తెలుగు ఎనేబ్లర్…

జనాలకు తమ తమ సిస్టం లలో తెలుగు ని ఎనేబుల్ చెయ్యమని చెప్పేకంటే మనమే ఒక చిన్న యూటిలిటీ తయారు ద్వారా తెలుగు ని ఎనేబుల్ చెయ్యాలని మొన్న బెంగుళూరు బ్లాగర్లం కలిసినప్పుడు అనుకున్నాము.
అందుకని మొదటి విడతగా విండోస్ (xp, 95, 98, ME, 2000) లో తెలుగు ని ఎనేబుల్ చెయ్యడానికి యూటిలిటీలను తయారు చేసాను.

వీటిని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని మీ సిస్టం మీద పరిగెత్తించి పని చేస్తుందో లేదో చెప్పగలరు. (ఇవి ఇంకా ఆల్ఫా వర్షన్ లో ఉన్నాయి. కాబట్టి పరిగెత్తించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా మనవి. మీ పని ని దాచుకోండి.)

విండోస్ xp యూటిలిటీ
విండోస్ ఇతర వర్షన్లకోసం యూటిలిటీ

మీ బగ్గులు, తిట్లు బ్లాగు కామెంట్లలో పెట్టగలరు. 🙂 ఇంకెలాగయినా అభివృద్ధి పరచాలంటే సూచించగలరు.

గమనికలు:

విండోస్ xp యూటిలిటీ లో చిక్కులు:

* ఒక వేళ ఆల్రడీ మీ సిస్టం లో గనక తెలుగు కి సపోర్ట్ ఎనేబుల్ చేసుంటే గనక ఇది దానిని డిసేబుల్ చేస్తుంది. మళ్ళీ పరిగెత్తిస్తే ఎనేబుల్ చేస్తుంది. అంటే పరిగెత్తించిన ప్రతీ సారీ ఆప్షన్ ఫ్లిప్ అవుతుందన్నమాట.
సరి చెయ్యడం ఇప్పటికయితే కుదరలేదు. ఖాళీ దొరికితే చేస్తాను.
– సరయింది. కొత్త వర్షన్ అదే లంకె నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు..

* ఇంకోటి తెలుగు ఎనేబుల్ చేసిన తరువాత సిస్టం రీబూట్ చెయ్యాలా వద్దా అని అడుగుతుంది. నేను రీబూట్ చెయ్యట్లేదు (కావాలంటే చెయ్యవచ్చు). యూజర్ నే రీబూట్ చెయ్యమని అడుగుతున్నాను. ఇది ఓకే అనుకుంట ???

* కొన్ని సార్లు పని చెయ్యకపోవడం గమనించాను. (స్టక్ అవుతుంది.)

విండోస్ ఇతర వర్షన్ల యూటిలిటీ లో చిక్కులు:

* నా దగ్గర ఈ వర్షన్లు లేవు కాబట్టి ఇది టెస్ట్ చెయ్యబడలేదు. కానీ సింపుల్ ఫైల్ కాపీ కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. (దీనిని జిప్ ఫైల్ గా కాక ఒక ఎక్స్ట్రాక్ట్ గా చేసే ఆలోచన ఉంది. ఒకట్రెండు రోజుల్లో అదీ తయారవుద్ది.)

పెద్దగా కంప్యూటర్ల గురించి తెలీని వారికోసం ఈ యూటిలిటీలని ఎలా వాడాలో తొందర్లోనే ఒక పేజీ పెడతాను.