మార్చి 19, 2009

కథల్లో క్లిషేలు …

Posted in ఆలోచనలు, కథలు, క్లిషేలు వద్ద 7:05 సా. ద్వారా Praveen Garlapati

18 వ్యాఖ్యలు »

 1. ప్రవీణ్ గారు, సింప్లీ సింప్లీ సూపర్బ్ పోస్ట్. నేను అనుకుంటున్నవి నూటికి నూరు శాతం చెప్పారు. నిన్ననే నా బ్లాగులొ ఒక కథ గురించి చెప్తూ “చెత్త కథల గురించి ఒక పోస్టు వేస్తాను” అన్నాను. అందులో చెప్పాలనుకున్నవన్నీ మీరు చెప్పేసారు. అయినా సరే తొందర్లో నేను కూడా మరో పోస్టు వేస్తాను, మిమ్మల్ని స్పూర్తిగా తీసుకొని!

 2. Anonymous said,

  యాండోయి – అల్లా ఇతర కోణాలు సూయిత్తే సుయ్యిమని కోనార్కు ఎస్ప్రెస్సులాగా లగెత్తుకునొచ్చే వోళ్ళు శానా మంది ఉండారండి. మన కల్లూరాయన, అరిపిరాలోరు, కొత్తాళీ గోరు, మాలతి అమ్మోరు కతలు రాత్తే ఇపరీతమైన కోనాలు కనిపిత్తాయి కదోండీ. అయినా మీలాటి మారాజులకి ఇయ్యేం బుద్దులండీ – కతల్లో నిజాయితీలు, రియాల్టీలు ఎతకటం. చా, మా మాంచి తప్పు ఎగేత్తున్నారండోయి. కతల్లో పచ్చాత్తాపాలు నేపోతేనో, పేదోడు డబ్బున్నోడి మీన డవిలాగులు కొట్టకపోతేనో, ఎన్నారయిల్లో గుండెల్దీసిన బంట్లు లేపోతేనో మన గొర్రె జనాలు ఎట్టా తెర మీద సూత్తారండీ, కళ్ళతో సదూతారండీ ఇసిత్రం గాపోతేనూ. గాబట్టి మీరు ప్రశ్నలక్కనెట్టి మీక్కావలసింది సూటిగా రాసేత్తే ఇపరీతంగా సంతోసిత్తారండీ

 3. హ హ హ. భలే పోష్టు.పైన యెనానిమసుల కామెంటు గూడా బెష్టు.అద్సరే ప్రవీణ్, ఎన్నారైలు రాసుకునే కథల్లో ఎన్నారైల పాత్రలు ఎలా ఉంటాయంటారు? 🙂

 4. మేధ said,

  @కొత్తపాళీ గారు: ఎన్నారై లు వ్రాసే వాటిల్లో కూడా, కొంచెం విలనీనే ఉంచుతారు కాకపోతే, మరీ అంత క్రూడ్ విలన్స్ గా ఉండరు…

 5. ప్రవీణ్, నేననుకోవడం మీరు చెప్పిన మూస ధోరణి కథల కథకులకు సొంత ఆలోచన, ఆయా విషయాల మీద తమవైన అభిప్రాయాలు ఉండవనుకుంటా. సగటు మనస్తత్వం ఫలితం ఇది. అదే రచనల్లో, సినిమాల్లో, ఇతర కళారూపాల్లో ప్రకటమవుతూ ఉంటుంది. బలిపీఠం సినిమా చూసి కులాంతర వివాహం చేసుకున్న వాళ్లంతా చివరకు పశ్చాత్తాపపడతారని ఒక నిర్ణయానికొచ్చేస్తారు సగటు ప్రేక్షకులు. ఇటువంటిదే మీరు ప్రస్తావించిన కథకుల సంగతి. నేనెప్పుడూ ప్రేమలో పడలేదనుకోండి, అప్పుడు నాకు ప్రేమకథ నడిపించడం రాదు. అప్పుడేం చేస్తాను? సినిమాలు చూసిన, కొన్ని కథలు చదివిన అనుభవం ఉంటుంది కదా, దాన్నుపయోగించి నా కథలోని అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టో, ఏడిచి పిచ్చిదైపోయినట్టో, లేదా ఇటీవలి వార్తల్ని చూస్తుంటాను కనుక యాసిడ్ పోసినట్టో రాసేస్తాను అన్నమాట. 🙂 మరోకోణం తామనుభవించని వాటిపట్ల కుళ్లు. అంటే విమానమెక్కి అమెరికా వెళ్లి అక్కడి జీవితపు సౌఖ్య కోణాన్ని నేనెప్పుడూ చూళ్లేదు. వాళ్లూవీళ్లూ చెప్పినవి వింటాను. రోడ్లు బావుంటాయనీ, అవినీతి దైనందిన జీవితాన్ని ప్రభావితం చెయ్యదనీ.. ఇటువంటివి విని అసూయగా ఉంటుంది గదా, దాన్ని కప్పెట్టుకోవడానికి ువాళ్లంతా బంధాలను పట్టించుకోని వాళ్లని రాసేస్తా అన్నమాట. అర్థం చేసుకోరూ…

 6. ప్రవీణ్‌గారు,గత కొంతకాలంగా నా మనసులోనూ ఇదే ప్రశ్న నలుగుతోంది. మీరు చెప్పినట్టు అది క్లిషే మాత్రమేకాదు, మూస కూడా. ఇలాంటి మూసల్లో కథ వ్రాయటం చాలా సులభం. పాఠకుడు మనం చెప్పే లైన్లోనే ఆలోచిస్తాడు కాబట్టి కథ చివరిదాకా చదివించేస్తుంది. ఇలాంటి మూస దాటి వ్రాయాలంటే రచయితకి మంచి శిల్పం, విషయపరిజ్ఞానం అవసరం. ఇది కొంచెం అరుదైన పదార్థమే..!!మునుపు ఇలాగే కొత్త కోణంలో ఒక కథ వ్రాస్తే (పలక బలపం బ్లాగులో) అస్సలు బాగాలేదంటూ కొంత మంది వ్యాఖ్యానించారు. బాలేదంటే అక్కడ అర్థం “నువ్వు రచయితగా ఫైల్ అయ్యావు.. నువ్వు (రాడికల్‌గా)చెప్పదల్చుకున్నది మాదాకా చేరలేదు” అని నేను అర్థం చేసుకున్నాను. మరోసారి ఇలాంటి కథ వ్రాయాలా వద్దా అని ఆలోచించాను.అయితే అలా చెప్పి మెప్పించినవారూ లేక పోలేదు. క్రింది బ్లాగులో ప్రముఖ దిన పత్రికలో వచ్చిన కొన్ని కథలున్నాయి. అందులో – బందెలచావిడి, అనుబంధం చదవండి. మీకు కొంచెం సాంత్వన కలుగుతుంది.http://sites.google.com/site/manchimata/inadu-adivaram-kathalu

 7. బాగుంది. ఆలోచించాల్సిన విషయం.

 8. మంచి దృక్కోణం. సంపాదించిన వాళ్ళేమీ పెద్ద సుఖపడిపోవడం లేదని అనుకోవడంలో ఒకరకమైన సేడిజంఉందేమో.

 9. చాలా బాగుంది మీ పోస్ట్.ఈ ప్రశ్నలన్నీ చాలా మంది మనసులో ఉన్నవే… అందరు రచయితలూ ఇలా ఒకే ధోరణిలో వ్రాసుకుంటూ పోతారు కనుకనే… ఎప్పుడైనా ఎవరైనా కొంచం వేరేగా రాస్తే… మనకి ఒక different, వెరైటీ కథ చదివిన ఫీలింగ్ వస్తుంది… ఆ వెరైటీ కథ కాస్త రిలీఫ్ ఇస్తుంది 🙂

 10. te.thulika said,

  మంచి చర్చే.సంపాదకులు కూడా ఇలాగే భిన్నదృక్పథాలు గల రచనలని స్వీకరించాలి కదా మూసకథలు మాత్రమే చదివే గతి మనకి పట్టకుండా వుండాలంటే. జీడిపప్ప దృష్టిలో చెత్తకథలేమిటో కూడా చూద్దాం.

 11. Sudhakar said,

  Nice thought process

 12. Ramesh Babu said,

  This comment has been removed by the author.

 13. Ramesh Babu said,

  అందరికి నమస్కరం అండి. ప్రవీన్ గారి బ్లాగు కి నేను ఒక క్రొత్త పాఠకుడిని.ఇలాంటి కధలు, సినిమాలు చాలా చూశాను, చదివాను కాని ఈ కొణం లొ ఎప్పుడు ఆలొచించ లెదండి బాబు!!కానీ, నావి విచిత్రమైన సందెహాలు హీరొ తుపాకి పెలిస్తె వెంటనె తగులుతుంది కాని విలన్ పెలిస్తె తగలవు ఎందుకు?2.హీరొ తుపాకి లొ బుల్లెట్స్ ఎప్పుదు ఎందుకు ఐపొవు?ఇలాంటి బోలెడు సందెహాలు

 14. కథ రాసే వారి ప్రధాన లక్ష్యాలను బట్టి కథ స్వరుపం మారుతూ ఉంటుంది అనుకుంటాను… ఎక్కువ మంది చదవాలి అనే ప్రధాన ఉద్దేశ్యంతో మొదలుపెడితే, మెజారిటీ వర్గాల కోసం (పేదరికం, బాధలు వగైరా) రాస్తారు. అనుభవాలు, ఊహలతో మరి కొన్ని.. మచ్చుకి ఎన్నడూ విదేశాలకు రాని వారు, లేదా వచ్చి ఓ పదిమందిని చుసి అమెరికా-అంతా-ఇంతే అని ఓ నిర్ణయానికి వచ్చిన వారు రాసే కథలు. స్లండాగ్‌లాంటి ప్రాపగాండా సినిమా కథలు… (వివరాల్లోకి వెళ్ళడం లేదు) వగైరా వగైరా….

 15. @జీడిపప్పు:మంచి టపా, విశ్లేషణ. టపా నచ్చినందుకు సంతోషం. మీ విశ్లేషణ కోసం ఎదురు చూస్తాను.@అనానిమస్సు:మీర్రాసిన యాస తెగ నచ్చేసిందండోయ్. సూటిగా సుత్తి లేకుండా వ్రాయమంటారా, సరే అలాగే :P@కొత్త పాళీ:ఈ మాటలో ఫస్టు హాండు ఎక్స్పీరియన్సు ఉన్న మీకు నేను చెప్పాలా ? :-)ఎవర్రాసినా ఎన్నారైలు ఎన్నారైలే, వారి మీద చెణుకులు విసరాల్సిందే.@మేధ::-)@అరుణ గారు:మంచి వివరణ. అయితే సొంత ఆలోచనతో రాయాల్సిన బాధ్యత కొంతయినా రచయిత మీద ఉంది.లేకపోతే ఆ రచయితకీ కాపీ కొట్టే దర్శకులకీ తేడా ఏముంది. కాన్సెప్టు ఒకటే అయినా టేకింగు వేరు అని చెప్పుకునే బాపతే.కొంతయినా ఒరిజినాలిటీ, సొంతంగా అనుభవించినవి వ్రాయాలి. అదీ కాక నేను గమనించిందేమిటంటే కొంత మంది రచయితలు తమ సొంత అనుభవాలు వేరుగా ఉన్నా అలా వ్రాయడానికి ఇష్టపడరు.ఉదా: ఒక సాఫ్టువేరు ఇంజినీరు కథ వ్రాస్తున్నాడనుకోండి, తన జీవితం గురించి సాధక బాధకాలన్నీ తెలిసినా ఆ వైపుని సరిగా చూపిస్తూ వ్రాయరు.@సత్యప్రసాద్ గారు:చక్కని లంకెని అందించినందుకు ధన్యవాదాలు.పాఠకులని మెప్పించడానికి కథలు వ్రాయాలా, సొంత ఆలోచనలని వ్రాసుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకునేదే.@మహేష్ గారు:థాంక్యూ!@కొవ్వలి గారు:హహహ… ఏమో అందని ద్రాక్ష సూత్రమేమయినా నేమో ?@చైతన్య:ఓహో! అలాగంటారా. అందరూ వెరయిటీగా రాస్తే వెరయిటీ బోరు కొడుతుందేమో :P@మాలతి గారు:పైన సత్యప్రసాద్ గారన్నట్టు ఒక మూసలో వ్రాయడం సులభం. కథని తేలికగా వ్రాయవచ్చు, ముగింపునివ్వవచ్చు.పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే భిన్నంగా ఉంటే ఆదరణ ఉండదనుకోవడం కూడా సరి కాదేమో. మీరన్నట్టు ప్రోత్సాహం ఉంటే తప్పక మరింత మంది ఇంకెన్నో కోణాలలో వ్రాయగలరు.@sudhakar: ధన్యవాదాలు.@Ramesh Babu:దేని దరిద్రం దానిదే !@నాగన్న:కొంత వరకూ ఒప్పుకుంటాను.సొంత అనుభవం లేని వారు ఒక విషయం గురించి వ్రాయకూడదని కాదు గానీ, కొంత పరిశోధన అయినా చేయాలి.రీచబిలిటీ విషయంలో మీ అభిప్రాయమే నాదీను.

 16. This comment has been removed by the author.

 17. భలే టపా!ఏదో కథలోనే చదివాను, "మనలో చాలామందిమి మాట్లాడేటప్పుడు మన మాట ఎదుటివారిలో అసూయ రేకెత్తించకుండా జాగ్రత్తపడుతూ వుంటాం. ఎదుటివాని దగ్గర లేనిది, నీకు మాత్రమే దక్కినదీ చూపిస్తే సాధారణంగా వాడు సంతోషించడు కానీ సంతోషించినట్టు నటిస్తాడు, నిన్ను అభినందిస్తాడు" అని.నువు ప్రస్తావించిన కథల్లో క్లిషేలకు కారణమిదే కావచ్చు. 🙂

 18. కొత్తపాళిగారి టపా ద్వార ఇవాళే మి బ్లాగు చుసానండి.చాలా బాగుంది.విలు చూసుకుని చదవాలి మీ పాత పోస్టులన్ని..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: