నవంబర్ 23, 2006

లాంచీ…

Posted in లాంచీ వద్ద 4:45 సా. ద్వారా Praveen Garlapati

మీ start menu కూడా నా PC లో లా చేంతాడంత పొడుగ్గా ఉంది మీ software లు లాంచ్ చెయ్యడానికి కష్టమనిపిస్తే మీరు కూడా “Launchy” అనే ఈ software ని ఇన్‌స్టాల్ చేసుకోండి.

చాలా చిన్న software కానీ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఇది మీ స్టార్ట్ మేను లో ఉండే shortcuts అన్నిటిని గుర్తుంచుకుని మీకు కావాల్సినప్పుడు ఒక “Hot Key” దూరంలో ఉండేల చేస్తుంది.

అంటే కాక మీకు కావలసిన folders దీనికి అందిస్తే గనుక దాంట్లో ఉన్న files ని కూడా మీకు కావలసినప్పుడు వెతకడానికి అనువుగా చేస్తుంది.

“Google Desktop” కూడా ఇవన్ని చేస్తుంది కానీ అందరు ఆది ఉపయోగించకపోవచ్చు. అది గాక ఆది ఎంతో disk space తీసుకుంటుంది.

కాకపోతే ఈ software, filenames మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది, Google Desktop లాగా దాని contents ని వెతకటానికి వీల్లేదు. కాబట్టి మీకో light weight search tool కావాలంటే ఇది వాడచ్చు.

క్రింద దాని బొమ్మలు చూడండి :