ఓపెన్ ఐడి …

మీరు ఒక వెబ్ సైట్ కి వెళ్ళారు. అక్కడ కామెంట్ చేద్దామనుకున్నారు, కానీ అక్కడ మీకు అకౌంట్ లేదు. మరి మీరు మీ పేరు మీద కామెంట్ చెయ్యాలంటే ఎలాగ ???

మీరు ఒక కొత్త వెబ్ సైట్ కి వెళ్ళారు. అబ్బా మళ్ళీ అక్కడ సమాచారం అంతా ఇవ్వాల్సిందేనా ???

ఇలాంటి సమస్యలని తీర్చడనికే ఓపెన్ ఐడి అనే కాన్సెప్ట్. ఎమిటంటారా ఇదేమీ మరీ కొత్త కాన్సెప్ట్ కాదు. ఇంతకు ముందు కొన్ని కంపెనీలు మొదలెట్టినవే (Microsoft Passport Network ఇప్పుడు Windows Live ID అనుకుంట, ఇంకా Yahoo BBAuth మొదలయినవి). కాకపోతే అందులో కొన్ని చిక్కులు ఉండెవి. ఎమిటంటే అవి తయారు చేసిన కంపెనీలతో account ఉండాల్సిందే, అదీ కాక వాతిని support చేసే applications తక్కువ.

ఇప్పుడు ఓపెన్ ఐడి ఎమిటంటే ఇదొక Open Source సాఫ్ట్ వేర్. దీనిని SixApart అనే ఒక కంపెనీ తయారు చెసింది (LiveJournal, Vox మొదలయినవి వీరివే.)
వీరు ఎమి చెసారంటె ఓపెనీద్ అని ఒక specification రిలీజ్ చేసారు. ఎవరయినా ఈ ఓపెన్ ఐడి specification ఉపయొగించి వారి ఓపెన్ ఐడి సెర్వెర్ ని రాయచ్చు. అది ఎవరయినా host చెయ్యచ్చు. ఒక కంపెనీ తొ సంబంధం లెదు. దీంట్లొ మీ సమాచారమంతా ఒకసారి పొందుపరచి దానితొ register అయ్యరంటె అంతే ఇక మీరు ఏ ఓపెన్ ఐడి enabled సైట్ కి వెళ్ళినా మీ ఓపెన్ ఐడి ని ఉపయొగిస్తే చాలు. మీ సమాచారమంతా అది background లో లగెసి మీకు కావలసిన చొట ఉపయొగించుకుంటుంది. ఇక మీరు ఎక్కడ కామెంట్ చెయ్యలన్న anonymous గా చెయ్యక్కర్లెదు. ఎక్కడ register అవ్వాలన్నా ఈ ఓపెన్ ఐడి ఉపయొగిస్తె మీరు మళ్ళీ మీ సమాచారమంతా type చెయ్యక్కర్లెదు.

దీంట్లో ఎమిటంటే మీ URL ఏ మీ ఓపెన్ ఐడి User ID. మీరు ఎదయినా ఓపెన్ ఐడి ని అహ్వానించె వెబ్ సైట్ కి వెళ్ళారనుకోండి మీ URL ద్వారా అక్కడ మీరు కామెంట్ చెయ్యచ్చు లెదా ఒక కొత్త account స్రుష్టించవచ్చు. మళ్ళి సమాచారం అంతా type చెయ్యనక్కర్లెదు.

మీరు మీ URL గా ఉపయొగించె మీ Home Page లో గాని లెక ఎదయినా ఎబ్ పెజ్ లో గాని ఈ క్రింది రెందు lines ఉంచారనుకొండి. (LiveJournal ఉదాహరణతో)

నా వెబ్ సైట్ (http://employees.org/~praveeng) లో ఈ క్రింది రెండు lines ఉంచాను

<link rel="openid.server" href="http://www.livejournal.com/openid/server.bml"/>
<link rel="openid.delegate" href="http://praveenkumarg.livejournal.com/"/>

ఇది మీ ఓపెన్ ఐడి గా ఉపయొగపదుతుంది. Back End లో అది ఎమి చెస్తుందంటే మీ ఓపెన్ ఐడి server ఎదయితె ఉందొ (ఇక్కడ LiveJournal) దానికి delegate చేస్తుంది. అక్కద మీ ఓపెన్ ఐడి సెర్వెర్ మీ request ని accept చేసి దానిని verify చేసి మీ అనుమతితో మీరు చెప్పిన వెబ్ సైట్ కి కోరిన సమాచారం అందిస్తుంది.

ఇది మొత్తంగా foolproof కాదు కాని, మంచి కాన్సెప్ట్. ఇప్పటికే కొన్ని వెబ్ సైత్ లు దీనిని ఉపయొగిస్తున్నాయి. zooomr, LiveJournal మొదలయినవి. మీకు గనక LiveJournal ఇద్ ఉంటె మీకు ఇప్పటికే ఓపెన్ ఐడి ఉన్నట్టే. మీ వెబ్ పేజి http://<LJ User ID>.livejournal.com మీ ఓపెన్ ఐడి అన్నమాట.

క్రింది కొన్ని వెబ్ సైట్ లు ఓపెన్ ఐడి service ని ఇస్తున్నాయి.

http://openid.net/wiki/index.php/Public_OpenID_providers