జూన్ 7, 2007

గూగుల్ గేర్స్ …

Posted in ఆఫ్లైన్ బ్రౌజింగ్, గూగుల్ గేర్స్, టెక్నాలజీ వద్ద 6:30 ఉద. ద్వారా Praveen Garlapati

కొన్ని రోజుల క్రితం గూగుల్ కంపెనీ గూగుల్ గేర్స్ అనే కొత్త సాఫ్ట్‌వేర్ ని విడుదల చేసింది. ఇది ఆఫ్‌లైన్ లో బ్రౌజ్ చేసుకునేందుకు సృష్టించబడిన అప్లికేషన్.

ఎలాగంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ లో చూస్తున్న వెబ్ పేజీలన్నీ మీరు ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతారు. మీరు గనక కనెక్ట్ అయి లేకపోతే వాటిని డిస్క్ మీదకి సేవ్ చేసుకుని పేజీలని తెరిచి చదువుకోవాలి. అలాగే అది డైనమిక్ కంటెంట్ అయితే అలా చెయ్యడం కూడా కష్టమే.
ఆ సమస్యని పరిష్కరించేదే ఈ గూగుల్ గేర్స్.

ఈ అయిడియా కొత్తదేమీ కాదు, ఇంతకు ముందే ఫైర్‌ఫాక్స్ (మంట నక్క) ఇలాంటి ఫీచరే తమ రాబోయే 3.0 వర్షన్లో ప్రవేశబెట్టబోతున్నట్టు చెప్పింది. అలాగే ఈ ఆఫ్లైన్ బ్రౌజింగ్ మీద ఇంకో రెండు మూడు కంపెనీలు కూడా ఆసక్తి కనబరిచాయి. వెబారూ లాంటి వెబ్‌సైట్ లు ఆల్రడీ ఉన్నాయి. (వెబ్ పాక్ లు అందిస్తుంది ఈ వెబ్‌సైట్ ఆఫ్లైన్ లో బ్రౌజ్ చేసుకోవడానికి. నాకు తెలుసు కానీ నేనెప్పుడూ వాడలేదు.)

ఇక గూగుల్ గేర్స్ విషయానికొస్తే ఇది కూడా పైన చెప్పిన ఈ ఆఫ్లైన్ బ్రౌజింగ్ కోసం సృష్టించబడింది. ఇప్పటికయితే ఇది గూగుల్ రీడర్ తో పని చేస్తుంది. ముందు ముందు జీమెయిల్, ఇంకా మరెన్నో వెబ్‌సైట్ ల తో కూడా పని చేస్తుంది. అదే కాక గూగుల్ తీసుకున్న స్ట్రాటజీ బాగుంది. ఇది టెక్నాలజీ ని కేవలం గూగుల్ వెబ్‌సైట్ లకే పరిమితం కకుండా ఓపెన్ సోర్స్ చేసింది. అంటే ఈ టెక్నాలజీ ని ఎవరయినా ఉపయోగించుకుని గూగుల్ గేర్స్ ద్వారా తమ వెబ్సైట్ లు గట్రా ని ఆఫ్లైన్ యూజ్ కోసం రెడీ చెయ్యచ్చన్నమాట.

ఒక విధంగా చూస్తే ఇప్పుడు కనెక్టివిటీ బాగా పెరిగిపోయింది కాబట్టి దీని ఉపయోగం పెద్దగా ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది, కానీ ఇంకా అన్ని చోట్లా అందరికీ బాండ్విడ్త్ అందుబాటులొ లేదు కాబట్టి బాగానే పనికొస్తుంది.

ఉదాహరణకి మీకు RSS ఫీడ్లు చదివే అలవాటుందనుకోండి. మీరు ఆఫీసులో సమయం వృధా చెయ్యకుండా గూగుల్ రీడర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫీడ్లను గూగుల్ రీడర్ సహాయంతో సింక్రనైజ్ చేస్కుంటే ఇంటికొచ్చి తీరిగ్గా చదువుకోవచ్చు. ముందు ముందు జీమెయిల్ సపోర్ట్ కూడా జత చెయ్యబడిందనుకోండి అప్పుడు మీ మెయిల్స్ అన్నీ సింక్రనైజ్ చేసుకుని జీమెయిల్ ఇంటర్ఫేస్ ఉపయోగించి బ్రౌజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికయితే ఇది మంట నక్క తో మాత్రమే పని చేస్తుంది.

మీరు దీనిని ఎలా ఉపయోగించవచ్చో కింద చూడండి.

గూగుల్ గేర్స్ వెబ్‌సైట్ ని మంట నక్క లో తెరవండి.

ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోండి.

తరువాత గూగుల్ రీడర్ ని మంట నక్క లో తెరవండి. మీకు పైన మెనూ లో ఒక చిన్న పచ్చ రంగులో ఒక ఐకాన్ కనిపిస్తుంది. దానిని నొక్కండి అంతే. మీ 2000 ఫీడ్లు ఆఫ్లైన్ లో బ్రౌజ్ చెయ్యడానికి రెడీ అయిపోతాయి.

 

దీనిని పరీక్షించాలనుకుంటే డిస్కనెక్ట్ అయ్యి చూడండి, లేదా మీ బ్రౌజరుని ఆఫ్లైన్ లోకి తీసుకెళ్ళండి. ఇప్పుడు మీ ఫీడ్లను ఆఫ్లైన్ లో కూడా చదువుకోవచ్చు. (బొమ్మలు కనబడవు)

భలే ఉంది కదూ. మిగతా వెబ్సైట్ లకి కూడా విస్తరించనివ్వండి అప్పుడు ఇంకా మజా వస్తుంది. ఉదాహరణకి జీమెయిల్, గూగుల్ డాక్స్ మొదలయినవి.

అంటే అప్పుడు గూగుల్ డెస్క్టాప్ స్పేస్ లో కూడా ప్లేయర్ అవుతుందన్నమాట ఒక విధంగా.

ఏమో ఎవరికి తెలుసు రేప్పొద్దున్న కూడలి మొదలయిన వెబ్సైట్ల ని కూడా ఆఫ్లైన్ బ్రౌజింగ్ కి ఎనేబుల్ చేస్తే మనందరం ఎంచగ్గ తీరికున్నప్పుడు బ్లాగులన్నీ చదువుకొవచ్చు. వింటున్నారా వీవెన్, చందూ, గౌరీ శంకర్ 🙂