IIT లు, మేధో వలసలు

IIT ని బాసర కి బదులు మెదక్ కి మార్చడం మీద అంతలా పోట్లాడటం ఎందుకో అర్థం కావట్లేదు. రాజకీయ పరంగా కాకపోతే ఎలా అయినా అది మన రాష్ట్రానికి వచ్చింది. అది చాలదా ?
అది వదిలేసి ఏదో కుట్ర జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు.

ఇందులో మాట్లాడే వారికి అసలు IIT యొక్క ప్రముఖ్యం కూడా సరిగా తెలుసో లేదో.

అయిన మన పిచ్చి కాకపోతే గాని IIT ఎక్కడ ఉంటే మాత్రం ఏమిటి ??? ఆఖరికి అందులో చదివిన వారెవరూ ఇండియా లో ఉంటే కదా మన దేశానికి ఏమయినా మంచి జరగడానికి.

ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే IIT లో చదివిన వారిలో 80% మంది U.S కి వెళ్లే

స్థిరపడుతున్నారని  అర్థమవుతుంది. మరి అలాంటి దానికి ఎన్ని ఉంటే ఎందుకు ?

మొన్నే ఈనాడు లో చదివాను, IIT లను improve చెయ్యాలంటే కొన్ని వందల కోట్లు అవసరమవుతాయని. మరి అంత ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి, వేరే దేశాన్ని ఉద్ధరించతామెందుకు ???

ఏమిటో ఈ జనాల పిచ్చి అనిపిస్తుంది ఒక్కోసారి. తల్లి తండ్రులను, మనవాళ్లను వదిలిపెట్టి, ఇక్కడ దొరికే సుఖమయిన జీవితాన్ని వదులుకుని ఎందుకు ప్రాణాన్ని కష్టపెట్టుకుంటారో అని ??? కానీ అంతలోనే అర్థమవుతుంది అందరూ ఒకేలా ఆలోచించరు కదా అని. ఎవరి priorities వారికి ఉంటాయి.

నాకు ఆశ్చర్యం వేసే మరో సంగతి ఏమిటి అంటే నా స్నేహితులు ఎవరు messenger లో లేదా online లో తగిలినా వారు నన్ను ముందు అడిగే ప్రశ్న U.S లో ఎక్కడున్నావు అని ?? అంటే నేను అక్కడే ఉన్నానని decide అయిపోతారాన్నమాట. నేను ఇండియా లోనే ఉన్నాను అని చెబితే ఏదో పాపం జాలి చూపిస్తారు, పాపం నాకు U.S వెళ్లే అవకాశం రాలేదేమో అని. నాకు interest లేదు అని చెబితే నాకు రాలేదు అని అలా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అయిన వారు అనుకునే దానితో నాకు పని లేదనుకోండి

నేను క్రితం సంవత్సరం ఆఫీస్ పని మీద U.S కి వెళ్లాను అక్కడ అందరూ మానవల్లే. ఎవరిని పలకరించనూ ఏదో నీర్వేదం వారిలో. ఏంటో నండి ఎలాగయినా వెనక్కి వచ్చేయ్యాలి అని ఉంది అని చెబుతారు. కానీ అది అంత వరకే అని వారికీ తెలుసు నాకూ తెలుసు. ఆ డబ్బు మాయ అటువంటిది మరి.

సరే ఎక్కడో మొదలెట్తి ఎక్కడకో వచ్చినట్టున్నాము. ఇక ముగిస్తాను.

మనవి: పైన రాసినవి నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ నొప్పించడానికి కాదు.