ఫిబ్రవరి 16, 2007

Yahoo! OurCity

Posted in Yahoo OurCity వద్ద 3:07 సా. ద్వారా Praveen Garlapati

Yahoo! OurCity చూసారా ?

మన సిటీ విశేషాలన్నీ ఒక చోట పోగేసి చూపిస్తుంది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కత, చెన్నై కి మాత్రమే లభ్యం.

ఇది కూడా ఒక లాంటి News Aggregator. కాకపోతే ఇది కొన్ని ఎంపిక చేసిన సైట్లలోంచి సమాచారం ఒకచోట చూపిస్తుంది. ఇందులో ఎక్కువగా Yahoo! సైట్లే ఉన్నట్టు కనిపిస్తున్నాయి (del.icio.us, flickr, upcoming మొదలయినవి)

ఇంకో ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే ఇది తెలుగు బ్లాగులు నుంచి అన్ని బ్లాగ్స్ నీ చూపిస్తుంది (నాకెందుకో నచ్చలేదు). ఇక్కడ చూడండి. మరి వారి దగ్గరనుంచి permission తీసుకున్నారో లెదో తెలీదు.

LiveJournal లో ఉన్న ఆయా సిటీల communities నుంచి కూడా టపాలను చూపిస్తుంది.

Yahoo! కంపనీ లో Hack Day అని ఒకటి జరుగుతుంది. దాంట్లో బెంగుళూరు లో ఉన్న ఉద్యోగులు దీనిని తయారు చేసారని చదివాను. గూగుల్ లాగా వీరు కూడా ఆ ఆలోచనలను applications గా మలుస్తున్నారన్నమాట. మంచి అలోచనే.