మార్చి 13, 2007

digg లాంటి వెబ్ సైట్ సెటప్ చెయ్యడం ఎలా ?

Posted in digg, pligg వద్ద 4:12 సా. ద్వారా Praveen Garlapati

మొన్న వెబ్ హోస్టింగ్, అప్లికేషన్ల మీద టపా లో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం ల గురించి రాసాను. దాంట్లో Digg లాంటి సైట్ ని ఎలా సెటప్ చెయ్యాలో చెబుదామనుకున్నాను.

కానీ దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ఇంకా బీటా స్థాయిలో ఉండడంతో జంకాను.

కానీ ఇవాళ సిబి రావు గారి టపా చూసిన తరవాత దీనిని పరిచయం చెయ్యాలనిపించింది.

Digg లాంటి వెబ్ సైట్ సెటప్ చెయ్యడానికి pligg అనే ఒక సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. ఇది ఓపెన్ సోర్స్.

ఇది కూడా Digg లాగానే links submission, voting మీద పని చేస్తుంది.

ఒక వేళ Digg గురించి తెలియని వారుంటే దాని గురించి చెబుతాను. Digg గురించి క్లుప్తంగా చెప్పాలంటే అది ఒక link submission సైట్. అంటే users ఆ సైట్ లో links సబ్మిట్ చేస్తారన్నమాట. అందులో వివిధ కాటగరీలు ఉన్నాయి technology, sports, entertainment మొదలయినవి. users submit చేసిన links ని ఇతర users వోట్ చేస్తారు. ఏ URL కి ఎక్కువ వోట్లు వస్తాయో అది హోం పేజీ లో స్థానం సంపాదిస్తుందన్నమాట. వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఎంతగానో ప్రాచుర్యం పొందింది ఈ వోటింగ్ విధానం, ఎందుకంటే ఇందులో ఎవరో ఒకరు కంటెంట్ ని సమకూర్చరు. users వారికి కావల్సిన కంటెంట్ ని వారే వోట్ చేస్తారన్నమాట, అలా మంచి మంచి కథనాలు బయటికి వస్తాయి. మంచివి కానివి మరుగున పడి పోతాయి.

సరే ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సి బి రావు గారు గురించి రాసిన టపాలో ఇలాంటి విధానం ఏర్పాటు గురించి మట్లాడారు. ఇలాంటిది ఒకటుంది అని అందరికీ తెలియ చెయ్యడానికే ఈ టపా.

గమనిక: ఇది ఇంకా బీటా స్టేజీ లోనే ఉంది, కాబట్టి ఇందులో సమస్యలు ఉండవచ్చు. కానీ స్క్రాచ్ నుంచి చేసే బదులు దీనిని ఉపయోగించి కొనసాగించవచ్చు.

ఎవరికయినా ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే వారికోసం ఇక్కడ (http://employees.org/~praveeng/mydigg/) దీనిని సెటప్ చేసాను. ట్రై చేసి చూడండి. తప్పులుంటే నా బాధ్యత కాదు. 🙂

కొంత టెస్టు చేసి బానే ఉంటే దీనిని వాడవచ్చు.

దీని స్క్రీన్ షాట్లు కింద చూడవచ్చు :

హోంపేజీ

లింక్ సబ్మిషన్, అప్రూవల్

సబ్మిషన్ స్టెప్ 1

సబ్మిషన్ స్టెప్ 2

సబ్మిషన్ స్టెప్ 3

పబ్లిష్ కాని కథనాలు

స్టేటస్ చేంజ్

తరవాత హోంపేజీ