బ్లాగు పుస్తకం ఇదుగో …

అనుకున్నట్టుగానే ఉగాదికి మన బ్లాగు పుస్తకం ఇక్కడ విడుదల.

ఈ పుస్తకం మొదలు నుంచి చివరి వరకూ నాకు చక్కని అనుభవంగా మిగిలింది.
చేద్దాము అనుకున్న దగ్గర నుంచీ టపాలు సేకరించి, వాటిలో నుంచి టపాలను ఎంచుకుని, వాటిని ఒక పద్ధతిలో పేర్చి పుస్తకం తయారు చేసే వరకూ అన్ని పనులలో వివిధ వ్యక్తుల నుంచి నాకు సహకారం లభించింది.

వారందరి సహాయంతో మన మొదటి బ్లాగు పుస్తకం తయారు అయింది.

వివిధ వర్గాలు ఈ ప్రకారంగా బ్లాగు పుస్తకంలో ఉంచబడ్డాయి.

  1. హాస్యం
  2. కవిత
  3. కథ
  4. రాజకీయం
  5. సినిమా
  6. సాంకేతికం
  7. వ్యక్తిగతం/ఆలోచనలు/అనుభవాలు
  8. వ్యాసం

నాకు వచ్చిన టపాలలో నుంచి మంచి వాటిని ఎంపిక చేసి, వర్గాలుగా విభజించి పై వాటిలో ఉంచాను.

ఆ తర్వాత ఆకర్షణీయమయిన కవరుపేజీ ని వీవెన్ తయారు చేసి ఇవ్వడంతో పుస్తకానికి నిజమయిన పుస్తకం రూపు వచ్చింది.
ఆఖరికి ఇలా మీ ముందుకి వచ్చింది.

పుస్తకాన్ని ఇక్కడ నుంచి (http://employees.org/~praveeng/telugublogbook/telugublogbook.pdf) దిగుమతి చేసుకోగలరు.

ఈ ప్రయత్నంలో నన్ను ప్రోత్సాహించిన అందరికీ నా కృతజ్ఞతలు.

ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలిసిన తెలుగు వారందరికీ ఈ పుస్తకాన్ని అందించగలరు. 🙂

* పుస్తకానికి సంబంధించి ఏమన్నా మెరుగుపరచవచ్చంటే చెప్పగలరు.
* దయచేసి ఇందులో టపాలను మాత్రమే అత్యుత్తమంగా అనుకోవద్దు. నాకు వచ్చిన టపాల నుంచి, నా దృష్టిలో ఉన్న టపాల నుంచి మంచి టపాలను ఒక సంకలనంగా మాత్రమే ఈ పుస్తకాన్ని పరిగణించగలరు.
* ఎవరివయినా మంచి టపాలు ఇందులో లేకపోతే క్షమించగలరు. వచ్చేసారి ఇంతకన్నా మెరుగ్గా అన్ని టపాలనూ సేకరించడానికి ప్రయత్నించవచ్చు 🙂 (దయచేసి పుస్తకాన్ని పుస్తకంగా చూడగలరు.)
* నాకు అంతటా సహకరించిన మన బ్లాగు స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. (చావా కిరణ్, వీవెన్, స్వాతికుమారి, రానారె, చదువరి, కొత్త పాళీ, సుధాకర్ కీ ప్రత్యేకంగా)