ఫిబ్రవరి 19, 2007

Tom Hanks…

Posted in Tom Hanks వద్ద 4:04 సా. ద్వారా Praveen Garlapati

Tom Hanks ఒక విలక్షణమయిన నటుడు. మన ఇండియా లో నటులతో పోల్చాలంటే ఒక్క అమీర్ ఖాన్ ని కొద్దిగా దూరంగా చూడచ్చు.

నేను పెద్దగా ఇంగ్లీషు సినిమాలు చూసే వాడిని కాదు. ఎదో తెలుగు, హిందీ సినిమాల నుంచి కొద్దిగా బ్రేక్ ఇవ్వడానికి మధ్య మధ్యలో చూసే వాడిని. అలాంటి నాకు ఇంగ్లీషు సినిమాల మీద ఆసక్తి కలిగించి వాటి మీదకి మనసు మళ్ళేలా చేసింది Tom Hanks ఏ అంటే అతిశయొక్తి కాదు.

నేను చూసిన Tom Hanks మొదటి సినిమా Forrest Gump. చాలా బాగా నచ్చింది. అది చూడగానే అనుకున్నాను ఇతను రొటీన్‌గా సినిమాలు చేసే రకం కాదు అని. ఆ తరువాత ఈ మధ్య కొద్దిగా సమయం చిక్కడంతో స్నెహితుడి దగ్గర ఉన్న The Terminal, Cast Away తో మొదలెట్టాను. తరువాత అసలు ఇంత మంచి సినిమాలు నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానా అని అనుకుని ఇక చూడడం మొదలెట్టాను. అలా The Green Mile, You’ve Got Mail కూడా చూసాను. ఒక్కోటి ఒక్కో కళాఖండం. దేనికదే సాటి అనిపించింది. ఇంకా చాలా చూడాల్సినవి మిగిలిపోయాయి. ముందుగా Saving Private Ryan చూడాలి.

The Terminal విమానాశ్రయం terminal లో అనుకోకుండా చిక్కుపడిపొయిన ఒక మనిషి ఎలా గడిపాడు అన వ్రుత్తాంతంతో నడుస్తుంది. ఎంతో హాస్యం తో నిండి ఉన్నా ఆఖరన ఎందుకు అంత పట్టుదలతో తనకు కావలసినది సాధించుకున్నాడు అనేది తెలిసి కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతాయి.

Cast Away లో విమాన ప్రమాదం లో ఒక దీవిలో చిక్కుకుపొయి ఎన్నో యేళ్ళు ఎలా గడిపాడు అన్న ఒక కథ. మనుషులు, విలువలు ఎంత ముఖ్యమో, వీటిలో చూడచ్చు.

Green Mile కూడా ఒక మంచి సినిమా. ప్రత్యెకమయిన శక్తులు ఉన్న ఒక మనిషి గురించిన కథ ఇది. Tom Hanks ఇందులో మంచి కీ చెడు కీ మధ్య నలిగిపోతాడు.

You’ve Got Mail లో internet లో కలిసిన ఒక స్నెహితురాలు నిజ జీవితంలో తనకు పోటీదారు అవుతుంది. ఒక మంచి ప్రేమ కథ.

Forrest Gump గురించి అయితే చెప్పలేను చూడవలసిందే.

మిగిలిన వాటిలో మంచివి ఎవో చెబితే అవి కూడా చూస్తాను మరి. చెప్పండి.