ష్రెక్ 3 – ఈ మూడు కూడా ???

ఏంటో ఈ త్రీ లన్నీ బాగున్నట్టు లేవు.

నిన్నే ష్రెక్ 3 చూశాను. ఏదో ఓ మాదిరిగా ఉంది. మొదట రెండు పార్టులు ఆకట్టుకున్నట్టుగా ఆకట్టుకోలేదు.

ఈ పార్టులో ఫియోనా కి సంబంధించిన రాజ్యానికి సరికొత్త రాజుని ఎన్నుకోవాలి. ఆ బాధ్యతని కప్పగా మారిపోయిన రాజు చనిపోతూ ష్రెక్ కి అప్పగిస్తాడు.
ష్రెక్ కేమో ముందర నుంచే తనంటే తనకు చిన్న చూపాయే. నేను తగను అని చెప్పి ఆ రాజ్యానికి కొత్త రాజుని చెయ్యడానికి ఉన్న ఒక్క బంధువుని వెతకడానికి బయలుదేరతాడు.

ఇంతలో మన ఫెయిరీ మదర్ యొక్క కొడుకు రాజ్యం కోసం కొందరు బోకు జనాలని పోగేసి యుద్ధానికొస్తాడు.

ఇక ష్రెక్, ఫియోనా, స్లీపింగ్ బ్యూటీ, సిండరెల్లా మొదలయిన వారందరూ కలిసి ఎలా తిరిగి రాజ్యాన్ని వెనక్కి తీసుకున్నారో, కొత్త రాజుని ఎలా తీసుకొచ్చారో అనేదే కథ.

ఇంతకు ముందు పార్టులు హాస్యం పండిస్తూనే అదే సమయంలో హార్ట్ టచ్ చేసేవిగా ఉన్నాయి, కానీ ఈ సారి మాత్రం ఎక్కడో లోపించింది. ష్రెక్, ఫియోనా ల మధ్య ఆ స్పార్క్ కనపళ్ళా. దానికి కారణం సినిమాలో వాళ్ళిద్దరూ ఎక్కువ సమయం జతగా ఉండకపోవడం కూడా కావచ్చు. అలాగే మన పిల్లి, గాడిద ఎక్కువ హాస్యం పండించలా.

మొత్తం మీద పరవాలా అనిపించినా డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.

మొదట స్పైడర్ మాన్, ఇప్పుడు ష్రెక్, మరి రేపు పైరేట్స్ ఆఫ్ కరీబియన్ సంగతేంటో ?