అక్టోబర్ 25, 2008

అంతర్జాలంలో తెలుగు/బ్లాగులు – అరువు టపా

Posted in అంతర్జాలం, తెలుగు, బ్లాగులు వద్ద 7:35 ఉద. ద్వారా Praveen Garlapati

నా బ్లాగు సమీక్ష ఈనాడులో వచ్చిందని చదువరి గారు చెప్పేవరకూ నాకు తెలీదు. 🙂

ఆయన పాపం ఓపికగా రాసుకున్న వ్యాసం అందరికీ ఉపయోగపడుతుందని వెంటనే నాకు పంపించారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Can’t see Telugu on this page? Is your Computer showing series of boxes after this paragraph? It is because, it is not taught how to render Telugu. You can teach a lesson to it, so that it will surrender to the sheer beauty of those magnificent letters. Follow the steps given in this Wikipedia link or this link or this and implement the suggested changes in your computer… you will find yourself in the lap of Mother Telugu. Then, please come back and read the following few lines.

కొత్తగా బ్లాగుల గురించి తెలుసుకుంటున్న వారికి, బ్లాగరులకు, బ్లాగ్వరులకు స్వాగతం! నాకు తెలిసిన నాలుగు ముక్కలను కొత్తవారికి చెప్పాలని ఇది రాస్తున్నాను.

 • మీకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో తెలీకపోతే లేఖినికి వెళ్ళండి. మీరు రోమను లిపిలో రాసుకుంటూ పోతుంటే అది తెలుగు లిపి లోకి మార్చేస్తూ ఉంటుంది. నేను తెలుగులో రాయగలగుతున్నాను అని రాయాలనుకున్నారనుకోండి.. “nEnu telugulO raayagalagutunnaanu” అని అక్కడ రాస్తే చాలు.. మిగతా పని అదే చూసుకుంటుంది. కొత్తవారికి దీని కంటే మంచి గురువు మరోటి లేదు. కొన్ని ఆసక్తికరమైన లింకులివిగోండి:
 • తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాణం అనే ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలుగువారు తమకో విజ్ఞాన భాండాగారాన్ని తయారుచేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళంతా అందులో భాగస్తులే! ఆంధ్ర దేశంలోని ప్రతి ఒక్క ఊరి గురించి వివరాలు పొందుపరచాలనేది అక్కడి ఆశయాల్లో ఒకటి. అక్కడ మా ఊరి గురించి ఉంది, నేనే రాసాను. మీ ఊరి గురించి వ్యాసం ఉందో లేదో చూడండి. లేకపోతే మీరే రాయండి. ఉంటే.. దానిలో మార్పులు చెయ్యండి, కొత్త విషయాలు చేర్చండి
 • ఇక, బ్లాగులు ! బ్లాగులు రాసేందుకు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు – నేను పెట్టలేదు. మీకు కావాల్సిందల్లా కంప్యూటరు, జాలంలో జొరబడేందుకు ఓ కనెక్షను -అంతే! ఇక మీ మనసులో ఉన్నదంతా బైటపెట్టడమే. చంద్రబాబును, రాజశేఖరరెడ్డిని, చిరంజీవిని, బాలకృష్ణను.. ఎవ్వర్నీ వదలొద్దు. ఛందోబద్ధమైన పద్యాలు, కథలు, కవితలు, వ్యాసాలు.. దేన్నీ వదలొద్దు. హాస్యం, వ్యంగ్యం, సీరియస్, విషాదం, వేదన, రోదన.. ఏదైనా సరే! పుస్తక సమీక్ష, సినిమా సమీక్ష, మీ చిన్ననాటి స్మృతులు, నిన్నామొన్నటి జ్ఞాపకాలు, కాలేజీ కబుర్లు.. ఆఫ్సు కబుర్లు.. అన్నిటినీ మీ బ్లాగులో పరవండి. అంతా వచ్చి చదూకుంటారు.. మీ బ్లాగు గురించి ఏమనుకుంటున్నారో కూడా చెబుతారు.
 • బ్లాగుల్లో కనబడేవి.. వినూత్నమైన ఆలోచనలు, స్వంత భావాలు, చక్కటి భాష, నిర్మొహమాటంగా, నిర్మోహంగా సాగే రచనలు. కొన్ని చక్కటి బ్లాగుల్లోని కొన్ని మంచి టపాలను ఏరి కూర్చిన ఈ పుస్తకాన్ని చూడండి. (ఇదో పీడీయెప్ఫు పుస్తకం.. దించుకోడానికి కాస్త ఎక్కువ సేపే పడుతుంది.)
 • బ్లాగు ఎలా మొదలుపెట్టాలనే సంగతి నుండి.. బ్లాగుల విషయంలో ఏ సాయం కావాలన్నా.. తెలుగుబ్లాగు గుంపునడగండి.
 • బ్లాగుల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం రాస్తున్నారో తెలుసుకునేందుకు కూడలి, జల్లెడలను చూస్తూ ఉండండి. బ్లాగుల్లో కొత్త రచనలు రాగానే వీటికి ఉప్పందుతుంది. కొత్తగా ఏయే రచనలు వచ్చాయో తెలిసికొనేందుకు తెలుగు బ్లాగరులు ఈ సైట్ల వద్దే తారట్లాడుతూ ఉంటారు.
 • చక్కటి ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు ఇప్పటి కుర్రకారులోనూ ఉన్నారు తెలుసా? అంతర్జాలంలో అభినవ భువనవిజయాలు జరిగాయి కూడాను. ఛందస్సునూ, పద్యాల లక్షణాలనూ నేర్పే గురు బ్లాగులు బ్లాగురువులూ కూడా ఉన్నారు.
 • ఈమాట జాల పత్రికను చూడండి. అలాంటి ఉత్తమ సాహితీ విలువలున్న పత్రికను అచ్చులో చూసి ఎన్నాళ్ళైందో గుర్తుకు తెచ్చుకోండి.
 • గళ్ళ నుడికట్టు అంటే ఇష్టమా? అయితే పొద్దు దిక్కుకు తిరగండి. తెలుగులో మొట్టమొదటి ఆన్‌లైను గళ్ళ నుడికట్టు ఇది.
 • కొత్త సినిమాల దగ్గర మైకులు పట్టుకుని, జనాల చేత అబ్బో, బెమ్మాండం, సూపరు, వందరోజులు, వెయ్యిరోజులు అంటూ చెప్పిస్తున్నపుడు “ఆంధ్రదేశంలో ఒక్ఖడు కూడా.. సినిమా బాలేదనేవాడే వీళ్ళకి కనపడడు..ఛి..చ్ఛీ..దరిద్రం.” అని టీవీల వాళ్ళను చీదరించుకున్నారా? అయితే నవతరంగపు తాజా గాలి పీల్చండి. నిష్పాక్షిక సమీక్షలే కాదు, సినిమాల గురించిన బోలెడు కబుర్లు తెలుసుకోవచ్చు.
 • తెలుగును చూపించే విషయంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు కాస్త మొహమాటపడుతుంది. పక్కనున్న స్క్రాల్ బారును పట్టుకుని పైకీ కిందకీ జరిపబోతే మహా బద్ధకంగా కదులుతుంది. (మరి ఈ సమస్య నాకేనో ఇతరులకూ ఉందో తెలీదు.) ఈ సందర్భంలో ఫైరుఫాక్సు అనే బ్రౌజరును మనం స్మరించుకోవాలి. దానిలో ఈ ఇబ్బంది కనబడలేదు. అది తెలుగుతో చెలిమి చేసింది. మంటనక్కపై తెలుగు సవారీ నల్లేరుపై నడకే! అన్నట్టీ మంటనక్క అనేది ఫైరుఫాక్సు బ్రౌజరును మనాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు.
 • మంటనక్కలాంటి ముద్దుపేర్లే కాక, మనం నిత్యం వాడే అనేక ఇంగ్లీషు పదాలకు సమానార్థకమైన తెలుగు మాటలను వెలికితీస్తూ, నిష్పాదిస్తూ, కనిపెడుతూ, చెలామణీ చేస్తూ ఉన్నారు. మీరూ ఓ చెయ్యెయ్యండి. ఉదాహరణకు ఇంటర్నెట్‌లో ఉండే జనులను ఇంగ్లీషులో నెటిజెన్స్ అంటారు. మనాళ్ళు నెజ్జనులు అన్నారు. జాలజనులు అన్నారు. నెటిజనులు అన్నారు. మీరేమంటారో చెప్పండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ప్రకటనలు

40 వ్యాఖ్యలు »

 1. మేధ said,

  eenadu lo blog vachinaduku congrats..

 2. మేధ said,

  eenadu lo blog vachinaduku congrats..

 3. te.thulika said,

  Congratulations, Praveen. ఈవ్యాసం బాగుంది చాలామందికి వుపయోగపడుతుంది.

 4. te.thulika said,

  Congratulations, Praveen. ఈవ్యాసం బాగుంది చాలామందికి వుపయోగపడుతుంది.

 5. చైతన్య said,

  ఈనాడు లో మీ బ్లాగ్ రివ్యు వచ్చినందుకు అభినందనలు.

 6. ఈనాడు లో మీ బ్లాగ్ రివ్యు వచ్చినందుకు అభినందనలు.

 7. Madhu said,

  ప్రవీణ్ గారు…అభినందనలు.

 8. Madhu said,

  ప్రవీణ్ గారు…అభినందనలు.

 9. కొత్త పాళీ said,

  అభినందనలు
  Well deserving honor
  ఇంతకీ ఆ ఈనాడు ఆర్టికిల్ ఎక్కడ?

 10. అభినందనలుWell deserving honorఇంతకీ ఆ ఈనాడు ఆర్టికిల్ ఎక్కడ?

 11. ravi said,

  హృదయపూర్వక అభినందనలు ప్రవీణ్..

 12. ravi said,

  హృదయపూర్వక అభినందనలు ప్రవీణ్..

 13. ప్రవీణ్ గార్లపాటి said,

  @ మేధ,@ చైతన్య గారు,@ madhu గారు:
  థాంక్యూ…

  @ మాలతి గారు:
  కృతజ్ఞతలు. ఆ వ్యాసం క్రెడిట్ చదువరి గారిదే.

  @ కొత్త పాళీ గారు:
  🙂 లంకె ఇదుగో.

  @ ravi:
  థాంక్యూ వెరీ మచ్ 🙂

 14. @ మేధ,@ చైతన్య గారు,@ madhu గారు:థాంక్యూ…@ మాలతి గారు:కృతజ్ఞతలు. ఆ వ్యాసం క్రెడిట్ చదువరి గారిదే.@ కొత్త పాళీ గారు::) లంకె ఇదుగో.@ ravi:థాంక్యూ వెరీ మచ్ 🙂

 15. శివ బండారు said,

  నాకు ఇదే వ్యాసం ఇంగ్లీషు లో కావాలి . ఎక్కడ దొరుకుతుంది?? . తెలుగురత్న లో పెట్టడానికి .

 16. నాకు ఇదే వ్యాసం ఇంగ్లీషు లో కావాలి . ఎక్కడ దొరుకుతుంది?? . తెలుగురత్న లో పెట్టడానికి .

 17. రిషి said,

  Congrats praveen.

 18. రిషి said,

  Congrats praveen.

 19. ప్రపుల్ల చంద్ర said,

  హృదయపూర్వక అభినందనలు.

 20. హృదయపూర్వక అభినందనలు.

 21. సుజాత said,

  praveen garu,
  congratulations!

 22. praveen garu,congratulations!

 23. Anonymous said,

  Thank you Eenadu, for referring me such a nice blog(ger).

 24. Anonymous said,

  Thank you Eenadu, for referring me such a nice blog(ger).

 25. Arjuna said,

  ప్రవీణ్,
  అభివందనాలు. ఏకంగా మీ బ్లాగులే వ్యాసాలుగా పత్రికల్లో వచ్చే రోజు కోసం ఆసిస్తున్నాను. కాపీ రైటు వివరాలు బ్లాగులో తెలియచేసి, పత్రికలవారితో సంప్రదింపులు చేసి చూడండి.

  అర్జున్

 26. Arjuna said,

  ప్రవీణ్,అభివందనాలు. ఏకంగా మీ బ్లాగులే వ్యాసాలుగా పత్రికల్లో వచ్చే రోజు కోసం ఆసిస్తున్నాను. కాపీ రైటు వివరాలు బ్లాగులో తెలియచేసి, పత్రికలవారితో సంప్రదింపులు చేసి చూడండి.అర్జున్

 27. vookadampudu said,

  ప్రవీణ్ గారు…అభినందనలు.

 28. vookadampudu said,

  ప్రవీణ్ గారు…అభినందనలు.

 29. ప్రవీణ్ గార్లపాటి said,

  @ శివ:
  ప్రయత్నిద్దాము. మనమే తర్జుమా చెయ్యవచ్చు.

  @ రిషి, @ ప్రఫుల్ల చంద్ర, @ సుజాత గారు, @anonymous, @ ఊకదంపుడు:
  కృతజ్ఞతలు.

  @ arjuna గారు:
  ఆ రోజు రావాలని ఆశిద్దాము. నా బ్లాగు కాకపోయినా ఆ స్థాయి ఉన్న బ్లాగులు తప్పకుండా ఉన్నాయి.

 30. @ శివ:ప్రయత్నిద్దాము. మనమే తర్జుమా చెయ్యవచ్చు.@ రిషి, @ ప్రఫుల్ల చంద్ర, @ సుజాత గారు, @anonymous, @ ఊకదంపుడు:కృతజ్ఞతలు.@ arjuna గారు:ఆ రోజు రావాలని ఆశిద్దాము. నా బ్లాగు కాకపోయినా ఆ స్థాయి ఉన్న బ్లాగులు తప్పకుండా ఉన్నాయి.

 31. Indira said,

  Hello Praveen Garu,

  I just saw the article in eenadu and happened to read some posts in your blog.
  Meeru chala baga rastunnaru. Chaduvutunte inka chadavalanipistundi. Keep it up.

 32. Indira said,

  Hello Praveen Garu,I just saw the article in eenadu and happened to read some posts in your blog. Meeru chala baga rastunnaru. Chaduvutunte inka chadavalanipistundi. Keep it up.

 33. tirumala said,

  Congrats Praveen.
  nenu general ga blogs baga chustuntanu.
  jalleda lo vetukutunta manchi blogs kosam.
  and meeru rasinivi anni morning nunchi chadivesanu.
  really superb.

 34. tirumala said,

  Congrats Praveen.nenu general ga blogs baga chustuntanu.jalleda lo vetukutunta manchi blogs kosam.and meeru rasinivi anni morning nunchi chadivesanu.really superb.

 35. Indira said,

  Hello Praveen Garu,

  Mallee nene. eesari mee blog lo posts anni chadivesa ani cheppataniki vacha. naku anniti kanna mee college dance post baga nachindi. Looking forward to read more posts from you.

 36. Indira said,

  Hello Praveen Garu,Mallee nene. eesari mee blog lo posts anni chadivesa ani cheppataniki vacha. naku anniti kanna mee college dance post baga nachindi. Looking forward to read more posts from you.

 37. సత్యసాయి కొవ్వలి said,

  congrats praveen.

 38. congrats praveen.

 39. ప్రవీణ్ గార్లపాటి said,

  @indira, @tirumala, @కొవ్వలి గారు:
  మీ అభిమానానికి కృతజ్ఞతలు.

 40. @indira, @tirumala, @కొవ్వలి గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: