వెబ్ 2.0…

వెబ్ 2.0… ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ…
అసలు ఈ వెబ్ 2.0 అంటే ఏంటి ???

కొన్నాళ్ళ క్రితం వరకూ వెబ్ అనేది ఒక మాధ్యమంగా ఉండేది, ఎక్కువగా one way కూడా. కానీ ఈ మధ్య వచ్చే అప్లికేషన్స్ చూస్తే తేడా మీకే స్పష్టం గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వి అన్నీ collaboration/social networking మీద base అయిన అప్లికేషన్స్. అంటే వీటిలో users చేత participate చేయిస్తారన్నమాట. వెబ్ అనేది one way కాక ఎంత interactive గా ఉంటే అంత బావుంటుంది, జనాలకు నచ్చుతుంది అని కనిపెట్టిన కంపెనీలు కుప్పలు తెప్పలు గా అప్లికేషన్స్ విడుదల చేస్తున్నాయి.

ఈ వెబ్ 2.0 కి తోడ్పడిన వాటిలో ముఖ్య పాత్ర బ్లాగ్స్, RSS feeds, pod casts, వికీలు, AJAX (దీని గురించి ఇంకోసారి చెప్పుకుందాము) మొదలయిన వాటి మీద ఆధారితమయిన వెబ్ సైట్లు.

ఈ మధ్య వచ్చిన బాగా ప్రాచుర్యం పొందిన సైట్లను చూడండి . అవన్నీ ఈ వెబ్ 2.0 కోవలోకే వస్తాయి. ఇంతకు ముందు బులెటిన్ బోర్డులు, ఫోరం లకు పరిమితమయిన information sharing ఇప్పుడు ఎన్నో రూపాంతరాలు చెందింది.

ఉదాహరణకి ఈ కింద చూడండి.

డిగ్: users సమర్పించే links తో ఎంతో ప్రచారం పొందిన వెబ్ సైట్ ఇది. చెప్పాలంటే ఇందులో ఏమీ లేదు. మీకు నచ్చిన URLs ని డిగ్ లో సమర్పిస్తే వాటిని users వోట్ చేస్తారన్నమాట. వేటికి ఎక్కువ వోట్లు ఉంటే అవి ముందుకు జరుగుతూ ఉంటాయి, అలా అన్నిటి కన్నా ఎక్కువ వోట్లు వచ్చిన URL హోం పేజీ లో స్థానం సంపాదిస్తుంది. ఎంతో తేలిగ్గా అనిపించిన ఈ స్టైలు ఇప్పుడూ ఎంతో ప్రాచూర్యం సంపాదించింది. Yahoo!, Microsoft మొదలయినవి కూడా ఈ తరహా ని కొన్ని వెబ్ సైట్ లకు ఆపాదించడం మొదలెట్టాయి.

వికీపీడియా: Community enabled సాఫ్త్ వేర్ బలం ఎంటో వికీ నిరూపించింది. మొదట్లో ఇదేం పని చేస్తుంది అన్న వాళ్ళే ఆశ్చరయపోయేలా జనాల కోసం, జనాల చేత నడిచే వికీపీడియా తయారయింది. ఇందులో అందరూ భాగస్వాములే, ఎవరికి తెలిసిన సమాచారం వారు కొద్ది, కొద్దిగా ఇందులో పెడుతుంటే అంతా కలిసి ఒక పెద్ద విజ్ఞాన భాండాగారం గా రూపాంతరం చెందింది. క్రిందటేడాది encyclopedia britannica తో పోటీ పడ దగ్గ సమాచారం ఇందులో ఉందని నిరూపితమయింది. ఒక మంచి పని కోసం జనాలు కలిస్తే ఎమి సాధ్యం కావచ్చో వికీ నిరూపించింది. ఇప్పుడు దీని మీద ఒక సెర్చ్ ఇంజనే నిర్మిస్తున్నారంటే ఇది ఎంతగా అభివృద్ధి చెందిందో ఊహించవచ్చు.

flickr: Photo Sharing సైట్లు ఇంతకు ముందే ఉన్నా ఒక కొత్త ఒరవడి సృష్టించింది అందులో flickr. జనాలకు నచ్చేలా, ఫోటోలను అమర్చి, వాటికి జనాలు తమ comments చేర్చే విధానం, ఫోటో కమ్యూనిటీలు స్థాపించుకుని అక్కడ చర్చా వేదికలు కల్పించటం, tagging, interestingness మొదలయిన సరి కొత్త అమరికలతో జనాలను విపరీతం గా ఆకట్టుకుంది. దీని సత్తా తెలిసి Yahoo! దీనిని acquire చేసేసింది.

pod casts: పాడ్ కాస్ట్ లంటే మ్యూజిక్, వీడియొ లతో కూడిన ఫీడ్లు అన్నమాట. ఐపాడ్ లలో వినవచ్చు.

AJAX గురించి మరో సారి తీరిగ్గా చెప్పుకుందాము. ఇంతకు ముందు వెబ్ సైట్ లు, ఎక్కువ interactive గా ఉండేవి కావు. అదీ కాక అవి లోడ్ అయ్యేంత వరకూ జనాలు ఓపిగ్గ ఎదురు చూసేవారు, పేజీ రిఫ్రెష్ లు చికాకు కలిగించేవి. ఇలాంటి సమస్యలు అన్నీ తీర్చడానికి AJAX ఒక వరం లాగా దొరికింది. ఇది కొత్త టెక్నాలజీ కాదు గానీ ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. AJAX సైట్లకు ఒక ఉదాహరణ GMail, ఇందులో మీరు ఎన్ని తక్కువ పేజీ రిఫ్రెష్ లతో పని చెయ్యచ్చో మీరే చూడవచ్చు. AJAX ని ఉపయోగించే సైట్ లు ఇప్పుడు ఎన్నో.

బ్లాగుల సంగతి అందరికీ తెలిసిందే.

Orkut: ఇక Social Networking సైట్లు. Orkut లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటన్నిటి ముఖ్యోద్దేశం జనాలు ఒకరితో ఒకరు communicate చేసుకోవడానికి ఒక interface కల్పించడం.

MySpace, FaceBook: ఇవన్నీ ఒక పెద్ద కలగూరగంపలన్నమాట. అన్నిటినీ అంటే బ్లాగు, మ్యూజిక్, వీడియో, సోషల్ నెట్వర్కింగ్ మొదలయినవన్నీ ఒకే చోట.

YouTube: వీడియోలు share చేసే సైట్ ఇది. ఇది ఎంత మంది యూజర్లను పొందింది అంటే గూగుల్ ని attract చేసి వారికి వీడియోల సొంత కుంపటి ఉన్నా దీన్ని acquire చేసేంత. ఒక బిలియన్ డాలర్లు ఇచ్చి కొన్నది దీనిని.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇలాంటి వెబ్ సైట్ ల సమాహారమే వెబ్ 2.0. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో, అసలు ఎంత వరకూ మనగలుగుతుందో, జనాలు దీనిని ఎంత వరకూ ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.