అక్టోబర్ 24, 2008

ఓ సాయంత్రం – ఆఫీసు నుంచి ఇంటికి …

Posted in కథ వద్ద 9:07 సా. ద్వారా Praveen Garlapati

ఆఫీసయిపోయింది. ఇంటికి బయలుదేరాను. పని మీద ఇంకో ఆఫీసుకి రావడంతో ఇవాళ్టికి క్యాబు లేదు. అలాగే బైకూ లేదు.

నెమ్మదిగా అడుగులేస్తూ ఇంటికేసి బయలుదేరాను. ఒక కిలోమీటరు దూరం మాత్రమే. నడిచి ఎన్ని రోజులయిందో!
చీకటి పడింది, రాత్రి దాదాపు ఎనిమిదిన్నర అయింది. ఆఫీసు బిల్డింగు నుంచి బయటకు రావడంతోనే వెల్లువలా ట్రాఫిక్కు. అదో మహా సముద్రం. అందులో కొట్టుకుని పోవడమే తప్ప ఆగి ఆలోచించే సమయం ఉండదు.

ఒక్క క్షణం ఆ దృశ్యం నా కళ్ళలో ఇంకే దాకా ఆగి నేనూ అందులో కలిసాను. ఆ ప్రయత్నంగా నాకు తెలీకుండానే అడుగులు పడుతున్నాయి. కొన్ని విషయాలు మనకు అంతర్గతంగా అలా ముద్ర పడిపోతాయి. వాటిని గురించి ఆలోచించక్కర్లేకుండానే ఆ పనులు ఆ ప్రయత్నంగా జరిగిపోతాయి. అలా నా అడుగులూ ఇంటికేసి సాగుతున్నాయి.

నడక రోడ్డు మీదయినా ఆలోచనలు ఎక్కడో. ఆ ట్రాఫిక్కు లాగానే పొంతన లేకుండా సాగుతున్నాయి. అడుగు తూలబోయి మళ్ళీ నిలదొక్కుకున్నాను.
పొద్దున్నే ఆఫీసుకి చేరుకున్నాను. ఏమిటో ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువయింది. ఇంకో ఆఫీసులో పనుందని ముందే తెలిసుంటే ఇంత దూరం వచ్చి ఉండకపోయేవాడిని కదా ? హు… అనవసరంగా సమయం వృధా. కానీ, తప్పేదేముంది.

వచ్చిన పనన్నా సక్రమంగా జరిగిందా అంటే అదీ లేదు. ఎప్పటిలాగానే బోరింగు మీటింగు. అదేదో ఐపీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడచ్చుగా ? ఊహు… లేదు అక్కడికే వెళ్ళాలి. మేనేజరు (డామేజరు ?) ప్రత్యేకంగా చెప్పాడు. వెధవ, పని లేక తీరిగ్గా తిని కూర్చునే వాడికేం తెలుసు మా ఇక్కట్లు.

మీటింగు గంటన్నరా నిద్రపోలేక, సుత్తి వినలేక ఆపసోపాలు పడడం నా వంతు.

టప్… ఏంటిది ? చినుకులు పడుతున్నాయి. ఏంటో వానాకాలం అయిపోవచ్చిన సమయాన ఇక్కడ రోజూ వర్షం కురుస్తుంది. ఒక చిన్న వర్షం చాలు రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా తయారవడానికి. ఇందాక కురిసిన వర్షానికి ఇప్పటికే రోడ్లన్నీ బురద బురదగా ఎలా ఉన్నాయో. ఇలాంటప్పుడు నడవడానికి భలే ఇబ్బంది. హుప్… ఈ మాత్రం లాంగు జంపులు చెయ్యాల్సిందే.

ఎంత చిరాకు పడినా సన్నని జల్లు కురుస్తుంటే దాంట్లో తడిచీ తడవకుండా నడుస్తుంటే ఆ ఆనందమే వేరు. ఈ ‘దర్శిని’లో ఓ టీ తాగితేనో ? ఛా… టీ ఏంటి ఫిల్టరు కాఫీ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆగి కాఫీ తాగనా ? మళ్ళీ ఇంటికెళ్ళి భోంచెయ్యాలి ఇంకో గంటలో. మ్‌…
కానీ, ఓ రోజు ఆలస్యంగా తింటే పోయేదేమీ లేదు. ఎంత రద్దీగా ఉందో ఈ దర్శిని. వీడి పనే మేలు. ఓ బోండా సూపు తిని కాఫీ తాగితే బాగుంటుంది.

ఫర్లా! వేడిగానే ఉంది బోండా సూపు. బాగుంది, బాగా చేసాడు. కారం కారంగా ఇది తిన్న తరువాత ఈ వేడి కాఫీ తాగుతుంటే భలేగుంది. ఏంటో ఈ దర్శినిల్లో చేసే లాంటి ఫిల్టరు కాఫీకీ, ఇంట్లో చేసే ఫిల్టరు కాఫీకీ రుచి భలే తేడా. రెండూ వేటికవే…

లేటవుతుంది గానీ ఇక ఇంటికి తిన్నగా వెళితే మేలు. ఎందుకో దిగులుగా ఉంది. ఏమిటో ఈ ఆర్థిక మాంద్యం. ఎక్కడ చూసినా ఈ బూచిని చూపించే పేపర్లే. ఎవడు మాట్లాడినా దీని గురించే. పనికి మాలిన వెధవలు అత్యాశకి పోయి చేసిన తప్పులకి ఎంచగ్గా ఆనందంగా ఉన్న మనకి కష్టాలు. ఇలాగే ఉంటుంది ఏంటో జీవితంలో. ఎవడో చేసిన తప్పుకి ఇంకెవడో బలవుతాడు.

ఓహ్.. కొద్దిగా ఉంటే ఆ కారు వెధవ మీదకెక్కించి ఉండేవాడే. వెధవ, రోడ్డు మీద నడుస్తున్న మనుషులు కూడా కనబడట్లేదు. అవును మరి నేను రోడ్డు మీదెందుకు నడుస్తున్నాను. ఫుట్‌పాత్ మీద కదా నడవాల్సింది ??
అవునులే అక్కడ బైకులు ఫుట్‌పాత్ మీద నడుపుతుంటే నేను రోడ్డు మీద కాక ఇంకెక్కడ నడుస్తాను !

అరే! మర్చేపోయాను. ఇవాళ ఈ ఆఫీసుకి రావడం మంచిదే అయింది. మన మెరుపు తీగ మళ్ళీ కనబడింది. పెదాల మీద ఆ ప్రయత్నంగా చిరునవ్వు. ఏమిటో జనాలకు టేస్టు లేదు. ఎంత సేపూ మోడర్న్ అమ్మాయిల వెంట పడతారు కానీ ఈ డీసెన్సీలో ఉన్న అందం వారికి అర్థం కాదు. అసలు తను నవ్వితే ఎంత అందంగా ఉంటుందీ… తెల్ల చుడీదారులో దేవత దిగివచ్చినట్టు లేదూ ?
పెళ్ళి చేసుకుంటే అలాంటి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి… ఆ అమ్మాయినే చేసుకుంటే ?

ఛా! అది ప్రాక్టికల్ గా ఉందా అసలు. ముక్కూ మొహం తెలియని అమ్మాయిని పెళ్ళి ఎలా చేసుకుంటాం. ఎవరయినా అమ్మాయిలను పటాయించడంలో కూడా ట్రయినింగు ఇస్తే నాలాంటి వాళ్ళకు బాగుండేది.

అవును కానీ రాజేష్ గాడికి పాపం. అలాంటి చెత్త మేనేజరు దొరికాడు. పాపం అలాంటి సిన్సియరుగా పని చేసే వారికే ఎందుకో అలా జరుగుతుంది. ఆ రీజనల్ ఫీలింగేమిటో ఆ మేనేజరుకి. వాడింకో టీముకి మారిపోతే బాగుండు తొందరగా. అలాంటి మేనేజరు వెధవలకు తగిన శాస్తి జరగాలి. బయటికెళితే కానీ మంచి పనితనం ఉన్న వాళ్ళ విలువ అర్థం కాదు.

ఈ రోడ్డు దాటే ప్రహసనం ఒకటి. ఎంతసేపు చూసినా అసలు ఈ ట్రాఫిక్కు ఆగదే ?
ఇలాంటి ఇరుకు రోడ్ల మీద భలే కష్టం. ఇటు సిగ్నళ్ళూ ఉండవు, ట్రాఫిక్ పోలీసూ ఉండడు. మనవాళ్ళకా క్రమశిక్షణా ఉండదు. ఇక లాభం లేదు, రిస్కు తీసుకునయినా అవతలి వైపుకెళ్ళాల్సిందే.

హమ్మయ్య! దాటేసాను.

విరల్ గాడి కొత్త కారు బాగుంది. స్విఫ్ట్. నేనూ కొనాలి. ఎన్నాళ్ళు ఈ బైకు మీద ?
కొనడానికేం గానీ రోజూ పదిహేను కిలోమీటర్లు ఆఫీసుకి వేసుకెళ్ళాలంటే చచ్చినట్టే. అదీ ఈ రద్దీలో. హాయిగా ఆఫీసు క్యాబు ఎక్కి గంట సేపు పడుకుంటే దింపుతాడు. అయినా ఈ సమయంలో ఎందుకులే ? కొంత డబ్బు చేతిలో ఉంటేనే మంచిది.
ఇంకా నయం నేను షేరు మార్కెట్టులో ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు. లేకపోతే బుక్కయిపోయేవాడిని. ఇప్పటికే నా స్టాక్ ఆప్షన్లు దొబ్బినియ్యి. పోన్లే కనీసం మార్కెట్లు ఈ స్థితికి రాకముందే కనీసం హైకులొచ్చాయి. లేకపోతే ఓ రెండు మూడేళ్ళు ఏమీ లేకపోయేది.

అన్నట్టు అసలు ఇప్పుడు ఎవడూ ఉన్న చోటు నుంచి కిక్కురుమనట్లేదు. మరే! అన్ని చోట్లా లే ఆఫ్‌లు జరుగుతుంటే ఇంకెక్కడికి వెళ్ళేది.

అయ్యయ్యో! ఆ గుడ్డి అమ్మాయి రోడ్డు దాటలేకపోతోంది. సహాయం చెయ్యనా ?
ఎవరయినా పాపం దాటిస్తే బాగుండు. పోనీ నేనే దాటిస్తే. దాటించనా ? వెళ్ళనా ?
హమ్మయ్య… ఎవరో ఆటోవాడు పాపం మంచోడు దాటిస్తున్నాడు. ఈ ఆటోవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు.

అయ్యో! వాన పెరిగిపోతోంది. జాకెట్టు తెచ్చుకునుండాల్సింది. సర్లే ఇంకో ఫర్లాంగే కదా. తొందరగా నడిస్తే మంచిది. ఇంటికి దగ్గరగా ఈ షాపింగు మాలు రావడమేమో గానీ రోడ్డు నిండా అడ్డంగా కార్లు పార్కు చెయ్యడమే… అసలు బుద్ధుండదు వెధవలకి. ఇంత పెద్ద కార్లు తీసుకొచ్చి రోడ్డుకడ్డంగా పెడితే మిగతా వెహికిల్స్ ఎలా వెళ్ళాలి ?
వీళ్ళకి నిజంగా పెద్ద పెద్ద జరిమానాలెయ్యాలి. అప్పుడు గానీ బాగుపడరు.

హమ్మయ్య. గేటొచ్చేసింది. నేను పైకెళ్ళే వరకూ కరెంటు పోకుండా ఉంటే బాగుండు. మళ్ళీ ఏడంతస్థులు ఎక్కాలి చచ్చినట్టు. ఈ ముసలి వాచ్‌మెన్ వెధవ ఎప్పుడూ ఉండి చావడు. వీడికి డబ్బులు దండగ.

కాలింగు బెల్లు కొట్టకుండా తలుపు మీద ఈ టకటకలాడించడం అలవాటయిపోయింది నాకు. అమ్మకి కూడా నేనే అని తెలిసిపోతుంది.
తలుపు తెరుచుకుంది. ఆహ్! అమ్మ…

ఇది చూడండి: ఇది కల్పితమే! కానీ నా ఆలోచనలూ ఒక్కోరోజు అలా ఎడతెగకుండా కలగాపులగంగా సాగుతాయి. స్వాతిలో బాపు గారి కోతి కొమ్మచ్చి ఫీచరు లాగా 🙂

ప్రకటనలు

48 వ్యాఖ్యలు »

 1. Vamsi M Maganti said,

  :)….:)…..:)…maLlI…:)…

 2. :)….:)…..:)…maLlI…:)…

 3. సుజాత said,

  మీ ఆలోచనా స్రవంతి చాలా బాగుంది. ప్రతి నిమిషం మనసులో రేగే ఆలోచనలని అక్షరాల్లో పెడితే ఇలాగే ఉంటుందేమో!
  “ఈ ఆటో వాళ్ళు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో తెలియదు”..హ హ!

 4. మీ ఆలోచనా స్రవంతి చాలా బాగుంది. ప్రతి నిమిషం మనసులో రేగే ఆలోచనలని అక్షరాల్లో పెడితే ఇలాగే ఉంటుందేమో! “ఈ ఆటో వాళ్ళు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో తెలియదు”..హ హ!

 5. చివుకుల కృష్ణమోహన్‌ said,

  అందుకేనండి బాబూ, నడవద్దని చెప్పేది. అలా నడిస్తే బుర్రకి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది – అది అలా ఆలోచించి కొన్ని నిజాల్ని అద్దంలో చూపించేస్తుంది. ఎందుకు ఆ బాధంతా – వదిలేయండి. హడావిడి మత్తుమందునిచ్చి ఆలోచనని పడుక్కోబెట్టడం తప్పోకాదో తెలియదు గానీ, తప్పనిసరి కదా!
  అయినా ఈ శైలి నాకెందుకు పరిచయంగా అనిపిస్తోందబ్బా!

  ప్రవీణ్‌, చాలా చక్కగా వ్రాసారు. అభినందనలు.

 6. అందుకేనండి బాబూ, నడవద్దని చెప్పేది. అలా నడిస్తే బుర్రకి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది – అది అలా ఆలోచించి కొన్ని నిజాల్ని అద్దంలో చూపించేస్తుంది. ఎందుకు ఆ బాధంతా – వదిలేయండి. హడావిడి మత్తుమందునిచ్చి ఆలోచనని పడుక్కోబెట్టడం తప్పోకాదో తెలియదు గానీ, తప్పనిసరి కదా!అయినా ఈ శైలి నాకెందుకు పరిచయంగా అనిపిస్తోందబ్బా!ప్రవీణ్‌, చాలా చక్కగా వ్రాసారు. అభినందనలు.

 7. venkat said,

  Congrats.. as your blog has been reviewd in Eenaadu eetharam ,today your blog is nice.

 8. venkat said,

  Congrats.. as your blog has been reviewd in Eenaadu eetharam ,today your blog is nice.

 9. bhavani said,

  అయ్యబాబోయ్! మీకు మరీ ఇంత అత్యాశేంటండీ బాబూ.
  ఆలోచనలను రాతలతో పట్టుకోవాలనుకున్నారా?
  చాలా కష్టం కదా.

 10. bhavani said,

  అయ్యబాబోయ్! మీకు మరీ ఇంత అత్యాశేంటండీ బాబూ. ఆలోచనలను రాతలతో పట్టుకోవాలనుకున్నారా?చాలా కష్టం కదా.

 11. chaduvari said,

  మీ బ్లాగు ప్రయోగాల్లోకి ఇప్పుడీ ఆలోచనాస్రవంతి కూడా చేరిందన్నమాట! చైతన్య స్రవంతి అంటే ఇదేనా!?

 12. chaduvari said,

  మీ బ్లాగు ప్రయోగాల్లోకి ఇప్పుడీ ఆలోచనాస్రవంతి కూడా చేరిందన్నమాట! చైతన్య స్రవంతి అంటే ఇదేనా!?

 13. మేధ said,

  ఇంచుమించు నా ఆలోచనలు కూడా ఇలానే ఉన్నాయి…!

 14. మేధ said,

  ఇంచుమించు నా ఆలోచనలు కూడా ఇలానే ఉన్నాయి…!

 15. జ్యోతి said,

  ప్రవీణ్,

  నిజం చెప్పు, ఆ మెరుపుతీగ ఎవ్వరు??

 16. ప్రవీణ్,నిజం చెప్పు, ఆ మెరుపుతీగ ఎవ్వరు??

 17. Purnima said,

  Hey Praveen, this is refreshingly new from you. Loved it to the core!

  మీరు ఏది ట్రై చేసినా మీ మార్కు ఎప్పుడూ అలానే ఉంటుంది. భలే టపా! సింపుల్ ఆండ్ స్వీట్.. లేకపోతే ఆ బోండా సూపు! (బైదవే, బోండా అంటే తెల్సు, సూపేంటీ?)

  జ్యోతి గారు: ఎవరు, ఎవరు, ఎవరు?? అని మనం వేధిస్తామనే పాపం బొద్దుగా చెప్పారు.. “ఇది కల్పితమే” అని. అర్థం చేసుకోరూ 🙂

 18. Purnima said,

  Hey Praveen, this is refreshingly new from you. Loved it to the core! మీరు ఏది ట్రై చేసినా మీ మార్కు ఎప్పుడూ అలానే ఉంటుంది. భలే టపా! సింపుల్ ఆండ్ స్వీట్.. లేకపోతే ఆ బోండా సూపు! (బైదవే, బోండా అంటే తెల్సు, సూపేంటీ?) జ్యోతి గారు: ఎవరు, ఎవరు, ఎవరు?? అని మనం వేధిస్తామనే పాపం బొద్దుగా చెప్పారు.. “ఇది కల్పితమే” అని. అర్థం చేసుకోరూ 🙂

 19. సిరిసిరిమువ్వ said,

  మీ బ్లాగు రివ్యూ ఈనాడులో వచ్చినందుకు ముందుగా అభినందనలు.
  మన ఆలోచనల్ని అక్షరబద్ధం చేస్తే పూటకో నవల రాసేయ్యొచ్చు:)ముఖ్యంగా ఒక్కరమే నడిచేటప్పుడు మన మనస్సు ఎటు వెళుతుందో ఏం ఆలోచిస్తుందో దానికే తెలియదు. ఒక్కొకసారి పరిసరాలని కూడా మర్చిపోయి మనస్సు ఊహల్లో విహరిస్తుంటాము. రకరకాల ఆలోచనలు, వింత వింత విశ్లేషణలు, కోపాలు,విసుగులు అన్నీ ఉంటాయి అక్కడ.

 20. మీ బ్లాగు రివ్యూ ఈనాడులో వచ్చినందుకు ముందుగా అభినందనలు.మన ఆలోచనల్ని అక్షరబద్ధం చేస్తే పూటకో నవల రాసేయ్యొచ్చు:)ముఖ్యంగా ఒక్కరమే నడిచేటప్పుడు మన మనస్సు ఎటు వెళుతుందో ఏం ఆలోచిస్తుందో దానికే తెలియదు. ఒక్కొకసారి పరిసరాలని కూడా మర్చిపోయి మనస్సు ఊహల్లో విహరిస్తుంటాము. రకరకాల ఆలోచనలు, వింత వింత విశ్లేషణలు, కోపాలు,విసుగులు అన్నీ ఉంటాయి అక్కడ.

 21. జ్యోతి said,

  Congratulations Praveen..

 22. Congratulations Praveen..

 23. sujana said,

  me ideas chala bagunnaii,prayathnisthe manchi director avutharu,appudu memu antha me fans ani tapa cheppesthanuEvaro thesina daniki blog gulu enduku,mana me direct cheyachu kadaaa

 24. sujana said,

  me ideas chala bagunnaii,prayathnisthe manchi director avutharu,appudu memu antha me fans ani tapa cheppesthanuEvaro thesina daniki blog gulu enduku,mana me direct cheyachu kadaaa

 25. చైతన్య said,

  అభినందనలు ప్రవీణ్ గారు.

 26. అభినందనలు ప్రవీణ్ గారు.

 27. pappu said,

  మీరు చాలా అదృష్టవంతులు ప్రవీణ్..ఎందుకంటే..ఎక్కడా డ్రైనేజ్ కవర్లు తీసి వుంచలేదు కదా….హహహహహ..లేకపోతే మేము ఇంత మంచి బ్లాగ్ చదివి వుండేవారమా?????(తప్పుగా అర్థం చేసుకొవద్దని మనవి…మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇదీ అని చెప్పడమే నా ఉద్దేశం)

 28. pappu said,

  మీరు చాలా అదృష్టవంతులు ప్రవీణ్..ఎందుకంటే..ఎక్కడా డ్రైనేజ్ కవర్లు తీసి వుంచలేదు కదా….హహహహహ..లేకపోతే మేము ఇంత మంచి బ్లాగ్ చదివి వుండేవారమా?????(తప్పుగా అర్థం చేసుకొవద్దని మనవి…మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇదీ అని చెప్పడమే నా ఉద్దేశం)

 29. Madhu said,

  చాలా బాగా వ్రాసారు

 30. Madhu said,

  చాలా బాగా వ్రాసారు

 31. ramya said,

  :),,,:)

 32. ramya said,

  :),,,:)

 33. శ్రీ said,

  మీతో పాటూ మమ్మల్ని కుడా నడిపించారు. భలే రాసారు.

 34. శ్రీ said,

  మీతో పాటూ మమ్మల్ని కుడా నడిపించారు. భలే రాసారు.

 35. రానారె said,

  యమాగా వుంది ప్రవీణ్ ఈ టపా!!! ఇక్కడ నేనేం చెప్పినా పూర్ణిమ, సిరిసిరిమువ్వగార్లు చెప్పినమాటలకు కాపీ ఔతుంది. చదువుతూ వుంటే ఎంతో సంతోషంగా అనిపింది.

 36. యమాగా వుంది ప్రవీణ్ ఈ టపా!!! ఇక్కడ నేనేం చెప్పినా పూర్ణిమ, సిరిసిరిమువ్వగార్లు చెప్పినమాటలకు కాపీ ఔతుంది. చదువుతూ వుంటే ఎంతో సంతోషంగా అనిపింది.

 37. కొత్త పాళీ said,

  excellently done.

 38. రాధిక said,

  అవును నడుస్తూ వుంటే అడుగులతో పాటూ ఆలోచనలూ సాగుతుంటాయి.మన అడుగులకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో,ఎక్కడ ఆగాలో.కానీ ఆలోచనలకే దారీ తెన్నూ వుండదు.చాలా బాగా రాసారు.

 39. excellently done.

 40. అవును నడుస్తూ వుంటే అడుగులతో పాటూ ఆలోచనలూ సాగుతుంటాయి.మన అడుగులకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో,ఎక్కడ ఆగాలో.కానీ ఆలోచనలకే దారీ తెన్నూ వుండదు.చాలా బాగా రాసారు.

 41. ప్రవీణ్ గార్లపాటి said,

  @ వంశీ:
  🙂 మరదే …

  @ సుజాత గారు:
  ఆ ప్రయత్నమే ఇది. ఆటో డ్రైవర్ల గురించి నో కామెంట్. 🙂

  @ కృష్ణమోహన్ గారు:
  కృతజ్ఞతలు.
  అప్పుడప్పుడూ అనుకోకుండా అలా జరిగిపోతుంది. మిగతా సమయాల్లో ఆలోచనలు బజ్జునే ఉంటాయి.

  @ venkat:
  నా బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషం.

  @ bhavani గారు:
  🙂

  @ చదువరి:
  అవునండీ ఒక ప్రయోగమే అనుకోవచ్చు.
  ఇది ఇలా చెయ్యాలనే ప్లాను చేసుకోను. అలా జరిగిపోతుంది అంతే …

  @ మేధ:
  మీవీ, నావే కాదు. అందరివీ ఇలాగే “సాగు”తాయి …

  @ జ్యోతి గారు:
  మీరు మరీను. డిస్క్లైమరు పెట్టిన తరువాత కూడా ప్రశ్న.. 🙂
  ఇందులో మొత్తం నా ఆలోచనలు కాదు. కొన్ని సృష్టించినవే.

  @ purnima గారు:
  థాంక్స్. మీ నుంచి ప్రతీసారీ ప్రోత్సాహం అందుతూనే ఉంటుంది.
  బోండా సూపంటే ఇక్కడ బెంగుళూరులో కొన్ని దర్శినీలలో బోండాని ఒక సూపులాంటి దాంట్లో నానేసి ఇస్తారు. అదన్నమాట.

  జ్యోతి గారికి మీరిచ్చిన వివరణ 😉

  @ సిరిసిరిమువ్వ గారు:
  కృతజ్ఞతలు.
  కానీ నాకు అలాంటి ఒంటరి సమయాల్లో, ఆలోచనల్లో కొన్ని సార్లు చాలా సంతృప్తి కలుగుతుంది.

  @ sujana గారు:
  నా ఆలోచనలకీ, టపాలకీ ఆ స్థాయి ఉందని మీరనుకోవడం‌ పెద్ద కాంప్లిమెంటు.
  కానీ ఎవరు చెయ్యాల్సిన పనులు వారు చేస్తేనే అందం 🙂

  @ చైతన్య గారు:
  థాంక్యూ…

  @ pappu:
  హహ… మీరు నమ్మరు కానీ ముందు దాని గురించీ రాద్దామనుకున్నా టపాలో.

  @ madhu:
  చాలా సంతోషం

  @ ramya గారు:
  :):):):):)

  @ శ్రీ:
  అవును ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాను.

  @ రానారె:
  నాకు చాలా ఆనందం కలిగించేలా ఉంది నీ వ్యాఖ్య.

  @ కొత్త పాళీ గారు:
  మీ నుంచి ఈ వ్యాఖ్య రావడం చాలా సంతోషం.

  @ రాధిక గారు:
  పర్ఫెక్ట్… మన ఆలోచనకి దారీ తెన్నూ ఉండదు. వాటిని ఆపలేము.

 42. @ వంశీ::) మరదే …@ సుజాత గారు:ఆ ప్రయత్నమే ఇది. ఆటో డ్రైవర్ల గురించి నో కామెంట్. :)@ కృష్ణమోహన్ గారు:కృతజ్ఞతలు. అప్పుడప్పుడూ అనుకోకుండా అలా జరిగిపోతుంది. మిగతా సమయాల్లో ఆలోచనలు బజ్జునే ఉంటాయి.@ venkat:నా బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషం.@ bhavani గారు::) @ చదువరి:అవునండీ ఒక ప్రయోగమే అనుకోవచ్చు. ఇది ఇలా చెయ్యాలనే ప్లాను చేసుకోను. అలా జరిగిపోతుంది అంతే …@ మేధ:మీవీ, నావే కాదు. అందరివీ ఇలాగే “సాగు”తాయి …@ జ్యోతి గారు:మీరు మరీను. డిస్క్లైమరు పెట్టిన తరువాత కూడా ప్రశ్న.. :)ఇందులో మొత్తం నా ఆలోచనలు కాదు. కొన్ని సృష్టించినవే.@ purnima గారు:థాంక్స్. మీ నుంచి ప్రతీసారీ ప్రోత్సాహం అందుతూనే ఉంటుంది.బోండా సూపంటే ఇక్కడ బెంగుళూరులో కొన్ని దర్శినీలలో బోండాని ఒక సూపులాంటి దాంట్లో నానేసి ఇస్తారు. అదన్నమాట.జ్యోతి గారికి మీరిచ్చిన వివరణ ;)@ సిరిసిరిమువ్వ గారు:కృతజ్ఞతలు. కానీ నాకు అలాంటి ఒంటరి సమయాల్లో, ఆలోచనల్లో కొన్ని సార్లు చాలా సంతృప్తి కలుగుతుంది.@ sujana గారు:నా ఆలోచనలకీ, టపాలకీ ఆ స్థాయి ఉందని మీరనుకోవడం‌ పెద్ద కాంప్లిమెంటు.కానీ ఎవరు చెయ్యాల్సిన పనులు వారు చేస్తేనే అందం :)@ చైతన్య గారు:థాంక్యూ…@ pappu:హహ… మీరు నమ్మరు కానీ ముందు దాని గురించీ రాద్దామనుకున్నా టపాలో.@ madhu:చాలా సంతోషం@ ramya గారు::):):):):)@ శ్రీ:అవును ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాను.@ రానారె:నాకు చాలా ఆనందం కలిగించేలా ఉంది నీ వ్యాఖ్య.@ కొత్త పాళీ గారు:మీ నుంచి ఈ వ్యాఖ్య రావడం చాలా సంతోషం.@ రాధిక గారు:పర్ఫెక్ట్… మన ఆలోచనకి దారీ తెన్నూ ఉండదు. వాటిని ఆపలేము.

 43. ప్రతాప్ said,

  అంతే, జీవనది ప్రవహించడం మానేస్తుందేమో కానీ, ఆలోచనల స్రవంతి మాత్రం అస్సలు అలుపెన్నదే ఎరుగదు. ఈ టపా చదువుతూ ఉంటే నాకు తిలక్ రాసిన “రాత్రి 9 గంటలకు” అన్న కథ బాగా గుర్తుకు వచ్చింది.

 44. అంతే, జీవనది ప్రవహించడం మానేస్తుందేమో కానీ, ఆలోచనల స్రవంతి మాత్రం అస్సలు అలుపెన్నదే ఎరుగదు. ఈ టపా చదువుతూ ఉంటే నాకు తిలక్ రాసిన “రాత్రి 9 గంటలకు” అన్న కథ బాగా గుర్తుకు వచ్చింది.

 45. రవి said,

  ఓ వర్షం కురిసిన సాయంత్రం అని టైటిల్ ఎలా ఉంది?. కొంచెం యండమూరి వీరేంద్రనాథ్ “అంతర్ముఖం” గుర్తొచ్చింది.

  మనలో మాట. ఇంకా అదృష్టవంతుడివి. పెళ్ళయితే ఆలోచనలుండవు. ఓన్లీ కష్టాస్…:-)

 46. రవి said,

  ఓ వర్షం కురిసిన సాయంత్రం అని టైటిల్ ఎలా ఉంది?. కొంచెం యండమూరి వీరేంద్రనాథ్ “అంతర్ముఖం” గుర్తొచ్చింది. మనలో మాట. ఇంకా అదృష్టవంతుడివి. పెళ్ళయితే ఆలోచనలుండవు. ఓన్లీ కష్టాస్…:-)

 47. ప్రవీణ్ గార్లపాటి said,

  @ ప్రతాప్ గారు:
  ఇంకా తిలక్ గారి రచనలు చదివే అదృష్టం నాకు కలగలేదు.
  ఆయన కథని గుర్తుకు తెచ్చిందంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది.

  @ రవి:
  టైటిల్ సినిమాటిక్ గా ఉంది 🙂

  యండమూరి గారిని నేను అటూ ఇటూగా చదివాను. కొన్ని మాత్రమే ఆకట్టుకున్నవి. అంతర్ముఖం చదవలేదు 😦

  ఇంకొన్నాళ్ళు అదృష్టవంతుడిగా ఉండాలనుకుంటున్నాను. 😛

 48. @ ప్రతాప్ గారు:ఇంకా తిలక్ గారి రచనలు చదివే అదృష్టం నాకు కలగలేదు. ఆయన కథని గుర్తుకు తెచ్చిందంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది.@ రవి:టైటిల్ సినిమాటిక్ గా ఉంది :)యండమూరి గారిని నేను అటూ ఇటూగా చదివాను. కొన్ని మాత్రమే ఆకట్టుకున్నవి. అంతర్ముఖం చదవలేదు :(ఇంకొన్నాళ్ళు అదృష్టవంతుడిగా ఉండాలనుకుంటున్నాను. 😛


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: