్ సూపర్

 16. అయినా వోడ్కా యాక్ ఏంటి! ప్రవీణ్ ORKUT లో ఎక్కవ మంది ఉన్న community ఇది… చాక్లేట్ ఫ్లేవర్ మాత్రమ్ సూపర్

 17. Raj said,

  ఆన్సైట్ వచ్చాక చాక్లెట్లు తినడం ఎక్కువై 2 సంవత్సరాల్లోనే ఒక పన్ను పీకించుకోవాల్సి వచ్చింది. ఇలాగే కొనసాగిస్తే మరో రెండు పీకుతానని డాక్టరు హెచ్చరించింది కూడా. కాబట్టి చాక్లెట్ డైట్ మీదున్నా. మొత్తానికి మీరూ నా పార్టీయే అన్నమాట. సంతోషం.

 18. Raj said,

  ఆన్సైట్ వచ్చాక చాక్లెట్లు తినడం ఎక్కువై 2 సంవత్సరాల్లోనే ఒక పన్ను పీకించుకోవాల్సి వచ్చింది. ఇలాగే కొనసాగిస్తే మరో రెండు పీకుతానని డాక్టరు హెచ్చరించింది కూడా. కాబట్టి చాక్లెట్ డైట్ మీదున్నా. మొత్తానికి మీరూ నా పార్టీయే అన్నమాట. సంతోషం.

 19. వేణూ శ్రీకాంత్ said,

  హ హ బావుందండీ మీ చాక్లెట్ పురాణం… వోడ్కా ఏమో కానీ వైన్ చాక్లెట్స్ బావుంటాయ్ అంటారు ప్రయత్నించండి. నాకూ ఎక్లైర్స్ ఇష్టమే కానీ 5 స్టార్ లాంటి కాడ్బరీ చాక్లెట్ ఫ్లేవర్ నచ్చదు. ఫడ్జ్ / కేక్స్ లో అస్సలు నచ్చదు చేదు గా అనిపిస్తుంది.

 20. హ హ బావుందండీ మీ చాక్లెట్ పురాణం… వోడ్కా ఏమో కానీ వైన్ చాక్లెట్స్ బావుంటాయ్ అంటారు ప్రయత్నించండి. నాకూ ఎక్లైర్స్ ఇష్టమే కానీ 5 స్టార్ లాంటి కాడ్బరీ చాక్లెట్ ఫ్లేవర్ నచ్చదు. ఫడ్జ్ / కేక్స్ లో అస్సలు నచ్చదు చేదు గా అనిపిస్తుంది.

 21. cbrao said,

  చాక్లేట్ అంటే ఎవరికి ఇష్టం వుండదు? ఈ టపా కూడా చాక్లేట్ లా ఉంది. నా కైతే చాక్లేట్ కొరికితే, విస్కీ వచ్చే చాక్లేట్లంటే ఇష్టం. ఉప్మా పురాణం అయిపోయింది. ఇప్పుడు చాక్లేట్ పురాణం. తరవాత ఏమిటి? చిరంజీవి దోశా (హైదరాబాదు చట్నీస్ రెస్టారెంట్ లో అది స్పెషల్)? ఎవరైనా తిన్నారా?

 22. cbrao said,

  చాక్లేట్ అంటే ఎవరికి ఇష్టం వుండదు? ఈ టపా కూడా చాక్లేట్ లా ఉంది. నా కైతే చాక్లేట్ కొరికితే, విస్కీ వచ్చే చాక్లేట్లంటే ఇష్టం. ఉప్మా పురాణం అయిపోయింది. ఇప్పుడు చాక్లేట్ పురాణం. తరవాత ఏమిటి? చిరంజీవి దోశా (హైదరాబాదు చట్నీస్ రెస్టారెంట్ లో అది స్పెషల్)? ఎవరైనా తిన్నారా?

 23. రాధిక said,

  పొరపాటున ఒకటివ్వబోయి రె0డు చాక్లెట్లు ఇఛ్ఛేసాను.ఒకటి తిరిగిఛ్ఛేయ0డి.

  నాకు మహాలేక్టో నఛ్ఛుతు0ది.చిన్నప్పుడు అ0టే ఇ0టర్ మీడియట్ వరకూ రోజూ ల0ఛ్ అయ్యాకా ఏదో ఒక చాక్లెట్ తినేదాన్ని.డబ్బులు లేకపోతే దేవుడిదగ్గర పెట్టే చిప్స్ బిళ్ళలో,పటిక బెల్లమో,లేదా దిలీప్ గాఉ చెప్పిన నిమ్మతొనలో తినాల్సి0దే.

  ఇన్ని చాక్లెట్లు తి0టూ కూడా మీరు అలా స్లిమ్ గా ఎలా వున్నార0డి.అద్రుష్ట0 చేసుకున్నారు.ఇప్పుడు నేనొక చాక్లెట్ తినాల0టే ఒక పూట భోజన0 త్యాగ0 చెయ్యాలి.

 24. పొరపాటున ఒకటివ్వబోయి రె0డు చాక్లెట్లు ఇఛ్ఛేసాను.ఒకటి తిరిగిఛ్ఛేయ0డి.నాకు మహాలేక్టో నఛ్ఛుతు0ది.చిన్నప్పుడు అ0టే ఇ0టర్ మీడియట్ వరకూ రోజూ ల0ఛ్ అయ్యాకా ఏదో ఒక చాక్లెట్ తినేదాన్ని.డబ్బులు లేకపోతే దేవుడిదగ్గర పెట్టే చిప్స్ బిళ్ళలో,పటిక బెల్లమో,లేదా దిలీప్ గాఉ చెప్పిన నిమ్మతొనలో తినాల్సి0దే. ఇన్ని చాక్లెట్లు తి0టూ కూడా మీరు అలా స్లిమ్ గా ఎలా వున్నార0డి.అద్రుష్ట0 చేసుకున్నారు.ఇప్పుడు నేనొక చాక్లెట్ తినాల0టే ఒక పూట భోజన0 త్యాగ0 చెయ్యాలి.

 25. Srikanth vadarevu said,

  __((()))__
  ((()))

  ముందుగా మీకొక చాక్లెట్
  ఇది చుస్తూ మీ జేబులోని ఒక చాక్లేటు తినండి
  నేను ఇచ్చిన చాక్లెట్ తిన్నటే

  august 15 న మా స్కూలో అందరికంటే నేనే యెక్కువ చాక్లేట్లు తినేది

  చాలా తియ్యగా ఉందండి మీ టపా

 26. __((()))__ ((()))ముందుగా మీకొక చాక్లెట్ ఇది చుస్తూ మీ జేబులోని ఒక చాక్లేటు తినండి నేను ఇచ్చిన చాక్లెట్ తిన్నటేaugust 15 న మా స్కూలో అందరికంటే నేనే యెక్కువ చాక్లేట్లు తినేది చాలా తియ్యగా ఉందండి మీ టపా

 27. This comment has been removed by the author.

 28. lalitha said,

  “చాక్లెట్టు తినని వారిని వింత పశువు కన్నా వింతగా చూస్తాను నేను. నా ప్రకారం తినని వాడు మనిషే కాదు మరి.”

  ఎలాగూ కనిపించను కాబట్టి నన్నెలా చూసినా పర్వాలేదు. నాకు చాక్లెట్ ఇష్టం లేదు.
  ఇక నేను “వాడు” కాదు కాబట్టి బతికిపోయాననుకుంటున్నాను:-)

 29. lalitha said,

  “చాక్లెట్టు తినని వారిని వింత పశువు కన్నా వింతగా చూస్తాను నేను. నా ప్రకారం తినని వాడు మనిషే కాదు మరి.”ఎలాగూ కనిపించను కాబట్టి నన్నెలా చూసినా పర్వాలేదు. నాకు చాక్లెట్ ఇష్టం లేదు.ఇక నేను “వాడు” కాదు కాబట్టి బతికిపోయాననుకుంటున్నాను:-)

 30. పూర్ణిమ said,

  ఒకసారి ఒక అబ్బాయి నా దగ్గరకొచ్చి.. “యు ఆర్ ఎ స్టుపిడ్ గాళ్” అన్నాడు.. ఏమీ అని అడిగాను అంత షాకులో.. “నువ్వు చాక్లెట్ తినవంట కదా.. అందుకు.” అన్నాడు సింపుల్ గా!!
  కానీ మరుసటి రోజునుండీ.. నన్ను మనిషిలా కాదు.. దేవతలా చూసేవాడు. ఎందుకో చెప్పుకోండి..??

  నేను దారిలో వెళ్తుంటే ఒక పువ్వును చూసాను.. ఒక నవ్వుని పలకరించాను.. అంటూ కారణం ఉన్నా లేకపోయినా.. చాక్లెట్లు పంచడం.. మీకు చాక్లెట్లెంత ఇష్టమో.. నాకంతే ఇష్టం. 🙂 నా ప్రతీ చిన్ని సంతోషాన్ని చాక్లెట్లతోనే పంచుకుంటాను.. కాకపోతే.. నేను తినను అంతే!!

  రావుగారు:
  చెట్నీస్ లో.. చిరంజీవి దోశ.. నేను తిన్నానండీ!! బాగుంటుందది.

 31. ఒకసారి ఒక అబ్బాయి నా దగ్గరకొచ్చి.. “యు ఆర్ ఎ స్టుపిడ్ గాళ్” అన్నాడు.. ఏమీ అని అడిగాను అంత షాకులో.. “నువ్వు చాక్లెట్ తినవంట కదా.. అందుకు.” అన్నాడు సింపుల్ గా!!కానీ మరుసటి రోజునుండీ.. నన్ను మనిషిలా కాదు.. దేవతలా చూసేవాడు. ఎందుకో చెప్పుకోండి..?? నేను దారిలో వెళ్తుంటే ఒక పువ్వును చూసాను.. ఒక నవ్వుని పలకరించాను.. అంటూ కారణం ఉన్నా లేకపోయినా.. చాక్లెట్లు పంచడం.. మీకు చాక్లెట్లెంత ఇష్టమో.. నాకంతే ఇష్టం. 🙂 నా ప్రతీ చిన్ని సంతోషాన్ని చాక్లెట్లతోనే పంచుకుంటాను.. కాకపోతే.. నేను తినను అంతే!!రావుగారు: చెట్నీస్ లో.. చిరంజీవి దోశ.. నేను తిన్నానండీ!! బాగుంటుందది.

 32. Srividya said,

  మీ టపా చాలా బావుంది. చాక్లెట్లు పురాణం సూపర్. కానీ నాకు చాక్లెట్లు నచ్చవు. లలితగారన్నట్టు నేను “వాడు” కాదు కాబట్టి బతికిపోయాను.

 33. Srividya said,

  మీ టపా చాలా బావుంది. చాక్లెట్లు పురాణం సూపర్. కానీ నాకు చాక్లెట్లు నచ్చవు. లలితగారన్నట్టు నేను “వాడు” కాదు కాబట్టి బతికిపోయాను.

 34. మేధ said,

  మీ టపా చదవకపోయిన ఫర్లేదు బాబూ, నేను మాత్రం చాక్లెట్ ఇవ్వలేను.. ఎవరికైనా చాక్లెట్ ఇవ్వాలి అంటే, ఏదో నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తున్న ఫీలింగ్ నాకు.. హిహిహి..

 35. మేధ said,

  మీ టపా చదవకపోయిన ఫర్లేదు బాబూ, నేను మాత్రం చాక్లెట్ ఇవ్వలేను.. ఎవరికైనా చాక్లెట్ ఇవ్వాలి అంటే, ఏదో నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తున్న ఫీలింగ్ నాకు.. హిహిహి..

 36. చైతన్య | chaitü said,

  chocolate tinanivadu manishi kaadaa :O
  mari naakento aa chocolate ruchi antene sahinchadu… ela tinestharo babu anipistundi…

  hmm!!!

 37. chocolate tinanivadu manishi kaadaa :Omari naakento aa chocolate ruchi antene sahinchadu… ela tinestharo babu anipistundi…hmm!!!

 38. kiraN said,

  ఎదుటి వారు చాక్లెట్టు ఇష్టం ఉండదు అన్నారంటే అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను, ఇంక నాకు పండగే పండగ.
  చిన్నప్పటినుంచి నేను ఎన్ని రకాల చాక్లెట్లు తిన్నానో గుర్తులేదు గాని రాపర్లను మాత్రం చాలా వరకు దాచాను, దాస్తున్నాను.

  చాక్లెట్టు తినని వారు ముమ్మాటికి మనిషే కాదు(వాళ్లు నా ఎదురుగా లేనంతసేపు), అసలు తినే అవకాసం ఉండి కుడా తినని వాళ్ళని తినడానికి చాక్లెట్టు మాత్రమే ఉండే చోట వదిలేయాలి.

  -కిరణ్

 39. kiraN said,

  ఎదుటి వారు చాక్లెట్టు ఇష్టం ఉండదు అన్నారంటే అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను, ఇంక నాకు పండగే పండగ. చిన్నప్పటినుంచి నేను ఎన్ని రకాల చాక్లెట్లు తిన్నానో గుర్తులేదు గాని రాపర్లను మాత్రం చాలా వరకు దాచాను, దాస్తున్నాను. చాక్లెట్టు తినని వారు ముమ్మాటికి మనిషే కాదు(వాళ్లు నా ఎదురుగా లేనంతసేపు), అసలు తినే అవకాసం ఉండి కుడా తినని వాళ్ళని తినడానికి చాక్లెట్టు మాత్రమే ఉండే చోట వదిలేయాలి.-కిరణ్

 40. విహారి said,

  పోకిరి సినిమా ప్రివ్యూ చూసిన కృష్ణని మహేష్ బాబు “నాన్నా సినిమా ఎలావుంది?” అని అడిగితే.
  “ఇది 40 కోట్ల సినిమా రా” అన్నాడట.

  ఈ టపా ప్రివ్యూ చదవగానే అంటే అప్పటికి ఇంకా కామెంట్లు లేవు “మినిమం 20 కామెంట్లు” అనుకున్నా. ఇప్పుడొస్తే అదే జరిగింది.

  ఉప్మాలూ, చాక్లెట్లు, పుచ్చకాయలు ఈ రోజుల్లొ చాలా ఫేమస్. ఏంటో ఇవన్నీ యూతే రాస్తున్నారు.

  — విహారి

 41. పోకిరి సినిమా ప్రివ్యూ చూసిన కృష్ణని మహేష్ బాబు “నాన్నా సినిమా ఎలావుంది?” అని అడిగితే.”ఇది 40 కోట్ల సినిమా రా” అన్నాడట.ఈ టపా ప్రివ్యూ చదవగానే అంటే అప్పటికి ఇంకా కామెంట్లు లేవు “మినిమం 20 కామెంట్లు” అనుకున్నా. ఇప్పుడొస్తే అదే జరిగింది. ఉప్మాలూ, చాక్లెట్లు, పుచ్చకాయలు ఈ రోజుల్లొ చాలా ఫేమస్. ఏంటో ఇవన్నీ యూతే రాస్తున్నారు.– విహారి

 42. ప్రవీణ్ గార్లపాటి said,

  @ ప్రదీపు, rsg:
  ఊ మరదే… తాగని వాడంటే అందరికీ చిన్నచూపే.
  మీలాంటి బకరాలెవరో వైన్ చాక్లెట్లిస్తే అదీ అవుద్ది 🙂

  @ oremuna:
  అక్కడ కాదు కానీ చాలా చోట్ల ట్రై చేసా…
  కార్నర్ హౌజ్ లో DBC లాగే దీనికీ ప్రత్యేక టేస్టేమో…
  కానీ అన్ని చాక్లెట్టు టేస్టులూ ఒకటి కాదు. నిజమే

  @ శ్రీ:
  భలే! సేం టు సేం అనుభవం….

  @ కొత్త పాళీ గారు:
  తింటున్నప్పుడు మాకవన్నీ గుర్తు రావు 🙂
  మీ వాడి పరిస్థితి పాపం “సొమ్మొకడిది, సోకొకడిది”

  @ శ్రీను గారు:
  మీరు స్పీడు పోస్టు బదులు రిజిస్టర్డ్ చేసినట్టున్నారు… మరదే

  @ దిలీప్ గారు:
  మా జట్టులోకి రావాలంటే మీరింకా కష్టపడాలి …

  @ అశ్విన్:
  ఊ… అప్పుడే వోడ్కా రుచి పట్టేసిందా నీకు ??
  ప్చ్… ఏం చేస్తాం

  @ raj:
  మరే రెండు పళ్ళు ఫిల్లింగు లేటెస్టు కౌంటు నాది…
  మీరు నా టీం మెంబరయిపోయారు

  @ వేణూ శ్రీకాంత్ :
  తినాల్సిన చోట తినాలి… చేదు కూడా మధురమే చాక్లెట్టు విషయంలో 😉

  @ cbrao గారు:
  ఓ! మీరు విస్కీ బ్రాండా ??
  చిరంజీవి, బాలకృష్ణా దోశలా ? ఏంటో ఇవి కూడా బాంబులూ కత్తుల్లా పేలతాయో ఏమిటో ?

  @ రాధిక గారు:
  మీరు నా టపా రెండు సార్లు చదువుకోవచ్చు 🙂
  మహా లాక్టో బాగుంటుంది కదూ… గట్టి చాక్లెట్లలో ఇది మంచిది.
  స్లిమ్‌… దేవుడు నాకు ప్రసాదించిన వరం 😛

  @ srikanth గారు:
  మ్‌… ఊరిస్తూ నా చాక్లెట్టే అవగొట్టేస్తారా ? హన్నా…
  మీ ఆగస్టు 15 బాపతే నే కూడా 😉

  @ lalitha గారు, srividya గారు:
  నాటపాలో లాజిక్కులు లాగి తప్పించుకుంటారా ?? మ్‌…

  @ పూర్ణిమ:
  మీరు నా క్లోజెస్టు ఫ్రెండు అయితే.
  మీ చాక్లెట్లన్నీ నావే ఎంచగ్గా…

  @ మేధ గారు:
  మీలాంటి వారికోసం ప్రత్యేక రాయితీ. నా టపా ఫ్రీ… 🙂

  @ చైతన్య గారు:
  చాక్లెట్టు తిననందుకు మీకు శిక్షగా మిమ్మల్ని చాక్లెట్టు టాంకులో ముంచాల్సిందే…

  @ kiran గారు:
  ఐ లైక్ దట్ ఐడియా… చిన్నప్పుడు రాపర్లు దాయటం నాక్కూడా భలే సరదా.
  మీ కలెక్షన్ చూడాల్సిందే.

  @ విహారి గారు:
  అమ్మ! మీరు ఫోర్‌కాస్టింగు సూపరనుకుంట కానీ మీకు బ్లాగు ఆస్థాన విదూషకుడి పదవితో పాటూ జ్యోతిష్య పదవీ కట్టబెట్టాల్సిందే.

 43. @ ప్రదీపు, rsg:ఊ మరదే… తాగని వాడంటే అందరికీ చిన్నచూపే.మీలాంటి బకరాలెవరో వైన్ చాక్లెట్లిస్తే అదీ అవుద్ది :-)@ oremuna:అక్కడ కాదు కానీ చాలా చోట్ల ట్రై చేసా…కార్నర్ హౌజ్ లో DBC లాగే దీనికీ ప్రత్యేక టేస్టేమో…కానీ అన్ని చాక్లెట్టు టేస్టులూ ఒకటి కాదు. నిజమే@ శ్రీ:భలే! సేం టు సేం అనుభవం….@ కొత్త పాళీ గారు:తింటున్నప్పుడు మాకవన్నీ గుర్తు రావు :)మీ వాడి పరిస్థితి పాపం “సొమ్మొకడిది, సోకొకడిది”@ శ్రీను గారు:మీరు స్పీడు పోస్టు బదులు రిజిస్టర్డ్ చేసినట్టున్నారు… మరదే @ దిలీప్ గారు:మా జట్టులోకి రావాలంటే మీరింకా కష్టపడాలి …@ అశ్విన్:ఊ… అప్పుడే వోడ్కా రుచి పట్టేసిందా నీకు ??ప్చ్… ఏం చేస్తాం@ raj:మరే రెండు పళ్ళు ఫిల్లింగు లేటెస్టు కౌంటు నాది…మీరు నా టీం మెంబరయిపోయారు@ వేణూ శ్రీకాంత్ :తినాల్సిన చోట తినాలి… చేదు కూడా మధురమే చాక్లెట్టు విషయంలో ;)@ cbrao గారు:ఓ! మీరు విస్కీ బ్రాండా ??చిరంజీవి, బాలకృష్ణా దోశలా ? ఏంటో ఇవి కూడా బాంబులూ కత్తుల్లా పేలతాయో ఏమిటో ?@ రాధిక గారు:మీరు నా టపా రెండు సార్లు చదువుకోవచ్చు :-)మహా లాక్టో బాగుంటుంది కదూ… గట్టి చాక్లెట్లలో ఇది మంచిది.స్లిమ్‌… దేవుడు నాకు ప్రసాదించిన వరం :P@ srikanth గారు:మ్‌… ఊరిస్తూ నా చాక్లెట్టే అవగొట్టేస్తారా ? హన్నా…మీ ఆగస్టు 15 బాపతే నే కూడా ;)@ lalitha గారు, srividya గారు:నాటపాలో లాజిక్కులు లాగి తప్పించుకుంటారా ?? మ్‌…@ పూర్ణిమ:మీరు నా క్లోజెస్టు ఫ్రెండు అయితే.మీ చాక్లెట్లన్నీ నావే ఎంచగ్గా…@ మేధ గారు:మీలాంటి వారికోసం ప్రత్యేక రాయితీ. నా టపా ఫ్రీ… :)@ చైతన్య గారు:చాక్లెట్టు తిననందుకు మీకు శిక్షగా మిమ్మల్ని చాక్లెట్టు టాంకులో ముంచాల్సిందే…@ kiran గారు:ఐ లైక్ దట్ ఐడియా… చిన్నప్పుడు రాపర్లు దాయటం నాక్కూడా భలే సరదా.మీ కలెక్షన్ చూడాల్సిందే.@ విహారి గారు:అమ్మ! మీరు ఫోర్‌కాస్టింగు సూపరనుకుంట కానీ మీకు బ్లాగు ఆస్థాన విదూషకుడి పదవితో పాటూ జ్యోతిష్య పదవీ కట్టబెట్టాల్సిందే.

 44. అశ్విన్ బూదరాజు said,

  అయ్యో ప్రవీణ్….తప్పట్లేదు.
  అసలు ఎక్కడున్నా మన విహారీ రూటే సపరేటు…
  ఆ కామెంట్ రాసే తీరే వేరు
  ఆరుపులు

 45. అయ్యో ప్రవీణ్….తప్పట్లేదు. అసలు ఎక్కడున్నా మన విహారీ రూటే సపరేటు… ఆ కామెంట్ రాసే తీరే వేరుఆరుపులు

 46. మీనాక్షి said,

  నా..చాక్లెట్ అందిందా…ప్రవీణ్ గారు
  ……………

 47. నా..చాక్లెట్ అందిందా…ప్రవీణ్ గారు……………

 48. రవి said,

  చాక్లెటోపాఖ్యానం లిండ్ట్,టోబ్లర్ లా ఉంది. అయితే, వైన్ చాక్లెట్ ను యాక్ అనడం, తీవ్రంగా ఖండిస్తున్నాను, అధ్యక్షా!

 49. రవి said,

  చాక్లెటోపాఖ్యానం లిండ్ట్,టోబ్లర్ లా ఉంది. అయితే, వైన్ చాక్లెట్ ను యాక్ అనడం, తీవ్రంగా ఖండిస్తున్నాను, అధ్యక్షా!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: