ద్వాదశ జ్యోతిర్లింగాలు…

ఈనాడు లో ప్రచురితమయిన బ్రహ్మమురారి సురార్చిత లింగం అనే వ్యాసం బాగుంది. చదవండి. ఇందులో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి వాటి పురాణాల గురించి క్లుప్తం గా అందించారు.

మహా శివరాత్రి సందర్భంగా ఒక సారి ఇవన్ని చదవచ్చు. దేవుదంటే పెద్దగా ఆరాధించక పోయినా నాకు పురాణాలంటే ఆసక్తి. స్థల పురాణాలు, వాటి గాధలు తెలుసుకోవడం నాకిష్టం. పిట్టకథలు కూడా.

ద్వాదశ జ్యోతిర్లింగలలో నేను శ్రీశైలం, కేదారనాథ్, కాశీ, రామేశ్వరం చూసినట్టు గుర్తు. ఇంకా చూసి ఉండవచ్చు కానీ నాకు తెలీని వయసులో అయి ఉంటుంది. ఇంతకు ముందు అయితే నాన్న LTC లో ప్రతీ రెండేళ్లకూ ఎక్కడో అక్కడికి తీసుకు వెళ్ళేవారు. దాదాపు ఎన్నో ప్రదేశాలు నేను అలా చూసినవే. ఇప్పుడు అంత planning చెయ్యటానికి మన దగ్గర సమయమూ లేదు.

అన్నిటికంటే నాకు బాగా గుర్తుండిపోయినది మాత్రం కేదారనాథ్. ఢిల్లీ కి వెళ్ళి అక్కడ నుంచి కేదారనాథ్ కి చేరుకున్నాము. అక్కడ మంచు, ఆ ప్రదేశం, పోనీ లలోకొండ మీదకి ప్రయాణం చెయ్యడం ఎంతో బాగా ఆనందం కలిగించింది, గుర్తుండిపోయింది. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అదో అలౌకికమయిన ఆనందం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వినిపించే దేవుడి స్తూతులు, ఓం కారాలు మనసు కు ఎంతో హాయి కలుగచేస్తాయి. దారిలో ఎన్నో గంగా నదికి చెందిన ఉపనదులు, అంత చలిలో వాటిలో స్నానం చెయ్యడం. అక్కడ అంత చలిగా ఉంటుందని తెలీక స్వెటర్లు, రగ్గులు పెద్దగా తీసుకెళ్ళక ఇబ్బంది పడటం అన్నీ బాగా గుర్తున్నాయి.

నాన్న గారు తీసుకువెళ్ళబట్టి కానీ నేను నా అంతట వెళ్ళేవాదిని కాదేమో అనిపిస్తుంది నాకు. చక్కటి అనుభూతులు మాత్రం మిగిల్చాయి.