అడ్వర్టైజ్మెంట్లు కథా కమామీషు …

మన టీవీ ల లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు మనం ఆలోచించే విధానాన్ని మారుస్తున్నాయా ?

పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయే దాకా ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లే. మన టీవీ లోనూ, రేడియో లోనూ, మన వీదుల్లో పెట్టిన పెద్ద్ పెద్ద బోర్డుల్లోనూ, ఆఖరికి మనం వాడే వెబ్ లోనూ ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లే.

ఒకడు చూస్తే ఈ క్రీం వాడితే తెల్లగా అయిపోయి పెళ్ళి అయిపోద్దనీ, అబ్బాయిలు మీ వెంట పడతాడనీ, ఇంకోడు మీరు ఈ బైక్ వాడితే అమ్మాయిలు మీ వెంట పడతారనీ, ఇంకోడు ఈ కూల్ డ్రింక్ తాగితే మీరు మీరు అడ్వెంచరస్ గా ఎన్నో విజయాలు సాధించేస్తారనీ, ఇంకోడు మీరు ఈ పిప్పర్మెంట్ తింటే మంచి మంచి అయిడియాలు వచ్చేస్తాయనీ, పౌడర్ రాసుకుంటే లవర్కి మనసులో మాట చెప్పేస్తారని, డియోడరంట్ వాడితే అమ్మాయిలు పైడ్ పైపర్ వెనక ఎలకలు పరిగెట్టినట్టు పరిగెడతారనీ ఒక దానితో ఒకటి పొంతన లేని విషయాల మీద అడ్వర్టైజ్మెంట్లు వదులుతూనే ఉన్నారు.

అప్పుడు చూడగానే అసలు మనమే ఒక నిముషం సాధ్యా సాధ్యాలు మరిచి పోయి ఇది నిజమేనా అనిపించే రేంజులో తీస్తారు.

ఓ రకం గా చూస్తే ఇదంతా క్రియేటివిటీ లాగా నే అనిపించినా ఇందులో నిజమెంత అని ఆలోచిస్తే మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. సరే ఎవరి ప్రాడక్ట్ వారు అమ్ముకోవాలి, ఒప్పుకుంటాను. దానికి కావలసిన అడ్వర్టైజింగ్ చేసుకోవటం లోనూ తప్పు లేదు. కానీ అందులో జనాల సైకాలజీ నే మార్చేసే విధంగా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి.

ఏ క్రీం రాసినా ఏమీ లాభం ఉండదు అని అందరికీ తెలిసిందే. ఏ పౌడర్, డియో వాడినా ఏ అమ్మాయీ మీ వైపు చూడదనీ అందరికీ తెలుసు. అయినా వాడి చూస్తే పోయేదేముందీ అని అనుకునే విధంగా ఆకర్షణీయంగా ఆడ్ లు తయారు చేసి వదులుతారు.

ఓ రకం గా వీరు చెప్పేదేంటంటే మీరు తెల్లగా లేకపోతే మీకు పెళ్ళి కాదు. ఒక సారి ఆలోచించండి ఇది జనాలలో ఎలాంటి ఆలోచనలను రేకెత్తిస్తుందో. ఒక వేళ పట్టించుకోని వారు కూడా, ఎందుకయినా మంచిది వాడితే పోలా, అందరూ వాడేస్తున్నారు నేను వెనక పడిపోతానేమో అని. ఫెయిర్ అండ్ లవ్లీ వారికి సేల్స్ అంతగా ఉన్నాయంటే ఉండవూ ? ఆఖరికి ఇప్పుడు మగవారికి కూడా క్రీములంటూ వెంట పడుతున్నాయి.

అసలు మనకు తెలీకుండా మన మైండ్ నే మార్చేస్తారు వీరు. ఓ రకమయిన అవగాహన ఉన్న వారికి ఓకే. మాయలో పడే వారు ఇక వీటిలో పడి కొట్టుకుంటారు.
ఈ ఆడ్ లు కనక అసమంజసం గా ఉంటే వాటిని అరికట్టే ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉన్నా అది పని చేస్తున్న దాఖలాలేవీ కనిపించవు.
ఇక మనలాంటి వాళ్ళు వీటి గురించి పట్టించుకుని కంప్లెయిన్ చేసి ఫాలో అప్ చేసేంత సీను లేదు. ఎందుకంటే నా కెందుకులే అని ఆలోచించడమే.
సినిమాల్లో నూ ఈ అతి ఉన్నా అది ఒక సారితో పోతుంది కానీ ఈ ఆడ్ లను రోజుకి వంద సార్లేసి “మన జీవితాలనే” మార్చేస్తాయి.