డిసెంబర్ 19, 2006

క్రియేటీవ్ కామన్స్ ….

Posted in creative commons వద్ద 7:37 సా. ద్వారా Praveen Garlapati

మీరు ఒక చక్కటి ఫొటో తీశారు. కానీ అది మీ flickr సైటు లోంచి తీసుకుని ఒక పత్రిక వారు ఉపయోగించారనుకోండి ???
మీరు ఎంతో ఆలోచించి ఒక వ్యాసం రాశారు… దానిని ఎవరో copy చేసేసారు అనుకోండి ???

పై సందర్భాల్లో మీకు copyright అనేది ఉందని చాలా మందికి తెలీదు. ఇంటెర్నెట్ లో ఉంచే content అంతా చాలా సులభం గా దొంగిలించవచ్చు ఎందుకంటే అది digital కాబట్టి. అంటే ఎవరన్నా ఒక copy/paste చేస్తే చాలన్నమాట. ఆది వారిది అయిపోతుంది.

మరి మీరు మీ రచనలు, ఫోటోలు, బ్లాగ్‌లు వగైరాలను ఎలా కాపాడుకోవాలి ? ఒకవేళ మీ రచనలను కొన్ని షరతులతొ ఎవరైన వాడుకోవడానికి అంగీకరించాలంటే ఎలా ?
ఇలాంటి సందేహాలు మీకు గనక ఉంటే మీరు Creative Commons (wiki) గురించి తెలుసుకోవలసిందే.

copyright laws కింద మీరు రాసిన ఏ వ్యాసమైన మీకు automatic గా చెందుతుంది. ఎవరైన దానిని మీకు సమ్మతం లేకుండా ఉపయోగిస్తే వారిని శిక్షించవచ్చు. కానీ ఇందులో ఒక చిక్కు ఏమిటంటే మీరు ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీరు రాసిన దాన్ని ఎవరయినా కొన్ని షరతులతొ వాడుకోవడానికి అంగీకరించాలంటే కుదరదు. అందుకని creative commons అనే ఒక licensing విధానం ఉంది…

వీరు మీకు తగిన, మీకు కావలసినట్టుగా తీర్చుకునే license ని అందజేస్తారు. వీటిని మీ పనికి ఆపాడిస్తే చాలు. అందరు దానికి లోబడి ఉండాల్సిందే. ఇది ఉచితం. ఈ license ఉపయోగించినందుకు వారికి ఏమీ చెల్లించనక్కర్లేదు.

కాబట్టి మీరు ఇక మీదట మీరు కాపాడుకోవాలి అనుకునే content కి ఈ licensing విధానం ఉపయోగించండి.

ఇక్కడ మీకో సరదా విషయం చెప్పాలి. ఒక రెండు వారాల క్రితం అనుకుంట, MSDN బ్లాగ్స్ లో ఎవరిదో ఒక ఫొటో వారికి చెప్పకుండా వాడారు. మరి అదే ఎవరికైనా కాలదూ ? ఆది ఆ ఫొటో తీసిన అతనికి తెలిసి దానిని ఏదో పనికి రాని చెత్త ఫొటో తో replace చేసేసాడుట. ఆ కొత్త ఫొటో MSDN లో దర్శనమివ్వటం మొదలెట్టింది 🙂
మరోసారి ఎప్పుడైనా software license ల గురించి మాట్లాడుకుందాము.