జనవరి 6, 2007
గూగుల్, బ్లాగర్, ఆర్కుట్….
గూగుల్ అంటే నాకు తగని ఇష్టం, గౌరవం…
ముఖ్యం గా ఎందుకంటే వారి సృజనాత్మకత, ఇంకా వారు users గురించి పట్టించుకునే తీరు. simplicity వారి products లో అణువనువునా కనిపిస్తుంది.
ఏ product తీసుకున్న, ఉదాహరణకి సెర్చ్… ఆ హోం పేజీ చూడండి ఒక చిన్న సెర్చ్ బాక్స్, రెండు మూడు బటన్లు, రెండు మూడు లింకులు…అంతే ఎందుకంటే దాని ముఖ్య కారణం users కి వారికి కావలసిన సమాచారం అందించడం. దానికి అవి చాలు.
వెబ్ లో చాలా site లు ఉన్నాయి కానీ చాలా మటుకు వాటికీ simplicity అంటే ఏమిటో తెలీదు…ఎన్ని ఎక్కువ ఫీచర్లు పెడితే అంత మంచిది అనే భావం తప్పితే అవి ఎంత బావున్నాయి, అవి ఎవరన్న నిజంగా వాడతార ? అవి అవసరమా ? అనే ఆలోచనలు చేసేవి చాలా తక్కువ. ఉదాహరణకి యాహూ హోం పేజీ చూడండి ఎంత కలగాపులగాంగా ఉంటుందో. నిజమే information ఉండడం అవసరమే కానీ ఆది సరిగా అమర్చి ఉండకపోతే దాని ఆది appeal అవదు.
కానీ గూగుల్ products నాకు నచ్చనివి కూడా ఉన్నాయి అవి బ్లాగర్ ఇంకా ఓర్కుట్ ముఖ్యంగా…
ఎందుకంటారా బ్లాగర్ అంత చెత్త బ్లాగ్ సాఫ్ట్వేర్ ని నేను చూడలేదు అని చెప్పవచ్చు….
ఒకసారి ఎవరయిన లైవ్ జర్నల్, వర్డ్ ప్రెస్, మూవబుల్ టైప్ వంటి సాఫ్ట్వేర్ లు వాడినతరువాత బ్లాగర్ ని వాటితో పోలిస్తే ఆది ఎందుకో appeal అవదు. ఉదాహరణకి వేరే వాటిలో ఉన్న కామెంట్స్ త్రెడింగ్ ఫీచర్, స్నేహితులను add చేసుకునే ఫీచర్, కామెంట్ కి బదులిస్తే కామెంట్ చేసిన వారికి, ఇంకా పోస్ట్ చేసిన వారికి మెయిల్ చేసే ఫీచర్, స్నేహితుల బ్లాగులలో పోస్ట్ లు అన్ని ఒక దగ్గర చేర్చి చూపించడం (కూడలి లాగా అన్నమాట.) లాంటివి….ఇలాంటివి అన్ని లైవ్ జర్నల్ లో ఉన్నాయి. నేను బ్లాగటం మొదలెట్టింది లైవ్ జర్నల్ లో నే కాబట్టి నాకు ఎన్నల్లగానో దాని గురించి తెలుసు. వాళ్ళని బాగ్గింగ్ లో pioneers అని చెప్పవచ్చు. వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఓపెన్ సోర్స్. ఒక బ్లాగ్ సాఫ్ట్వేర్ కి కావలసిన అన్ని సదుపాయలు ఇందులో ఉన్నాయి.
అయినా నేను బ్లాగర్ ని ఎందుకు వాడుతున్నాను అంటారా…
మొదట గూగుల్ ఈ ఒక్క సాఫ్ట్వేర్ నే కదా ఉపయోగించనిది అని మొదలెట్టా…ఇక ఆది కూడలి లో జతపరిచిన తరువాత ఇక మార్చడం ఎందుకు అని అలాగే వదిలేసా… ఆది కాక లైవ్ జర్నల్ లో కామెంట్ చెయ్యాలి అంటే వారికి లైవ్ జర్నల్ లో account తో కానీ, ఓపెన్ ఐడీ (దీని గురించి మరో సారి మాట్లాడుకుందాము) తో కానీ, anonymous గా కానీ చెయ్యాలి. ఇక ఇక్కడ అందరికి చాలా మటుకు బ్లాగర్ లో అక్కౌంట్స్ ఉండడం తో ఇక అలా కానిచ్చేశాను.
ఇంకోటి నాకు నచ్చనిది ఆర్కుట్ అని చెప్పాను కదా…ఆది ఎందుకంటే అన్ని వెబ్ సైట్ లనూ అంత చక్కగా maintain చేసే గూగుల్ దీనిని మాత్రం ఆ quality తో maintain చెయ్యలేకపోతుంది. మనం ఎన్ని సార్లు “Bad Bad Server….No Donut for you” message చూశాము ??? (సరదాగా బానే ఉంటుంది అనుకోండి) అందుకే నాకు నచ్చదు (ఓర్కుట్ ని మైక్రోసాఫ్ట్ technologies తో రూపొందించారు మరి ;))కాకపోతే design బాగా చేసి మంచి ఫీచర్లతో మిగతా సోషల్ నెట్వోర్క్ల కన్నా బాగా ఆకట్టుకుంటుంది. ఇది వారు scratch నుంచి తయారు చేసింది కాక acquire చేసిన సాఫ్ట్వేర్ కావడం కారణం కావచ్చు.
అయినా సరే గూగుల్ అంటే నాకున్న అభిమానం ఏ మాత్రం సడలలేదు. నా జీవితంలో ఉన్న ఒక ఆశయం గూగుల్ లో పని చెయ్యటం, ఎంతో మందికి ఉంటుంది అనుకోండి. ఈ సారి కుదరలేదు సరే ఇంకోసారి తప్పకుండా…. 😉