అక్టోబర్ 3, 2008

చిక్కమగళూరు ట్రావెలాగుడు …

Posted in అనుభవాలు, చిక్కమగళూరు, ట్రావెలాగుడు, ట్రెక్కింగ్ వద్ద 7:35 సా. ద్వారా Praveen Garlapati

భారతంలో పొడవాటి వారాంతం (మధ్యలో ఒక సెలవు పెడితే ఐదు రోజులు) కావడంతో ఎప్పటిలాగే ఎలాంటి ప్లానూ లేకుండానే మంగళవారం ఆఫీసుకెళ్ళాను.

నా సహోద్యోగి ఒకతను మేము చిక్కమగళూరుకి వెళుతున్నాము వస్తావా ? అని అడిగాడు. ఎప్పటిలాగే ఇంకో లాస్ట్ మినట్ ట్రిప్పుకి రెడీ అయ్యాను.

ఆ రోజు రాత్రి బయలుదేరి మళ్ళీ శుక్రవారం పొద్దున్నకి తిరిగి వచ్చేటట్టు అనుకున్నాము. రాత్రి పదకొండున్నరకి ఇంటి నుంచి బయలుదేరాలి. అయితే మన భారత కాలామానం ప్రకారం పన్నెండున్నర కల్లా బయలుదేరాము.
క్వాలిస్ ఒకటి మాట్లాడుకుని దాంట్లో ఎక్కగానే నాకిష్టమయిన పని మొదలెట్టేసాను. ఇంకేంటి పడక. అదేంటో జనాలకి క్యాబుల్లోనూ, బస్సుల్లోనూ నిద్ర రాదు కానీ నాకయితే ముంచుకొచ్చేస్తుంది.

ఇక మధ్యలో ఒకట్రెండు బ్రేకులేసి టీ తాగి మళ్ళీ నా నిద్ర కొనసాగించాను. ఎలాగయితే పొద్దున్నే ఆరింటికల్లా చిక్కమగళూరు చేరుకున్నాము.
(చిక్కమగళూరు అంటే చిన్న కూతురి ఊరు అని అర్థం కన్నడంలో. ఈ ఊరుని ఏదో రాజు తన చిన్న కూతురికి కట్నంగా ఇచ్చాడని ఒక కథగా వికీపీడియాలో చదివాను.)

ఒక మోస్తరు (అంతకంటే అక్కడ లేవు) హోటల్లో దిగి మళ్ళీ పడక. చిక్కమగళూరులో చూడడానికంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. మంచి వ్యూ పాయింట్లకీ, ట్రెక్కింగుకీ అనువయిన స్థలం.
పదింటికల్లా తయారయి ఘాట్ రోడ్డెక్కి ప్రయాణం చేస్తుండగానే వాతావరణంలో మార్పు కనిపించసాగింది. నెమ్మదిగా మంచుతో కూడిన మబ్బుల మధ్యలో నుంచి మా వాహనం వెళుతూంది. భలే ఆహ్లాదంగా ఉంది వాతావరణం.

అలా ఒక గంట సేపు ప్రయాణం చేసిన తరువాత “సీతాళయ్యన మఠా”నికి చేరుకున్నాము. అప్పటికి అక్కడ బాగా దట్టంగా మంచు కమ్ముకుని ఉంది. ఒక చిన్న గుడి కూడా ఉంది.

మాతో పాటూ వచ్చిన ఒక స్నేహితుడికి అది సొంతూరు. అక్కడి లోకలు స్పెషల్సుని మా మధ్యాహ్న భోజనానికి ఆర్డరు చేసాడు కింద. మా డ్రైవరుని అది తేవడానికి పంపి “ముళ్ళయ్యన గిరి” ట్రెక్కింగు మొదలెట్టాము. చిరు చలిగా ఉన్న ఆ వాతావరణంలో మాంచి పచ్చదనం ఉన్న దట్టమయిన చెట్ల మధ్య నుంచి ట్రెక్కింగు చెయ్యడం ఒక మంచి అనుభూతి.

రెండు ప్రదేశాలకీ దూరం బానే ఉంది. కానీ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే సమయం తెలియలేదు. ఇంతకు ముందు అనుభవాల వల్ల మరీ అలసటగా కూడా అనిపించలేదు నాకు. మధ్య మధ్యలో ఆగుతూ, బిస్కెట్లు, చిప్సూ మేస్తూ మేము చేరాల్సిన కొండ దిగువకి చేరుకున్నాము. అక్కడ నుంచి మెట్లున్నాయి. అవి ఎక్కితే చక్కగా కొండ పైకి చేరుకోవచ్చు. ఆ ప్రదేశం కర్ణాటకలోనే ఎత్తయిన ప్రదేశం అట.

అక్కడ వ్యూ చాలా బాగుంది. చెప్పుకోవడానికి ఏదో గుడిలాంటిది ఉందక్కడ. ఒక గంట సేపు అక్కడ గడిపి మా బెటాలియనుకి రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసి నెమ్మదిగా తిరిగి “సీతాళయ్యన మఠా”నికి చేరుకున్నాము. మా డ్రైవరుదీ చిక్కమగళూరు సొంతూరు కావడంతో కేవలం ఒక గంట ఆలస్యంగా మా మేత తీసుకొచ్చాడు. అప్పటికే ఆకలితో నకనక లాడుతోంది మాకు. అది కొండ ప్రాంతం, మేము వెళ్ళాల్సింది ఆ దారే కావడంతో మధ్యలో ఆపి తిండి తిందామని ప్లాను. కాకపోతే తినడానికి అనువయిన ప్రదేశమే దొరకలేదు.
చివరాఖరికి ఒక చిన్న సైజు ట్రెక్కు చేసి ఒక కొండ మీదకి చేరి అక్కడ తినడానికి కూర్చున్నాము. అక్కీ రోటీ, వంకాయ కూర లాంటి వాటితో ఓ మోస్తరుగా లాగించాము.

అక్కడ నుంచి ఇంకో రెండు ప్రదేశాలు చూడడానికి బయలుదేరాము. బాగా అలసిపోయామేమూ ఇంకో కునుకేసాము. జోరుగా వర్షం మొదలయింది. ఆ వర్షంలోనే చూడాల్సిన రెండు ప్రదేశాలూ చూసి వెనక్కొచ్చాము. రాత్రికి ఏదో తిన్నామనిపించి బెడ్డెక్కితే మళ్ళీ పొద్దున్నే లేవడం.

మాతో పాటూ వచ్చిన లోకలు స్నేహితుడికి అక్కడికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఒక రిసార్టు ఉంది. ఇక మరుసటి రోజు మొత్తం అక్కడ గడపాలని ప్లాను.
ఆ రిసార్టు పేరు “రొట్టికల్లు”. దాని అర్థం నన్నడక్కండి. నాకు తెలీదు.

అక్కడికి చేరిన తరువాత అతను మమ్మల్ని సైటు సీయింగుకి తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశం బాగా తెలిసిందే అతనికి. చెట్లూ, పుట్టల మధ్య నుంచి మమ్మల్ని ఓ చిన్న సెలయేరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని ప్లానన్నమాట. సెలయేరు చక్కగా పారుతోంది. ఆ పారే నీళ్ళ చప్పుడు నాకు భలే ఇష్టం. అలా దాంట్లో నుంచి చాలా సేపు అడ్వెంచర్ చేసాం. ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్ళరు లాగుంది. మేమే దారి చేసుకుంటూ వెళ్ళాము. అదో చక్కని అనుభవం.

అలా దాంట్లో నడుస్తూ వెళితే ఆఖరికి ఒక చిన్న సైజు జలపాతానికి చేరుకున్నాము. అసలే మనకి నీళ్ళంటే చాలా ఇష్టము. ఇక ఆ జలపాతం కింద ఒక గంట గడిపిన తరువాత వెనక్కి బయల్దేరాము.
వెనక్కొచ్చేటప్పుడు నా కాలికి ఏదో నల్లనిది అంటుకుని ఉందని నా స్నేహితుడు చెప్పగానే చూస్తే జలగ. దానిని పీకి ముందుకెళుతుంటే ఒక్కొక్కరికీ పట్టిన జలగలు కనిపిస్తున్నాయి. అందరికీ తలా ఒక రవుండు అయిన తర్వాత మళ్ళీ నా వంతు వచ్చింది. ఓ రెండు జలగలు పట్టకుండానే పీకితే, మరో మూడిటికి రక్త దానం చేసాను. పట్టిన ప్రదేశంలోనే మళ్ళీ పట్టడంతో రక్తం చాలా సేపు ఆగలేదు.

అదో కొత్త అనుభవం. 🙂

రిసార్టుకి తిరిగొచ్చి సుష్ఠుగా లాగించి కాసేపు అక్కడ ఉయ్యాలలాంటి దాంట్లో ఒక చిన్న కునుకు తీసాను నేను. మా వాళ్ళు బాతాఖానీ మొదలెట్టారు.
ఒక గంట తర్వాత వాలీ బాలు ఆడిన తర్వాత ఆ రిసార్టుకే ఆనుకుని ఉన్న సెలయేట్లో స్నానం చేసి వెనక్కి బయలుదేరాము.

అనుకోకుండా కుదిరే నా ట్రిప్పులు భలే బాగుంటాయి. మళ్ళీ లాంగు వీకెండు వరకూ ఈ అనుభవాలతోనే 🙂

54 వ్యాఖ్యలు »

 1. sujata said,

  Very nice pictures. I would plan for chikmangulur this year. Is it okay to plan a trip in Nov ?

  jalaga padite noppestunda ?

 2. sujata said,

  Very nice pictures. I would plan for chikmangulur this year. Is it okay to plan a trip in Nov ? jalaga padite noppestunda ?

 3. మేధ said,

  టపా బావుంది.. ఫొటోస్ బావున్నాయి.. కానీ, టపాలోని మొదటి వాక్యం – “పొడవాటి వారాంతం” అసలు నచ్చలేదు..! పైగా చాలా బాధగా అనిపించింది… 😦

 4. మేధ said,

  టపా బావుంది.. ఫొటోస్ బావున్నాయి.. కానీ, టపాలోని మొదటి వాక్యం – “పొడవాటి వారాంతం” అసలు నచ్చలేదు..! పైగా చాలా బాధగా అనిపించింది… 😦

 5. సత్యసాయి కొవ్వలి said,

  బాగుంది. మీ కండలపెంపు పధకానికి చిహ్నంగా రిసార్టులో విగ్రహం పెట్టించినట్లున్నారు? :))

 6. బాగుంది. మీ కండలపెంపు పధకానికి చిహ్నంగా రిసార్టులో విగ్రహం పెట్టించినట్లున్నారు? :))

 7. మీనాక్షి said,

  inkaa..himaalayaalaku vellalane korika naku teerane ledu..malli
  meeru ila chikkamaguluru gurinchi raaseste elagandi..
  …………………….
  pics chaalaaaa baaunnaayi..
  hmmmm..mari neneppudu veltaanO 😦

 8. inkaa..himaalayaalaku vellalane korika naku teerane ledu..mallimeeru ila chikkamaguluru gurinchi raaseste elagandi………………………pics chaalaaaa baaunnaayi..hmmmm..mari neneppudu veltaanO 😦

 9. Purnima said,

  ఇది బెంగళూరు నుండి ఎంత దూరం, ఆ ఊరివారితో పరిచయం లేకపోతే ఎలా వెళ్ళేది, లాంటి విషయాలు కూడా జతచేరిస్తే, మా వాళ్ళకీ లింక్ పంపుకుంటాను.

  ఇలా బోలెడన్ని ఊర్లు తిరిగేసి, బ్లాగుల్లో రాస్తే, మేమవైనా తిరిగేసుకుంటాము! 🙂

  Beautiful pictures!

 10. Purnima said,

  ఇది బెంగళూరు నుండి ఎంత దూరం, ఆ ఊరివారితో పరిచయం లేకపోతే ఎలా వెళ్ళేది, లాంటి విషయాలు కూడా జతచేరిస్తే, మా వాళ్ళకీ లింక్ పంపుకుంటాను. ఇలా బోలెడన్ని ఊర్లు తిరిగేసి, బ్లాగుల్లో రాస్తే, మేమవైనా తిరిగేసుకుంటాము! :-)Beautiful pictures!

 11. చైతన్య said,

  ప్రవీణ్ గారు చాలా బాగుంది మీ టపా. మీ టపా చదివిన వెంటనే చిక్కమగళూరు చెక్కేయాలి అని ఉంది మరి త్వరలో ప్లాన్ చేసుకోవాలి. ఇంతకు ముందు ఒక సారి వెళ్ళాలి అనుకున్నాం కాని కుదరలేదు , కాని ఈ సారి మిస్ కాకూడదు.

 12. ప్రవీణ్ గారు చాలా బాగుంది మీ టపా. మీ టపా చదివిన వెంటనే చిక్కమగళూరు చెక్కేయాలి అని ఉంది మరి త్వరలో ప్లాన్ చేసుకోవాలి. ఇంతకు ముందు ఒక సారి వెళ్ళాలి అనుకున్నాం కాని కుదరలేదు , కాని ఈ సారి మిస్ కాకూడదు.

 13. Raj said,

  ఫోటోలు చాలా బాగున్నాయి.

 14. Raj said,

  ఫోటోలు చాలా బాగున్నాయి.

 15. ramya said,

  అప్పుడు హిమాలయాలు ఇప్పుడు ఇది, ఓ టూర్లకు టూర్లు కొట్టేస్తున్నారు ఒక్కదానికైన మమ్మల్ని పిలిచారాఅయ్యా!(మహేష్ బాబు ఉప్మా డవిలాగ్ లా చదుకో గలరు)

 16. ramya said,

  అప్పుడు హిమాలయాలు ఇప్పుడు ఇది, ఓ టూర్లకు టూర్లు కొట్టేస్తున్నారు ఒక్కదానికైన మమ్మల్ని పిలిచారాఅయ్యా!(మహేష్ బాబు ఉప్మా డవిలాగ్ లా చదుకో గలరు)

 17. ramya said,

  చిక్క మంగుళూరు చక్కగా ఉంది!
  చాలా అందమైన రిసార్ట్ పొటోలు బావున్నాయ్.

 18. ramya said,

  చిక్క మంగుళూరు చక్కగా ఉంది!చాలా అందమైన రిసార్ట్ పొటోలు బావున్నాయ్.

 19. కత్తి మహేష్ కుమార్ said,

  మీరు ట్రావెలాగుల్లో భలే అదరగొడతారండీ!

 20. మీరు ట్రావెలాగుల్లో భలే అదరగొడతారండీ!

 21. కొత్త పాళీ said,

  You’re becoming a seasoned traveller and taveloguer. good show.
  Pics are beautiful.
  Keep them in your pictur eblog with brief individual explanations.
  @satyasai meshtaru .. ha ha ha

 22. You’re becoming a seasoned traveller and taveloguer. good show.Pics are beautiful.Keep them in your pictur eblog with brief individual explanations.@satyasai meshtaru .. ha ha ha

 23. రిషి said,

  ఫొటోస్ బాగున్నాయ్.

  మీరు ‘గోపాలస్వామి బెట్ట ‘ వెళ్ళారా ? కర్నాటక లో అది కూడా చాలా మంచి ట్రెకింగ్ స్పాట్.

 24. రిషి said,

  ఫొటోస్ బాగున్నాయ్.మీరు ‘గోపాలస్వామి బెట్ట ‘ వెళ్ళారా ? కర్నాటక లో అది కూడా చాలా మంచి ట్రెకింగ్ స్పాట్.

 25. రానారె said,

  హలో ప్రవీణ్,
  సంతోషంగా వుంది. నీకు మరిన్ని టూర్లు ప్రాప్తిరస్తు. బొమ్మలు భలే వున్నాయ్. ఫోటోలు తీయడంలో మంచి మెరుగుదల కనిపిస్తోంది! ప్రత్యేక తరగతులేమైనా…? 🙂

 26. హలో ప్రవీణ్, సంతోషంగా వుంది. నీకు మరిన్ని టూర్లు ప్రాప్తిరస్తు. బొమ్మలు భలే వున్నాయ్. ఫోటోలు తీయడంలో మంచి మెరుగుదల కనిపిస్తోంది! ప్రత్యేక తరగతులేమైనా…? 🙂

 27. Madhu said,

  మీ టూర్ బాగా ఎంజాయ్ చేసారని…ఫొటోస్ చెబుతున్నాయ్.

  @sujata gaaru: జలగ పట్టి రక్తం ఆగలేదు అని ప్రవీణ్ గారు రాస్తే…మీరు నొప్పేస్తుందా అంటారేమిటండీ 🙂

 28. Madhu said,

  మీ టూర్ బాగా ఎంజాయ్ చేసారని…ఫొటోస్ చెబుతున్నాయ్.@sujata gaaru: జలగ పట్టి రక్తం ఆగలేదు అని ప్రవీణ్ గారు రాస్తే…మీరు నొప్పేస్తుందా అంటారేమిటండీ 🙂

 29. ప్రవీణ్ గార్లపాటి said,

  @sujata గారు:
  చిక్కమగళూరు వెళ్ళడానికి ఇది మంచి సమయం. వానాకాలం ఇప్పుడే ముగిసింది కదా !
  నవంబరులో కొద్దిగా చలిగా ఉండచ్చు. ఇంత చక్కని వ్యూ దొరుకుతుందో డౌటే !

  జలగ పడితే కొంత నొప్పెడుతుందండీ. రక్తం సులువుగా రావడానికి ఒక రకమయిన లాలాజలాన్ని అది విడుదల చేస్తుంది.
  దాని వల్ల రక్తం అంత త్వరగా గడ్డకట్టకుండా కారుతుంది.

  @మేధ:
  ఓ రెండు రోజులు మీ ఆన్సైటులో లీవు పెట్టండి చెబుతా 🙂

  @కొవ్వలి గారు:
  హహహ… చూసారా, ఇక్కడ దాకా పాకిపోయింది ఆ వార్త.

  @మీనాక్షి:
  మరే ఓ రోజు బ్లాగు రాయడం మాని ఓ ట్రిప్పు వేసెయ్యడమే…

 30. @sujata గారు:చిక్కమగళూరు వెళ్ళడానికి ఇది మంచి సమయం. వానాకాలం ఇప్పుడే ముగిసింది కదా !నవంబరులో కొద్దిగా చలిగా ఉండచ్చు. ఇంత చక్కని వ్యూ దొరుకుతుందో డౌటే !జలగ పడితే కొంత నొప్పెడుతుందండీ. రక్తం సులువుగా రావడానికి ఒక రకమయిన లాలాజలాన్ని అది విడుదల చేస్తుంది.దాని వల్ల రక్తం అంత త్వరగా గడ్డకట్టకుండా కారుతుంది.@మేధ:ఓ రెండు రోజులు మీ ఆన్సైటులో లీవు పెట్టండి చెబుతా :-)@కొవ్వలి గారు:హహహ… చూసారా, ఇక్కడ దాకా పాకిపోయింది ఆ వార్త.@మీనాక్షి:మరే ఓ రోజు బ్లాగు రాయడం మాని ఓ ట్రిప్పు వేసెయ్యడమే…

 31. ప్రవీణ్ గార్లపాటి said,

  @purnima:
  ఊ… ఆ ఆలోచనే నాకు తట్టలేదు.
  బెంగుళూరు నుంచి చిక్కమగళూరు ఓ రెండొందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది.
  బస్సు ద్వారా కూడా రీచబులిటీ ఉంది.

  అక్కడ ఊరి వాళ్ళతో పరిచయం పెద్ద అవసరం లేదు. కాకపోతే చుట్టుపక్కల ప్రదేశాలు తిరగడానికి వీలుగా ఓ వాహనం చేతిలో ఉంటే చాలా సదుపాయం.
  రిసార్టులు ఈ మధ్యనే వస్తున్నాయి అక్కడ.

  @చైతన్య:
  తప్పకుండా ప్లాన్ చెయ్యండి. వెళ్ళడానికి ఇది మంచి టైము కూడాను.

  @raj:
  థాంక్స్.

  @ramya గారు:
  నాకే లాస్టు మినట్ లో తెలిసింది.
  అవును రిసార్టు సింపుల్ గా ఉన్నా ఆహ్లాదకరంగా ఉంది.

  @మహేష్:
  Thanks for the compliment.

  @కొత్త పాళీ గారు:
  థాంక్యూ.. థాంక్యూ…
  తప్పకుండా పెడతాను.

  @రిషి:
  దాని చుట్టుపక్కలకి వెళ్ళినా అక్కడికి వెళ్ళలేకపోయానండీ. ఈ సారి ప్రయత్నిస్తాను.

  రానారె:
  భలే! ఫోటోలు తీయడంలో తరగతులా. కొన్ని టిప్పులేమయినా ఇటు పారెయ్యరాదూ 🙂

  @madhu:
  పట్టినప్పుడు అసలు తెలీదండీ. అందుకే చాలా సేపు రక్తం పీల్చగలుగుతుంది.
  నాకు రెండో సారి పట్టినప్పుడు మాత్రం నొప్పిగా అనిపించింది. అందుకే వెంటనే తీసెయ్యగలిగాను.

 32. @purnima:ఊ… ఆ ఆలోచనే నాకు తట్టలేదు. బెంగుళూరు నుంచి చిక్కమగళూరు ఓ రెండొందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది.బస్సు ద్వారా కూడా రీచబులిటీ ఉంది.అక్కడ ఊరి వాళ్ళతో పరిచయం పెద్ద అవసరం లేదు. కాకపోతే చుట్టుపక్కల ప్రదేశాలు తిరగడానికి వీలుగా ఓ వాహనం చేతిలో ఉంటే చాలా సదుపాయం.రిసార్టులు ఈ మధ్యనే వస్తున్నాయి అక్కడ.@చైతన్య:తప్పకుండా ప్లాన్ చెయ్యండి. వెళ్ళడానికి ఇది మంచి టైము కూడాను.@raj:థాంక్స్.@ramya గారు:నాకే లాస్టు మినట్ లో తెలిసింది. అవును రిసార్టు సింపుల్ గా ఉన్నా ఆహ్లాదకరంగా ఉంది.@మహేష్:Thanks for the compliment.@కొత్త పాళీ గారు:థాంక్యూ.. థాంక్యూ… తప్పకుండా పెడతాను. @రిషి:దాని చుట్టుపక్కలకి వెళ్ళినా అక్కడికి వెళ్ళలేకపోయానండీ. ఈ సారి ప్రయత్నిస్తాను.రానారె:భలే! ఫోటోలు తీయడంలో తరగతులా. కొన్ని టిప్పులేమయినా ఇటు పారెయ్యరాదూ :-)@madhu:పట్టినప్పుడు అసలు తెలీదండీ. అందుకే చాలా సేపు రక్తం పీల్చగలుగుతుంది.నాకు రెండో సారి పట్టినప్పుడు మాత్రం నొప్పిగా అనిపించింది. అందుకే వెంటనే తీసెయ్యగలిగాను.

 33. Nani & Choti said,

  ఫొటోలు చాలా బాగున్నయి రా ప్రవీన్.మన కాలేజి ట్రిప్స్ గుర్తు వచ్చెలా రాశావు.

 34. Nani & Choti said,

  ఫొటోలు చాలా బాగున్నయి రా ప్రవీన్.మన కాలేజి ట్రిప్స్ గుర్తు వచ్చెలా రాశావు.

 35. చిలమకూరు విజయమోహన్ said,

  మంచి నైపుణ్యంతో తీసిన ఫోటోలతో చిక్కమగుళూర్ ను కళ్లక కట్టినట్లుగా ఆవిష్కరింపచేశారు.

 36. మంచి నైపుణ్యంతో తీసిన ఫోటోలతో చిక్కమగుళూర్ ను కళ్లక కట్టినట్లుగా ఆవిష్కరింపచేశారు.

 37. ప్రపుల్ల చంద్ర said,

  బాగున్నాయి మీ ప్రయాణవిశేషాలు… ఫోటోలు కూడా చాలా బాగున్నాయి.

 38. బాగున్నాయి మీ ప్రయాణవిశేషాలు… ఫోటోలు కూడా చాలా బాగున్నాయి.

 39. శ్రీ said,

  బాగుంది మీ ట్రిప్! హిమాలయాల దాకా వెళ్ళినవారు పక్కనే ఉన్న చిక్ మగళూరుకి ఇపుడు వెళ్ళారనమాట! పొగ మంచులో చిక్ మగళూరు చాలా బాగుంది.

 40. శ్రీ said,

  బాగుంది మీ ట్రిప్! హిమాలయాల దాకా వెళ్ళినవారు పక్కనే ఉన్న చిక్ మగళూరుకి ఇపుడు వెళ్ళారనమాట! పొగ మంచులో చిక్ మగళూరు చాలా బాగుంది.

 41. రవి said,

  నేనూ ఓ నెల క్రితమే ఆ చుట్టుపక్కల తిరిగాను (కంపనీ డబ్బుతో :-))…సూపర్ ప్లేస్…అక్కడే ఓ టీ షాపు పెట్టుకుని, లైఫ్ లో సెటిల్ అవాలి అని అనుకుంటున్నాను. 🙂

 42. రవి said,

  నేనూ ఓ నెల క్రితమే ఆ చుట్టుపక్కల తిరిగాను (కంపనీ డబ్బుతో :-))…సూపర్ ప్లేస్…అక్కడే ఓ టీ షాపు పెట్టుకుని, లైఫ్ లో సెటిల్ అవాలి అని అనుకుంటున్నాను. 🙂

 43. ప్రవీణ్ గార్లపాటి said,

  @భరత్:
  కదూ! నాకూ అచ్చంగా మన కాలేజీ ట్రిప్పులే గుర్తొచ్చాయి…
  మరపురాని రోజులవి 🙂

  @విజయమోహన్ గారు:
  మనసు నిండింది మీ వ్యాఖ్యతో…

  @ప్రపుల్ల గారు:
  థాంక్సండీ

  @శ్రీ:
  భలే కొశ్చెను 🙂
  పెరటి చెట్టు టైపన్నమాట.

  @రవి:
  హు… అంతే లెండి లక్కీ జనాలు మీరు.
  మీ టీ షాపుకో అటెండరు కావలిస్తే… 😉
  (మీకో సారీ బాకీ నేను)

 44. @భరత్:కదూ! నాకూ అచ్చంగా మన కాలేజీ ట్రిప్పులే గుర్తొచ్చాయి…మరపురాని రోజులవి :)@విజయమోహన్ గారు:మనసు నిండింది మీ వ్యాఖ్యతో…@ప్రపుల్ల గారు:థాంక్సండీ@శ్రీ:భలే కొశ్చెను :)పెరటి చెట్టు టైపన్నమాట.@రవి:హు… అంతే లెండి లక్కీ జనాలు మీరు.మీ టీ షాపుకో అటెండరు కావలిస్తే… ;)(మీకో సారీ బాకీ నేను)

 45. వేణూ శ్రీకాంత్ said,

  ప్రవీణ్ మీ ప్రయాణ విశేషాలు, ఫోటోలు రెండు సూపరు. చాలా బాగున్నాయి.

 46. ప్రవీణ్ మీ ప్రయాణ విశేషాలు, ఫోటోలు రెండు సూపరు. చాలా బాగున్నాయి.

 47. chaduvari said,

  ఫోటోలు బ్రహ్మాండం! చిక్కమగళూరు అనగానే ఇందిరమ్మ గుర్తుకొస్తుంది. అక్కడి ప్రజలకు ఆవిడ చిన్నకూతురేమో! 🙂

  ఏదేమైనా, మీరు ఈ ట్రావెలాగడంలో రాటుదేలిపోతున్నారు. ఇప్పటిదాకా ఆయా ఊళ్ళు వెళ్ళారు కాబట్టి బ్లాగారు. ఇకపై, బ్లాగేందుకైనా ప్రయాణాలు పెట్టుకోవలసిందిగా మనవి.

 48. chaduvari said,

  ఫోటోలు బ్రహ్మాండం! చిక్కమగళూరు అనగానే ఇందిరమ్మ గుర్తుకొస్తుంది. అక్కడి ప్రజలకు ఆవిడ చిన్నకూతురేమో! :)ఏదేమైనా, మీరు ఈ ట్రావెలాగడంలో రాటుదేలిపోతున్నారు. ఇప్పటిదాకా ఆయా ఊళ్ళు వెళ్ళారు కాబట్టి బ్లాగారు. ఇకపై, బ్లాగేందుకైనా ప్రయాణాలు పెట్టుకోవలసిందిగా మనవి.

 49. నిషిగంధ said,

  కాస్త లేటుగా చూస్తున్నా మీ టపాని..

  మేము కాలేజీలో ఉన్నప్పుడు బెంగళూరు ట్రిప్ వేసుకున్నాం.. మా గ్రూప్ లో ఒకమ్మాయిది చిక్కమగుళూరే! బెంగళూరు నించి వాళ్ళ ఊరు వెళ్దాం రమ్మని అడిగింది.. “అబ్బే! ఆ పల్లెటూర్లో చూడ్డానికేముంటాయి ” అని కొట్టిపారేశాం! ఇప్పుడు మీ ఫోటోస్ చూస్తుంటే తెలుస్తుంది ఎంత తెలివితక్కువ పని చేశామో!!
  really beautiful photos!! చదువరి గారు చెప్పినట్లు ఇక మీరు బ్లాగడానికైనా ట్రిప్పులేసుకోండి 🙂

 50. కాస్త లేటుగా చూస్తున్నా మీ టపాని..మేము కాలేజీలో ఉన్నప్పుడు బెంగళూరు ట్రిప్ వేసుకున్నాం.. మా గ్రూప్ లో ఒకమ్మాయిది చిక్కమగుళూరే! బెంగళూరు నించి వాళ్ళ ఊరు వెళ్దాం రమ్మని అడిగింది.. “అబ్బే! ఆ పల్లెటూర్లో చూడ్డానికేముంటాయి ” అని కొట్టిపారేశాం! ఇప్పుడు మీ ఫోటోస్ చూస్తుంటే తెలుస్తుంది ఎంత తెలివితక్కువ పని చేశామో!!really beautiful photos!! చదువరి గారు చెప్పినట్లు ఇక మీరు బ్లాగడానికైనా ట్రిప్పులేసుకోండి 🙂

 51. ranjeet said,

  Hi, I just read your blog and thought it had some
  very good desi content. I wanted you to know that there is
  a way for you to get many more readers in a short time
  very easily…

  infact, many desi bloggers like you are getting their
  blog exposed to over 60,000+ Indians every month!!!

  This website – helps desi bloggers get exposure and TONS
  of free desi traffic to their blog almost instantly!

  http://dubbagol.com

  Currently there are over 500+ desi bloggers/users registered
  and using it to drive traffic to their blogs.

  Your story will appear alongside stories from Rediff, DNA India,
  Times of India, The Hindu, Mumbai Mirror, ZoomTV etc.

  And, there’s no catch to it. 🙂

  Get started at http://dubbagol.com

  It takes less than 2 minutes and the results are real quick!

 52. ranjeet said,

  Hi, I just read your blog and thought it had some very good desi content. I wanted you to know that there is a way for you to get many more readers in a short time very easily…infact, many desi bloggers like you are getting their blog exposed to over 60,000+ Indians every month!!!This website – helps desi bloggers get exposure and TONS of free desi traffic to their blog almost instantly!http://dubbagol.com Currently there are over 500+ desi bloggers/users registered and using it to drive traffic to their blogs.Your story will appear alongside stories from Rediff, DNA India,Times of India, The Hindu, Mumbai Mirror, ZoomTV etc.And, there’s no catch to it. :)Get started at http://dubbagol.com It takes less than 2 minutes and the results are real quick!

 53. raju said,

  hello praveen,
  mee blog chala bagundi.
  naa e comment meeru chustaro ledo teleedu, chuste reply istarani..blog snehanni konasagistarani aashistu……
  seeta rama raju

 54. raju said,

  hello praveen,mee blog chala bagundi.naa e comment meeru chustaro ledo teleedu, chuste reply istarani..blog snehanni konasagistarani aashistu……seeta rama raju


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: