నవంబర్ 16, 2008

డిటెక్టీవ్‌లు, షెర్లాక్ హోంస్, ఫెలూదా …

Posted in అనుభవాలు, ఆలోచనలు, డిటెక్టీవ్, ఫెలూదా, షెర్లాక్ హోంస్ వద్ద 7:00 సా. ద్వారా Praveen Garlapati

8 వ్యాఖ్యలు »

 1. chala baga rasaru and thanks for the link to sherlock holmes series…

 2. డయిల్ గారి హోంసే, అంతకు మునుపు ఎడ్గర్ ఏలన్ పో సృష్టించిన మరో డిటెక్టివ్ ప్రేరణతో ప్రాణం పోసుకున్నవాడు.పోగారి కథనాలు డాయిల్ గారి కథనాలంత ఉత్కంఠభరితంగా ఉండవు గానీ చదవ దగినవే.

 3. శరత్ said,

  షెర్లాక్ హోంస్ కంప్లీట్ వాల్యూం తెచ్చుకొని మా నాన్న గారు ఎంతో ప్రీతి పాత్రంగా చదివేవారు. నేను మొత్తం ఇంకా చదవలేకపోయాను. అప్పట్లో తెలుగు డిటెక్టివ్ నవల్స్ మాత్రం బాగా చదివేవాడిని.

 4. రవి said,

  ఇంగ్లీషులో పెద్దగా సీను లేకపోవడం వల్ల నేను ఇవి చదవలేదు :-(. మొత్తానికి ఫిలాసఫీ పుస్తకాలకు అవతల ఇంకో ప్రపంచం ఉందని తెలిసింది!సత్యజిత్ రే ఫెలూదానే కాకుండా, హారర్ కథలు కూడా ఉన్నాయి. ఒక్కసారి చదవడం మొదలెడితే ఆపలేరు. గారంటీ. ప్రయత్నించండి.

 5. Purnima said,

  బోలెడన్ని కబుర్లు చెప్పుకోడానికి వీలున్న టపా! కానీ ఈ డబ్బాలో నా డబ్బా మొదలెట్టచ్చో పెట్టకూడదో.. అయినా సరే.. గబగబా చెప్పేస్తా.. > Hound of Baskerville, మాకు పదో తరగతిలో నాన్-డిటేల్. నేను నా లాంగ్వేజ్ టెక్ట్స్ అన్నీ అట్టలేయకముందే చదివేసేదాన్ని. తెలుగు వాచకంలో పద్య భాగం కష్టం కాబట్టి, భావాలు చదివేసి ఊరుకునేదాన్ని. అప్పుడేమయ్యిందో గుర్తు రావటం లేదు కానీ, నేను ఇంట్లో అర్థరాత్రి ఒంటరిగా నిద్రపోకుండా ఉండాల్సి వచ్చింది ఒక రోజున( ఏదో ఎమెర్జెన్సీ) బోర్ కొడుతుందని ఈ పుస్తకం తీసా.. నా తిప్పలు అన్నీ-ఇన్నీ కావు! పుస్తకం పెట్టిన భయం కన్నా, పరిస్థితులు ఎక్కువ పెట్టాయనుకుంటా. నాకు చాలా నచ్చిన పుస్తకం. > మీరిప్పుడు చదువుతున్న బారిష్టరు పార్వతీశం, పదో తరగతి నాన్-డీటేల్. మా తెలుగు టీచర్ నాన్-డీటేల్ ని క్లాసులో మా చేతే చదివించేవారు, ఒక్కోరు ఒక్కో పేరా చదవాలి. ఓ అమ్మాయి లేచి చదువుతున్నా, పుస్తకం ఎదురుగా ఉంటే మన కళ్ళూ పరుగులు తీస్తాయి కదా. ఎక్కడో చోట పుస్సుకుమంటాం త్వరగా చదివే నాలాంటి వాళ్ళు. అది ఇంకో ఇద్దరు ముగ్గురు అందుకుంటారు. చదువుతున్న అమ్మి ఇవేమీ పట్టించుకోకుండా పూర్తి చేయాలి. కష్టపడి పూర్తి చేస్తుంది. కానీ ఆ పాటికే క్లాసంతా గొల్లుమంటుంది. కలిసి చదువుతూ నవ్వుతూ ఆనందించిన క్షణాలవి. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు! మీరూ ఆ రచనను ఒక్కరికన్నా, pull somebody. ఎవరూ లేకపోతే అమ్మని బుక్ చేయడమే! :-)> ఫెలూదా గురించి చెప్పమని అడుగుదామనుకున్నా.. మీరే చెప్పేసారు.పార్వతీశం కబుర్లు మొసుకొచ్చే వరకూ, ఎదురు చూస్తాను. పూర్ణిమ

 6. @ దీప్తి గారు:షెర్లాక్ హోంస్‌ని నా టపా ద్వారా ఇంకొందరయినా చదవాలనేదే నా కోరిక.@ కొత్త పాళీ:ఓ! ఈ విషయం నాకు తెలీదు. థాంక్యూ చెప్పినందుకు.దొరికితే చదువుతా అవీ.@ శరత్:తప్పకుండా చదవండి. డిటెక్టీవ్‌లకే మాస్టరయిన ఆయనని పూర్తిగా చదవకపోతే ఎలా ?@ రవి:వావ్! ఇంకో తెలీని సంగతి తెలిపినందుకు థాంకులు.@ పూర్ణిమ:హహ! మీ కబుర్లు బాగున్నాయి.”Hound of Baskervilles” ఒకటే కాదు ఆ తరువాత “The Adventure of Blue Carbuncle” కూడా నాన్ డీటెయిల్‌గా చదివాను నేను.మంచి కథ అది కూడా.బారిష్టరు పార్వతీశం నా చిన్నప్పుడు చదివిందే. తీపి గుర్తులు మళ్ళీ నెమరేసుకోవడానికి. బెంగుళూరులో పుస్తక ప్రదర్శన ఉంటే ఆదివారం విశాలాంధ్రలో కొన్నా. ఓ నాలుగు పుస్తకాలు లైనులో ఉన్నాయి లెండి. 🙂

 7. Manohar said,

  ఒక పుస్తకంలో పాత్రలకి రచయిత మాత్రమే పూర్తిగా భాధ్యుడు. అయితే సినిమా విషయానికి వచ్చేసరికి మీరన్నది సరిగ్గా అతకదేమోనని నా అభిప్రాయం. ఎందుకంతే రచయిత మనకి ఒక నెపధ్యాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ నేపధ్యాన్ని అధారంగా చేసుకుని మనమే ఆ దృశ్యాన్ని పూర్తి చేసుకుంటాం. కాని సినిమా అలా కాదు. అది నటకుల హావభావాల మీద అదారపడి ఉంటుంది. పాత్ర ఎంత గొప్పదైనా ఆ గొప్పదనాన్ని సదరు పాత్రధారి పలికించలేకపోతే అంతా వ్యర్ధం అవుతుంది. ఏమంటారు?బారిష్టర్ పార్వతీశం, పదవ తరగతి లో ఒక పార్ట్ మాత్రమే ఉంది. ఐతే పార్వతీశం లండన్ లో చదువుకోవడం, మళ్ళీ తిరిగి రావడం, లాయర్ వృత్తిని చేపట్టడం, అక్కడ అలవాట్లు మానలేక ఇబ్బంది పడడం, చాల బగుంటుంది.www.teluguone.com లో మొత్తం మూడు భాగాలు దొరుకుతున్నాయి, నేను అన్నిటిని కలిపి ఒక పి.డి.ఎఫ్ గా తయారు చేసుకుని చదివాను.

 8. @ Manohar గారు:అవును. నేను చెప్పింది ఉద్దేశ్యం ఒక రచయిత ఆ పాత్ర ఆలోచించలేకపోతే, ఆ పాత్ర భావాలు, ఆహార్యం చెప్పకపోతే ఆ సినిమాలో ఆ హీరో పాత్ర ఉండదు కదా అని.ఆ పాత్రని పండించడంలో కథానాయకుడి/నాయకురాలి పాత్ర ఉందనేది మాత్రం ఖచ్చితంగా నిజం.అవునండోయ్! నేను చదివించి కేవలం మొదటి పార్టు మాత్రమే. ఇప్పుడు నేను కొన్నది మాత్రం మూడూ ఉన్న సమగ్రమయినది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: