జనవరి 15, 2007

దేశముదురు

Posted in దేశముదురు, సినేమా వద్ద 8:13 సా. ద్వారా Praveen Garlapati

ఇవాళ దేశముదురు సినేమా చూసాను. బానే ఉంది.

మాస్ మసాలా దట్టించి డాన్సులు, ఫైట్లు వగైరాలాన్ని షరా మామూలే…అప్పుడప్పుడూ ఇలాంటి డోసు పడాల్సిందే 🙂 చిరంజీవి తరవాత తెలుగు ఇండస్ట్రీ లో ఇంత చక్కగా డాన్స్ చేసేది అల్లు అర్జున్ మాత్రమే. నిజంగా చెప్పాలంటే చిరంజీవి అంత బాగానూ చేస్తాడు కాబోతే చిరంజీవి డాన్స్ లో ఉన్న గ్రేస్ కి ఇంకొన్ని ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు.

నాకున్న ఒక మంచి లక్షణం సినేమా చూసేటప్పుడు లాజిక్కులు లాగకపోవడం. అలా ఉండడం వలన నేను ఎప్పుడూ సినేమా బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు సినేమా అనేది ఒక అనుభవం అంతే. దాని గురించి తీవ్రంగా ఆలోచించి ఇదేంటి అదేంటి అని తెగ మధానపడిపోను.

ఎంచగ్గా నా స్నేహుతుడు రమేష్ తో సమయం గడిపాను. ఉదయం చక్కగా అమ్మ చేసిన పిండి వంటలన్ని తినేసి, సాయంత్రం షో కి చెక్కెసాము.

ఆహా ఈ వీకెండ్ ఎన్ని సినెమాలో….

జనవరి 13, 2007

గురు….

Posted in గురు, సినేమా వద్ద 7:56 సా. ద్వారా Praveen Garlapati

నేను గురు సినేమా చూసాను ఇవాళ…

బాగుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బాగా నటించారు. మాధవన్ కి, విద్య బాలన్ వి పెద్ద పాత్రలు కావు. మితున్ చక్రవర్తి పాత్ర బాగానే ఉంది.

అనుకున్నట్టు గానే సినేమా ధీరుభాయి అంబానీ కథని పోలి ఉంది. ఎలా వ్యాపారం మొదలెట్తాడో, ఎలాంటి కష్టాలు ఎదురుకున్నాదో టూకీగా చూపించారు.

మనిషి తలుచుకుంటే, ఒక కల కని దానిని సాధించడానికి కష్టపడితే ఆది సాధ్యమేనని చూపించారు.

అంతా మాంచే కాక ఎలాంటి తప్పులు జరిగాయో, టాక్స్ ఎగవేత, జనాలను మభ్యపెట్టడం, లంచాలు ఇవ్వటం, తప్పుడు సమాచారం అందించటం వంటివి కూడా చూపించారు.
ఇందులో కొన్నే నిజం కావచ్చు.

నాకు నచ్చనిది ఏమిటంటే ఎలాంటి తప్పులు చేసినా తప్పించుకోవచ్చు అనే విధంగా ఉంది ముగింపు.

మొత్తం మీద మంచి సినేమా నే తీశారు మణిరత్నం గారు. రహ్మాన్ సంగీతం కూడా బాగుంది. బాక్క్గ్రౌండ్ స్కోరే కూడా బానే ఉంది.

డిసెంబర్ 24, 2006

ద టెర్మినల్

Posted in ద టెర్మినల్, సినేమా వద్ద 9:22 ఉద. ద్వారా Praveen Garlapati

నాకు Tom Hanks అంటే ఇష్టం. నిన్నే “The Terminal” అనే ఒక సినేమా చూశాను.

ఎంతో బాగుంది. ఇంతకీ కథ ఏమిటంటే విక్టర్ అనే ఒకతను క్రకోసియా అనే దేశం నుండి న్యూ యోర్క్ కి వస్తాడు. అయితే ఏర్పోర్ట్ కి చేరుకుని అక్కడ నుండి city లోకి వెల్లేప్పుడు తెలుస్తుంది అతని పాస్‌పోర్ట్ పని చెయ్యదు అని. ఎందుకంటే అతని దేశం లో ఏదో తిరుగుబాటు జరిగి, అల్లర్లు చెలరేగుతాయి. అందుకని ఆ దేశం పాస్‌పోర్ట్‌లు అన్ని రద్దు చేసేస్తారు. అతను వెనక్కి వెళ్ళడానికి US authorities ఒప్పుకోరు, అలాగని న్యూ యోర్క్ లోకి enter అవడానికి ఒప్పుకోరు. అందుకని అతను ఏర్పోర్ట్ టెర్మినల్ లోనే ఉండటం మొదలెదతాడు. US authorities ఎలా అన్నా అతడు ఏదన్న తప్పు చేస్తే వెనక్కి పంపేయవచ్చు అని ఎదురు చూస్తుంటారు. కానీ ఎక్కడ దొరక్కుండా ఏర్పోర్ట్ లోనే బతుకుతూంటాడు. ఆఖరికి కానీ తెలీదు మనకి అతను తన తండ్రి ఆఖరి కోరిక తీర్చడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాడు అని.

Steven Spielberg దర్శకత్వం చేసిన సినేమా ఇది . Tom Hanks నటనతో ఎంతో బావుంది. ఎప్పుడన్న ఖాళీగా ఉంటే తప్పక చూడండి