అడోబ్ అపోలో, మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్, JavaFX …

యూజర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాముఖ్యం RIA (Rich Internet Applications) రావడం తో బాగా పెరిగింది.

బాగా ఇంటరాక్టీవ్ గా ఉండే వెబ్‌సైట్ లు, ఆకట్టుకునే విధమయిన అజాక్స్, జావాస్క్రిప్ట్ బేస్డ్ UI లు, మాషప్ లు సాధారణమయిపోయాయి.

ఇప్పుడు కొత్త జనరేషన్ టెక్నాలజీలకు అంకురార్పణ జరుగుతుంది. అవే డెస్క్‌టాప్ మీద వెబ్ అప్లికేషన్లని మాష్ చెయ్యగలిగే విధానం కల్పించే అడోబ్ వారి అపోలో, మైక్రోసాఫ్ట్ వారి సిల్వర్లైట్, JavaFX మొదలయినవి.

అడోబ్ అపోలో: ఇది అడోబ్ వారి నుండి విడుదలయిన కొత్త ప్రాడక్ట్. ఇంత వరకూ మనం వెబ్ అప్లికేషన్లను విడిగా, డెస్క్‌టాప్ అప్లికేషన్లను విడిగా చూస్తూ వచ్చాము. కానీ ఈ రిలీజ్ తో అడోబ్ వారు రెండిటినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే మీరు రాసిన జావాస్క్రిప్ట్, అజాక్స్ కోడ్ ఇందులో కూడా రన్ అవుతుందన్నమాట. ఇంతవరకూ కేవలం బ్రౌజర్ కే పరిమితమయిన టెక్నాలజీలను ఇప్పుడు డెస్క్‌టాప్ మీద కి తీసుకొస్తామని చెబుతున్నారు.
వీరి ఫ్లాష్ టెక్నాలజీ ఎంత ప్రచారం పొందిందో మనకు తెలిసిందే. మరి ఈ టెక్నాలజీ కూడా అదే రేంజ్ లో హిట్టవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్: ఇంతవరకూ జావాస్క్రిప్ట్, ఫ్లాష్ మొదలయినవి మాత్రమే RIA లకి వయబుల్ ఆల్టర్నేటీవ్స్ గా ఉండేవి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్ రిలీజ్తో వీటికి కాంపిటీషన్ గా వస్తుంది. ఇంతవరకూ డేస్క్టాప్ అప్లికేషన్ల మీదే కాన్సంట్రేట్ చేసిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు వెబ్ మీద ఉండే పొటెన్షియల్ రియలైజ్ అయ్యి ఆ దిశలో ఎన్నో కొత్త టెక్నాలజీలు, అప్లికేషన్లూ రిలీజ్ చేస్తుంది. (popfly లాంటి మాషప్ అప్లికేషన్లూ, విండోస్ లైవ్, వెబ్ స్పేసస్ మొదలయినవి…) ఈ రిలీజ్ తో ఫ్లాష్ సంపాదించిన క్రేజ్ ని సంపాదించి దానిని కొట్టాలన్నది మైక్రోసాఫ్ట్ లక్ష్యం లా కనపడుతుంది. ఎలాగూ విండోస్ తో నేటీవ్ ఇంటిగ్రేషన్ ఉండనే ఉంది కాబట్టి మంచి లుక్ అండ్ ఫీల్ ఇవ్వచ్చు. వేచి చూడాలి ఎంతలా అడాప్ట్ అవుతుందో.

JavaFX: జావా లో ఎప్పటి నుంచో వీక్ లింక్ ప్రెజంటేషనే. ఇప్పుడు ఈ JavaFX రిలీజ్ తో ఆ ప్రెజంటేషన్ ని టార్గెట్ చేద్దామని చూస్తుంది సన్. వారికున్న జావా రన్ టైం మీదే ఇది కూడా రన్ అవుతుంది. కాబట్టి రీచ్ కోసం పెద్ద ఇబ్బందులు లేవు.వీరి ప్రకారం ఈ JavaFX వివిధ రకాలయిన క్లైంట్స్ మీద సీంలెస్ గా పని చేస్తుంది. కాబట్టి దీనితో నయినా అది సరవుతుందేమో చూడాలి.

పై వాటిలొ గమనించాల్సినవి:

మైక్రోసాఫ్ట్ సిల్వర్లైట్ విండోస్, మరియు మాక్ ప్లాట్ఫాం ల మీదే లభ్యం. లినక్స్ మీద కాదు. అడోబ్ అపోలో కూడా కానీ ఇది తొందరలోనే లినక్స్ వర్షన్ రిలీజ్ చెయ్యనుంది (ఫ్లాష్ అల్రడీ ఉంది). ఇక జావా ఎలాగూ క్రాస్ ప్లాట్ఫాం కాబట్టి దానికి సమస్యలు లేవు.
ఇకపోతే అన్నిటికీ ఈజీగా కోడ్ చెయ్యగలిగే ఇంటర్ఫేస్లున్నాయి.

ఫ్యూచర్ ఈజ్ ఎక్సైటింగ్.