సంగీతం, సాఫ్ట్ వేర్లు…

నేను తరచుగా ఉపయొగించే వీడియో సాఫ్ట్ వేర్ ల లో VLC ఒకటి. మీరు దానికి ఏ ఎక్స్టెన్షన్ అన్నా ఇవ్వండి అది ప్లే చెయ్యగలదు.

ఇది అన్ని platforms మీదా లభ్యం. అదీ కాక దీనిని streaming server గా ఉపయోగించవచ్చు. అంటే మీరు మీ నెట్ వర్క్ లో రేడియో స్టేషన్ నదపచ్చు అన్నమాట 🙂 మీకు నచ్చిన పాటలు ప్లే చేసి, దానిని stream చేసెయ్యండి.

సినిమాలు చాలా ఎక్కువగా చూసేవారికి దీని గురించి ఈ పాటికే తెలిసి ఉంటది. ఇది కాక పోతే నేను వాడేది K-Lite Mega Codec. ఇది కూడా చాలా బాగా పని చేస్తుంది. సిస్టం లో ఇప్పటికే ఉన్న మ్యూజిక్ సాఫ్ట్ వేర్ లను ఉపయొగించుకుని కూడా పని చేస్తుంది. అంటే rm, ram మొదలయిన ఫైల్స్ ప్లే చెయ్యాలంటే Real Player నీ, Quick Time player వగైరా ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకుంటుంది. అదే కాక ఇంకా లెక్కకు ఇంచిన codec లతో వస్తుంది.

కానీ దీని కంటే నాకు VLC ప్లేయరే నాకు నచ్చుతుంది. సింపుల్ గా ఉంటుంది. కానీ దీంట్లో నాకు నచ్చనిది ప్లే లిస్టులు వగైరా organize చేసుకోవడానికి సదుపాయాలు సరిగా ఉండకపోవడం. సిస్టం త్రే లో ఉంచే సదుపాయం లేకపోవడం. అందుకే నేను ఇంకా winamp ఉపయొగించాల్సి వస్తుంది. ఇది అన్నీ ప్లే చెయ్యలేకపోయినా నా పనికి అడ్డం రాదు. నేను ఎక్కువగా Radio stations ప్లే చేస్తుంటా లేండి. ఎప్పుడూ music అలా ప్లే అవుతూ ఉండాల్సిందే. నేను ఎక్కువగా వినే station హిందీ ది (http://www.radioteentaal.com/) రోజంతా advertisements లేకుండా ప్లే చేస్తూనే ఉంటుంది. ఇంకా కావాలంటే అడగండి ఇస్తాను.

iTunes కూడా వాడచ్చు కానీ నా దగ్గర అంత కలెక్షన్ లేదు. iPod కూడా లేదు 🙂 నవ్వద్దు. అదే మరి.

లినక్స్ మీద అయితే నేను amarok వాడతాను. అద్భుతమయిన సాఫ్ట్ వేర్ ఇది కూడా.

ఇక మీ సంగీత ఝరులు మొదలెట్టండి. ఆ ఆ ఆ …