తెలుగు బ్లాగరుల సర్వే …

తెలుగు బ్లాగరుల సర్వే కోసం నేనో అప్లికేషన్ తయారు చేసాను.

మీరు ఇక్కడికి (http://employees.org/~praveeng/survey/) వెళ్ళి మీ వివరాలను ఇస్తే అంతే చాలు.

దీని ముఖ్యోద్దేశం:
1. బ్లాగు జనాలలో ఎవరెవరు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నారో తెలుస్తుంది.
2. మీ నగరం లో ఎవరయినా బ్లాగరులు ఉన్నారేమో సులభంగా కనుక్కోవచ్చు.
3. మీటింగులు గట్రా ఆర్గనైజ్ చేసుకోవడానికి సులభం.
4. బ్లాగు జనాల డెమోగ్రాఫిక్స్ తెలుస్తాయి.

ఇవి గమనించండి:

1. ఇందులో మీరు ఇచ్చే వివరాలలో కొన్నే అందరికీ చూడటానికి వీలవుతాయి.
2. ఈ అప్లికేషను నేనెందుకు తయారు చేస్తున్నానంటే నాకు మన బ్లాగర్ల డెమోగ్రాఫిక్స్ తెలుసుకుందామనే ఆసక్తి. ఆ వివరాలను నేను అందరికీ షేర్ చేస్తాను. నాకు కంట్రోల్ సరిగా ఉంటుంది నా అప్లికేషనయితే. నాకు కావలసిన రిపోర్టులు ఈజీ గా తయారు చెయ్యగలను. (సర్వేలు చెయ్యడానికి ఆల్రడీ అప్లికేషన్లు ఉన్నాయి.)
ఉదా: ఏ ఏజ్ గ్రూపు లో జనాలు ఎక్కువగా బ్లాగుతున్నారో, ఆడ మగ పర్సెంటేజీలు, ఏ బ్లాగు హోస్టుతో ఎక్కువగా బ్లాగుతున్నారో మొదలయినవి. వీటికి ఇంకొన్ని రోజులు పట్టచ్చు.
3. అన్ని వివరాలూ ఇవ్వడం కంపల్సరీ కాదు కానీ ఇస్తే పైన చెప్పిన సమాచారం సేకరించడానికి నాకు తోడ్పడుతుంది.
4. ఇంకేమన్నా సమాచారం సేకరిస్తే బాగుంటుందేమో చెప్పండి.
5. బగ్గులున్నచో నాకో కామెంటో మెయిలో పడెయ్యండి. ఫీచర్ రిక్వెస్టులు కూడా.
6. తెలుగు బ్లాగులున్న వారే పాల్గొనమని మనవి.
7. ఒక సారి సమర్పించిన సమాచారం ఎడిట్ చెయ్యడానికి ప్రస్తుతానికయితే నేను వీలు కల్పించలేదు. కావాలి అనుకుంటే కల్పిస్తా.