మార్చి 16, 2007

లేజీ లేజీ నేను…

Posted in లేజీ వద్ద 8:14 సా. ద్వారా Praveen Garlapati

ఎన్నో నాళ్ళ తరవాత (ఏళ్ళు అనాలేమో) ఇవాళ ఎందుకో ఆఫీసుకు వెళ్ళబుద్ధి కాలేదు. పొద్దున్న అమ్మ లేపగానే ఇంకొంచెం సేపు అని పడుకున్నా. ఇంకొద్ది సేపటి తరవాత లేపితే మరికొంచం అన్నా, సర్లే వర్క్ ఎట్ హోం (అదే స్లీప్ ఎట్ హోం) చేద్దామనుకున్నా, కానీ అప్పుడే గుర్తొచ్చింది దాదాపు రెండేళ్ళుగా ఎప్పుడూ సెలవు పెట్టలేదు అని, అవసరం రాలేదు మరి. నాకే ఆశ్చర్యం వేసింది. సర్లే ఇంకెందుకు ఆలస్యం అని ముసుగు తన్నా. ఇక లేవడం పన్నెండు గంటలకే.

నాకు గుర్తు లేదు ఇక్కడ మాకు సోమవారం సెలవు ఉగాదికి. అంటే నాలుగు రోజులు వరసగా సెలవు అన్నమాట. ఆహా…

ఇక నా దగ్గరున్న సినిమా స్టాకు బయటకి తీయాల్సిందే. ఈ మధ్యే క్రిష్ రాం, డాక్టరు గారు సూచించిన టాం హాంక్స్ సినిమాలు చూసేసాను (Road to Perdition, Catch me if you can). అద్భుతం గా ఉన్నాయండీ. ధన్యవాదాలు మీ రెకమండేషన్లకి. అవే కాక The Holiday, World Trade Center మొదలయినవి కూడా చూసాను.

ఇంకో పది సినిమాల స్టాక్ ఉన్నట్టుంది. ఈ నాలుగు రోజులూ అవి కానిచ్చేస్తే సరి.

ఇంకా ఇవాళ ఇంగ్లాండ్ న్యూజీలాండ్ మాచ్ పూర్తి కాందే ? రేపు మళ్ళీ ఇండియా మాచ్ కోసం టీవీ కి అతుక్కోవలసిందే.

ఇంకా ఒక రెండు నవలలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాయి. వాటి పని కూడా పట్టాలి. కుదిరితే మరి నవీన్ అన్న ని కలవాలి. అబ్బో ఎన్నో పనులు…

రాం రాం… మీ అందరూ మరి ఉగాది ఎప్పుడు జరుపుకుంటున్నారో ?