ఫిబ్రవరి 20, 2010

గూగుల్ బజ్, ప్రైవసీ సమస్యలు…

Posted in గూగుల్, టెక్నాలజీ, ప్రైవసీ, బజ్, సాంకేతికం, సోషల్ నెట్వర్కింగ్ వద్ద 7:24 సా. ద్వారా Praveen Garlapati

ఫిబ్రవరి 6, 2010

ఫేస్‌బుక్… కథా కమామీషు

Posted in టెక్నాలజీ, ఫేస్‌బుక్, విశ్లేషణ, సాంకేతికం, సోషల్ నెట్వర్కింగ్ వద్ద 6:49 సా. ద్వారా Praveen Garlapati

జూలై 1, 2007

సోషల్ నెట్వర్కింగ్… ఓ లుక్కు…

Posted in టెక్నాలజీ, సోషల్ నెట్వర్కింగ్ వద్ద 4:36 సా. ద్వారా Praveen Garlapati

ఇంతకీ ఇదేమిటంటే జనాలను ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యేలా చెయ్యటమే. ఇది ఎందులోనయినా కావచ్చు. వెబ్ 2.0 ప్రపంచంలో అంతా కొలాబరేషన్ మయం అయి, జనాలకి ఎంటర్టెయిన్మెంట్ అంటే ఆన్లైన్ మాత్రమే గోచరించే స్థితి వచ్చింది. ఇలాంటి స్థితి ని చక్కగా ఉపయోగించుకోవడానికి పుంఖాను పుంఖాలుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఇంతకు ముందు చెప్పుకున్నా మరింత డీటెయిల్డ్ గా ఇప్పుడు.

MySpace: News Corp అనే సంస్థ కు చెందిన ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇప్పుడు అతి పెద్దది. ఇందులో మిలియన్ల కొద్దీ జనాలు రిజిస్టర్ అయి ఉన్నారు. ఇందులో జనాలు మ్యూజిక్, వీడియో గట్రా తమ అభిరుచులన్నీ ఇతరులతో పంచుకోవచ్చు. తమ కోసం ఓ పేజీ సృష్టించుకుని తమ విశిష్టత ప్రపంచానికి చాటుకోవచ్చు. తమ విభిన్న రుచులని ఈ ప్రపంచంతో పంచుకోవచ్చు.
ఇది ఇప్పుడు ఏ స్థితి కి ఎదిగిందంటే ఇప్పుడు అమెరికా లో సెనేటర్లు, పొలిటికల్ పార్టీ లీడర్లు, సినీ స్టార్లు, ఆటగాళ్ళు వీటిలో అకౌంటు సృష్టించుకుని దీంట్లో వారి ఫ్రెండ్స్ లిస్ట్ ద్వారా తమ పాపులారిటీ చాటుకుంటున్నారు. రాజకీయ నాయకుల పాపులారిటీ కి ఇది కూడా ఓ కొలబద్ద లా తయారయింది.
ఇంకా ఇప్పుడు దీంట్లో సెర్చ్, ఆడ్స్ కోసం రైట్లు సంపాదించుకోవడానికి గూగుల్ వంటి సెర్చ్ మహా మహులని తన కాళ్ళ బేరానికి తెచ్చుకునే స్థితి కి చేరుకుంది. అదే కాక ఇతర వీడియో, ఫోటో వెబ్ సైట్ ల ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేంత స్థాయి ఉంది ఇప్పుడు దీనికి. ఉదాహరణకి ఏదయినా ఒక సైట్ నుంచి వీడియోలు ఇందులో ఎంబెడ్ చెయ్యడం ఆపేస్తే దాని ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోవచ్చు.
జనాలకి వేలం వెర్రి లాగా తయారయింది. కొన్ని అతి చేష్టలు కూడా చేసింది ఈ మధ్యలో. ఏ కారణం లేకుండా సడన్ గా కొన్ని సైట్లను బ్లాక్ చెయ్యడం మొదలయినవి. ఇప్పుడు తనకే సొంతంగా ఓ వీడియో ఫీచర్ ని సృష్టించుకుని జనాలకి వేరే సైట్ల అవసరం లేకుండా చేసుకుంది. దీని విలువ కొన్ని బిలియన్ డాలర్లలో ఉంది ఇప్పుడు.

Facebook: ఇది ఈ మధ్య మంచి ఊపందుకుంది. మొదటి నుంచీ తనదయిన ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఇది ఇప్పటి వరకూ ఎన్నో పెద్ద సంస్థలు (యాహూ లాంటివి) కొనడానికి ముందుకొచ్చినా తూచ్ అంది.
మొదట యూనివర్సిటీలలో జనాలు తమ మధ్య నెట్వర్క్ లు సృష్టించుకోవడానికి మొదలయింది ఇది. త్వరగానే కార్పోరేట్స్ కూ ఇది విస్తరించింది. కంపెనీలలో జనాలు నెట్వర్కులు సృష్టించుకోవడానికి ఇది ఉపయోగపడింది. మొదట్లో ఇందులోకి ప్రవేశం రెస్ట్రిక్టెడ్ గా ఉండేది. అంటే మీరు మీ యూనివర్సిటీ మెయిల్ ఐడీ తో గానీ, లేదా మీ కంపెనీ మెయిల్ ఐడీ తో గానీ మాత్రమే ఇందులో రిజిస్టర్ చేసుకోగలిగేవారు. ఆయా నెట్వర్కులలో స్థానం సంపాదించాలంటే మీకు దానికి సంబంధించిన మెయిల్ ఐడీ ఉండాల్సిందే.
కానీ ఇప్పుడు దీనిని అందరికీ ఓపెన్ చేసారు. ఎవరయినా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా కంపెనీల, యూనివర్సిటీల నెట్వర్కులలో భాగం కాబ్వాలంటే ఆ మెయిల్ ఐడీ ఉండాల్సిందే.
ఇది కూడా ఎంతో పాపులర్ అయింది. MySpace కి వ్యతిరేకంగా ఇది క్లోస్డ్ కాకుండా ఓపెన్ అప్రోచ్ ని ఎంచుకుంది. ఈ మధ్యనే తన ప్లాట్ఫాం ని అందరికీ ఓపెన్ చేసి ఎవరయినా ఫేస్బుక్ కోసం అప్లికేషన్లు జత చేసేలా కొత్త ఫీచర్ ని రిలీజ్ చేసింది. దీనితో అకస్మాత్తుగా కుప్పలు కుప్పలుగా అప్లికేషన్లను తయారు చేసేసారు జనాలు దీని కోసం. యూజర్లను కూడా బాగా భారీగా పంచుకుంది.
పోయిన సంవత్సరం యాహూ దీనిని ఒక బిలియన్ డాలర్లకి కొందామని అనుకుని బోల్తాపడింది. కాదు పొమ్మంది. ఇప్పుడు దీని విలువ రెండు మూడు బిలియన్ డాలర్ల పైమాటే అంటున్నారు. ఎవరికీ దీనిని అమ్మమని చెప్పి దీని ఫౌండర్ అంటున్నాడు.

Orkut: ఇది తెలియని భారతీయుడు ఉండడేమో ? ఇండియా లో ప్రతి టీనేజర్ కూ ఇది పరిచయమే. అందరికీ ఇందులో అకౌంట్ ఉంటుంది. రోజూ తమ స్నేహితులకు స్క్రాప్స్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు తమతో చదువుకున్న స్నేహితులను కూడా దీని ద్వారా కలుసుకుంటూనే ఉన్నారు.
బ్రజిల్, ఇండియా లలో జనాలను విశేషంగా ఆకట్టుకుంది ఇది. ఇందులో కమ్యూనిటీలు గట్రా సృష్టించుకోవచ్చు. కొత్త స్నేహితులను చేసుకోవచ్చు.

Twitter: ఎప్పటికప్పుడు మీరేం చేస్తున్నారో అందరికీ తెలియచెయ్యడానికి ఈ నెట్వర్క్. ఇందులో న్లాగుల లాగా పెద్ద పెద్ద టపాలూ గట్రా ఉండవు. ఒక లైను ఎంట్రీలు నేను తింటున్నా, నిద్రపోతున్నా, సినిమా చూస్తున్నా మొదలయినవి మాత్రమే ఉంటాయి. ఇది కూడా బాగా పాపులర్ అయింది ఈ మధ్య.

ఇక స్పెషలైజ్డ్ నెట్వర్కింగ్ సైట్లకు వస్తే:

flickr: ఫోటో ల హోస్టింగ్ సైట్ ఇది. ఎంతో చక్కని ఇంటర్ఫేస్, ఇతరులతో మీ ఫోటోలను షేర్ చేసుకోవడానికి వీలు, థర్డ్ పార్టీ ఆక్సెస్ కోసం api లతో ఇది ఇంతింతై అన్నట్టుగా పెరిగింది. యాహూ కి ఎంతో మంచి అడిషన్ ఇది.

LiveJournal: బ్లాగులలో నెట్వర్కింగ్ సృష్టించడం దీని ప్రత్యేకత. ఇతర బ్లాగులకీ దీనికీ ఎంతో తేడా ఉంది. దీని ఫీచర్లు ఎంతో బాగుంటాయి. ఇందులో జనాలు ఎంతో లాయల్ కూడా. మొదట్లో ఇన్వైట్ బేసిస్ మీద్ చాల రోజులు ఉండేది. మంచి క్రేజ్ ఉండేది ఆ రోజులలో దీని కోసం. ఇప్పుడు అందరికీ ఓపెన్ అనుకోండి. ఇందులో ఇతర జనాలను స్నేహితులుగా ఆడ్ చేసుకోవచ్చు. ఎవరికి ఏమి కనిపించాలో మీరు నిర్ణయించుకోవచ్చు. అంటే కొన్ని టపాలు కొందరికి మాత్రమే కనిపించేలా సదుపాయం ఉంది ఇందులో. అందుకే ఇక్కడ ఇతర బ్లాగులకి భిన్నంగా ఉంటాయి టపాలు జనాలవి. తమ జీవితంలో దేని గురించయినా రాస్తుంటారు, లవ్ లైఫ్ నుంచి, పర్సనల్ విషయాల వరకూ. మంచి ఫ్రెండ్స్ సర్కిల్ తయారవుతుంది. ఇందులో ఫ్రెండ్స్ అయి పెళ్ళి చేసుకున్న వారు కూడా నాకు తెలుసు 🙂 నాకెంతో ఇష్టమయిన బ్లాగు సైటంటే ఇదే. ఎంతయినా ఫస్ట్ లవ్ లాగా ఫస్ట్ బ్లాగు కదా.

LinkedIn: ఉద్యోగులకు తమ ప్రొఫైల్ సృష్టించుకునే నెట్వర్కింగ్ సైటు ఇది. ఇతర ఉద్యోగులను కలుసుకొవచ్చు, జాబ్ ఆపర్చూనిటీస్ సంపాదించుకోవచ్చు, రిఫరెన్సులు రాయచ్చు, తీసుకోవచ్చు. ఇండియా లో ఈ సంస్కృతి తక్కువ గానీ యూఎస్ లాంటి కంట్రీలలో ఉద్యోగుల గురించి వెబ్ లో వెతకడం, వెబ్ లో ఆపర్చూనిటీస్ మొదలయినవి సాధారణమే.

పైవి వెబ్ లో ఉన్న ఎన్నో నెట్వర్కింగ్ సైట్లలో కొన్ని మాత్రమే. ఇంకా last.fm, bebo మొదలయినవి ఎన్నో. వీటివల్ల ఉపయోగాలంటారా ఎంటర్టెయిన్మెంటే ఎక్కువగా. జనాలు వెబ్ గబ్బిలాలు అయిన పక్షంలో నిజ జీవితంలో ఏం చెయ్యాలో అది వెబ్ లో చేసే సదుపాయాలుగా అనిపిస్తాయి నాకు.
ఇందులో ఎన్నో నష్టాలు కూడా లేకపోలేదు. మీ సమాచారమంతా అందరికీ బట్టబయలయిపోతాయి వీటి వల్ల. మీ అలవాట్లు, మీ అభిరుచులు, మీ ఇష్టాలూ అన్నీను. నిముష నిముషం లో మీరేం చేస్తున్నారో తెలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
అదే కాక టీనేజర్లని మోసం చేసే వాళ్ళు కూడా వీటిని ఆసరా చేసుకుంటున్నారు. ఇప్పటికే MySpace, Orkut లలో ఇలాంటి కేసులెన్నో. మీ సమాచారమంతా అక్కడే ఉండడంతో మోసం చేసేందుకు కూడా ఈజీ. మీరు గనక నెట్ సావీ అయితే ఓ సారి మీ పేరుతో గూగుల్ చేసి చూడండి. మీకే తెలుస్తుంది. పిల్లలని ఓ కంట కనిపెట్టి ఉంచడం అవసరమయిపోయింది. విదేశాలలో అయితే పేరెంటల్ కంట్రోల్ కోసం సాఫ్ట్‌వేర్ లకు మంచి మార్కెట్టే ఉంది.

కాబట్టి బాలెన్స్డ్ గా మనం ఉండడం, మన పిల్లలను ఉంచడం ఎంతో ముఖ్యం.