P2P అంటే ?

మనం P2P, torrents గురించి వింటుంటాము. అసలు అవంటే ఏంటి ? మనకెలా ఉపయోగపడతాయి ?

P2P అంటే Peer to Peer, అనగా సర్వర్ ఆధారితం కాకుండా, మీ peer సిస్టంస్ నుండి డౌన్లోడ్ చేసుకునే టెక్నాలజీ.
ఇంటర్నెట్ లో ఎన్నెన్నో P2P సాఫ్ట్వేర్ లు ఉన్నాయి. Gnutella, eDonkey, BitTorrent వాటిలో కొన్ని, అలాగే ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యమయిన నాప్‍స్టర్ వంటి సైట్లు కూడా P2P పైన ఆధారితమే. (దీనికెంతో కథ ఉంది లేండి. స్యూ చెయ్యబడి మూతబడి, ఇప్పుడూ మళ్ళీ పెయిడ్ సైట్ అయ్యింది.)

ఇక పోతే P2P ఎలా పనిచేస్తుంది?

ఒక ఫైల్ డౌన్లోడ్ ఎలా జరుగుతుంది సాధారణంగా ? ఒక సర్వర్ ఉంటుంది. అది ఆ ఫైల్ ని హోస్ట్ చేస్తుంది. క్లైంట్ ఒక రిక్వెస్ట్ పంపించగానే సర్వర్ దానిని క్లైంట్ కి పంపిస్తుంది.

ఇక P2P లో ఎలా జరుగుతుందంటే డౌన్లోడ్ ఒక సర్వర్ నుంచి జరగదు. మీ peers (మీ లాగే ఫైల్ కావాలనుకున్నవాళ్ళు), సీడ్స్ (అల్రడీ డౌన్లోడ్ చేసేసుకుని షేర్ చేసేవాళ్ళు.) నుంచి డౌన్లోడ్ జరుగుతుంది. ఇదంతా ఒక ప్రోటోకాల్ ఉపయోగించి జరుగుతుంది. అది బిట్టోరెంట్ కావచ్చు, ఇంకేదయినా కావచ్చు. ఇదంతా చెయ్యడానికి ఆ ప్రోటొకాల్ ని సపోర్ట్ చేసే ఒక క్లైంట్ ఉండాలి. ఉదాహరనకి టోరెంట్లను సపోర్ట్ చేసే క్లైంట్లు ఎన్నో ఉన్నాయి బిట్టోరెంత్, అజూరియస్, మ్యూటోరెంట్, మొదలయినవి. ఈ క్లైంట్లు మీ పీర్ లకు కనెక్ట్ అయ్యి వాటి నుంచి ఫైల్ ని రాబడతాయి. ఈ ఫైల్ డౌన్లోడ్ అంతా ఒక సీక్వెన్స్ గా జరగదు. ఎక్కడ ఏ పీర్ నుండి ఏ ఫైల్ పార్ట్ దొరికితే దానిని డౌన్లోడ్ చేసేస్తుందన్నమాట. అన్ని పార్టులూ డౌన్లోడ్ అయిన తరవాత అతికించేస్తుంది అన్నమాట. అలాగే మీరు డౌన్లోడ్ చెసేసుకున్న పాట్లను ఎప్పటికప్పుడు వేరే పీర్ లకి షేర్ కూడా చేస్తుంటుంది. అలా ఇంతకు ముందు ఐదు ఉన్న పార్టులు మీ డౌన్లోడ్ పూర్తి కాగానే ఆరు అవుతాయన్నమాట. ఇక ఈ ఫైల్ ని ట్రాక్ చేసేందుకు ఒక డౌన్లోడ్ మొదలుపెట్టేందుకు, పీర్ లతో కమ్యూనికేట్ చెయ్యడానికి ట్రాకర్ లు అని ఉంటాయి.

అలాగే ఎంతో మంది కేవలం డౌన్లోడ్ చేసుకుని షేర్ చెయ్యకుండా ఉండే క్లైంట్ ల ను శిక్షించేందుకు వాటి అప్లోడ్, డౌన్లోడ్ రేషియోలను కూడా చూస్తుంటాయి. ఎక్కువ అప్లోడ్ చేసిన వారికి వెంటనే పీర్ లను అందిస్తుంది, వేరే వారికి వీరి కంటే ఆలస్యం గా ఫైల్ లభిస్తుంది.

ఇక ఇలాంటి విధానం వల్ల లాభాలు ఏంటి అంటారా ? ఒకే సర్వర్ పైన భారం పడదు. అసలు ఒక సర్వర్ అవసరమే లేదు. అదీ కాక మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఇతరులకు అప్లోడ్ కూడా చేస్తారు. భారమంతా అందరూ పంచుకుంటారు. కొన్ని సైట్లు ఉదాహరణకి ఉబుంటు లినక్స్ డౌన్లోడ్, ఎక్లిప్స్ డౌన్లోడ్ మొదలయినవి టోరెంట్ల మీద కూడా అందిస్తారు.

దీనికి ఉన్న లాభాల కంటే దీని వల్ల నష్టాలే ఎక్కువేమో. ఎందుకంటే దీని మీద ఒకటనేంటి అన్ని రకాల్ ఫైళ్ళూ షేర్ చెయ్యబడతాయి. పాటలు, వీడియోలు, సినిమాలు, పోర్న్, సాఫ్ట్‌వేర్లు, ఈ బుక్స్, ఒకటనేంటి అన్నీనూ. వీటిలొ ఎక్కువ ఇల్లీగల్ కంటెంటే. తెలుగు, హిందీ సినిమాలయితే తెలీదు కానీ ఇంగ్లీష్ సినిమాలయితే ఇలా రిలీజ్ అవగానే అలా టోరెంట్లు పెట్టేస్తారు. ఇప్పుడిప్పుడు హిందీ, తెలుగు కూడా లభ్యమవుతున్నాయనుకోండి. అందుకని ఈ టెక్నాలజీ వల్ల పైరసీ అత్యధికంగా చెయ్యబడుతుంది. అదే కాక ఇది వాడడం వల్ల పెద్దగా ట్రాక్ చెయ్యలేకపోవడం కూడా ఒక రకంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునేందుకు దోహదపడుతుంది. ఇంతకు ముందు నాప్‌స్టర్ అనే ఇలాగే మ్యూజిక్ ఎక్స్చేంజ్ చెయ్యడానికి P2P వెబ్‌సైట్ ని నడిపింది. యూజర్లందరూ దానిని ఉపయోగించి ఇల్లీగల్ గా పాటలని మార్చుకునేవారు. అందుకని మ్యూజిక్ కంపెనీలన్నీ కలిసి దాన్ని మూసివేయించాయి. ఇప్పుడది కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని డబ్బులు కట్టి డౌన్లోడ్ చేసుకునేలా మార్పు చేసింది.

అయినా పట్తించుకునే వారెవరు. అందరూ డౌన్లోడ్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు.