మార్చి 18, 2007

ఉబుంటు స్థానీకరణ…

Posted in ఉబుంటు స్థానీకరణ వద్ద 9:25 సా. ద్వారా Praveen Garlapati

వర్డ్ ప్రెస్, గూగుల్ మొదలయిన వాటి స్థానీకరణ చూసే ఉంటారు. అలాగే ఎంతో మంది ఉపయోగించే (నాతో పాటు) ఉబుంటు (లినక్స్ ఆపరేటింగ్ సిస్టం) స్థానీకరణ కూడా జరుగుతుంది. ఇవాళే దీని గురించి తెలిసుకున్నాను.

ఉబుంటు ని స్థానీకరణ చెయ్యడానికి మీకు గనక ఆసక్తి ఉంటే మీరు http://launchpad.net లో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ https://translations.launchpad.net/ ఉన్న వాటిలో మీకు కావలసిన వాటిని అనువదించటం మొదలుపెట్టగలరు.

మీకు ఆసక్తి ఉంటే నేను సృష్టించిన ఈ https://launchpad.net/~ubuntutelugutranslators టీంలో చేరవచ్చు.