జనవరి 23, 2008

కేడీయీ ౪…

Posted in కేడీయీ ౪, టెక్నాలజీ, లినక్స్, KDE 4, linux వద్ద 8:31 సా. ద్వారా Praveen Garlapati

ఈ మధ్య నన్ను బాగా నిరాశపరచినది కొత్తగా రిలీజయిన కేడీయీ ౪.

ఇది చాలా విధాలుగా ఓ రివల్యూషనరీ అని బాగా ప్రచారం జరిగింది ఎందుకంటే ఇది కేడీయీ కి సంబంధించి చాలా వరకూ కోడ్ రీరైట్.
స్టన్నింగ్ గ్రాఫిక్స్, ఐకాన్స్ తో మాక్ నే తలదన్నేట్టుగా ఉంటుందన్న అంచనాలున్నాయి.
ఇది ఆక్సిజన్ అని ఒక సరికొత్త ఐకాన్స్, గ్రాఫిక్స్ సెట్ ని ఉపయోగించుకుంటుంది. (ఎక్సలెంటుగా ఉన్నాయి ఐకాన్లు)
అలాగే ప్లాస్మా అనే ఒక విడ్జెట్ల మీద ఆధారితమయిన కేడీయీ ని రూపొందించారు. (చాలా మంచి కాన్సెప్టు)

అంతా బాగానే ఉంది. కొత్త రిలీజూ చెయ్యబడింది కానీ హైప్ చేసినంత బాగా లేదనే చెప్పుకోవాలి.
నన్నయితే బాగా నిరాశపరచింది.

లినక్స్ చాలా రోజుల నుంచీ వాడుతున్నా ఎక్కువగా కేడీయీ డెస్క్‌టాప్ మేనేజర్ నే వాడడం అలవాటు నాకు. జీనోం‌ వాడేది చాలా తక్కువ.
ఎప్పుడయినా క్యూబ్ ఎఫెక్ట్లు, విండో ఎఫెక్ట్లు వగయిరాలతో ఆడుకోవాలనిపిస్తే తప్ప 😉
కుబుంటు కేడీయీ ని ఎంత బాగా తయారు చేసిందంటే అసలు విండోస్ ఎక్స్పీ (విస్టా నేను వాడలేదు) కంటే కూడా తెగ నచ్చేసింది నాకు.

అలాంటిది కేడీయీ ౪ ని వాడినప్పుడు అంత ఎక్సైట్‌మెంట్ కలగలేదు.
కొన్ని ఫీచర్లు చాలా బాగున్నాయి. కానీ చాలా బగ్గీగా ఉంది. కస్టమైజేషను సరిగా లేదు.
ఓ పెద్ద గుది బండ లాంటి టాస్కుబారు, దానిని కస్టమైజు చెయ్యాలంటే కాన్ఫిగ్ ఫైళ్ళు కెలకాల్సిందే.
ఎక్కువగా అవుటాఫ్ ది బాక్సు పని చేసే కేడీయీ ని ఇలా చూడడం అలవాటు లేదు.

కానీ ఇక్కడ నేను కన్వీనియంటుగా మర్చిపోయిందేమిటంటే ఇది చాలా విధాలుగా సరికొత్త కోడు.
అదీ కాక ఇది మొదటి వర్షను రిలీజు. కుబుంటు ఆల్రడీ దీనిని గట్సీకీ, హార్డీ కి ఇంటిగ్రేట్ చేసింది (ఊరికే ట్రై చెయ్యడానికి) కానీ కస్టమైజు చెయ్యలేదు.
కాబట్టి అద్భుతమయిన యూఐ, మరియు ఫీచర్లతో కూడిన కేడీయీ ౪ ని త్వరలోనే చూడవచ్చేమో.
ఆల్రడీ కేడీయీ ౪.౧ కి సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై లో విడుదల అనుకుంట.

అప్పటివరకూ కేడీయీ ౪ కి మాత్రం నేను పర్మనెంటుగా స్విచ్ అయ్యేది లేదు 🙂

ఇటు చూడండి: అన్నట్టు నేను “బ్లాగిన్ మెయిలు” సన్నాహాలు చేస్తున్నాను. అంటే రోజుకోసారి ఏదో ఒక సమయంలో కూడలిలో ఉన్న టపాలను ఓ హెచ్‌టీ‌‌ఎమ్‌ఎల్ ఫైలు రూపంలో కావలసిన జనాలకి పంపడానికి. (ఫోటోలు ఉండవు) ఇవి సాధ్యమయినంత వరకూ కత్తిరించిన టపాలు కాకుండా పూర్తి టపాలతోనే చెయ్యాలనుకుంటున్నా. కోడు కొంత మటుకు పూర్తయింది గానీ ఇంకా చాలానే బగ్గులున్నాయి. ఎవరికయినా బీటా టెస్టు చెయ్యడానికి ఆసక్తి ఉంటే మీ మెయిలయిడీ వ్యాఖ్యలలోగానీ, నా మెయిలయిడీకి గానీ పంపించండి.

ఏప్రిల్ 22, 2007

లినక్స్/ఉబుంటు డ్యువల్ బూట్ …

Posted in ఉబుంటు, డ్యువల్ బూట్, లినక్స్ వద్ద 8:38 సా. ద్వారా Praveen Garlapati

ఈ కింద నాకు తెలిసున్నంత వరకూ ఎలా చెయ్యాలో చెబుతాను, ఒకట్రెండు లింకులు కూడా ఇస్తాను.

* నేను ఇతరుల దగ్గర నుండి నేర్చుకుందే ఎక్కువ, ట్యుటోరియళ్ళు ఎక్కువ ఉపయోగించలేదు.

డ్యువల్ బూట్ మొదలెట్టే ముందు కొన్ని సూచనలు

1. డాటా ని తప్పక బాకప్ చేసుకోండి.
2. ఉబుంటు ని ఉపయోగించడానికి 2 GB హార్డ్ డిస్క్ స్పేస్, 256 MB రాం అవసరం. దానిని సరి చూసుకోండి.
3. ఉబుంటు మీకు సరిపోతుందో లేదో లైవ్ సీడీ ఉపయోగించి చూసుకోండి.
4. ఒక వేళ కొన్నాళ్ళు వాడి తరవాత ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఉచితంగా లభించే vmware server ఉపయోగించి వాడి చూడండి.

ఇక డ్యువల్ బూట్ విధానం:

1. డ్యువల్ బూట్ కోసం మనకు ముందు మన హార్డ్ డిస్క్ లో సెపరేట్ పార్టీషన్ కావాలి. అంటే మీకు C, D లాంటి డ్రైవులు కనీసం రెండు ఉండాలి. అందులో ఒకటి లినక్స్ కి కేటాయించగలగాలి.

2. లేవు అనుకోండి ఉన్న ఒకే డ్రైవ్ ని మనం ముక్కలు చేసి దానిని మనకు కావలసిన విధంగా పార్టీషన్ చేసుకోవాలి. దానికి ఎన్నో విధానాలు ఉన్నాయి.

అ) ఉబుంటు ఇన్స్టాలర్ ఇప్పుడు లైవ్ సీడీ ద్వారానే సాధ్యం. కాబట్టి మీరు ఆ సీడీ ని మీ సీడీ డ్రైవ్ లో ఉంచి బూట్ చెయ్యండి.
ఆ) ఉబుంటు లోకి బూట్ అయ్యిన తరవాత అక్కడ మెనూ లో పార్టీషన్ చెయ్యడానికి QTParted (under System) అనే యూటిలిటీ ఉంటుంది. దానిని ఉపయోగించి మీ హార్డ్ డిస్క్ ని రీసైజ్ చెయ్యండి. మీకు కావలసినట్టు అందులో సైజ్ నిర్ణయించుకోండి. (ఇది చేసే ముందు విండోస్ లో ఒక సారి మీ డిస్క్ ని డీఫ్రాగ్మెంట్ చేస్తే మంచిది.)

* ఈ QTParted పని చెయ్యకపోతే ఇతర ఏ పార్టీషన్ చెయ్యగలిగే టూల్ నయినా ఉపయోగించి పార్టీషన్ చెయ్యండి. (System Rescue CD, Knoppix, Partition Magic లాంటివి)

3. మీరు ఆ టూల్స్ ని ఉపయోగించి పార్టీషన్ చేసిన తరవాత ఒక సారి సరి చూసుకోండి. (విండోస్ లోకి బూట్ అయి కూడా చూసుకోండి.)

4. అంతా సరిగా ఉందనుకుంటే మళ్ళీ సీడీ నుండి బూట్ చెయ్యండి. మీరు బూట్ చేసిన తరవాత మీకు డెస్క్‌టాప్ మీద ఉబుంటు ఇన్స్టాలర్ అని ఒకటి కనిపిస్తుంది, దానిని తెరవండి. దాంట్లో ఆటోమాతిక్ కాకుండా, మాన్యువల్ అని ఉంటుంది ఆ విధానం సెలెక్ట్ చేసుకోండి డిస్క్ పార్టీషన్ కి.

5. ఇప్పుడు మీరు పార్టీషన్ చేసిన స్పేస్ ని(అదే కొత్తగా సృష్టించిన పార్టీషన్ లో) ఉబుంటు కోసం ఎంపిక చేసుకోండి. మీకు ఒక రూట్ పాటీషన్, ఒక స్వాప్ స్పేస్ కావాలి మినిమం గా. స్వాప్ స్పేస్ కి బండ గుర్తు ఏమిటి అంటే మీ రాం సైజ్ కి రెట్టింపు ఉండాలి. నాకు తెలిసి ఉబుంటు ఆటోమాటిగ్గా దీనిని చేస్తుంది.

6. పైన చెప్పినవే కొద్దిగా కష్టమయిన పనులు. కుదిరితే ఎవరయినా ఇంతకు ముందు చేసిన వారి సహాయం తీసుకోండి. మీకు గనక అల్రెడీ రెండు పార్టీషన్లు ఉండి, ఒక దానిని లినక్స్ కోసం ఉపయోగించగలిగితే అసలు సమస్యే లేదు.

7. ఇక అది సెలెక్ట్ చేసుకున్న తరవాత అంతా straight forward. విండోస్ ఇన్స్టాలర్ మాదిరిగా విజర్డ్ ఉంటుంది, దానిని పట్టి ఆన్సర్ చేస్తూ పోవడమే.

8. మీ సిస్టం లో ఉన్న విండోస్ ని ఇది ఆటోమాతిగ్గ డిటెక్ట్ చేసి మీకు చెబుతుంది, తర్వాత గ్రబ్ ఇన్స్టాల్ చేసి అందులో మీకు విండోస్ ఎక్స్పీ ఆప్షన్ పెడుతింది.

(డ్యూవల్ బూట్ గనక ఇది గ్రబ్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇది బూట్‌లోడ్ మేనేజర్. ఇందులో మీకు విండోస్ మరియు, ఉబుంటు ఆప్షన్స్ కనపడతాయి. ఏది సెలెక్ట్ చేసుకుంటే అందులోకి బూట్ అవుతుంది).

మీరు మొదటి సారి చేస్తుంటే గనక ఎవరినయినా సహాయం తీసుకోవడం మంచిది. కానీ మీ పర్సనల్ సిస్టం అయి ఉండి పర్వాలేదు అనుకుంటే సొంతంగా చేస్తే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. తప్పు ఆయే ప్రమాదం కూడా ఉంది.

నేను సెర్చ్ చేసిన వాటిలో ఒక రెండు లింకులు పనికొచ్చేవి

http://www.linuxdevcenter.com/pub/a/linux/2006/05/08/dual-boot-laptop.html?page=1
http://ca.geocities.com/zachandloricox@rogers.com/ubuntu/windowsxp.html
http://www.dedoimedo.com/computers/install_kubuntu.html

ఆల్ ద బెస్ట్. 🙂