నవంబర్ 28, 2008

ఎన్నాళ్ళిలా ?

Posted in ఆలోచనలు, పేలుళ్ళు, ముంబై వద్ద 7:06 సా. ద్వారా Praveen Garlapati

7 వ్యాఖ్యలు »

 1. Anonymous said,

  meeru cheppindhi current kaani mana rajakeeya nayakulu nakka lanti varu ela ante adhi okuda badhapaduthudhemo. sigguleni janma unna ekyka jathi rajakeeya nayakula jathi.

 2. saisahithi said,

  మీరన్నది అక్షరసత్యం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..అయితే ఇటువంటి పరిస్థితులకి ప్రజలెంతవరకూ భాగస్వామ్యులు అవుతారన్నది మరొక కోణం. అంత పెద్ద పెద్ద హోటళ్ళలో ఒక చిన్న లగేజి స్కానర్ వుండి వుంటే…వందల కేజీల ఆర్డిఎక్స్, మారణాయుధాలు లోపలికి వెళ్ళి వుండేవి కాదుగా

 3. రవి said,

  వందేళ్ళ చరిత్ర ఉన్న ఓ పార్టీకి, ఇలాంటి హోం మినిస్టర్, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. మరణించిన వారి మీద వీళ్ళకు కనీస సానుభూతి కూడా ఉందో లేదో అనుమానమే. దేవుడే రక్షించాలి మన దేశాన్ని.

 4. రవి said,

  వందేళ్ళ చరిత్ర ఉన్న ఓ పార్టీకి, ఇలాంటి హోం మినిస్టర్, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. మరణించిన వారి మీద వీళ్ళకు కనీస సానుభూతి కూడా ఉందో లేదో అనుమానమే. దేవుడే రక్షించాలి మన దేశాన్ని.

 5. నిజానికి నా అభిప్రాయం నా బ్లాగులోనే పోస్టుగా రాద్దామనుకున్నాను. కానీ మీ ఆవేదనలో చాలా నిజాయితీ కనపడి , ఇక ఇక్కడే రాద్దామనుకుంటున్నాను.దాడి జరిగినన్నాళ్ళూ కలుగులో ఎలకల్లా అయిపు లేకుండా పోయిన నాయకులంతా “దాడి ముగిసింది ‘అన్న ప్రకటన వెలువడ్డాక స్టేట్మెంట్లతో తయారవడాన్ని చూస్తుంటే వీళ్ళ మొహాన్న ఉమ్మెయ్యాలనిపించడం లేదూ? “మీరు మారరా?” అని పేడకళ్ళాపి మొహాన కొట్టాలనిపించడం లేదూ?దేశ ప్రజలంతా ముంబాయికి సంఘీభావంగా నిలబడ్డ రోజిది. అయినా రాజకీయ నాయకుల తీరు మాత్రం మారదే! శివరాజ్ పాటిలు పీకలేకపోయిందేమిటి, చిదంబరం వచ్చి పీకేదేమిటి? ఎవడైతే మనకేం ఒరిగింది. అందరూ ఆ తానులో ముక్కలేగా? అందరూ రాజకీయ నాయకులేగా?మంత్రుల్నీ, ముఖ్య మంత్రుల్నీ మార్చేస్తే పోయే సమస్యా ఇది?చిత్త శుద్ధి అన్న మాట వీళ్ళు చచ్చే లోపు ఒక్క సారైనా ఫీల్ కారా? అసలు విలాస రావుకి సిగ్గుంటే, అతగాడు మనిషైతే రాం గోపాల్ వర్మ ను , కొడుకు రితేష్ దేశ్ ముఖ్ ని తీసుకుని తాజ్ హోటల్కెళతాడా? స్మశానాన్ని తలపిస్తూ రక్తపు మరకలతో, బలవన్మరణం పొందిన ఆత్మలతో భీభత్సంగా ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళాల్సింది సినిమా దర్శకుడితోనా? ఈ వర్మ సైకో కాకపోతే అల్లాంటప్పుడు అక్కడికెళ్ళి సినిమాకు ప్లాట్ ఆలోచిస్తాడా? మనుషులా వీళ్ళు? మనుషులా వీళ్ళు? శవాల మీద పైసలేరుకునే వాళ్ళు కూడా గతిలేని పరిస్థితుల్లో ఏరుకుంటారు. వీళ్లని పోల్చడానికి నీచమైన పోలిక కూడా దొరకడం లేదు. తీరుబడిగా తాజ్ ముందు స్టేట్మెంట్లు ఇస్తున్న సంజయ్ నిరుపం మొహాన జనం చెప్పులు విసరడం చూసి చెప్పలేని సంతోషం కలిగింది. “దాడులు జరిగినపుడు ఎక్కడ దాక్కున్నావు, పోరా కుక్కా” అని జనం చీ కొడితే పారిపోయాడు. ఏదో సినిమా చూస్తున్నట్టు అనిపించింది.ముంబాయి జనాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాల త్యాగాలకు డబ్బు తో విలువ గట్టాలని చూసిన మోడీకి శ్రీమతి కర్కరే గట్టి గుణపాఠమే చెప్పింది. ఆ డబ్బు విసిరి అతని మొహానే కొట్టింది. ఒక రూపాయి చేర్చి కొడితే మరీ బాగుండేది. మనిషి పోయినపుడు డబ్బు ఇవ్వడం తప్ప ప్రాణం విలువు , త్యాగం విలువ తెలుసా వీళ్లకి? భారత దేశపు మోస్ట్ వేస్ట్ బాచెలర్ రాహుల్ ని, విలాస్ రావు కొడుకు రితేష్ ని NSG లోనో, సైన్యంలోనో చేర్చమంటే పంపుతారా? మీ కొడుకులు బిజెనెస్ మాగ్నెట్లూ, మీ వారసులుగా నాయకులూ కావాలా? ప్రజల ప్రాణాలకు మాత్రం మీరు హామీ ఇవ్వలేరు! ఇదెక్కడి న్యాయం?ఉన్ని కృష్ణన్ తండ్రి “you stinky dogs, go away” అని కేరళ ముఖ్యమంత్రిని మెడబట్టి బయటికి గెంటుతుంటే మనసు ప్రశాంతంగా అనిపించింది.జనం తిరగబడితే ఎలా వుంటుందో నాయకులకు ఇప్పుడే తెలిసింది.ఇంకా ఇంకా తిరగబడాలి. తరిమి తరిమి కొట్టాలి.సగం భయాందోళనలని మీడియా చానెళ్ళు సృష్టించాయి. ఈ విషయంలో అవి పూర్తిగా సఫలమయ్యాయి.ఇంకా నయం, బాబ్రీ మసీదు కూలగొట్టే సమయంలో ఇన్ని చానెళ్ళు ఉండుంటే కెమెరాలతో మసీదు పైకెక్కి, కరసేవకులకు చాన్స్ ఇవ్వకుండా వీళ్ళే మొత్తం కూలగొట్టేవాళ్ళేమో!(అన్ని చానెళ్ళ వాళ్ళూ ఎక్కితే కూలదూ) ప్రధానమంత్రి, హోం మంత్రుల వ్యాఖ్యలు వింటుంటే ఇలాంటి ప్రభుత్వం కింద ప్రజలుగా ఉన్నందుకు సిగ్గుతో చావాలనిపిస్తుంది. అసలు ప్రభుత్వమంటూ లేని చోటికి పారిపోవాలనిపిస్తోంది.(ఇప్పుడు ఉన్నది అక్కడేగా అంటారా) ఓటు గురించి ఎంత చెప్పినా ప్రజల్లో సరైన అవగాహన రావడం లేదు. పార్టీని చూసో, కులాన్ని చూసో తప్ప సరైన వ్యక్తిని ఎంచుకోవడం జరగటం లేదు. అయినా ఎవరికి ఓటేస్తే ఏమిటి? అందరూ దొంగలే అయినపుడు? ఎవరికి నిజాయితీ ఉంది?నిరాశగా ఉంది. దిగులుగా ఉంది. ఎప్పటికీ భారత రాజకీయ వ్యవస్థ మారదేమో అని భయంగా ఉంది.

 6. @ anonymous:నిజమే!@ saisahiti:ఒక రకంగా అవన్నీ తరువాత స్థాయి. ముందస్తుగా హెచ్చరికలు జారీ అయినా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం అతి పెద్ద తప్పు.@ రవి:కనకపు సింహాసమున … అదే ఇక్కడ.@ సుజాత గారు:మీకున్నటువంటి ఆలోచనలే నాకు కలిగాయి. కోపం, తట్టుకోలేనటువంటి కోపం.అన్నిటికన్నా నన్ను బాధించింది నాయకులలో అసలు నిజాయితీ కనబడకపోవడం. బాధ్యత గుర్తించకపోవడం.తప్పు వివిధ స్థాయిల్లో జరిగింది. లంచం తీసుకుని కొందరు, అజాగ్రత్తతో కొందరు, పట్టించుకోక కొందరు. అన్నీ కలిస్తే ఒక పెద్ద ఘోరం.అన్నిటినీ రాజకీయం, అన్నిటిలోనూ స్వలాభాపేక్ష.

 7. Watziznehm said,

  సుజాత గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం. వాళ్లకె చిత్తశుద్ది ఉంటె ఆక్టొపస్ విభాగాన్ని పొయిన ఆగస్టు లొ జరిగిన దాడి తరువత పూర్తి స్తాయిలొ సమీకరించి ఉండేవాళ్లు. తాజ్ సంఘటనకి రాజకీయ నాయకుల్లొ కనీసం ఒక్కరయిన కనీళ్లు కార్చారా? అంతా ఒక గాదె కింద …లె కద


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: