ఆగస్ట్ 16, 2008

Context is everything !

Posted in అనుభవాలు, ఆలోచనలు, కాంటెక్స్టు, నేపథ్యం వద్ద 8:53 ఉద. ద్వారా Praveen Garlapati

నేపథ్యం. ఎందుకో “కాంటెక్స్ట్” అన్న పదానికి నేపథ్యం అంత దగ్గరగా అనిపించట్లేదు. నా టపా టైటిలుని “నేపథ్యంలోనే ఉందంతా …” అని పెడదామనుకున్నా… కానీ నా నేపథ్యం వల్లనేమో అది నాకు రుచించలేదు 🙂

ఇంతకీ ఈ టపా ఎందుకంటే నిన్న మాలతి గారి బ్లాగులో గురించి ప్రస్తావించడం, దానికి వ్యాఖ్య రాస్తూ దాని గురించి నేను ఆలోచించడం జరిగింది.
ఆ ఆలోచనలు అలా ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి.

అసలు నేపథ్యం అంటే ఏమిటి ? మనిషి విషయాలను అర్థం చేసుకోవడంలో దాని పాత్ర ఎందుకు ఉంది, ఎంతవరకూ ఉంది ? అనే ఆలోచనలు మొదలయ్యాయి.

ఒక మనిషి పెరుగుతున్నప్పుడు అతని చుట్టూతా ఉన్న పరిసరాలు, పరిచయాలు, అనుభవాలు, అనుభూతులు, స్నేహాలు అన్నీ అతని వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి. ఆ ప్రయత్నంలో ఒక మనిషి అందరినీ తన మాటలతో ఆకట్టుకుంటూ, అందరికీ మంచి చేస్తూ, మంచి వాడిగా పేరు తెచ్చుకోవచ్చు. లేదా చెడు వైపుకి మొగ్గి, ఎవరికీ అర్థం కాని మూర్ఖుడిగా అవతరించవచ్చు.

అన్నట్టు ఇక్కడ మంచితనం, మూర్ఖత్వం కూడా ఆయా నేపథ్యాల ప్రకారమేనండోయ్. ఎందుకంటే నాకు మంచితనం అనిపించింది మరొకరికి చేతకానితనం లాగా అనిపించవచ్చు. నాకు మూర్ఖత్వం అనిపించింది ఇంకొకరికి పట్టుదలగా కనిపించవచ్చు. నాకు విపరీత ఆలోచనలు అనిపించినవి ఇంకొకరికి చాలా సాధారణ ఆలోచనలు కావచ్చు. అవన్నీ అలా ఆలోచించటానికి వారి నేపథ్యమే కారణమూ కావచ్చు.

ఉదా: ఫెమినిస్టుల ఆలోచనలు నాకు అర్థం కావు. మగవాళ్ళు పశువులు, ఆడవారిని హింసించడానికే పుట్టారు, ఆడవారిని అణగదొక్కటానికే వారున్నది అని వాదించే ఫెమినిస్టులంటే నాకు మా చెడ్డ చిరాకు. కొన్ని సార్లు వారు చెప్పేమాటలకి నాకు విపరీతంగా కోపం పుట్టుకొస్తుంది. ఏమిటి అసలు వీరు మగవాళ్ళలో మంచిని చూడనేలేరా ? అసలు ఇంత పెద్ద లోకంలో వీరికి మంచితనం ఉన్న మగవాళ్ళే కనిపించరా ? అనే ప్రశ్నలు నన్ను తొలుస్తాయి.
అయితే కొంత ఆలోచిస్తే నాకు తట్టేదేమిటంటే నా ఆలోచనలు నేను పెరిగిన నేపథ్యం, నా దృక్పథం వల్ల కావచ్చు. మా ఇంట్లో గానీ, నా చుట్టుపక్కల గానీ నేను ఇలాంటి మగవారిని ఎక్కువ చూసి ఉండకపోవచ్చు. అప్పుడు నేచురల్ గా నాకు ఎక్కువ మంచితనమే కనబడుతుంది. చెడు కనిపించదు.
అలాగే కుటుంబంలో పెత్తనం చలాయించే మగవారు ఉన్నారనుకోండి, భార్యని మానసికంగా/శారీరకంగా హింసించే భర్త ఉన్నాడనుకోండి వారికి ఈ ఫెమినిస్టుల రాతలు దగ్గరగా అనిపించవచ్చు. వారికి నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అని కూడా అనిపించవచ్చు.
ఆ నేపథ్యం గురించే నేను మాట్లాడేది.

మా సాఫ్టువేరు ఫీల్డులో ఒక జోకుంది. ఇద్దరు బిచ్చగాళ్ళు, ఇద్దరు సాఫ్టువేరు ఇంజినీర్లు కలిస్తే మాట్లాడుకునే ఒకే వాక్యం ఏమిటి అని ?
దానికి సమాధానం నువ్వే ప్లాటుఫారం మీద పని చేస్తున్నావు అని 🙂
అవును మరి ఇద్దరికీ ఈ ప్రశ్న ఒక్కటే దాని నేపథ్యమే వేరు.

ఇంకో నేపథ్యం చూద్దాము. బ్లాగుల్లో అస్పృశ్యత, అంటరానితనం గురించి మాట్లాడుతూ ఉంటారు జనాలు. నాకయితే ఇవేవీ ఈ లోకంలో లేవు అని అనిపిస్తుంది. దానికి కారణం నేను నగరాల్లో పెరగడం, ఓపెన్ మైండ్ ఉన్న తల్లిదండ్రుల పెంపకంలో పెరగడం, అవి పట్టించుకోని స్నేహితులుండడం కావచ్చు. అందుకని వారు చెప్పే విషయాలు వేటితోనూ నేను రిలేట్ కాలేను. ఆ బాధలు అర్థం చేసుకోలేను. కాకపోతే కొంచం ఆలోచన పెట్టగలిగితే వారి వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం మాత్రం చెయ్యగలను.
మరి అదే బ్లాగు చదివేవారిలో అలాంటి సంఘటనలు ఎదురయ్యి, అనుభవించిన వారున్నారనుకోండి వారు ఆ బ్లాగరి చెప్పేదానితో అద్భుతంగా రిలేట్ చేసుకోగలరు. అవే రాతలు వారిలో ఆవేశం కలిగించి ఇలాంటివి ఈ సమాజంలో రూపుమాపాలి అనే ఆలోచనలు కలిగించవచ్చు.
మరి ఇక్కడ ఎవరి ఆలోచన సరి ఎవరి ఆలోచన తప్పు ? ఇద్దరిదీనూ. ఎందుకంటే మొదటి వ్యక్తి అయిన నా దృక్పథంలో ఈ రెండో కోవకి చెందినవారిది తప్పు. రెండో కోవకి చెందినవారికి మూర్ఖుడనయిన, అర్థం చేసుకోలేకున్న నేను తప్పు.

మొన్నొక సంఘటన జరిగింది. ఒక బ్లాగులో నేను ఏదో విషయం గురించి సూటిగా నా అభిప్రాయం చెప్పాను. దానికి ఆ బ్లాగరి వ్యంగ్యంగా ఎత్తిపొడుపులతో నాకు సమాధానం ఇచ్చారు. నాకర్థం కాలేదు, అరే ఇంత నిజమయిన విషయం నేను ఇంత సూటిగా చెబుతుంటే ఆయన ఇంత మూర్ఖంగా ఎందుకు సమర్థించుకుంటున్నారు ? అని నాకు కొంతసేపు చాలా కోపం వచ్చింది.
కానీ కొద్దిసేపు శాంతంగా ఆలోచిస్తే నాకు సమాధానం తట్టింది. నా నేపథ్యం, ఆ బ్లాగరి నేపథ్యం వేరు కావచ్చు. నాకున్న విలువలు, నాకున్న అనుభవాలు ఆయనతో పోలిస్తే వేరు అయి ఉండవచ్చనే ఆలోచన రాగానే విషయం అర్థమయింది.
నేను పెరిగింది ఒక మిడిల్ క్లాసు కుటుంబంలో, మామూలు జీవితంలో ఎదిగాను. ఆ తరువాత జీవితం స్థాయి ఎదిగినా నాలో చిన్నప్పటి నుంచీ నేను పెరిగిన ఆ వాతావరణం, నేపథ్యం నరనరానా జీర్ణించుకుపోయాయి. ఏదీ వృధా చెయ్యకూడదు, చెడు అలవాట్లు ఉండకూడదు, తల్లిదండ్రులని స్నేహితులుగా భావించాలి, అందరితోనూ కలుపుగోలుగా ఉండాలి, అనవసరమయిన గోడవల జోలికి పోకూడదు, ఎప్పుడూ నిజం చెప్పాలి లాంటి ఆలోచనలు నా నరనరానా జీర్ణించుకుపోయాయి. అలాగే కొంత ఇంట్రావర్టుగా ఉండడం, కొత్తవారితో అంత తొందరగా కలుపుగోలుగా మాట్లాడలేకపోవడం లాంటివీ నా నేపథ్యం నుంచి వచ్చి ఉండవచ్చు.
అదే ఆ బ్లాగరి పెరిగిన నేపథ్యం వేరు అయి ఉండవచ్చు. నేను విభేదించిన విషయం వారి సర్కిల్లో అతి సామాన్యం అయి ఉండవచ్చు. అదసలు తప్పుగానే కనిపించకపోవచ్చు. అందుకనే ఆయనకి నా ఆలోచనలు ఏ పురాతన కాలం నాటివి అనిపించి ఉండవచ్చు అని.
అలా ఆలోచించిన తరువాత నేను తిరిగి వ్యాఖ్య రాయడం మానుకున్నాను. ఎందుకంటే ఎంత సేపు అక్కడ వాదులాడినా ఎవరి విషయం వారికి సరి అనే అనిపిస్తుంది. మరి నేపథ్యం మహత్యం అది.

సరే ఇవి ఇలాగుంటే ఇంకొన్ని సార్లు మన నేపథ్యం కొన్ని విషయాలను అర్థం చేసుకోనివ్వదు. అదెలాగంటే మాలతి గారి బ్లాగులో నేను చెప్పినట్టు కొన్ని కథలు నాకు అర్థం కావు. వాటి భావం, వాటి వెనకున్న ఆంతర్యం నాకు అంతుపట్టదు. అసలు ఆ రచయిత అలా ఎందుకు రాస్తున్నాడో నాకర్థమే కాదు.
ఉదా: వితంతువు వివాహాలు, కన్యాశుల్కం ఇలాంటి వాటి మీద రచనలు చదివినప్పుడు (తక్కువే అనుకోండి). అప్పుడు నేను అవి అంత తొందరగా అర్థం చేసుకోలేను. వాటి గురించి చదివీ, ఆ రచన జరిగిన కాలంలో సంఘటనలు, మనుషుల స్వభావాలు, పరిస్థితుల గురించి ఒక అవగాహన ఏర్పరచుకున్న తరువాత ఆ రచన నేను కొంత అర్థం చేసుకోగలుగుతాను.

అలాగే రాబిన్ కుక్ నవలలు చదవటం మొదలుపెట్టినప్పుడు మామూలు జనాలకు అవి అంతగా నచ్చవు. ఎందుకంటే ఆయన రాసేది మెడిసిన్ నేపథ్యమున్న నవలలు. వాటిలోని విశేషాలను కథలో మిళితం చేసి నవలలు రచిస్తారు. అవి పూర్తిగా అర్థమవాలంటే ఎంతో కొంత ఆ నేపథ్యం అవసరం. మొదట నాకు ఎక్కలేదు ఆ కథలు, తర్వాత వేరు కారణాల వల్ల ఆసక్తి కలిగి చదవడం మొదలుపెట్టాను. ఆ విషయాల గురించి కొంత నేర్చుకున్నాను. ఇప్పుడు బాగానే నచ్చుతాయి.

నా ఆంగ్ల సినిమా ప్రస్థానంలోనూ నేపథ్యం పాత్ర ఉంది. మొదట్లో నేను పెరుగుతున్న వయసులో, కాలేజీలో నాకసలు ఆంగ్ల చిత్రాలు ఎక్కేవి కావు. ఎందుకంటే నాకు వారి ఆచారాలు, వ్యవహారాలు, సిట్యువేషను పరంగా ఉండే కామెడీ అర్థమయేవి కావు. ఆ యాక్సెంటూ అర్థమయేది కాదు.
కానీ తరవాత్తర్వాత నా పరిధి విస్తరించింది. వివిధ ఆంగ్ల పుస్తకాలు, నవలలూ చదవటం మొదలుపెట్టాను ఇంజినీరింగులో ఉండగా. అందులోని భాష, పద్ధతులు, ఆచార వ్యవహారాలు కొద్ది కొద్దిగా తెలియడం మొదలయింది. అవి తెలిసిన తర్వాత చూసిన సినిమాలు అంతకు ముందుకన్నా బాగా అర్థమవడం మొదలయింది. ఇంకొన్నాళ్ళు గడిచిన తరువాత ఉద్యోగంలో చేరాను. అక్కడ పని తీరు (తెచ్చిపెట్టుకున్నది అయినా సరే), పాశ్చాత్యాలలో ఉన్న సహచరులతో మెలగడం, అక్కడ గుడారం వేసుకున్న స్నేహితుల ద్వారాను విషయాలు తెలిసిన తరువాత (బేబీ షవరు, బాచిలర్స్ పార్టీ చేసుకున్న స్నేహితులు ఉన్నారు నాకు), అంతర్జాలం ద్వారా ఆ విషయాలు నాకు మరింత బాగా అర్థమవడం మొదలయింది. ఇప్పుడు ఆంగ్ల సినిమాలను బాగా అర్థం చేసుకుని చూడగలను.

అందుకనే ఒక విషయం మీద తీర్పు ఇచ్చే ముందు దాని నేపథ్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. (కోర్టు వారు హత్యని మర్డర్ గానూ, సెల్ఫ్ డిఫెన్సు గానూ నేపథ్యం బట్టి ఎలా తీర్పిస్తారో అలాగన్నమాట)
కానీ ఎంతయినా మనుషులమే కదా ! మన రియాక్షను స్ప్లిట్ సెకన్లలో ఉన్నప్పుడు అన్ని సార్లూ ఇవన్నీ ఆలోచించగలగడం కష్టమే. కానీ సాధ్యమయిన చోట ఈ విధానంలో ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యవచ్చు.

అన్నిటినీ నేపథ్యమే కారణం కాదు గానీ మన జీవితంలో నేపథ్యం తిరుగులేని పాత్ర పోషిస్తుందన్నది మాత్రం నిజం.

26 వ్యాఖ్యలు »

 1. మాలతి said,

  ప్రవీణ్ గారూ, చాలా చాలా ఆలస్యంగా మీ పోస్టు చూడడం జరిగింది. మీరు పెరిగిన వాతావరణంలాటిదే నేను పెరిగిన వాతావరణం కూడా. కొన్ని రచనలకి నాస్పందన కూడా మీరు చెప్పినట్టే వుంటుంది. బాగా వివరించారు. ఈవిషయాలు వ్యాఖ్యలు రాసేవారు కూడా గమనిస్తే, స్ఫూర్చినిచ్చే వ్యాఖ్యలు వచ్చే అవకాశం వుంది.
  అభినందనలతో
  మాలతి

 2. ప్రవీణ్ గారూ, చాలా చాలా ఆలస్యంగా మీ పోస్టు చూడడం జరిగింది. మీరు పెరిగిన వాతావరణంలాటిదే నేను పెరిగిన వాతావరణం కూడా. కొన్ని రచనలకి నాస్పందన కూడా మీరు చెప్పినట్టే వుంటుంది. బాగా వివరించారు. ఈవిషయాలు వ్యాఖ్యలు రాసేవారు కూడా గమనిస్తే, స్ఫూర్చినిచ్చే వ్యాఖ్యలు వచ్చే అవకాశం వుంది. అభినందనలతోమాలతి

 3. కత్తి మహేష్ కుమార్ said,

  ప్రవీణ్ గారూ, మీరు ఆలొచించిన విషయం నూటికినూరుపాళ్ళూ సరైనదే! నేఫధ్యాన్నిబట్టి మనుషుల చరిత్రలు,భావాలూ,ఆలోచనలు,అభిప్రాయాలూ ఏర్పడుతాయి. వాటినిబట్టే మన పరిధులు నిర్ణయింపబడుతాయి.

  అందుకే theory of relativity నేపధ్యంలో reader based interpretaions సాహిత్యంలో వచ్చాయి.తప్పొప్పులనేవి సమసిపోయి,”నీ దృకపధం నా ధృక్పధం” మాత్రం మిగిలాయి.

 4. ప్రవీణ్ గారూ, మీరు ఆలొచించిన విషయం నూటికినూరుపాళ్ళూ సరైనదే! నేఫధ్యాన్నిబట్టి మనుషుల చరిత్రలు,భావాలూ,ఆలోచనలు,అభిప్రాయాలూ ఏర్పడుతాయి. వాటినిబట్టే మన పరిధులు నిర్ణయింపబడుతాయి.అందుకే theory of relativity నేపధ్యంలో reader based interpretaions సాహిత్యంలో వచ్చాయి.తప్పొప్పులనేవి సమసిపోయి,”నీ దృకపధం నా ధృక్పధం” మాత్రం మిగిలాయి.

 5. చిలమకూరు విజయమోహన్ said,

  చాలా బాగా వ్రాశారు.ప్రతి ఒక్కరు ఎదుటివారికోణం నుంచి ఆలోచిస్తే అసలు సమస్యే వుండదు.

 6. చాలా బాగా వ్రాశారు.ప్రతి ఒక్కరు ఎదుటివారికోణం నుంచి ఆలోచిస్తే అసలు సమస్యే వుండదు.

 7. సూర్యుడు said,

  The same concept is very well explained in Stephen Covey’s “The Seven Habits Of Highly Effective People”. He calls it as a frame of reference 🙂

  You too have explained it very well.

 8. The same concept is very well explained in Stephen Covey’s “The Seven Habits Of Highly Effective People”. He calls it as a frame of reference :-)You too have explained it very well.

 9. రవి said,

  నా ఉద్దేశ్యం ప్రకారం, మనకు ఏ విషయమైనా నచ్చకపోతే, ఆ విషయం గురించి వ్యాఖ్యానించే ముందు ఓ ౨ విషయాలు ఆలోచించుకోవడం ఉత్తమం.

  ౧. మన వ్యాఖ్య స్వీకరించే వ్యక్తి ఎలాంటి వాడు? తను ఆ వ్యాఖ్య ను స్వీకరించగలడా? అతను మీ అభిప్రాయాన్ని ఖండించనీ/విభేదించనీ లేదూ స్వీకరించనీ, అయితే basic గా తను మన వ్యాఖ్య ను సహృదయంగా స్వీకరిస్తాడా?

  ౨. మన అభిప్రాయం అవతల వ్యక్తి మనసు నొప్పించే అవకాశం ఉందా?

  పై రెండు thumb rules నేను పాటించేవి.

  ఇంకో extreme case :ఒక్కోసారి, అవతల వ్యక్తి తో మనం తీవ్రంగా విభేదించిన తర్వాత కూడా (due to some weak moment)మనం తనకు క్షమాపణో, లేదూ, ఓ సారీ నో చెబితే, ఆ వ్యక్తి నవ్వేసి, జరిగింది మర్చిపోగలిగితే పర్లేదు.

  వీటికి అవతల మనం ఒకరిని వ్యాఖ్యానించడం లేదా, మన అభిప్రాయం చెప్పడం శుద్ధ నిరుపయోగం…ఇది నా అభిప్రాయం.

  సరే…లెక్చర్ సంగతికేం గానీ, కొంత మంది బయటకు extroverts గా కనిస్పిస్తూనే introverts గా ఉంటారు. ఉదా : ప్రవీణ్, రవి (నేను)…:-)

 10. రవి said,

  నా ఉద్దేశ్యం ప్రకారం, మనకు ఏ విషయమైనా నచ్చకపోతే, ఆ విషయం గురించి వ్యాఖ్యానించే ముందు ఓ ౨ విషయాలు ఆలోచించుకోవడం ఉత్తమం.౧. మన వ్యాఖ్య స్వీకరించే వ్యక్తి ఎలాంటి వాడు? తను ఆ వ్యాఖ్య ను స్వీకరించగలడా? అతను మీ అభిప్రాయాన్ని ఖండించనీ/విభేదించనీ లేదూ స్వీకరించనీ, అయితే basic గా తను మన వ్యాఖ్య ను సహృదయంగా స్వీకరిస్తాడా?౨. మన అభిప్రాయం అవతల వ్యక్తి మనసు నొప్పించే అవకాశం ఉందా? పై రెండు thumb rules నేను పాటించేవి. ఇంకో extreme case :ఒక్కోసారి, అవతల వ్యక్తి తో మనం తీవ్రంగా విభేదించిన తర్వాత కూడా (due to some weak moment)మనం తనకు క్షమాపణో, లేదూ, ఓ సారీ నో చెబితే, ఆ వ్యక్తి నవ్వేసి, జరిగింది మర్చిపోగలిగితే పర్లేదు.వీటికి అవతల మనం ఒకరిని వ్యాఖ్యానించడం లేదా, మన అభిప్రాయం చెప్పడం శుద్ధ నిరుపయోగం…ఇది నా అభిప్రాయం.సరే…లెక్చర్ సంగతికేం గానీ, కొంత మంది బయటకు extroverts గా కనిస్పిస్తూనే introverts గా ఉంటారు. ఉదా : ప్రవీణ్, రవి (నేను)…:-)

 11. gsnaveen said,

  వావ్, చాలా మంచి విషయం చెప్పావు. దీని మీద ఇంకా చర్చ జరగాలి. ఇలాంటి టపాలు ఇంకొన్ని వ్రాయి.

 12. gsnaveen said,

  వావ్, చాలా మంచి విషయం చెప్పావు. దీని మీద ఇంకా చర్చ జరగాలి. ఇలాంటి టపాలు ఇంకొన్ని వ్రాయి.

 13. tetageeti said,

  నేపథ్యం ప్రాముఖ్యత ఎవరూ కాదనలేనిది. ఐతే నేపథ్యం ఎప్పటికీ “relative moralismకి” మాత్రం దారి తీయకూడదు. తప్పొప్పులు లేవూ అనేది post modern సాహిత్యం వెర్రి తలలు వేయడం వల్ల పుట్టిన concept. There are still a few absolute rights and wrongs. బాగా రాశారు.

  -మురళి

 14. tetageeti said,

  నేపథ్యం ప్రాముఖ్యత ఎవరూ కాదనలేనిది. ఐతే నేపథ్యం ఎప్పటికీ “relative moralismకి” మాత్రం దారి తీయకూడదు. తప్పొప్పులు లేవూ అనేది post modern సాహిత్యం వెర్రి తలలు వేయడం వల్ల పుట్టిన concept. There are still a few absolute rights and wrongs. బాగా రాశారు.-మురళి

 15. Aruna said,

  ఆ వ్యాఖ్య ని చూసాక నాకు కూడా చాలా బాధ వేసింది ఫ్రవీణ్. ఇదేంటి ఇలాంటి జవాబు అనుకున్నాను. మానసిక పరిణితిని బట్టి మనుషుల ప్రవర్తన, మాట తీరు వుంటాయి. అదే అనుకుని సైలెంటు అయిపోయాను.

 16. Aruna said,

  ఆ వ్యాఖ్య ని చూసాక నాకు కూడా చాలా బాధ వేసింది ఫ్రవీణ్. ఇదేంటి ఇలాంటి జవాబు అనుకున్నాను. మానసిక పరిణితిని బట్టి మనుషుల ప్రవర్తన, మాట తీరు వుంటాయి. అదే అనుకుని సైలెంటు అయిపోయాను.

 17. Purnima said,

  చాలా ఆలస్యంగా ఈ టపా చూశాను. Better late than never!!

  ఈ విషయమై నేను చెప్పాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. కానీ, అన్నింటికన్నా ముందు ఈ విషయాన్ని మీరు వివరించిన తీరు భలే బాగా నచ్చింది. కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా, మీ మాటల్లో తేలిగ్గా అనిపించింది. 🙂 (అంటే మరీ అర్దం చేసుకోడానికే చాలా సమయం పట్టలేదు అని. )

  మీరన్న ఆ నేపధ్యం సమస్య నాకూ ఎదురయ్యింది. ఈ బ్లాగ్లోకంలో ముఖ్యంగా!! బ్లాగులను ఇష్టపడడానికి ఇదో కారణమేమో!! నా స్నేహితులతో కానీ, మా ఇంట్లో కానీ “కులం” గురించో, “ఆడవారి అసహాయత” గురించో అరవీరభయంకరంగా చర్చించుకునే సీను లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎంత కాదనుకున్నా, మాదంతా ఒకటే నేపధ్యం కదా!! బ్లాగుల్లోకి వచ్చాక నా పరిధిని విస్తరించుకునే అవకాశం వచ్చిందనను కానీ, కాస్త అయినా అటు వైపుగా నడక మొదలయ్యిందేమో అనిపిస్తుంది. May be I can now think of empathizing somethings, that didn’t even existed for me before. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సానుభూతిలోనూ, లేక సహానుభూతిలోనూ కూడా నా “స్పందన” నా నేపధ్యానికి అనుగుణంగానే ఉంటుంది. ఉదా: నాకు మనుషుల మీదే నమ్మకం ఎక్కువ, వారు కట్టుకున్న గోడల కన్నా!!

  కాస్త చొరవ తీసుకుంటానని మీకనిపించినా, నా అనుభవం ఒకటి మీతో పంచుకోవాలని ఉంది. అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను. “అన్నిటినీ నేపథ్యమే కారణం కాదు గానీ..” అని మీరే అన్నారు కావున చెప్తున్నాను.

  మీ టపా బట్టి మీ, నా నేపధ్యం ఎంచుమించు ఒకేలా ఉందని చెప్పచ్చు. కాబట్టి మీ, నా ఆలోచనా తీరు కూడా కలిసే అవకాశం ఎక్కువే!! తాగేవారంటే నాకదో రకమైన హేయ భావం ఉండేది. పొగ తాగేవారంటే మరీ దారుణంగా!! వారితో పాటు చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం కూడా చెడగొడుతున్నారని వారి మీద ద్వేషం. ఎంతగా అంటే ఒక ఉదా, చెప్తాను. నేను నా తొలి ఉద్యోగాన్ని ఎంచుకోవాటానికి కారణమే ఆ కంపెనీ డైరెక్టరు. నాకు నచ్చిన ఫీల్డులో ఆయనది అందవేసిన చేయి. మాస్టర్. ఆ కంపెనీ అనగానే కళ్ళు మూసుకుని జాయిన్ అయ్యా!! జాయినింగ్ అప్పుడే వారితో మాట్లాడాలి, కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. తర్వాత ఎప్పుడో ఆయన్నిమొదటి సారి చూసినప్పుడు, he was smoking!! అంతే అప్పటినుండి I’ve shut all the gates for him. ఎదురుపడితే తప్పనిసరిగా ఎవరినైనా పలకరించే నేను, ఆయన్ని చూడగానే ముఖం తిప్పేసుకునేదాన్ని. ముందో వెనుకో ఉన్న మనిషిని పలకరించేదాన్ని కానీ, వారే పలకరించినా సమాధానం చెప్పనంతగా ప్రవర్తించేదాన్ని!!

  మా టీం లో ఒక సీనియర్ ఒకరు ఉన్నారు. నేను తడబడుతున్న ప్రతీ సాయం చేయడానికే ఉన్నారా అని అనిపించేది, చాలా నేర్చుకున్నాను తన దగ్గర నుండీ!! He was such a strong strength for me!! అటు తర్వాత కొత్తగా ఒక అబ్బాయి చేరాడు. నా గురించి ఏమీ తెలీదింకా అతనికి. ఏదో ముఖ పరిచయం తప్ప. కానీ ఆఫీసులో ఏవో పాలిటిక్స్ జరుగుతుంటే, తను వాటిని ఖచ్చితంగా ఖండించాడు. ఏ మాత్రం సాయం చేయను ఆ గేం కి గట్టిగా చెప్పాడు. ఆ అబ్బి మీద గౌరవం ఒక స్థాయిలో పెరిగిందని చెప్పక్కరలేదు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ స్మోకర్స్ అని తెలిసింది. “అయ్యో” అన్న ఫీలింగ్ వచ్చిందేమో, తెలీదు కానీ, ద్వేషం మాత్రం కలుగలేదు. ఎంతగా ప్రయత్నించినా!! 🙂 (నేపధ్య ప్రభావం ఏమో, అందుకే ప్రయత్నమేమో) అయినా వారిద్దరూ ఇప్పుడు నా స్నేహితులని అంతే నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను.

  అంతకు మునుపు ఆ అలవాటున్న ప్రతీ వ్యక్తినీ విమర్శించేదాన్ని!! ఇప్పుడా అలవాటును మాత్రమే విమర్శిస్తాను. Had I not met these two, I’m sure I would have commented entirely differently to this post!! 🙂 మీకు ఇంగ్లీషు సినిమాలు నచ్చుతున్నట్టే నాకు వీళ్ళూ నచ్చుతున్నారు.

  నేపధ్యం కాకుండా మన ఆలోచనలని ప్రభావితం చేసేది, ఇలాంటి అనుభావాలేనేమో. నేనింత పెద్ద వ్యాఖ్య చేయడం చాలా అరదు. ఇబ్బంది కలిగించలేదు అనే అనుకుంటున్నాను. మీరు రాసిన తీరు నా చేత ఇలా రాయించింది మరి!!

  (ఊ, వ్యాఖ్యలో ఆంగ్ల పదాలు బాగానే దొర్లాయి!! నా నేపధ్యం అర్ధం చేసుకోమని ప్రార్ధన!! 😉 )

 18. Purnima said,

  చాలా ఆలస్యంగా ఈ టపా చూశాను. Better late than never!! ఈ విషయమై నేను చెప్పాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. కానీ, అన్నింటికన్నా ముందు ఈ విషయాన్ని మీరు వివరించిన తీరు భలే బాగా నచ్చింది. కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా, మీ మాటల్లో తేలిగ్గా అనిపించింది. 🙂 (అంటే మరీ అర్దం చేసుకోడానికే చాలా సమయం పట్టలేదు అని. )మీరన్న ఆ నేపధ్యం సమస్య నాకూ ఎదురయ్యింది. ఈ బ్లాగ్లోకంలో ముఖ్యంగా!! బ్లాగులను ఇష్టపడడానికి ఇదో కారణమేమో!! నా స్నేహితులతో కానీ, మా ఇంట్లో కానీ “కులం” గురించో, “ఆడవారి అసహాయత” గురించో అరవీరభయంకరంగా చర్చించుకునే సీను లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎంత కాదనుకున్నా, మాదంతా ఒకటే నేపధ్యం కదా!! బ్లాగుల్లోకి వచ్చాక నా పరిధిని విస్తరించుకునే అవకాశం వచ్చిందనను కానీ, కాస్త అయినా అటు వైపుగా నడక మొదలయ్యిందేమో అనిపిస్తుంది. May be I can now think of empathizing somethings, that didn’t even existed for me before. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సానుభూతిలోనూ, లేక సహానుభూతిలోనూ కూడా నా “స్పందన” నా నేపధ్యానికి అనుగుణంగానే ఉంటుంది. ఉదా: నాకు మనుషుల మీదే నమ్మకం ఎక్కువ, వారు కట్టుకున్న గోడల కన్నా!! కాస్త చొరవ తీసుకుంటానని మీకనిపించినా, నా అనుభవం ఒకటి మీతో పంచుకోవాలని ఉంది. అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను. “అన్నిటినీ నేపథ్యమే కారణం కాదు గానీ..” అని మీరే అన్నారు కావున చెప్తున్నాను.మీ టపా బట్టి మీ, నా నేపధ్యం ఎంచుమించు ఒకేలా ఉందని చెప్పచ్చు. కాబట్టి మీ, నా ఆలోచనా తీరు కూడా కలిసే అవకాశం ఎక్కువే!! తాగేవారంటే నాకదో రకమైన హేయ భావం ఉండేది. పొగ తాగేవారంటే మరీ దారుణంగా!! వారితో పాటు చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం కూడా చెడగొడుతున్నారని వారి మీద ద్వేషం. ఎంతగా అంటే ఒక ఉదా, చెప్తాను. నేను నా తొలి ఉద్యోగాన్ని ఎంచుకోవాటానికి కారణమే ఆ కంపెనీ డైరెక్టరు. నాకు నచ్చిన ఫీల్డులో ఆయనది అందవేసిన చేయి. మాస్టర్. ఆ కంపెనీ అనగానే కళ్ళు మూసుకుని జాయిన్ అయ్యా!! జాయినింగ్ అప్పుడే వారితో మాట్లాడాలి, కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. తర్వాత ఎప్పుడో ఆయన్నిమొదటి సారి చూసినప్పుడు, he was smoking!! అంతే అప్పటినుండి I’ve shut all the gates for him. ఎదురుపడితే తప్పనిసరిగా ఎవరినైనా పలకరించే నేను, ఆయన్ని చూడగానే ముఖం తిప్పేసుకునేదాన్ని. ముందో వెనుకో ఉన్న మనిషిని పలకరించేదాన్ని కానీ, వారే పలకరించినా సమాధానం చెప్పనంతగా ప్రవర్తించేదాన్ని!! మా టీం లో ఒక సీనియర్ ఒకరు ఉన్నారు. నేను తడబడుతున్న ప్రతీ సాయం చేయడానికే ఉన్నారా అని అనిపించేది, చాలా నేర్చుకున్నాను తన దగ్గర నుండీ!! He was such a strong strength for me!! అటు తర్వాత కొత్తగా ఒక అబ్బాయి చేరాడు. నా గురించి ఏమీ తెలీదింకా అతనికి. ఏదో ముఖ పరిచయం తప్ప. కానీ ఆఫీసులో ఏవో పాలిటిక్స్ జరుగుతుంటే, తను వాటిని ఖచ్చితంగా ఖండించాడు. ఏ మాత్రం సాయం చేయను ఆ గేం కి గట్టిగా చెప్పాడు. ఆ అబ్బి మీద గౌరవం ఒక స్థాయిలో పెరిగిందని చెప్పక్కరలేదు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ స్మోకర్స్ అని తెలిసింది. “అయ్యో” అన్న ఫీలింగ్ వచ్చిందేమో, తెలీదు కానీ, ద్వేషం మాత్రం కలుగలేదు. ఎంతగా ప్రయత్నించినా!! 🙂 (నేపధ్య ప్రభావం ఏమో, అందుకే ప్రయత్నమేమో) అయినా వారిద్దరూ ఇప్పుడు నా స్నేహితులని అంతే నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. అంతకు మునుపు ఆ అలవాటున్న ప్రతీ వ్యక్తినీ విమర్శించేదాన్ని!! ఇప్పుడా అలవాటును మాత్రమే విమర్శిస్తాను. Had I not met these two, I’m sure I would have commented entirely differently to this post!! 🙂 మీకు ఇంగ్లీషు సినిమాలు నచ్చుతున్నట్టే నాకు వీళ్ళూ నచ్చుతున్నారు. నేపధ్యం కాకుండా మన ఆలోచనలని ప్రభావితం చేసేది, ఇలాంటి అనుభావాలేనేమో. నేనింత పెద్ద వ్యాఖ్య చేయడం చాలా అరదు. ఇబ్బంది కలిగించలేదు అనే అనుకుంటున్నాను. మీరు రాసిన తీరు నా చేత ఇలా రాయించింది మరి!! (ఊ, వ్యాఖ్యలో ఆంగ్ల పదాలు బాగానే దొర్లాయి!! నా నేపధ్యం అర్ధం చేసుకోమని ప్రార్ధన!! 😉 )

 19. ప్రవీణ్ గార్లపాటి said,

  నాకు నచ్చిన నా టపాలలో ఇదీ ఒకటి 🙂

  కొంత మందయినా దీనితో రిలేట్ చేసుకోగలిగారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
  వ్యాఖ్యానించిన అందరికీ కృతజ్ఞతలు.

  @ రవి:

  మీరు చెప్పిన సూచనలు నేను సాధారణంగా పాటిస్తాను. కానీ నా టపాలో చెప్పాను చూడండి అన్నివేళలా ఇంతలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి వీలవదు. అలాంటి వీక్ మూమెంట్స్ లో ఇలాంటి తప్పులు జరుగుతాయి.

  @ తేటగీతి:
  తప్పొప్పులు తప్పకుండా ఉన్నాయి. ఉదా: మొరాలిటీ, నిజాయితీ లాంటివాటికి తప్పొప్పులు నా ప్రకారం ఉన్నాయి.

  @ పూర్ణిమ గారు:
  మీరు సరిగా పట్టుకున్నారు. నేపథ్యం కూడా ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. మీ జీవితంలోని సంఘటనల పరంగా రూపొందిన నేపథ్యం మీకెదురవుతున్న అనుభవాల పరంగా మారుతూనే ఉంటుంది.
  కాబట్టి ఇవాళ నాకు చెత్త అనిపించిన విషయం రేపు అలాగే అనిపించాల్సిన అవసరం లేదు.

  మనుషుల స్వభావాల మీద రీసెర్చ్ లు చేసి పీహెచ్డీలు చేసాసారు జనాలు. అవి అంత సులభంగా లొంగేవి కాదు లెండి. 🙂 వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉంది కిటుకంతా.

 20. నాకు నచ్చిన నా టపాలలో ఇదీ ఒకటి :-)కొంత మందయినా దీనితో రిలేట్ చేసుకోగలిగారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.వ్యాఖ్యానించిన అందరికీ కృతజ్ఞతలు.@ రవి:మీరు చెప్పిన సూచనలు నేను సాధారణంగా పాటిస్తాను. కానీ నా టపాలో చెప్పాను చూడండి అన్నివేళలా ఇంతలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి వీలవదు. అలాంటి వీక్ మూమెంట్స్ లో ఇలాంటి తప్పులు జరుగుతాయి.@ తేటగీతి:తప్పొప్పులు తప్పకుండా ఉన్నాయి. ఉదా: మొరాలిటీ, నిజాయితీ లాంటివాటికి తప్పొప్పులు నా ప్రకారం ఉన్నాయి.@ పూర్ణిమ గారు:మీరు సరిగా పట్టుకున్నారు. నేపథ్యం కూడా ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. మీ జీవితంలోని సంఘటనల పరంగా రూపొందిన నేపథ్యం మీకెదురవుతున్న అనుభవాల పరంగా మారుతూనే ఉంటుంది.కాబట్టి ఇవాళ నాకు చెత్త అనిపించిన విషయం రేపు అలాగే అనిపించాల్సిన అవసరం లేదు.మనుషుల స్వభావాల మీద రీసెర్చ్ లు చేసి పీహెచ్డీలు చేసాసారు జనాలు. అవి అంత సులభంగా లొంగేవి కాదు లెండి. 🙂 వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉంది కిటుకంతా.

 21. Japes said,

  I agree with you about ‘context’.. but let me stray on the topic ..

  “ఫెమినిస్టుల ఆలోచనలు నాకు అర్థం కావు. మగవాళ్ళు పశువులు, ఆడవారిని హింసించడానికే పుట్టారు, ఆడవారిని అణగదొక్కటానికే వారున్నది అని వాదించే ఫెమినిస్టులంటే నాకు మా చెడ్డ చిరాకు.” andaru ‘+ists’ lo kuda ativaadulu untaru… ayite magavallanu pashuvulu annappudu ‘gummadi kaaya donga lekka’ manam enduku bhujam tadumukovale. the ‘context for those feminists is the ones that are rotten’. the only reason why i mentioned this topic is. i have seen this comment in one too many blogs to let it pass by.

  “అస్పృశ్యత, అంటరానితనం గురించి మాట్లాడుతూ ఉంటారు జనాలు” just because we dont see it, doesn’t mean it doesnt exist.

 22. Japes said,

  I agree with you about ‘context’.. but let me stray on the topic ..”ఫెమినిస్టుల ఆలోచనలు నాకు అర్థం కావు. మగవాళ్ళు పశువులు, ఆడవారిని హింసించడానికే పుట్టారు, ఆడవారిని అణగదొక్కటానికే వారున్నది అని వాదించే ఫెమినిస్టులంటే నాకు మా చెడ్డ చిరాకు.” andaru ‘+ists’ lo kuda ativaadulu untaru… ayite magavallanu pashuvulu annappudu ‘gummadi kaaya donga lekka’ manam enduku bhujam tadumukovale. the ‘context for those feminists is the ones that are rotten’. the only reason why i mentioned this topic is. i have seen this comment in one too many blogs to let it pass by.”అస్పృశ్యత, అంటరానితనం గురించి మాట్లాడుతూ ఉంటారు జనాలు” just because we dont see it, doesn’t mean it doesnt exist.

 23. ప్రవీణ్ గార్లపాటి said,

  @ జేప్స్ గారు:

  మీరు కొంచం అపార్థం చేసుకున్నారు నేను చెప్పే విషయాన్ని. నేను చెప్పింది ఒక పాఠకుడిగా విషయాలు అర్థం చేసుకోవడంలో కాంటెక్స్టు అనేది ఎంత బలమయిన ముద్ర వేస్తుందో చెప్పడానికే…

  పైన నేనిచ్చిన ఉదాహరణ ఒకరికి అతివాదంగా అనిపించిన రచన ఇంకొకరికి ఎందుకనిపించదో అని వివరించడానికి. అందులో ఒకరు తప్పు అనీ కాదు, ఇంకొకరు ఒప్పు అనీ కాదు.

  ఇక భుజాలు తడుముకోవటం అంటారా ? అది మానవ సహజం. ఉదాహరణకి ఒక ప్రాంతం యాస చెత్త అని ఎవరో అన్నారనుకోండి వారికి పిచ్చి కోపం రాదూ ?
  అలాగే జనరలైజు చేస్తూ మాట్లాడిన సంగతులు కోపం తెప్పించడం సాధారణం. అందులో వింతేమీ లేదు.

  ఇక అంటరానితనం లాంటివి అనుభవించడం ఒక స్థాయి అయితే అర్థం చేసుకోవడం ఇంకో స్థాయి. ఒకవేళ రచనలో ఆయా వాటి గురించి రాస్తే అవి అనుభవించిన వారు దానికి స్పందించే తీరు, ఒక మామూలు పాఠకుడిగా అర్థం చేసుకుని నేను స్పందించే తీరు వేరు వేరుగా ఉంటాయి. రెండు స్పందనలూ ఒకేలా ఉండవు.

  ఇక నా వ్యాసంలో పైవేవీ లేవు అని సూచిస్తూ నేను చెప్పలేదు. ఒకసారి ఆ కాంటెక్స్టు సరిగా చూడండి. నేను చెప్పింది వాటి గురించి చెబుతూన్న రచనలతో నేను ఎంత రిలేట్ చేసుకోగలను ? వారి దృక్పథం నుంచి ఆలోచిస్తే మెరుగ్గా ఎలా అర్థం చేసుకోగలను అని చెప్పాను అంతే.

 24. @ జేప్స్ గారు:మీరు కొంచం అపార్థం చేసుకున్నారు నేను చెప్పే విషయాన్ని. నేను చెప్పింది ఒక పాఠకుడిగా విషయాలు అర్థం చేసుకోవడంలో కాంటెక్స్టు అనేది ఎంత బలమయిన ముద్ర వేస్తుందో చెప్పడానికే…పైన నేనిచ్చిన ఉదాహరణ ఒకరికి అతివాదంగా అనిపించిన రచన ఇంకొకరికి ఎందుకనిపించదో అని వివరించడానికి. అందులో ఒకరు తప్పు అనీ కాదు, ఇంకొకరు ఒప్పు అనీ కాదు. ఇక భుజాలు తడుముకోవటం అంటారా ? అది మానవ సహజం. ఉదాహరణకి ఒక ప్రాంతం యాస చెత్త అని ఎవరో అన్నారనుకోండి వారికి పిచ్చి కోపం రాదూ ? అలాగే జనరలైజు చేస్తూ మాట్లాడిన సంగతులు కోపం తెప్పించడం సాధారణం. అందులో వింతేమీ లేదు.ఇక అంటరానితనం లాంటివి అనుభవించడం ఒక స్థాయి అయితే అర్థం చేసుకోవడం ఇంకో స్థాయి. ఒకవేళ రచనలో ఆయా వాటి గురించి రాస్తే అవి అనుభవించిన వారు దానికి స్పందించే తీరు, ఒక మామూలు పాఠకుడిగా అర్థం చేసుకుని నేను స్పందించే తీరు వేరు వేరుగా ఉంటాయి. రెండు స్పందనలూ ఒకేలా ఉండవు.ఇక నా వ్యాసంలో పైవేవీ లేవు అని సూచిస్తూ నేను చెప్పలేదు. ఒకసారి ఆ కాంటెక్స్టు సరిగా చూడండి. నేను చెప్పింది వాటి గురించి చెబుతూన్న రచనలతో నేను ఎంత రిలేట్ చేసుకోగలను ? వారి దృక్పథం నుంచి ఆలోచిస్తే మెరుగ్గా ఎలా అర్థం చేసుకోగలను అని చెప్పాను అంతే.

 25. Japes said,

  Dear Praveen,
  Sorry for the delayed response.. the comment was not personally aimed at you.. thats the reason why i mentioned it in the first line that “I agree with you about ‘context’.. but let me stray on the topic ..”

  🙂 i went out of ‘context’ to your article to mention about stereotypes against feminism.

 26. Japes said,

  Dear Praveen,Sorry for the delayed response.. the comment was not personally aimed at you.. thats the reason why i mentioned it in the first line that “I agree with you about ‘context’.. but let me stray on the topic ..”:) i went out of ‘context’ to your article to mention about stereotypes against feminism.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: