నవంబర్ 19, 2007
భరత్ గాడి హాపీ డేస్ …
మొత్తానికి ఎప్పటి నుంచో నే పోరుతుంటే భరత్ గాడు ఆఖరికి ఒక టపా రాద్దామనుకుని మొదలెట్టాడు. భరత్ అంటే నా ప్రాణ స్నేహితుల్లో ఒకడు లెండి. ఇంతకు ముందు ఒక రెండు మూడు సార్లు నా టపాల్లో వీడి గురించి చెప్పా.
టీవీ టవరంత పొడుగుంటాడు. డాన్సు, క్రికెట్టు ఇరగదీస్తాడు. మంచి ఆల్రౌండరు :), కొంత రసహృదయం ఉన్నవాడు. ఆ డీటెయిల్సు లోకి వెళ్ళను లెండి. ఈ నెలాఖరుకి పెళ్ళి చేసుకుంటున్నాడు. (అప్పటికీ నేను భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ అని పాడుతూనే ఉన్నా… వినిపించుకుంటేగా)
ఇంతకీ విషయమేమిటంటే వాడిని పోరితే కంటెంటు తయారు చేసుకున్నాడు రాయడానికి. దానిని కాస్తా బ్లాగులో రాయకుండా హాపీ డేస్ కాంటెస్టంట ఐడిల్ బ్రెయిన్ కి పంపించాడు. అది కాస్తా ఎంపికయిపోయింది. కంటెంటు తెలుగింగ్లీషులో రాసాడు అక్కడ.
హాపీ డేస్ టీం తో డల్లస్ లో ఎంజాయ్ చేసాడు ఎదవ.
అన్నట్టు వాడి వ్యాసం చదివి అందులో నా పేరు గానీ కనిపిస్తే అది నేను కాదు. అక్కడ ఫోటోల్లో చూచాయగా నాలాగా ఎవరయినా కనిపిస్తే అది కూడా నేను కాదు. కనిపించకపోతే మరీ మంచిది 😛