సెప్టెంబర్ 13, 2008

జిమ్ముకెళ్ళరా… కండ పెంచరా…

Posted in అనుభవాలు, హాస్యం వద్ద 8:20 సా. ద్వారా Praveen Garlapati

శీర్షిక చూస్తునే మీకర్థం అయుంటుంది… కాసేపలాగే ఉండండి. నా జిమ్ము బాడీ కండలు చూపించి టపా రాస్తాను. ఊ…హుం…. కళ్ళు తిరిగినియ్యా ? మరదే…

అసలు ఈ పరంపర ఎప్పుడు మొదలయిందో తెలియాలంటే మీరు నా ఇంజినీరింగు రోజులలోకి వెళ్ళాలి. అది ఏదో సెమిస్టరు (అసలు ఎప్పుడేమి చదివామో గుర్తుంటే కదా ?). నేను హ్రితిక్ రోషను “ఎక్ పల్ కా జీనా …” అంటూ అవసరం లేకపోయినా కండలు చూపించే డాన్సు చూసాను.
అంతే ఎన్నో వేల మంది “యూతు” (బూతు అని వినిపిస్తే నా బాధ్యత కాదు) లాగా నాకూ వెంటనే కండలు పెంచేసి మా కాలేజీలో అమ్మాయిలని పడగొట్టెయ్యాలనే తీవ్రమయిన కోరిక కలిగింది.

మా కాలేజీలో నాలాంటి బకరాల కోసమే అన్నట్టు ఓ జిమ్ము ఉండేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కానీ బానే ఉండేది లెండి. ఇక నేను ఆల్మోస్టు అక్కడ ఇరగదీసాను. ఏమిటనుకున్నారు, నా వెన్నెముకని. మొదటి రోజే మరి కరణం మల్లీశ్వరి స్ఫూర్తితో యాభై కేజీల వెయిట్ లిఫ్టింగు చేస్తే ఇంకేమవుతుంది మరి ?

ఓ నెల రోజుల రెస్టు తర్వాత మళ్ళీ ఇంకో ప్రయత్నం అన్నమాట. ఈ సారి జాగ్రత్తగా పాపం తలో ఐదు కేజీల డంబెల్స్ ఎత్తి నా మానాన నేను జిమ్ము చేసుకుంటుంటే ఆ రోజే కాలేజీలో ఏదో “ఆటల దినమంట” అమ్మాయిలంతా బిలబిలా జిమ్ముకొచ్చేసారు (అబ్బ. మన ఖర్మ కాకపోతే జిమ్ములోనే బాడ్‌మింటను కోర్టు పెట్టాలనే బుద్ధిలేని అయిడియా ఎవరిచ్చారో మా కాలేజీ వారికి.) అసలే నా పక్కన హల్క్ లాంటి “బ్రెస్టు లాంటి చెస్టు” ఉన్న వీరుడొకడు తలా పన్నెండు కిలోల డంబెల్స్ ఎత్తుతున్నాడు.
మరి ఆ పక్కనే నేను ఐదు కిలోల డంబెల్సు, అదీ అమ్మాయిల ముందు (మీకు సీను అర్థమయింది కదా…) వెంటనే నా చేతిలో పది కిలోల డంబెల్సు ప్రత్యక్షం.

సీను కట్ చేస్తే పది కిలోల డంబెల్ ఒకటి నా కాలు పచ్చడి చెయ్యడం. కుంటలేక, ఏడవలేక నోరు కట్టేసుకుని హాస్టలు చేరడం నెక్స్టు సీనులు.

ఇలా కాదని ఎవరూ లేకుండా చూసి మధ్యాహ్నం పూట జిమ్ము కెళ్ళడం మొదలెట్టా… అప్పుడేమయిందా ? హు… మీరు నన్ను అవమానిస్తున్నారు. ఏదో అయే ఉంటుందని డిసైడయిపోయినట్టున్నారు. ఇక చెప్పక తప్పుతుందా ?
సంగతేమిటంటే మా కాలేజీలో వెయిట్ లిఫ్టింగు వీరుడొకడు ఉండేవాడు. భారీ పర్సనాలిటీ, మా యూనివర్సిటీలోనే గోల్డు మెడలిస్టు వంటి స్థాయి. ఏదో ఒక పోటీలో ఇతగాడు ఎత్తగలిగినంత వెయిట్లు లేక బాబ్బాబూ ఇక చాలు ఆపెయ్యి అన్నారని ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది అప్పట్లో…
నేను వెళ్ళే మధ్యాహ్నం టయిమునే నా అదృష్టం ?? కొద్దీ ఇతగాడు ఎంచుకున్నాడు. నా పక్కనే నిలబడి పదుల కిలోలు అమాంతంగా ఎత్తేస్తుండేవాడు. అప్పటికే ఇలాంటి అవమానాలకి అలవాటు పడిపోయానేమో పక్క నా ఏడున్నర, అప్పుడప్పుడు పదీ కిలోలతో కానిచ్చేవాడిని.
ఇలా ఉండగా ఒక రోజు పాపం ఏ కళనున్నాడో కానీ నేను ఎక్సర్సయిజు చేస్తున్న సమయంలో ఆ వంద కేజీల వెయిటు జస్టు నా తలకి పదించిల దూరంలో డభేల్మని కింద పడింది. ఓ పది నిముషాలు అవాక్కయ్యానన్నమాట. తేరుకున్నానుకున్నారా ? లేదు జిమ్ము మానేసా 🙂 అదీ సంగతి.

అప్పటితో నా సల్మాన్ ఖాను లాగా షర్టు విప్పడాలు, కండలు ఫ్లెక్సు చెయ్యడాలు కట్టయ్యాయన్నమాట. (ఏం చేస్తాం. ఐఎస్‌ఐ కుట్ర జరిగింది)

ఇక ఏదో నా ఇంజినీరింగు పూర్తిచేసి “జనాల ప్రకారం” తీరిగ్గా తిని కూర్చుని చేసే ఉద్యోగంలో చేరాను. ఇక షరా మామూలే. ఏముందీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కదలకుండా పని చేసి ఒళ్ళొంచకుండా ఇంటి నుంచి ఆఫీసుకీ, ఆఫీసు నుంచి ఇంటికీ. ఈ మధ్యలో జిమ్ముకెళ్ళాలి అనే ఆలోచన నేను చెయ్యలేదు. ఎందుకంటే నాకంటే ముందే నా సహోద్యోగులు మాంచి ఉత్సాహంతో రెండు రోజులు జిమ్ముకెళ్ళి విజయవంతంగా పది రోజుల పండగ పూర్తి చేసుకుని వేలు సమర్పించుకున్నారు.

ఇక అలా హాయిగా సాగిపోతున్న జీవితంలో కాంపసు మారడం అనే ఒక విషాద సంఘటన జరిగింది. బిగ్గర్, బెటర్ పాలసీలో భాగంగా ఓ ఆట్టహాసమయిన జిమ్మొకటి మా కాంపసులో కొచ్చింది.
“కుక్క తోక వంకర” లాంటి సామెతలు ఎవరికయినా గుర్తుకొస్తే చెప్పకుండా వారిదగ్గరే పెట్టుకోమని మనవి.

మళ్ళీ మొదలు. అక్కడున్న నాలుగయిదు ట్రెడ్ మిల్లులని చూసి మనసాగలేదు. వెంటనే అవెక్కి రన్నడం అదే పరుగెత్తడం మొదలెట్టాను. మీకప్పుడే “ఫారెస్టు గంపు” గుర్తొస్తుంటే నేనేమీ చెయ్యలేను. మరీ అలా పరిగెట్టలేదు కానీ, ఎందుకో పరిగెడుతుంటే నాకేదో చెప్పలేని ఆనందం కలుగుతుండేది. నేనేదో మారథాన్ పరిగెడుతున్నట్టు, పూర్తి చేసి చేతులు పైకెత్తి ఆనందపడిపోతున్నట్టూ కళ్ళు తెరిచి కలలుగనే వాడిని.

ఇంకే రోజుకి దాదాపు నాలుగుతో మొదలెట్టి ఎనిమిది కిలోమీటర్ల దాకా పరిగెత్తడం మొదలుపెట్టాను. జిమ్ములో నా వెనక చకోర పక్షుల్లా వేచి చూసే వారు లేకపోతే ఇంకెన్ని కిలోమీటర్లు పరిగెత్తేవాడినో తెలీదు మరి. దాని ఫలితం నెలలోగా నాలుగు కేజీల బరువు తగ్గడం. కనిపించిన వాళ్ళందరూ ఏమయింది అని అడగడం మొదలుపెట్టారు. మా మేనేజరు పిలిచి బాబూ నువ్వు ఆ జిమ్ము ఆపకపోతే మన టీములోకి జనాలెవరూ రారు, కనీసం నా గురించయినా ఆపెయ్యి నాయనా అన్నాడు.
నాకు మంచి హైకు ఇస్తానని ఒట్టేయించుకుని ఆపేసాను. (నేను ఆయన గదిలో నుంచి బయటకు రాగానే ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం నేను చూడలేదు)

ఇదిగో మళ్ళీ ఇప్పుడు దురద మొదలయింది. ఈ సారి కేవలం కండలు పెంచి, ఛాతీ వెడల్పు చేద్దామని మళ్ళీ మొదలెట్టాను. గత నెల రోజులుగా ఠంచనుగా వెళుతున్నాను (అంటే వారానికి రెండు రోజులు). ఈ సారి రికార్డు ఏమన్నా మారుతుందేమో చూడాలి మరి …

46 వ్యాఖ్యలు »

 1. teresa said,

  అదే చేత్తో కొంచెం ప్రోటీన్ షేకులు, 4 హీటింగ్ పేడ్లూ కూడా కొనుక్కుంటే మంచిదేమో 🙂 Good luck!
  ప్రోగ్రెస్ రెపోర్ట్ రాయటం మర్చిపోవద్దు.

 2. teresa said,

  అదే చేత్తో కొంచెం ప్రోటీన్ షేకులు, 4 హీటింగ్ పేడ్లూ కూడా కొనుక్కుంటే మంచిదేమో 🙂 Good luck!ప్రోగ్రెస్ రెపోర్ట్ రాయటం మర్చిపోవద్దు.

 3. భాస్కర్ రామరాజు said,

  FYI
  If you are really interested in building basic body, follow this workout.
  http://www.freedomfly.net/workouts/workout1.htm

 4. FYIIf you are really interested in building basic body, follow this workout.http://www.freedomfly.net/workouts/workout1.htm

 5. chaduvari said,

  హమ్మో హమ్మో.. మీరింత హాస్యం రాస్తారని, (ఇన్నాళ్ళు ఈ కళని దాస్తారనీ) తెలీదు సుమండి.
  మరి.. ముందు, తరవాత (బిఫోరు, ఆఫ్టరు) ఫోటో గాలరీ కోసం ముందు ఫోటో తీయించి పెట్టుకున్నారా?

 6. chaduvari said,

  హమ్మో హమ్మో.. మీరింత హాస్యం రాస్తారని, (ఇన్నాళ్ళు ఈ కళని దాస్తారనీ) తెలీదు సుమండి. మరి.. ముందు, తరవాత (బిఫోరు, ఆఫ్టరు) ఫోటో గాలరీ కోసం ముందు ఫోటో తీయించి పెట్టుకున్నారా?

 7. విహారి said,

  హుమ్…ఇలాగయితే నా ‘ఆరు పెట్టెలు’ టపా ఏం చెయ్యాలి? ఏవిటో నా అవుడియాలు మళ్ళీ కాపీకి గురవుతున్నాయి.

  — విహారి

 8. హుమ్…ఇలాగయితే నా ‘ఆరు పెట్టెలు’ టపా ఏం చెయ్యాలి? ఏవిటో నా అవుడియాలు మళ్ళీ కాపీకి గురవుతున్నాయి.– విహారి

 9. Purnima said,

  బ్రావో! ఈ కథలు నేను ఇంచుమించు రోజూ వినేవే! వింటున్నంత (చదువుతున్నంత) సేపూ భలే నవ్వుకుంటాను కానీ వాళ్ళు చకచక కదలేనప్పుడు అర్ధం అవుతుంది, ఎంత కష్టమో జిమ్కి వెళ్ళడం అని. ఎందుకు నవ్వానా అనుకుంటా, కానీ మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ నవ్వేస్తా!

  ఆల్ ది బెస్ట్! అటు తర్వాత ఏం జరిగిందో చెప్పండే!

  >>"జనాల ప్రకారం" తీరిగ్గా తిని
  ఛాన్స్ వదులుకోలేము కదా 😉

  బైదవే, మీ సండే మార్నింగ్ పోస్టులు నాకు భలే ఇష్టం. ఆదివారం మీ టపాతో మొదలెడితే, అదో తృప్తి. 🙂

 10. Purnima said,

  బ్రావో! ఈ కథలు నేను ఇంచుమించు రోజూ వినేవే! వింటున్నంత (చదువుతున్నంత) సేపూ భలే నవ్వుకుంటాను కానీ వాళ్ళు చకచక కదలేనప్పుడు అర్ధం అవుతుంది, ఎంత కష్టమో జిమ్కి వెళ్ళడం అని. ఎందుకు నవ్వానా అనుకుంటా, కానీ మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ నవ్వేస్తా!ఆల్ ది బెస్ట్! అటు తర్వాత ఏం జరిగిందో చెప్పండే! >>"జనాల ప్రకారం" తీరిగ్గా తినిఛాన్స్ వదులుకోలేము కదా ;-)బైదవే, మీ సండే మార్నింగ్ పోస్టులు నాకు భలే ఇష్టం. ఆదివారం మీ టపాతో మొదలెడితే, అదో తృప్తి. 🙂

 11. జ్యోతి said,

  ప్రవీణ్,
  నీకు కూడా ఇంత టాలెంటు ఉందా?? అదిరింది పో.. కాని అప్పుడప్పుడు నీ ప్రోగ్రెస్ ని చెపుతూ ఉండి. ఫోటోలతో సహా. లేకుంటే కాస్త డౌట్ పడాల్సి వస్తుంది.

 12. ప్రవీణ్, నీకు కూడా ఇంత టాలెంటు ఉందా?? అదిరింది పో.. కాని అప్పుడప్పుడు నీ ప్రోగ్రెస్ ని చెపుతూ ఉండి. ఫోటోలతో సహా. లేకుంటే కాస్త డౌట్ పడాల్సి వస్తుంది.

 13. athmakatha said,

  :))

 14. athmakatha said,

  :))

 15. Anonymous said,

  బాగుంది మీ స్టొరీ…
  నేను కూడా జిమ్ము కెళ్ళే వాడిని…మంత్లీ ఒక్కసారి.

 16. Anonymous said,

  బాగుంది మీ స్టొరీ…నేను కూడా జిమ్ము కెళ్ళే వాడిని…మంత్లీ ఒక్కసారి.

 17. aswin budaraju said,

  ఎవరక్కడ.

  ప్రవీణ్ ప్రొఫైల్ లో పిక్ త్వరలోనే తీసెయ్యండి. సిక్స్ పాక్స్ పిక్ కి కెమెరా సిద్దాం చెయ్యండి.

 18. ఎవరక్కడ.ప్రవీణ్ ప్రొఫైల్ లో పిక్ త్వరలోనే తీసెయ్యండి. సిక్స్ పాక్స్ పిక్ కి కెమెరా సిద్దాం చెయ్యండి.

 19. Srini said,

  For better results regular Gym routine can helps and minimizes risk for injuries (repetitive).

 20. Srini said,

  For better results regular Gym routine can helps and minimizes risk for injuries (repetitive).

 21. GIREESH K. said,

  నేను కూడా, మూడు నెలల విరామం తరువాత, ఇవ్వాళే జిమ్ముకెల్లడం మొదలు పెట్టాను! గత రెండేళ్ళలో ఇలా “మూడు నెలల విరామం” ఎనిమిది సార్లు తీసుకున్నాను! :))))

 22. GIREESH K. said,

  నేను కూడా, మూడు నెలల విరామం తరువాత, ఇవ్వాళే జిమ్ముకెల్లడం మొదలు పెట్టాను! గత రెండేళ్ళలో ఇలా “మూడు నెలల విరామం” ఎనిమిది సార్లు తీసుకున్నాను! :))))

 23. సుజాత said,

  ప్రవీణ్, మీ హిమాయలాల ట్రెక్కింగ్ పోస్టులు నన్ను మీ అభిమానిగా మార్చేసాయి. కానీ మీరు కూడా
  కామెడీ మనుషులేనని నాకిప్పుడే తెలిసింది సుమా! నిజంగా భలే రాశారసలు!
  కొన్ని వాక్యాలు మళ్ళి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని నవ్వేలా ఉన్నాయి.
  “జనాల ప్రకారం” తీరిగ్గా తిని కూచుని చేసే ఉద్యోగం…
  “బూతు అని వినిపిస్తే నా బాధ్యత కాదు”
  “హల్క్ లాంటి…” చెస్టున్న వీరుడు..
  “కుక్క తోక వంకర లాంటి సామెత గుర్తొస్తే..”

  “ఫారెస్టు గంపు” మరీ సూపరు!

  చాలా బాగుంది. ఈ టపాని ప్రింట్ తీసి మా బిల్డింగ్ జిమ్ములో అంటిస్తానని ఒట్టేస్తున్నాను. ఒట్టు తీసి గట్టు మీద పెట్టనని ఇంకో ఒట్టేస్తున్నాను.

  గిరీష్,
  మీ కామెంట్ అదుర్స్!

 24. ప్రవీణ్, మీ హిమాయలాల ట్రెక్కింగ్ పోస్టులు నన్ను మీ అభిమానిగా మార్చేసాయి. కానీ మీరు కూడా కామెడీ మనుషులేనని నాకిప్పుడే తెలిసింది సుమా! నిజంగా భలే రాశారసలు! కొన్ని వాక్యాలు మళ్ళి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని నవ్వేలా ఉన్నాయి.”జనాల ప్రకారం” తీరిగ్గా తిని కూచుని చేసే ఉద్యోగం…”బూతు అని వినిపిస్తే నా బాధ్యత కాదు””హల్క్ లాంటి…” చెస్టున్న వీరుడు..”కుక్క తోక వంకర లాంటి సామెత గుర్తొస్తే..””ఫారెస్టు గంపు” మరీ సూపరు!చాలా బాగుంది. ఈ టపాని ప్రింట్ తీసి మా బిల్డింగ్ జిమ్ములో అంటిస్తానని ఒట్టేస్తున్నాను. ఒట్టు తీసి గట్టు మీద పెట్టనని ఇంకో ఒట్టేస్తున్నాను.గిరీష్,మీ కామెంట్ అదుర్స్!

 25. Bhasker said,

  తీరిగ్గా తిని కూర్చుని చేసే ఉద్యోగాలు చెసే వాళ్ళలొ మీ/నా లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారులెండి. పొట్ట తగ్గిద్దామని బొల్డన్ని డబ్బులు తగలెసి ట్రయినర్ కొని మూడు నెలలయింది. దుమ్ము కొట్టుకు పొతుంది .. ప్చ్ లాభం లేదు ఎదొ ఒకటి చెసేయాలి.
  మంచిగా వ్రాసారు.

 26. Bhasker said,

  తీరిగ్గా తిని కూర్చుని చేసే ఉద్యోగాలు చెసే వాళ్ళలొ మీ/నా లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారులెండి. పొట్ట తగ్గిద్దామని బొల్డన్ని డబ్బులు తగలెసి ట్రయినర్ కొని మూడు నెలలయింది. దుమ్ము కొట్టుకు పొతుంది .. ప్చ్ లాభం లేదు ఎదొ ఒకటి చెసేయాలి.మంచిగా వ్రాసారు.

 27. ప్రవీణ్ గార్లపాటి said,

  టపా నచ్చి వ్యాఖ్య చేసిన వారందరికీ తలో కండా ప్రాప్తిరస్తు 🙂

  @ చదువరి గారు:
  మరే! నా ముందు ఫోటో మీరు చూసే ఉంటారు. తర్వాత కనిపిస్తానో లేదో 🙂

  @ విహారి:
  మళ్ళీనా! నా వచ్చే టపా టెలీపతీ మీద రాయబోతున్నా 🙂

  @ పూర్ణిమ గారు:
  పట్టేసారూ! ఛాన్సు ఎలా వదులుకుంటాం ?
  సండే కాంప్లిమెంటుకి చాలా సంతోషం.

  @ జ్యోతి గారు:
  దీని సైడెఫెక్టు కూడా మీకు నిన్నే తెలిసింది కదా 🙂

  @ అశ్విన్:
  ముందే చెబితే ఓ బాడీ సూట్ ఏర్పాటు చేసుకుంటా 😉

  @ గిరీష్ గారు:
  కేక! మీరు నాకు సరిగ్గా సరిపోయే జోడీ.. మనం కలిసి జిమ్ముకెళ్ళాల్సిందే.

  @ సుజాత గారు:
  మీరు నా అభిమానా ? మరీనూ… మీరు కామెడీ దంచేస్తుంటే.

  @ మిగతా అందరికీ:
  నా మీద నమ్మకముంచి సీరియసుగా సలహాలు ఇచ్చిన వారికి, మీ కోసమయినా రేపు జిమ్ము దాకా నడిచి వెళ్ళొస్తా అని మనవి చేసుకుంటున్నా.

 28. టపా నచ్చి వ్యాఖ్య చేసిన వారందరికీ తలో కండా ప్రాప్తిరస్తు :-)@ చదువరి గారు:మరే! నా ముందు ఫోటో మీరు చూసే ఉంటారు. తర్వాత కనిపిస్తానో లేదో :-)@ విహారి:మళ్ళీనా! నా వచ్చే టపా టెలీపతీ మీద రాయబోతున్నా :)@ పూర్ణిమ గారు:పట్టేసారూ! ఛాన్సు ఎలా వదులుకుంటాం ?సండే కాంప్లిమెంటుకి చాలా సంతోషం.@ జ్యోతి గారు:దీని సైడెఫెక్టు కూడా మీకు నిన్నే తెలిసింది కదా :-)@ అశ్విన్:ముందే చెబితే ఓ బాడీ సూట్ ఏర్పాటు చేసుకుంటా ;-)@ గిరీష్ గారు:కేక! మీరు నాకు సరిగ్గా సరిపోయే జోడీ.. మనం కలిసి జిమ్ముకెళ్ళాల్సిందే.@ సుజాత గారు:మీరు నా అభిమానా ? మరీనూ… మీరు కామెడీ దంచేస్తుంటే.@ మిగతా అందరికీ:నా మీద నమ్మకముంచి సీరియసుగా సలహాలు ఇచ్చిన వారికి, మీ కోసమయినా రేపు జిమ్ము దాకా నడిచి వెళ్ళొస్తా అని మనవి చేసుకుంటున్నా.

 29. అబ్రకదబ్ర said,

  జిమ్ క్యారీ అంటే మీరేనన్నమాట. ఎన్ని పెట్టెలొచ్చాయిప్పటిదాకా?

 30. జిమ్ క్యారీ అంటే మీరేనన్నమాట. ఎన్ని పెట్టెలొచ్చాయిప్పటిదాకా?

 31. రాధిక said,

  హా హా అదిరింది.నా సైకిల్ దుమ్ముపట్టి,బూజులు వేలాడుతూ హాలు మధ్యలో కళాఖంఢంలా వ్లుగొందిపోతుంది.నువ్వు తొక్కకపోయినా అట్లీస్టు దాని దుమ్ము దులుపు చూడలేకపోతున్నాం అని మావారు గోల చేసినా నాచెవులు ఆ క్షణం పనిచెయ్యవు.నాకెందుకు అంత పట్టుదల మటే అది క్లీన్ గా వుంటే ఏదో ఒక బలహీన క్షణంలో తొక్కాలనిపిస్తుంది.అదే మట్టికొట్టుకుపోయి వుందనుకోండి శుభ్రం చెయ్యాలన్న ఆలోచనతోనే తొక్కాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది కదా.ఎక్సర్ సైజు అంటే నాకు అంత బద్ధకం అన్నమాట.దానికి తగ్గట్టే వుంటాననుకోండి భారీగా.

 32. హా హా అదిరింది.నా సైకిల్ దుమ్ముపట్టి,బూజులు వేలాడుతూ హాలు మధ్యలో కళాఖంఢంలా వ్లుగొందిపోతుంది.నువ్వు తొక్కకపోయినా అట్లీస్టు దాని దుమ్ము దులుపు చూడలేకపోతున్నాం అని మావారు గోల చేసినా నాచెవులు ఆ క్షణం పనిచెయ్యవు.నాకెందుకు అంత పట్టుదల మటే అది క్లీన్ గా వుంటే ఏదో ఒక బలహీన క్షణంలో తొక్కాలనిపిస్తుంది.అదే మట్టికొట్టుకుపోయి వుందనుకోండి శుభ్రం చెయ్యాలన్న ఆలోచనతోనే తొక్కాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది కదా.ఎక్సర్ సైజు అంటే నాకు అంత బద్ధకం అన్నమాట.దానికి తగ్గట్టే వుంటాననుకోండి భారీగా.

 33. సిరిసిరిమువ్వ said,

  జిమ్ముకెళ్ళి కండ పెంచటం ఏమో కాని మాకు మంచి హాస్యాన్ని మాత్రం వడ్డించారు. ఇంతకీ మాకు మీ కండలు ఎప్పుడు చూపిస్తారు?

 34. జిమ్ముకెళ్ళి కండ పెంచటం ఏమో కాని మాకు మంచి హాస్యాన్ని మాత్రం వడ్డించారు. ఇంతకీ మాకు మీ కండలు ఎప్పుడు చూపిస్తారు?

 35. Nani & Choti said,

  బాగుంది రా.త్వరలో మా 8 ప్యాక్ ప్రవీన్ని చూడాలని ఆసిస్తున్నా:).
  2006 లో మా రూంలో పోటిలు పడి జింకి ఎమొగానీ విటమిన్ స్టోర్కి మటుకు వెల్లేవాల్లు,:) . ఒక రూమీ ఐతే రైస్ తింటూ పట్టుకుంటే 20 $ భహుమతి కూడా ప్రకటించాడు:)

 36. Nani & Choti said,

  బాగుంది రా.త్వరలో మా 8 ప్యాక్ ప్రవీన్ని చూడాలని ఆసిస్తున్నా:). 2006 లో మా రూంలో పోటిలు పడి జింకి ఎమొగానీ విటమిన్ స్టోర్కి మటుకు వెల్లేవాల్లు,:) . ఒక రూమీ ఐతే రైస్ తింటూ పట్టుకుంటే 20 $ భహుమతి కూడా ప్రకటించాడు:)

 37. రవి said,

  బావుంది.:-)నాకూ మీ లాగే జిమ్ము ని చూస్తే ఎదలో కోటి డ్రమ్ములు మోగుతాయి. ఆన్ సైట్ వెళ్ళినప్పుడల్లా, అక్కడ హోటళ్ళలో జిమ్ములు చూసి, ఉన్న ఆ కొన్ని నెలలు కండ పెంచడం, తిరిగి మన దేశానికి రాగానే, బొజ్జ పెంచడం…ఇలా అవుతోంది. ఇప్పుడు “యూత్” స్టేజి దాటిపోయింది కదా అని సరిపెట్టుకుంటున్నాను.

 38. రవి said,

  బావుంది.:-)నాకూ మీ లాగే జిమ్ము ని చూస్తే ఎదలో కోటి డ్రమ్ములు మోగుతాయి. ఆన్ సైట్ వెళ్ళినప్పుడల్లా, అక్కడ హోటళ్ళలో జిమ్ములు చూసి, ఉన్న ఆ కొన్ని నెలలు కండ పెంచడం, తిరిగి మన దేశానికి రాగానే, బొజ్జ పెంచడం…ఇలా అవుతోంది. ఇప్పుడు “యూత్” స్టేజి దాటిపోయింది కదా అని సరిపెట్టుకుంటున్నాను.

 39. సుజాత said,

  అయినా ఈ ఆరు పెట్టెలు పెంచిన సినిమా హీరోలని చూస్తున్నాం కదా! ఒంటి మీద పెట్టెల సంగతి ఏమో గానీ మొహంలో శవం కళ వచ్చేసింది వీళ్ళందరికీ, షారూకూ, సల్మానూ, తెలుగులో నితినూ(వీడొక అర్భకుడు, వీడికీ 6 పెట్టెలు కావాలి) వీళ్ళందరూ ఆరు పెట్టెలు పెంచాక మొహంలో కళా కాంతులూ కోల్పోయి, చచ్చిన శవం మొహాలేసుకుని ఏడుస్తున్నారు.

  ప్రవీణ్,
  అందువల్ల, పెట్టెలు ముఖ్యం కాదు, హెల్దీ గా ఉండటం ముఖ్యం! అమ్మాయిలు పెట్టెలకీ, సూట్ కేసులకీ పడరు. దేనికి పడతారంటారా….టపా రాస్తాను లెండి దాని గురించి!మిమ్మల్ని కొత్త ఫొటో పెట్టమని నేను అడగను, ఎందుకంటే మీ జిమ్ము ప్రోగ్రాం కంటిన్యూ చేస్తారో లేదో అని డౌటు!

 40. అయినా ఈ ఆరు పెట్టెలు పెంచిన సినిమా హీరోలని చూస్తున్నాం కదా! ఒంటి మీద పెట్టెల సంగతి ఏమో గానీ మొహంలో శవం కళ వచ్చేసింది వీళ్ళందరికీ, షారూకూ, సల్మానూ, తెలుగులో నితినూ(వీడొక అర్భకుడు, వీడికీ 6 పెట్టెలు కావాలి) వీళ్ళందరూ ఆరు పెట్టెలు పెంచాక మొహంలో కళా కాంతులూ కోల్పోయి, చచ్చిన శవం మొహాలేసుకుని ఏడుస్తున్నారు. ప్రవీణ్,అందువల్ల, పెట్టెలు ముఖ్యం కాదు, హెల్దీ గా ఉండటం ముఖ్యం! అమ్మాయిలు పెట్టెలకీ, సూట్ కేసులకీ పడరు. దేనికి పడతారంటారా….టపా రాస్తాను లెండి దాని గురించి!మిమ్మల్ని కొత్త ఫొటో పెట్టమని నేను అడగను, ఎందుకంటే మీ జిమ్ము ప్రోగ్రాం కంటిన్యూ చేస్తారో లేదో అని డౌటు!

 41. Falling Angel said,

  సుజాతగారు, ఆ టపా ఏదో రాసి పుణ్యం కట్టుకోండి 🙂
  బె.పు.బ్లా.సం తరపున మిమ్మల్ని సత్కరించే పూచీ నాది.

 42. సుజాతగారు, ఆ టపా ఏదో రాసి పుణ్యం కట్టుకోండి :)బె.పు.బ్లా.సం తరపున మిమ్మల్ని సత్కరించే పూచీ నాది.

 43. రానారె said,

  జిమ్మేశావ్ పో! :-)))

 44. జిమ్మేశావ్ పో! :-)))

 45. ప్రవీణ్ గార్లపాటి said,

  @ అబ్రకదబ్ర:
  పెట్టెలు ఇవ్వడమే గానీ తీసుకుంది లేదు ఇంతవరకూ 😛
  జిమ్ క్యారీ… హహహ.

  @ రాధిక గారు:
  మనం మనం ఒకటే బాపతు. 🙂

  @ సిరిసిరిమువ్వ గారు:
  టపా మొదట్లోనే చూపించా కదండీ… చూడలేదా.
  సరే మీకోసం మళ్ళీ ఓసారి. ఊ.. హుం…

  @ భరత్:
  మరీ నువ్వొక్కడివే పెంచితే బాగుండదని తోడుగా …

  @ రవి:
  భలే! నాకయితే అప్పుడే “పోకిరి” లో “నువ్వు నేనూ యూతేంటంకుల్” డైలాగు గుర్తుకొచ్చేస్తుంది.

  @ సుజాత గారు:
  మాకు వేంటనే ఆ టపా కావాలి…

  సిక్స్ పాకు, శవం కళ మాత్రం ఒప్పుకోవాల్సిందే.

  @ falling angel:
  ఓహో! మీరూ మా సంఘం మనిషేనా ? చెప్పరే ???

  @ రానారె:
  పోదూ! నీ చెయ్యి తిరిగిన కళాకారుడి టైపులో నా కండలు తిరుగుతాయి. 🙂

 46. @ అబ్రకదబ్ర:పెట్టెలు ఇవ్వడమే గానీ తీసుకుంది లేదు ఇంతవరకూ :Pజిమ్ క్యారీ… హహహ.@ రాధిక గారు:మనం మనం ఒకటే బాపతు. :-)@ సిరిసిరిమువ్వ గారు:టపా మొదట్లోనే చూపించా కదండీ… చూడలేదా.సరే మీకోసం మళ్ళీ ఓసారి. ఊ.. హుం… @ భరత్:మరీ నువ్వొక్కడివే పెంచితే బాగుండదని తోడుగా …@ రవి:భలే! నాకయితే అప్పుడే “పోకిరి” లో “నువ్వు నేనూ యూతేంటంకుల్” డైలాగు గుర్తుకొచ్చేస్తుంది.@ సుజాత గారు:మాకు వేంటనే ఆ టపా కావాలి…సిక్స్ పాకు, శవం కళ మాత్రం ఒప్పుకోవాల్సిందే.@ falling angel:ఓహో! మీరూ మా సంఘం మనిషేనా ? చెప్పరే ???@ రానారె:పోదూ! నీ చెయ్యి తిరిగిన కళాకారుడి టైపులో నా కండలు తిరుగుతాయి. 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: