షీన్ చాన్…

హంగామా టీవీ లో షీన్ చాన్ అని ఒక కార్టూన్ వస్తుంది. మీరు చూడక పోతే చూడండి ఎంతో బాగుంటుంది. కాకపోతే రాత్రి 10:30 కి వస్తుంది. ఒక చిన్న బుడతడు వాళ్ళ అమ్మ నాన్నలను, టీచర్లను, అందరిని ఎలా ముప్పు తిప్పలు పెడతాడో తన అల్లర్లతో చూసి ఆనందించాల్సిందే.

చిన్నప్పటి నుంచి నాకు కార్టూన్లంటే చాలా ఇష్టం. Tom and Jerry, Dexters Laboratory, Scooby Doo, Richie Rich, Archie వంటి ఎన్నో కార్టూన్లు నాకు ఇష్టమైనవి. అవి చూస్తూ చిన్న పిల్లలలాగా ఆనందిస్తాను. నాకు అనిపిస్తుంది పిల్లల కంటే పెద్డలే ఎక్కువ ఆనందిస్తారేమో కార్టూన్లు చూసి.