సెప్టెంబర్ 3, 2008

గూగుల్ క్రోమ్ – విహరిణుల విపణిలో సరికొత్త ఎంట్రీ …

Posted in క్రోమ్, గూగుల్, టెక్నాలజీ, విహరిణి, సాంకేతికం, technology వద్ద 5:42 సా. ద్వారా Praveen Garlapati

ఇన్నాళ్ళూ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్ మధ్య సాగుతున్న విహరిణుల పోటీ నిన్నటితో సరికొత్త మలుపు తిరిగింది.

కొంత మంది ఊహించినట్టు, ఇంకొంత మంది ఊహించనట్టూ గూగుల్ నిన్న క్రోమ్ అనే ఒక సరికొత్త ఓపెన్ సోర్స్ విహరిణిని విడుదల చేసింది.

దీనికి ప్రేరణ గూగుల్ చెబుతున్న ప్రకారం ఒక సరికొత్త విహరిణిని స్క్రాచ్ నుంచి తయారు చెయ్యడం. అంటే దీని డిజైన్, ఆర్కిటెక్చరు అన్నీ కొత్తగా దేని మీదా ఆధారపడకుండా తయారు చెయ్యడం. (ఫైర్‌ఫాక్స్ నెట్‌స్కేపు కోడు బేసు నుంచి తయారయిందని అందరికీ తెలుసనుకుంట)
అలాగే ఇప్పటి విహరిణులలో ఉన్న సమస్యలని అధిగమించడానికీ, ఇప్పటి వెబ్ కి తగినట్టూ తీర్చిదిద్దటం.

ఇక దీంట్లో ప్రత్యేకంగా ఏమున్నాయో చూద్దాము:

౧. లుక్స్ : అన్నిటికన్నా మొదటిగా ఇందులో నేను గమనించింది విహరిణిలో ఎంత ఎక్కువ స్థలం ఉపలబ్ధంగా ఉందో. క్రోమ్ లో టూల్‌బార్ లేదు, స్టేటస్‌బార్ లేదు. ఉన్నదల్లా టాబులు మాత్రమే.
ప్రతీ టాబుకీ విడివిడిగా వాటికి సొంతమయిన యూఆర్‌ఎల్ బారు, పేజీకల బారు ఉంది. దానితో మనకి ఎక్కువ స్క్రీను స్పేసు కనిపిస్తుంది.
అనవసరంగా ఎక్కువ స్థలాన్ని ఉపయోగించకుండా, జాజీగా కాకుండా గూగుల్ స్టైల్లో దీనిని సింపుల్ గా తీర్చిదిద్దారు. అయితే మరీ ప్లెయినుగా ఉండి కొందరికి నచ్చ్కపోవచ్చు కూడా.

. టాబులు: టాబులలో కొత్తేముంది. అన్ని విహరిణులలోనూ ఉన్నాయి. ఐఈ ౭ తో దాంట్లోనూ వచ్చి చేరాయి. ఇక ఓపెరా, ఫైర్‌ఫాక్స్ లలో అయితే మొదటి నుంచీ ఉన్నాయి.
మరి ఇందులో ప్రత్యేకత ఏముంది ?
మీరు వాడే విహరిణులలో మీరు అప్పుడప్పుడూ గమనించి ఉంటారు. ఒక టాబులో చూపించే వెబ్‌పేజీ గనక భారంగా ఉండి స్టక్ అయితే మొత్తం విహరిణినే మూసి మళ్ళీ తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే క్రోమ్‌లో దీనిని కొంత మేరకు మార్చగలిగారు.
ఇందులో మొత్తం విహరిణి ఒక ప్రాసెసుగా కాక, ప్రతీ టాబూ ఒక ప్రాసెసుగా డిజైని చేసారు. అందుకని ఒక టాబులో గనక సమస్య తలెత్తితే దానిని మాత్రమే మూసివేసి మిగతావాటిని అలాగే ఉంచుకోవచ్చు.

. ప్రతీ టాబూ ఒక కొత్త ప్రాసెసు: మొత్తం విహరిణి ఒకే ప్రాసెసుగా కాక ప్రతీ టాబూ ఒక ప్రాసెసుగా చూడడం వల్ల లాభాలున్నట్టే నష్టాలూ ఉండవచ్చు. వాడుకలో నేను గమనించిందేమిటంటే మెమురీ వాడకం ఎక్కువగా ఉంది.
ఉదా: అవే వెబ్‌సైట్లు వివిధ టాబులలో ఫైర్‌ఫాక్స్, ఓపెరా, క్రోమ్, ఐఈ లో తెరిస్తే క్రోమ్ అన్నిటికన్నా ఎక్కువగా మెమొరీ వాడుతుంది నా సిస్టంపైన.
అందుకని డిజైను పరంగా ఇది మంచి నిర్ణయమే అయినా నిజానికి మీ సిస్టముని నెమ్మది చేయవచ్చు.

. జావాస్క్రిప్టు: జావాస్క్రిప్టు మరీ అంత స్ట్రక్చర్డ్ లాంగ్వేజీ కాదు. కాబట్టి దానికి సంబంధించి చాలానే సమస్యలు ఉన్నాయి. అయితే క్రోమ్ లో v8 అనే జావాస్క్రిప్టు ఇంజనుని వాడుతున్నారు. ఇది ఒక VM. జావాస్క్రిప్టుని కంపైల్ చేసి మెషీన్ లాంగ్వేజీలోకి తర్జుమా చెయ్యడంవల్ల వెబ్‌పేజీలు త్వరగా లోడవుతాయని గూగుల్ ఉవాచ.

. వేగం: క్రోమ్‌లో చాలా ఆప్టిమైజేషన్లు చేసామనీ ఇంకా కొత్త జావాస్క్రిప్టు ఇంజిను వాడటం వల్ల పేజీలు వేగవంతంగా లోడవుతాయనీ చెబుతున్నారు. ఇది కొంతవరకూ నిజంలగే ఉంది. నే వాడినంతలో పేజీలు వేగంగానే లోడవుతున్నాయి. దాదాపు ఓపెరాలో అయినంత వేగంగానో, అంతకంటే వేగంగానో లోడవుతున్నాయి.

. అన్నిటికీ ఒకే అడ్రసు బారు: ఫైర్‌ఫాక్స్ ౩ తో మొదలయింది ఆసం పట్టీ. (ఇది మీరు ఇంతకు ముందు వెళ్ళిన వెబ్‌పేజీలనీ, వాటి కంటెంటునీ, మీ పేజీకలనీ అన్నిటినీ కలిపి వెతుకుతుంది) క్రోమ్ ఇవన్నీ చేస్తుంది. అలాగే దానితో పాటు దీనిని గూగుల్ సజెస్ట్‌తో అనుసంధానించారు. కాబట్టి మీరు దేనికోసమయితే వెతుకుతున్నారో దానికి సంబంధించిన సజెషన్లను గూగుల్ సజెస్టు నుంచి అందిస్తుంది.
అలాగే ఇది కొంత తెలివయిన సెర్చ్ ఏర్పాటుని కూడా కలిగుంది. మామూలుగా అయితే మీరు యూఆర్‌ఎల్ బారులో టైపు చేసిన టెక్స్టుని గూగుల్‌లో చెతుకుతుంది. అయితే మీరు ఏదయినా వెబ్‌సైటుకి వెళ్ళి దానికో సెర్చ్ బాక్సు ఉంటే మాత్రం దానిని వాడే ఏర్పాటు ఇందులో ఉంది.

ఎలాగంటే ఉదాహరణకి మీరు cnn.com కి వెళ్ళారనుకోండి. ఆ వెబ్‌సైటులో ఒక సెర్చ్ బాక్సు ఉంటుంది వెతకడానికి. అందుకని మీరు మీ యూఆర్‌ఎల్ బారులో cnn.com అని టైపు చేసి టాబు కొడితే మీరు గూగుల్ కి బదులుగా cnn.com లో సెర్చ్ చెయ్యవచ్చు.

. స్పీడ్ డయల్: ఓపెరాలో స్పీడు డయల్‌లు ఉంటాయి. ఇవేమిటంటే మీరు ఒక కొత్త టాబుని గనక తెరిస్తే మీకు ఒక తొమ్మిది స్పీడు డయళ్ళు కనిపిస్తాయి. దాంట్లో మీరు తరచూ వాడే వెబ్‌సైట్లు సెట్ చేసుకోవచ్చు. కాబట్టి కొత్త టాబు తెరవగానే సమయం వృధా కాకుండా వాటిని నొక్కితే వెంటనే ఆయా సైట్లకి వెళ్ళిపోవచ్చు.
ఇలాంటిదే క్రోమ్‌లో కూడా ఉంది. అయితే ఇందులో స్పీడు డయళ్ళు ఆటోమేటిగ్గా మీరు తరచూ వెళ్ళే వెబ్‌సైట్లుగా సెట్ చెయ్యబడి ఉంటాయి. మీరు సెట్ చేసుకోలేరు. మీరు ఇంతకు ముందు బ్రౌజ్ చేసిన చరిత్రని బట్టి వీటి ఎంపిక ఉంటుంది.

. ప్రైవేటు బ్రౌజింగు: కొన్ని సార్లు మీరు వెళ్ళిన వెబ్‌సైట్ల వివరాలు బ్రౌజరులో నిక్షిప్తం కాకుండా ఉండాలని మీరు కోరుకోవచ్చు. (ఉదా: పోర్న్ కోసం చూసేవారు) ఎందుకంటే మీ ఆసం పట్టీలో లేదా స్పీడు డయళ్ళలో ఆయా సైట్లు కనిపిస్తే మీకు ఇబ్బంది కలగవచ్చు. సాధారణంగా అయితే మీరు మీ విహరిణి కాష్ (cache) ని తుడిచివెయ్యడమో లేదా చరిత్రని తుడిచివెయ్యడమో చేస్తుంటారు. అయితే దానివల్ల మిగతా చరిత్ర వివరాలన్నీ కూడా తుడుచుకుపోతాయి.
అలా కాకుండా మీరు ప్రస్తుతం బ్రౌజ్ చేస్తున్న టాబుని మాత్రమే విహరిణి చరిత్రలో రాకుండా “Incognito” అనే ఒక కొత్త మోడ్‌ని క్రోమ్ లో ప్రవేశపెట్టారు. మీ దానిని ఎంపిక చేసుకుంటే ప్రైవేటుగా బ్రౌజ్ చెయ్యవచ్చన్నమాట.

. సెక్యూరిటీ: ఇతర విహరిణులలో ఉన్నట్టే ఇందులోనూ సెక్యూరిటీ బాగుంది. మీరు “ఫిషింగ్” లేదా స్పైవేరు ఉన్న వెబ్‌సైట్లకి వెళితే క్రోమ్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
అలాగే సర్టిఫికెట్లు ఎక్స్పైర్ అయిన లేదా సరిపోలని వెబ్‌సైట్లకి వెళ్ళినా ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

౧౦. దిగుమతులూ, అప్లికేషన్లూ: ఇక క్రోమ్ లో దిగుమతులూ సులభమే. ప్రస్తుతం అవుతున్న దిగుమతిని “పాజ్” చేసి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి కానివ్వచ్చు. అలాగే దీనికి స్టేటస్ బార్ ఉండదు కానీ దిగుమతి అవుతున్న ఫైలుని అవుతున్నంత సేపూ ఆ స్థలంలో చూపిస్తుంది. పూర్తయిన తర్వాత ఆ ఫైలుని మీకు కావలసిన ప్రదేశానికి మార్చుకోవచ్చు.
అలాగే ఫైర్‌ఫాక్స్ “ప్రిజ్మ్” లాగా దీనినుంచి ఒక్క టాబు మాత్రమే ఉండే అప్లికేషన్లూ కూడా సృష్టించుకోవచ్చు.

౧౧. తెలుగు: క్రోమ్‌లో తెలుగుకి మద్దతు ఉంది. మీ విహరిణి ప్రధానమయిన భాషగా తెలుగుని పెట్టుకోవచ్చు. అలాగే తెలుగు యూనీకోడుని బాగానే చూపిస్తుంది. అయితే బరహ, అక్షరమాల వంటి ఉపకరణాలు ఇందులో సరిగా పని చెయ్యట్లేదు. అలాగే అక్కడక్కడా “Unjustified text” సమస్య చూసాను నేను.
ఇంకా పద్మ, indic input extension లాంటి జోడింపులు ఇందులో వాడలేము.
చిత్రంగా ఈనాడు డైనమిక్ ఖతిని ఇది బానే చూపిస్తుంది. ఆంధ్రజ్యోతిని సరిగా చూపించట్లేదు.

పైనవి స్థూలంగా ఇందులో విశేషాలు. ఇన్నొవేషను పరంగా ఫీచర్లను చూస్తే పెద్దగా కొత్తేమీ లేదు. (ఉంటే డిజైను పరంగా ఉండవచ్చు). ప్రస్తుతం ఉన్న ఇతర విహరిణులలో నుంచి మంచి ఫీచర్లన్నిటినీ ఒక దగ్గర పోగు మాత్రం చేసారు.

అయితే సరికొత్త విహరిణి తయారు చెయ్యవలసిన అవసరం గూగుల్ కి ఏముందని ప్రశ్నిస్తే దీనికి వేరే కారణాలు ఎక్కువుండచ్చనిపిస్తుంది. ముందు ముందు గూగుల్ అప్లికేషన్లని ప్రమోట్ చేసుకునేందుకు వీలుగా దీనిని తయారు చెయ్యవచ్చు లేదా మీ బ్రౌజింగు డాటాని మాకందిస్తే మీకు తగినట్టు మీరు విహరిస్తున్నప్పుడు మీకు కావలసినట్టు అంతర్జాలాన్ని కస్టమైజు చేస్తామని చెప్పవచ్చు. అలాగే మొబైలు మీద ఈ విహరిణిని ప్రస్తుతం ఉన్న ఓపెరా మినీ, ఐఈ లకి ప్రత్యామ్నాయంగా ఉంచవచ్చు.

ప్రస్తుతానికయితే ఇది ఇంకో విహరిణి మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఫైర్‌ఫాక్స్ కంటే తక్కువలో ఉంది ఇది. ఎందుకంటే దీంట్లో జోడింపుల సౌకర్యం లేదు. ఫైర్‌ఫాక్స్ బలమంతా అందులోనే ఉంది. కాబట్టి అలాంటిదేదో గూగుల్ చెయ్యాల్సిందే.
నాకయితే ఏదో బ్రౌజ్ చేసుకోడానికి బాగానే ఉన్నా ప్రస్తుతానికి ఫైర్‌ఫాక్స్ ఇచ్చిన సౌకర్యం ఇది ఇవ్వట్లేదని అనిపిస్తుంది. కానీ గూగుల్ కున్న హైపుని బట్టి దీనికి మంచి మార్కెటే ఉండవచ్చు.
అలాగే మొత్తం స్క్రాచు నుంచి తయారు చేసామని చెబుతున్నా ఆపిల్ వారి వెబ్‌కిట్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ నుంచి కోడుని వీరు వాడారు. కాబట్టి అందులో ఏమన్నా సమస్యలుంటే అవి వీటిలోకీ రావచ్చు.

ఏదయితే ఏమిటి. మనకి దీని దయవల్ల ఇంకొక మంచి విహరిణి వస్తే సంతోషమే…

36 వ్యాఖ్యలు »

 1. everythingisprecious said,

  Thanks for the post. But chrome seems to be a bit slower than the other browsers.

 2. everythingisprecious said,

  Thanks for the post. But chrome seems to be a bit slower than the other browsers.

 3. Anonymous said,

  eenadu.net font is not working in this browser….is there any way to make it work?

 4. Anonymous said,

  eenadu.net font is not working in this browser….is there any way to make it work?

 5. మాకినేని ప్రదీపు said,

  వ్8 వలన జావాస్క్రిప్టు తొందరగా పని చేస్తుంది, పేజీ లోడవడంలో పెద్దగా తేడా ఉండదు. ఉదాహరణకు: ఈ ఆటను FFలోనూ క్రోంలోనూ “కష్టం” లెవల్‌లో చివరి వరకూ ఆడి చూడండి.

 6. వ్8 వలన జావాస్క్రిప్టు తొందరగా పని చేస్తుంది, పేజీ లోడవడంలో పెద్దగా తేడా ఉండదు. ఉదాహరణకు: ఈ ఆటను FFలోనూ క్రోంలోనూ “కష్టం” లెవల్‌లో చివరి వరకూ ఆడి చూడండి.

 7. సూర్యుడు said,

  One more feature I liked in this browser is the tab management. You can break away one tab from a window as an individual window and you can merge it back to the main window 🙂

  ~sUryuDu 🙂

 8. One more feature I liked in this browser is the tab management. You can break away one tab from a window as an individual window and you can merge it back to the main window :-)~sUryuDu 🙂

 9. రవి said,

  బావుంది..ఈ వారం మా ఇంట్లో దింపుకుని చూడాలి. మొత్తానికి మైక్రో సాఫ్ట్ వాడికి ఇద్దరు ప్రబల శత్రువులు బయలుదేరారన్నమాట.

 10. రవి said,

  బావుంది..ఈ వారం మా ఇంట్లో దింపుకుని చూడాలి. మొత్తానికి మైక్రో సాఫ్ట్ వాడికి ఇద్దరు ప్రబల శత్రువులు బయలుదేరారన్నమాట.

 11. aswin budaraju said,

  Google ప్రవాహానికి ఎన్నో కొట్టూకుపోయాయి, కంప్యూటర్ ప్రతినిధి మైక్రోసాఫ్ట్ కూడా విలవిల లాడిపోయింది. ఇక గూగుల్ బ్రౌజర్ కూడా మరో విప్లవం తీసుకొస్తుందేమో ?
  ఈ version కి కాకపోవచ్చు ఖచ్చితంగా Next version కి మాత్రం Chrome Best Browser అయ్యే chance లు ఉన్నాయనటంలో సందేహం లేదు

 12. Google ప్రవాహానికి ఎన్నో కొట్టూకుపోయాయి, కంప్యూటర్ ప్రతినిధి మైక్రోసాఫ్ట్ కూడా విలవిల లాడిపోయింది. ఇక గూగుల్ బ్రౌజర్ కూడా మరో విప్లవం తీసుకొస్తుందేమో ?ఈ version కి కాకపోవచ్చు ఖచ్చితంగా Next version కి మాత్రం Chrome Best Browser అయ్యే chance లు ఉన్నాయనటంలో సందేహం లేదు

 13. శ్రీవిద్య said,

  Cool post.. Very good info 🙂

 14. Cool post.. Very good info 🙂

 15. జ్యోతి said,

  i came to know abt this browser two days back and tried it yesterday. yes i couldnt write with baraha. but i liked the features. like the images of recently viewed sites seen after opening the browser. hv to explore it more..

 16. i came to know abt this browser two days back and tried it yesterday. yes i couldnt write with baraha. but i liked the features. like the images of recently viewed sites seen after opening the browser. hv to explore it more..

 17. శివ బండారు said,

  Good Review .

 18. Good Review .

 19. Ghanta Siva Rajesh said,

  great job

 20. great job

 21. రాకేశ్వర రావు said,

  నేను గూగులు ముఖ్య పుఠలో క్రోము లంకె చూసి డౌనులోడు చేద్దామా అని ఆలోచించి, మన ప్రవీణ్ రివ్యూ వ్రాసారేమో అని వచ్చి చూసాను.
  డౌనులోడు మరియు ఇన్సటాలుల బాధ తప్పించినందుకు నెనర్లు. 😉

 22. నేను గూగులు ముఖ్య పుఠలో క్రోము లంకె చూసి డౌనులోడు చేద్దామా అని ఆలోచించి, మన ప్రవీణ్ రివ్యూ వ్రాసారేమో అని వచ్చి చూసాను. డౌనులోడు మరియు ఇన్సటాలుల బాధ తప్పించినందుకు నెనర్లు. 😉

 23. Srinivas Ch said,

  దీనిలో ఉన్న ఇంకో మంచి ఫీచర్ ఏంటి అంటే, బ్రవుసర్ మీద కనపడే textareasని మనకు కావల్సిన సైజు లోకి పెంచుకోవచ్చు. మాములుగా కొన్ని సైట్స్ డిజైన్ అందంగా ఉండడం కోసం textareasని చిన్నగా పెడతారు, కాని మనం వాటిని ఉపయోగించేటప్పుడు ఎక్కువ విషయం రాయల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఈ బ్రౌసర్తో మనకు కావల్సిన సైజు కి మనం textareasని పెంచుకోవచ్చు.

 24. Srinivas Ch said,

  దీనిలో ఉన్న ఇంకో మంచి ఫీచర్ ఏంటి అంటే, బ్రవుసర్ మీద కనపడే textareasని మనకు కావల్సిన సైజు లోకి పెంచుకోవచ్చు. మాములుగా కొన్ని సైట్స్ డిజైన్ అందంగా ఉండడం కోసం textareasని చిన్నగా పెడతారు, కాని మనం వాటిని ఉపయోగించేటప్పుడు ఎక్కువ విషయం రాయల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఈ బ్రౌసర్తో మనకు కావల్సిన సైజు కి మనం textareasని పెంచుకోవచ్చు.

 25. Purnima said,

  As usual, crisp and clear. Thanks for sharing the info.

  As of now, I would still continue with Firefox 🙂

 26. Purnima said,

  As usual, crisp and clear. Thanks for sharing the info. As of now, I would still continue with Firefox 🙂

 27. ప్రవీణ్ గార్లపాటి said,

  @ everythingisprecious:

  ఊ… అవునా ? నాకు వేగంగానే పని చేస్తుందే ?

  @ anonymous:
  లేదు. నాకు ఏ సెటింగూ చెయ్యకుండానే కనిపిస్తుంది.

  @ మాకినేని ప్రదీపు:
  జావాస్క్రిప్టు తొందరగా లోడ్ అవడం వల్ల పేజీ తొందరగా లోడయ్యే అవకాశాలు ఎక్కువ.
  ప్రస్తుతం వెబ్ ౨.౦ లో రూపొందించిన వెబ్‌సైట్‌లన్నీ జావాస్క్రిప్టుని చాలా ఎక్కువగా ఉపయోగిస్తాయి.
  అలాంటి వెబ్‌సైటులని చూసేటప్పుడు ఇలాంటి ఆప్టిమైజేషన్లు వాటిని తొందరగా లోడయ్యేలా చెయ్యవచ్చు.

  @ సూర్యుడు:
  అలాంటి ఫీచరు ఫైర్‌ఫాక్స్ లో కూడా ఉంది. ఒక టాబుని ఇంకో విండోలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యవచ్చు.
  కానీ ఒక టాబుని కొత్త విండోలాగా చేసే ఏర్పాటు లేదు.

  @ రవి:
  మైక్రోసాఫ్ట్ వాడి ఆధిపత్యం ఒక్క రోజులో పోయేది కాదు. విండోసుతో పాటు ఐఈ ఉంటుంది గనక.
  కానీ ఇతర విహరిణులు మంచి ఇన్నోవేషను చేస్తుంటే వాడు కాచప్ చెయ్యడం మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి మార్కెట్టు కోల్పోతున్నాడు.

  @ అశ్విన్:
  నాకు తెలిసి గూగుల్ వాడి టార్గెట్టు బ్రౌజర్ మార్కెట్టు కాదు. వాడు దీనిని ఒక ప్లాట్‌ఫారం లాగా వాడి సర్వీసులని పెంపొందించుకుంటాడు.
  ఉత్త బ్రౌజరుగా అయితే ఆడాన్స్ లేకుండా ఉన్న క్రోమ్‌ని నేను ఉపయోగించను. ఫైర్‌ఫాక్స్ చాలా మెరుగు.

  @ శ్రీ విద్య, జ్యోతి, శివ, రాజేష్:
  ధన్యవాదాలు.

  @ రాకేశ:
  మీరు మరీనూ! 😛
  మరీ తీసిపారెయ్యాల్సింది కాదు లెండి. డౌన్‌లోడ్ చెయ్యండి.

  @ శ్రీనివాస్:
  అవును. ఇలాంటి ఫీచరు ఫైర్‌ఫాక్స్ జోడింపుగా చాలా రోజుల నుంచీ ఉంది.

  @ purnima:
  బ్రౌజరు అన్నది పర్సనల్ ఛాయిసే. నాకూ ఫైర్‌ఫాక్స్ అంటేనే ఇష్టం. ఓపెరా కూడా…

 28. @ everythingisprecious: ఊ… అవునా ? నాకు వేగంగానే పని చేస్తుందే ?@ anonymous:లేదు. నాకు ఏ సెటింగూ చెయ్యకుండానే కనిపిస్తుంది.@ మాకినేని ప్రదీపు:జావాస్క్రిప్టు తొందరగా లోడ్ అవడం వల్ల పేజీ తొందరగా లోడయ్యే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం వెబ్ ౨.౦ లో రూపొందించిన వెబ్‌సైట్‌లన్నీ జావాస్క్రిప్టుని చాలా ఎక్కువగా ఉపయోగిస్తాయి.అలాంటి వెబ్‌సైటులని చూసేటప్పుడు ఇలాంటి ఆప్టిమైజేషన్లు వాటిని తొందరగా లోడయ్యేలా చెయ్యవచ్చు.@ సూర్యుడు:అలాంటి ఫీచరు ఫైర్‌ఫాక్స్ లో కూడా ఉంది. ఒక టాబుని ఇంకో విండోలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యవచ్చు. కానీ ఒక టాబుని కొత్త విండోలాగా చేసే ఏర్పాటు లేదు.@ రవి:మైక్రోసాఫ్ట్ వాడి ఆధిపత్యం ఒక్క రోజులో పోయేది కాదు. విండోసుతో పాటు ఐఈ ఉంటుంది గనక.కానీ ఇతర విహరిణులు మంచి ఇన్నోవేషను చేస్తుంటే వాడు కాచప్ చెయ్యడం మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి మార్కెట్టు కోల్పోతున్నాడు.@ అశ్విన్:నాకు తెలిసి గూగుల్ వాడి టార్గెట్టు బ్రౌజర్ మార్కెట్టు కాదు. వాడు దీనిని ఒక ప్లాట్‌ఫారం లాగా వాడి సర్వీసులని పెంపొందించుకుంటాడు.ఉత్త బ్రౌజరుగా అయితే ఆడాన్స్ లేకుండా ఉన్న క్రోమ్‌ని నేను ఉపయోగించను. ఫైర్‌ఫాక్స్ చాలా మెరుగు.@ శ్రీ విద్య, జ్యోతి, శివ, రాజేష్:ధన్యవాదాలు.@ రాకేశ:మీరు మరీనూ! :Pమరీ తీసిపారెయ్యాల్సింది కాదు లెండి. డౌన్‌లోడ్ చెయ్యండి.@ శ్రీనివాస్:అవును. ఇలాంటి ఫీచరు ఫైర్‌ఫాక్స్ జోడింపుగా చాలా రోజుల నుంచీ ఉంది.@ purnima:బ్రౌజరు అన్నది పర్సనల్ ఛాయిసే. నాకూ ఫైర్‌ఫాక్స్ అంటేనే ఇష్టం. ఓపెరా కూడా…

 29. ఉమాశంకర్ శివదానం said,

  ఏది ఏమైనా మీ ఓపికకు నా జోహార్లు..చక్కటి వివరణ..

  /ఉమాశంకర్

 30. ఏది ఏమైనా మీ ఓపికకు నా జోహార్లు..చక్కటి వివరణ../ఉమాశంకర్

 31. విజయ క్రాంతి said,

  inko samasya vundi…idi download chesina tarvatha , online lo videos ni play chayatam ledu ….ye browser lo kuda open kavatam ledu,,,,,,,,,, enduko teleedu….kaani time paduthundi….crome 2 kai vechi vuntanu 🙂

 32. inko samasya vundi…idi download chesina tarvatha , online lo videos ni play chayatam ledu ….ye browser lo kuda open kavatam ledu,,,,,,,,,, enduko teleedu….kaani time paduthundi….crome 2 kai vechi vuntanu 🙂

 33. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said,

  విహరిణి = విహారిణి

 34. విహరిణి = విహారిణి

 35. chaduvari said,

  “అలాగే మొత్తం స్క్రాచు నుంచి తయారు చేసామని చెబుతున్నా ఆపిల్ వారి వెబ్‌కిట్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ నుంచి కోడుని వీరు వాడారు. కాబట్టి అందులో ఏమన్నా సమస్యలుంటే అవి వీటిలోకీ రావచ్చు.” – ప్రవీణ్ భలే గమనించారు. నేను దీన్నో రెండ్రోలు వాడి చూసాను. ఒక సందర్భంలో ఒక అలర్టు వచ్చింది. దానిలో ఉండే సందేశం సఫారిలో ఏం ఉంటుందో యథాతథంగా అదే పెట్టేసాడు. బ్రౌజరు పేరును (సఫారి) కూడా మార్చలేదు. (దాని తెరపట్టును మీకు మెయిల్లో పంపిస్తాను) అచ్చు ఇదే సమస్య సఫారీలోనూ వచ్చింది. మన నక్కకి మాత్రం అట్టాంటి సమస్యేమీ రాలేదు!

  క్రోము బానే ఉంది. పొడిగింతలు పెట్టుకునే వీలయ్యేంతవరకు, తెలుగులో రాసుకోగలిగే వీలు కలిగేంతవరకు నేను దాని జోలికి పొయ్యేది లేదు.

  సూర్యుడు: మీరు చెప్పిన అంశం నాకు భలే నచ్చింది.

  ప్రవీణ్, ఇలా సాంకేతిక జాబులు రాయటంలో మీరు మొనగాడు. అభినందనలు.

 36. chaduvari said,

  “అలాగే మొత్తం స్క్రాచు నుంచి తయారు చేసామని చెబుతున్నా ఆపిల్ వారి వెబ్‌కిట్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ నుంచి కోడుని వీరు వాడారు. కాబట్టి అందులో ఏమన్నా సమస్యలుంటే అవి వీటిలోకీ రావచ్చు.” – ప్రవీణ్ భలే గమనించారు. నేను దీన్నో రెండ్రోలు వాడి చూసాను. ఒక సందర్భంలో ఒక అలర్టు వచ్చింది. దానిలో ఉండే సందేశం సఫారిలో ఏం ఉంటుందో యథాతథంగా అదే పెట్టేసాడు. బ్రౌజరు పేరును (సఫారి) కూడా మార్చలేదు. (దాని తెరపట్టును మీకు మెయిల్లో పంపిస్తాను) అచ్చు ఇదే సమస్య సఫారీలోనూ వచ్చింది. మన నక్కకి మాత్రం అట్టాంటి సమస్యేమీ రాలేదు! క్రోము బానే ఉంది. పొడిగింతలు పెట్టుకునే వీలయ్యేంతవరకు, తెలుగులో రాసుకోగలిగే వీలు కలిగేంతవరకు నేను దాని జోలికి పొయ్యేది లేదు.సూర్యుడు: మీరు చెప్పిన అంశం నాకు భలే నచ్చింది. ప్రవీణ్, ఇలా సాంకేతిక జాబులు రాయటంలో మీరు మొనగాడు. అభినందనలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: