కేడీయీ ౪…

ఈ మధ్య నన్ను బాగా నిరాశపరచినది కొత్తగా రిలీజయిన కేడీయీ ౪.

ఇది చాలా విధాలుగా ఓ రివల్యూషనరీ అని బాగా ప్రచారం జరిగింది ఎందుకంటే ఇది కేడీయీ కి సంబంధించి చాలా వరకూ కోడ్ రీరైట్.
స్టన్నింగ్ గ్రాఫిక్స్, ఐకాన్స్ తో మాక్ నే తలదన్నేట్టుగా ఉంటుందన్న అంచనాలున్నాయి.
ఇది ఆక్సిజన్ అని ఒక సరికొత్త ఐకాన్స్, గ్రాఫిక్స్ సెట్ ని ఉపయోగించుకుంటుంది. (ఎక్సలెంటుగా ఉన్నాయి ఐకాన్లు)
అలాగే ప్లాస్మా అనే ఒక విడ్జెట్ల మీద ఆధారితమయిన కేడీయీ ని రూపొందించారు. (చాలా మంచి కాన్సెప్టు)

అంతా బాగానే ఉంది. కొత్త రిలీజూ చెయ్యబడింది కానీ హైప్ చేసినంత బాగా లేదనే చెప్పుకోవాలి.
నన్నయితే బాగా నిరాశపరచింది.

లినక్స్ చాలా రోజుల నుంచీ వాడుతున్నా ఎక్కువగా కేడీయీ డెస్క్‌టాప్ మేనేజర్ నే వాడడం అలవాటు నాకు. జీనోం‌ వాడేది చాలా తక్కువ.
ఎప్పుడయినా క్యూబ్ ఎఫెక్ట్లు, విండో ఎఫెక్ట్లు వగయిరాలతో ఆడుకోవాలనిపిస్తే తప్ప 😉
కుబుంటు కేడీయీ ని ఎంత బాగా తయారు చేసిందంటే అసలు విండోస్ ఎక్స్పీ (విస్టా నేను వాడలేదు) కంటే కూడా తెగ నచ్చేసింది నాకు.

అలాంటిది కేడీయీ ౪ ని వాడినప్పుడు అంత ఎక్సైట్‌మెంట్ కలగలేదు.
కొన్ని ఫీచర్లు చాలా బాగున్నాయి. కానీ చాలా బగ్గీగా ఉంది. కస్టమైజేషను సరిగా లేదు.
ఓ పెద్ద గుది బండ లాంటి టాస్కుబారు, దానిని కస్టమైజు చెయ్యాలంటే కాన్ఫిగ్ ఫైళ్ళు కెలకాల్సిందే.
ఎక్కువగా అవుటాఫ్ ది బాక్సు పని చేసే కేడీయీ ని ఇలా చూడడం అలవాటు లేదు.

కానీ ఇక్కడ నేను కన్వీనియంటుగా మర్చిపోయిందేమిటంటే ఇది చాలా విధాలుగా సరికొత్త కోడు.
అదీ కాక ఇది మొదటి వర్షను రిలీజు. కుబుంటు ఆల్రడీ దీనిని గట్సీకీ, హార్డీ కి ఇంటిగ్రేట్ చేసింది (ఊరికే ట్రై చెయ్యడానికి) కానీ కస్టమైజు చెయ్యలేదు.
కాబట్టి అద్భుతమయిన యూఐ, మరియు ఫీచర్లతో కూడిన కేడీయీ ౪ ని త్వరలోనే చూడవచ్చేమో.
ఆల్రడీ కేడీయీ ౪.౧ కి సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై లో విడుదల అనుకుంట.

అప్పటివరకూ కేడీయీ ౪ కి మాత్రం నేను పర్మనెంటుగా స్విచ్ అయ్యేది లేదు 🙂

ఇటు చూడండి: అన్నట్టు నేను “బ్లాగిన్ మెయిలు” సన్నాహాలు చేస్తున్నాను. అంటే రోజుకోసారి ఏదో ఒక సమయంలో కూడలిలో ఉన్న టపాలను ఓ హెచ్‌టీ‌‌ఎమ్‌ఎల్ ఫైలు రూపంలో కావలసిన జనాలకి పంపడానికి. (ఫోటోలు ఉండవు) ఇవి సాధ్యమయినంత వరకూ కత్తిరించిన టపాలు కాకుండా పూర్తి టపాలతోనే చెయ్యాలనుకుంటున్నా. కోడు కొంత మటుకు పూర్తయింది గానీ ఇంకా చాలానే బగ్గులున్నాయి. ఎవరికయినా బీటా టెస్టు చెయ్యడానికి ఆసక్తి ఉంటే మీ మెయిలయిడీ వ్యాఖ్యలలోగానీ, నా మెయిలయిడీకి గానీ పంపించండి.