ఏప్రిల్ 8, 2007

అమ్మ ఊరెళ్ళింది…

Posted in అమ్మ వద్ద 7:23 సా. ద్వారా Praveen Garlapati

అమ్మ ఇంట్లో లేక పోతే ఎంత కష్టమో ?
అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది. నేనేమో పెద్ద అమ్మ కూచిని 🙂

ఇంటి తిండి, అమ్మా నాన్నా పక్కన లేకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. నా కాలేజీ తరవాత ఎప్పుడూ ఇక అమ్మా, నాన్న ని వదిలి ఇంట్లోంచి ఎక్కువగా వెళ్ళలేదు ఏదో కిందటి సంవత్సరం ఆ నెల యూ ఎస్ ట్రిప్ తరవాత (ఆహ్).

ఏది ఎలా ఉన్నా నాకు ఇంటి తిండి మాత్రం కావాల్సిందే. బయట తినడం అప్పుడప్పుడూ ఓకే అయినా తరచుగా అంటే కష్టమే నాకు. ఇక ఇప్పుడు అమ్మ ఇంట్లో లేదు మరి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగానే నాన్న ఉన్నారుగా అని ఆలోచన వచ్చింది. నాన్న కూడా ఇంటి భోజనమే ఇష్టపడతారు. నాకు ఎలాగూ వంట రాదు. నాన్న కి వచ్చు 😉

అమ్మ ఒక నాలుగు రోజులకి సరి పడా కూరలు, పచ్చళ్ళు అవీ వండేసి వెళ్ళిపోయింది. నాన్న అన్నం వండేస్తారు. ఎలాగో నెట్టెయ్యచ్చు ఈ నాలుగైదు రోజులూ.

ఏది ఎలా ఉన్నా రోజూ అమ్మ, నాన్నలతో మాట్లాడలేకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది కదూ ? తొందరగా వచ్చేస్తే బాగుండు.