కూడలి కి కొత్త ఫీచర్లు…

అదేంటి వీవెన్ కాకుండా నేను విడుదల చేస్తున్నానేంటా అని అనుకుంటున్నారా ? అదే మరి.

మొన్న వీవెన్ గారు కూడలి కోసం కొత్త ఫీచర్ రిలీజ్ చేసినప్పుడు రానారె అడిగాడు, కూడలి లో మనకు కావలసిన టపాలు మాత్రమే కనిపించేలా చేసే ఫీచర్ కోసమని.

అంతకు ముందే నేను ఆ ఫీచర్ రాద్దామనుకున్నా… 🙂

దీనికి జిడ్డుకోతి కావాలి (అదే Greasemonkey). దానిని మీ మంట నక్క లో ఇన్స్టాల్ చేసుకోండి.

తర్వాత ఇక్కడ నుంచి స్క్రిప్ట్ ని దిగుమతి చేసుకుని జిడ్డు కోతిలో చేర్చుకోండి.

ఇదెలా పనిచేస్తుందంటే దీనిని మీ జిడ్డు కోతిలో అమర్చుకున్న తర్వాత మొదటి సారి కూడలి ని తెరుస్తే మిమ్మల్ని ఓ కొచ్చెన్ అడుగుద్ది, ఏ ఏ బ్లాగుల నుండి మీకు టపాలు కనిపించాలో అని. కాబట్టి ముందు మీకు ఏ ఏ బ్లాగులు కనిపించాలనుకుంటూన్నారో వాటి లంకెలు రెడీగా పెట్టుకోండి.

మీకు కావలసిన బ్లాగులన్నీ “|” డీలిమిటర్ తో అందులో ఇవ్వండి.

ఉదా: http://abc.blogspot.com|http://def.wordpress.com అలా అన్నమాట. అంతే కూడలిని ఓ సారి రిఫ్రెష్ చెయ్యండి. మీకు కావలసిన బ్లాగుల నుండి టపాలు మాత్రమే కనిపిస్తాయి.

ఉదా: http://uniquespeck.blogspot.com/ అనే బ్లాగొకటే కనిపించాలని నేను ఎంచుకుంటే కూడలి పేజీ నాకు ఈ కింద ఉన్నట్లుగా కనిపిస్తుంది.

కానీ ఇందులో ఓ మతలబు ఉంది. మీకు కావలసిన బ్లాగుల లిస్టులో ఓ కొత్త బ్లాగుని చేర్చాలనుకోండి ఈ కింది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి:

మీ మంట నక్క URL bar లో about:config అని టైప్ చెయ్యండి. వచ్చిన తర్వాత, దాని ఫిల్టర్ బాక్సులో greasemonkey.scriptvals.http://employees.org/~praveeng/KoodaliFilter-Include.
blockurls అని టైప్ చేసి వచ్చినే ఎంట్రీ ని ఎంచుకుని మీ ఎలక తో డబల్ క్లిక్కండి. అక్కడ మీకు కావలసిన బ్లాగుని ఇంకో “|” జత చేసి జోడించండి. ఇక నుండి ఆ బ్లాగు టపాలు కూడా మీకు కనిపించడం మొదలెడుతుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఒక వేళ మీరు కావలసిన బ్లాగులు కాకుండా అక్కరలేని బ్లాగులు తీసెయ్యాలనుకున్నరనుకోండి కూడలి లోనుంచి దానికి కూడా ఓ స్క్రిప్ట్ రాశా. పై దీనికి ఉల్టా అన్నమాట. ఉపయోగించడం పై దానిలాగానే. కాకపోతే దీనికి మీకు అక్కరలేని బ్లాగుల లంకెలు ఇవ్వండి.

తరవాతి సారి నుంచి మీకు అక్కర్లేని బ్లాగులు కనిపించవు. పైదాని లాగే ఈ లిస్టు కి ఏదయినా ఇంకో బ్లాగు జోడించాలంటే మళ్ళీ about:config కి వెళ్ళి ఈ సారి greasemonkey.scriptvals.http://employees.org/~praveeng/KoodaliFilter-Exclude.
blockurls
అనే దానిని ఎంచుకుని దానికి ఆ బ్లాగు లంకె ని జోడించండి. అంతే.

కూడలిలో కూడా ఇదే కోడునుపయోగించి ఫీచర్ ని జోడించచ్చు. కాకపోతే ఏ కుకీ నో ఉపయోగించాలి బ్లాగులను గుర్తు పెట్టుకోవడానికి.

* గ్రీజ్‌మంకీ గురించి ఓ చిన్న ఇంట్రడక్షన్ కావాలంటే నా ఈ టపా చదవచ్చు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవండి.
* మీరు గనక మంట నక్క (firefox) ఉపయోగించనట్లయితే మీకిది పనికిరాదు.