ఫిబ్రవరి 13, 2007

RSS…

Posted in atom, rss వద్ద 10:08 ఉద. ద్వారా Praveen Garlapati

RSS అంటే మనలో చాలా మందికే తెలిసి ఉంటుంది.

ఇప్పుడు మనం ఉపయొగించే కూడలి మొదలయినవి అన్నీ ఈ RSS తోనే సృష్తించబడినవి.

అసలు ఈ RSS అంటే ఎంటి ? simple గా చెప్పాలంటే ఇది XML అంతే. title, link, description మొదలయిన elements ఉండే ఒక XML document అన్నమాట.

RSS అంటే Really Simple Syndication, Rich Site Summary, RDF Site Summary అని కానీ అంటారు.

ఇంతకు ముందు ఎక్కువగా mailing lists ని వాడేవారు. కానీ వాటితో ఎన్నో సమస్యలు. స్పాం బెడద ఎక్కువగా ఉండేది కూడా. అలా కాకుండా users కి కావలసిన విధంగా updates అందుకునే విధంగా ఈ RSS ఉపయొగపడుతుంది.

ఇది అందించే వెబ్ సైట్ కీ, users కీ ఇద్దరికీ సమానంగా ఉపయొగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం తెలుసుకోవడానికి users కీ, users ని ఆకర్షించడానికి వెబ్ సైట్ లకూ ఉపయొగపడుతుంది.

అంతే కాక ఇప్పుడు మనం చూస్తున్న Digg, Lifehacker, Techmeme, TechCrunch, Reddit, లాంటి వెబ్ సైట్ లు అన్నీ ప్రచారం పొందడానికి కూడా ఈ RSS పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు తయారయే ఏ వెబ్ సైట్ కన్నా RSS ఉంటుంది. అదే కాక అన్ని బ్లాగులకీ, న్యూస్ సైట్లకి కూడా ఈ సౌకర్యం ఉంటుంది. వారు కొత్త సమాచారం publish చెయ్యగానే మీకిట్టే తెలిసిపోతుంది RSS feeds ద్వారా.

మరి ఈ XML లాగా ఉండే RSS చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకనే దానికోసం Feed Readers అనే సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి desktop సాఫ్ట్ వేర్ల గానూ, వెబ్ వెర్షన్లలోనూ ఉంటాయి. thunderbird లాంటి డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ల లోను, bloglines, Google Reader వంటి వెబ్ వర్షన్లలో లభ్యం. వీటిలో మీకు నచ్చిన RSS ఫీడ్లను add చేసుకుని చదవచ్చు. ఇవే కాక netvibes లాంటివి కూడా ఎంతో ఉపయొగకరం.

పైన చెప్పుకున్న లాభాలే కాక మీరు కూడా వేరు వేరు వెబ్ సైట్ల నుంచి ఫీడ్లను ఉపయొగించి మీ సొంత applications రాయవచ్చు (feed aggregators). ఉదాహరణకి Google News, కూడలి, తేనెగూడు లాగా.

ఇంతకీ ఒక వెబ్ సైట్ కి ఈ RSS సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?

మీరు ఎదయిన వెబ్ సైట్ కి వెళ్ళినప్పుడు ఈ క్రింద లాంటి icons చూస్తే గనక దానికి ఈ RSS సౌలభ్యం ఉన్నట్టే.

అదే కాక ఫైర్ఫాక్స్ లాంటి బ్రౌసర్లు కూడా వీటిని ప్రత్యెకంగా చూపిస్తాయి మీ URL bar లో.

ఇక మీరు వీటిని పోగేసుకుని సమాచారం అందుకోవడమే తరువాయి.

గమనిక: RSS లాంటి standards ఇంకా వేరే కూడా ఉన్నాయి. Atom అందులో ఒకటి. RSS 1.0, 2.0 version లు కూడా ఉన్నాయి.