జూస్ట్ …

Joost™ the best of tv and the internet ఇంతకు ముందు మనం P2P గురించి చెప్పుకున్నాము.

అలాంటిదే ఒక టెక్నాలజీ మీద ఆధారితమయిన కొత్త సర్వీస్ ఈ మధ్య విడుదల చెయ్యబడింది.

అయితే ఈసారి అది సింపుల్ డౌన్లోడ్ ల కోసం కాదు. జూస్ట్ అనే ఈ సర్వీస్ ఆన్లయిన్ స్ట్రీమింగ్ వీడియో కోసం. ఇంతకు ముందే ఉన్నాయి కదా ఆన్లయిన్ స్ట్రీమింగ్ ఉదాహరణ కి యూ ట్యూబ్, గూగుల్ వీడియో ఇవన్నీ కూడా మీరు చూసే వీడియో ని స్ట్రీం చేసేవే. అయితే దానికీ దీనికీ తేడా కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా.

ఇది P2P టెక్నాలజీ తో తయారయింది (వికీ లింక్). ఎలా పని చేస్తుందో సరిగా నాకు కూడా తెలీదు. బహుశా మనం చూస్తున్న కంటెంట్ ని విడగొట్టి మన పీసీ నుంచి కూడా అప్‌లోడ్ చేస్తుందనుకుంట. అదే యూట్యూబ్ మామూలుగా సర్వర్ నుంచి స్ట్రీమింగ్ చేస్తుంది.

యూ ట్యూబ్ ఎక్కువగా యూజర్ కంటెంట్ తో నిండింది అని మనకి తెలిసిందే. అదే కాక ఇంతకు ముందు దాంట్లో ఎన్నో ఇల్లీగల్ కంటెంట్, అంటే లైసెన్స్డ్ అయిన పాటలు, చిత్రాలు కూడా ఉంచారు, ఇంకా ఉన్నాయి కూడా. కానీ గూగుల్ దానిని అక్వైర్ చేసిన తరవాత, ఇంతకన్నా మించి మనకు అవకాశం దొరకదు అని కంపెనీలు దానిని అదే పనిగా స్యూ చెయ్యడం మొదలెట్టారు. పెద్ద డబ్బులు ఇవ్వాల్సొచ్చింది లేదా ఏదో ఒప్పందాలు చేసుకోవాల్సొచ్చింది. ఇంకా ఆ తలకాయనొప్పులు సాగుతూనే ఉన్నాయి.

ఇంతకీ గూగుల్ దానికి తన సొంత వీడియో ఉండగా యూ ట్యూబ్ ని ఎందుకు అక్వైర్ చేసింది అని ఆలోచిస్తే ఒకటి యూజర్ బేస్ కోసం, ఇంకోటి యూ ట్యూబ్ కి ఉన్నా ఆ ఊంఫ్ ని గూగుల్ వీడియో సాధించలేకపోయింది.
గూగుల్ కి తెలుసు ఇప్పుడు రాబోయే కాలంలో వీడియో కంటెంట్, స్ట్రీమింగ్, మ్యూజిక్ వంటివి పెద్ద బిజినెస్ కాబోతున్నాయని. అందుకే అది యూ ట్యూబ్ ని అక్వైర్ చేసింది.

అయితే దాని ఆలోచనలు బిజినెస్ పరంగా వివిధ కంపెనీల తో కాంట్రాక్టులు చేసుకుని వారి విడుదల రాబోయే చిత్రాల ట్రైలర్లూ, వారి మ్యూజిక్ ఆల్బంలూ వాటికి ప్రచారం కల్పించాలని, వారి ద్వారా రెవెన్యూ సంపాదించాలనీ, ఇంకా వీడియో లో కూడా ఆడ్స్ ని విస్తరించాలని. ఆ మార్కెట్ ని మొదట ఇదే కనక కాప్చర్ చేసేస్తే టెక్స్ట్ ఆడ్స్ లో తిరుగు లేనట్టే ఇందులో కూడా ఉండదని (ఆన్లైన్ ఆడ్ మార్కెట్ ఎంత పెద్దదయిందంటే ఇప్పుడు ఏ కంపెనీ ఇప్పుడు దానిని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. గూగుల్ ఆ సింపుల్ సూత్రమ్మీదే బతుకుతుంది. దానికొచ్చే రెవెన్యూ అంతా దాని మీదే. కొన్ని బిలీన్ల డాలర్లు. అది దాని మీద రెవెన్యూ ని కూడా బయటికి చెప్పదు, ఎక్కడ అందరి కన్నూ దాని మీద పడుతుందో అని. మొన్న మొన్న మైక్రోసాఫ్ట్ యాహూ ని అక్వైర్ చేద్దామని అంతగా ప్రయత్నించడానికి ఒక కారణం ఇది కూడా. అది ఆన్లైన్ ఆడ్ మార్కెట్ ని కాప్చర్ చెయ్యడంలో విఫలం కావడం.). సరే ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాము.

ఇక ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఈ కంపెనీలు వీడియో బిజినెస్ లో పెద్ద లాభాలు ఆంటిసిపేట్ చేస్తున్నాయి. కానీ గూగుల్ అనుకున్నంతగా పార్ట్‌నర్షిప్స్ సాధించలేకపోయింది.

అలాంటి ఉద్దేశాలతోనే మొదలయింది ఈ జూస్ట్ అనే సర్వీస్. ఇది కాకపోతే అందరి దృష్టి నీ ఆకర్షించడంలో సఫలమయ్యింది. గూగుల్ ఎలాగయితే జీమెయిల్ సర్వీస్ ని ఇన్వైట్ పద్ధతిలో విడుదల చేసిందో జూస్ట్ కూడా అదే పద్ధతిలో తన సర్వీస్ ని ఇన్వైట్ పద్ధతి లో మాత్రమే విడుదల చేసింది. దాని బీటా టెస్టింగ్ కోసం ప్రస్తుత యూజర్లు మిగతా వారిని ఇన్వైట్ చెయ్యాల్సుంటుంది. ఇప్పటికే అది ఎం టీవీ, వాల్ట్ డిస్నీ, మొదలయిన పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చేసుకుంది. వారి పాటలు, కార్టూన్లు, ఇంకెన్నెన్నో కంటెంట్ స్ట్రీం చెయ్యడానిక్ రెడీ గా ఉంది. అది ఈ సర్వీస్ ని ఇంటర్నెట్ మీద టీవీ గా ప్రచారం చేసుకుంటుంది. ఇప్పటికే అందులో దాదాపు ఓ వంద దాకా ఛానళ్ళుండచ్చేమో.

దీనిని ఉపయోగించడానికి మీరు మీ సిస్టం పైన ఒక క్లైంట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత అది ఆన్లైన్ లొ కనెక్ట్ అయ్యి మీకు చానళ్ళ లిస్టు అందజేస్తుంది. వాటిలోంచి మీకు కావలసిన కార్టూనో, మ్యూజిక్ వీడియో నో మీరు స్ట్రీమింగ్ గా చూడవచ్చు.

ఎంతో అప్పీలింగ్ గా ఉంది. కానీ ఇందులో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. ఏంటంటే దీనికి విపరీతమయిన బాండ్‌విడ్త్ అందుబాటులో ఉండాలి. మరీ డయలప్, తక్కువ బాండ్‌విడ్త్ లతో ఇది సరిగా పని చెయ్యకపోవచ్చు. కానీ ఇప్పుడు బ్రాడ్‌బాండ్ రాకతో పరిస్థితి మారవచ్చు.

ఇదే కనక క్లిక్ అయితే టీవీ చూసే విధానంలో పెద్ద మార్పులు వస్తాయంటూ అందరూ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇంకేం ఆలసయం మీరు కూడా ట్రై చెయ్యండి. ఇన్వైట్ కావాలాంటే నే పంపగలను. ఇంకొద్ది రోజుల్లో ఇన్వైట్ లేకుండా కూడా వచ్చేసేటట్టుంది.

వేచి చూద్దాం ఇదెలా సాగుతుందో.