ఏప్రిల్ 28, 2007

55 మాటలతో కథ…

Posted in 55 మాటలు, కథ వద్ద 7:56 సా. ద్వారా Praveen Garlapati

అలారం మోగింది.
అమ్మాయి: ఆ…(ఆవులిస్తూ)ఏంటి ఏమాలోచిస్తున్నావు మన పెళ్ళి గురించి?
అబ్బాయి: నీకు తెలీదా? వేరే వాళ్ళను ఎలా ఒప్పించినా మీ అన్నను ఒప్పించడం కష్టమే…
అమ్మాయి: ఏమంటావు. విడిపోదామా?
అబ్బాయి: హు…
ఇంతలో బయట కారు శబ్దమయ్యింది.
అబ్బాయి(కంగారుగా): మీ వాళ్ళు రేపటి వరకూ రారన్నావే?
అమ్మాయి: అమ్మో అన్నయ్యేమో.
అబ్బాయి(భయపడుతూ): సరే కబోర్డులో దాక్కుంటా.
అన్నయ్య(వస్తూనే వెతుకుతూ): ఎక్కడ వాడు? కబోర్డ్ వైపు కదిలాడు.
గన్ను శబ్దం…
అమ్మాయి: నో…

అలారం మోగింది. అబ్బాయికి మెలకువొచ్చింది, బయట కారు శబ్దం….